ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
19-06-2013 (chapter-70)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
*****************
చివరి భాగం ...
ఒళ్ళు గగుర్పొడిచే సాహసం...
హెలికాప్టర్ ఆ బిల్డింగ్ మీదుగా ఎగురుతోంది. నిచ్చెన లాంటి సాధనం
ద్వారా మోహన దిగుతోంది. సాయుధులైన మాఫియా ఊహించని పరిణామం .ఆకాశం నుంచి
ఆదిశక్తి దిగివస్తున్నట్టు వుంది. ఇంకా పది అడుగుల దూరం ఉండగానే కిందికి
దూకేసింది.అప్పటికే మాఫియా చుట్టూ ముట్టింది.
*******************
స్టీఫెన్ తన ఎదురుగా వున్నా మోహన వైపు చూసాడు.ఒక్క క్షణం అతని ఒళ్ళు
జలదరించింది.మృత్యువు ఎదురుగా నిలబడిన ఫీలింగ్ కలిగింది.అతనికి మోహన
గురించి తెలుసు.మోహన ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుసు.
"మిస్టర్
స్టీఫెన్ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను.ఒకటి వాళ్ళని వదిలేసి
వెళ్ళిపో...నువ్వు సరెండర్ అవుతావో.లేదో నాకు అనవసరం..నేను వీళ్ళను
తీసుకుని వెళ్ళిపోతాను.రెండు నువ్వు చచ్చిపో...నిన్ను ప్రాణాలతో
ప్రభుత్వానికి అప్పగించే ఇంట్రెస్ట్ నాకు లేదు..టైం వేస్ట్ ప్రాసెస్ .
రెండింటిలో నీ ఛాయస్ ఏదో ఆలోచించుకుని చెప్పు. మరో విషయం నిన్ను వదిలి
పెట్టినా, వీళ్ళను వదిలిపెట్టను. ఆలోచించుకో...ఈ లోగా నేను వీళ్ళతో
మాట్లాడుతాను."అంటూ ముగ్ధ దగ్గరికి వచ్చింది.
"ఒకప్పుడు తను కిడ్నాప్
చేయించిన ముగ్ధ..".కాలం ఎంత విచిత్రమైంది. ప్రణవి వంక ,సంధ్య వంక చూసి
పలకరింపుగా నవ్వింది.సివంగిలా కనిపిస్తోంది మోహన వాళ్ళకు.
*************
స్టీఫెన్ వంక చూస్తున్నారు సాయుధులైన మాఫియా మనుష్యులు. స్టీఫెన్ ఒక
విధంగా ఆత్మా రక్షణలో పడ్డాడు.మెహతా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడన్న వార్త
క్షణం క్రితమే తెలిసింది.చంద్రహాస్ సేఫ్ గా ఉండడమే కాక భయంకరమైన మాఫియా
గ్రూప్ ని ఫినిష్ చేసాడు.ఆనవాళ్ళు లేకుండా చేసాడు. ఏ క్షణమైనా చంద్రహాస్
,కార్తికేయ రావచ్చు.అప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి తరమూ కాదు.
అతని ఛాయస్ వాళ్లకు అర్ధమైంది.వాళ్ళ ఛాయస్ మోహన కూ అర్ధమైంది.తాపీగా లేచింది.
"ఈ సృష్టిలో త్రిమూర్తులు వున్నారు.అలాంటి త్రిమూర్తులకు స్ఫూర్తిని
ఇచ్చిన స్త్రీమూర్తులకు ప్రతీకలైన ఈ స్త్రీమూర్తులను బందించావు.అందుకే
ఆదిశక్తినై వచ్చాను. మిమల్ని ఫినిష్ చేయడానికి ఈ పిడికిలి లో వున్న
కాన్ఫిడెంట్ చాలు."అంటూ చేతికి వున్న వాచీ వంక చూసింది. దానికి వున్న కీ
రాడ్ లాగి నేలకేసి కొట్టింది.చిన్న శబ్దం.ఆ తర్వాత పొగ...
కొద్ది క్షణాల తర్వాత చూస్తే ,ప్రణవి,ముగ్ధ,సంధ్య అక్కడ లేరు.మోహన మాత్రం వుంది.
***********
"ఈ యుద్ధం లో వాళ్ళ అవసరం లేదు.అయిదే నిమిషాల్లో ఫినిష్..."అంటూ బెల్ట్ లో
వున్న పదునైన డాగర్ తీసింది. గాలిలా కదిలింది.సుడిగాలిలా చెలరేగింది.ఒకే
ఒక నిమిషంలో నలుగురి కుత్తుకలు తెగిపోయాయి.అంటా షాక్ లో ఉండగానే మరో ఇద్దరు
నేలకొరిగారు. అప్పటికే మోహన సూచన మేరకు ఆ పరిసర ప్రాంతాల్లో వుండే
వారిని ఖాళీ చేయించారు పోలీసులు. మోహన కిచెన్ లోకి వెళ్ళింది.దాదాపు
వందకు పైగా సిలిండర్లు. స్టవ్ కు వున్న రెగ్యులేటర్ పీకి పారేసింది. బయటకు
పరుగెత్తింది.మోహన ఎందుకు లోపలి వెళ్ళింది వాళ్లకు అర్ధమయ్యేలోగా ,మోహన
బుల్లెట్ పేల్చింది కిచెన్ వైపు గురి చూసి.
పెద్ద శబ్దం...చాలా సింపుల్
గా...యుద్ధం ముగిసింది.చాలా ఘోరంగా వాళ్ళ చావు రాసిపెట్టి వుంది.అవయవాలు
గుర్తు పట్టడానికి వీల్లేకుండా...ప్రాణం లేని కరెన్సీ కోసం ,మనుష్యుల
ప్రాణాలు తీసే స్టీఫెన్,నాంపల్లి లాంటి వాళ్ళు .మాఫియా నామరూపాలు లేకుండా
ఫినిష్ అయింది.ఆ మంటల్లో మోహన రూపం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది.
భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వాత్రిని ఏరిపారేయడానికి
కార్తికేయ సూచనతో రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకంగా నియమించబడిన రక్షకురాలు
మోహన.
********************
ప్రణవి ,చంద్రహాస్..ఇద్దరి మధ్య నిశ్శబ్దం....వేన వేల భావాలను,కమ్యూనికేట్
చేస్తూ....అతని కౌగిలిలో ఒదిగిపోయింది.కన్నీటితో అతని గుండె ని
తడిపేసింది.
కార్తికేయ,ముగ్ధ ఘనంగా వీడ్కోలు పలికారు. కార్తికేయ మోహన కు ఫోన్ చేసి థాంక్స్ చెప్పాడు.
"నిన్ను కలవకుండా వెళ్తున్నందుకు మన్నించు మిత్రమా...నా ప్రాణాన్ని విడిచి
వెళ్తున్నాను.మళ్ళీ ఎపుడో నీ మాట కోసం ఎదురుచూస్తాను వుంటాను " మోహన
గొంతులో ఉగ్విగ్నత.
**************
చంద్రహాస్ గుండె మీద తల పెట్టింది ప్రణవి.ఆమె కు మాటలు రావడం లేదు.ఎన్నో
మాట్లాడాలని వుంది.ఎన్నో చెప్పాలని వుంది.ఆమె మనసును పసిగట్టిన అతని
అంతరంగం ..అతని చేతులకు,చేతలకు ఆ విషయాన్నీ చేరవేసింది.
ప్రణవిని
చుట్టేసాడు చ్చంద్రహాస్...ఒక స్పర్శ ఎన్నో కోటానుకోట్ల ఫీలింగ్స్
ని,విరహాలను,దూరాలను కలుపుతూ ,కలిసిపోతూ ,మధురోహాలను కానుకగా అందిస్తూ..
ప్రణవి చంద్రహాస్ కౌగిలిలో ఒదిగిపోయింది...కరిగిపోయింది..కలిసి ఒకే శరీరంగా మారిపోయింది
********************
*******ఈ సీరియల్ అయిపొయింది..కానీ మీ మనసు పొరల్లో నిలిచే వుంటుంది ******
రచయిత విసురజ చివరిమాట
_____________________
ఒక అక్షరాన్ని ఆహ్వానించి మరో అక్షరంతో అనుసంధానించి, సమాగింపచేసి పదంగా
మార్చి వాక్యంగా మలిచి శిల్పమనే కథనాన్ని చదువరుల మస్తిష్కపు కాన్వాసు పై
పరిచినప్పుడు ....మనో అశ్వవేగాన్ని అధిగమించి కథా కథన వేగంచే ఊపిరి
పోసుకున్ననవలా పాత్రలు మీ ఆదరణలో... ధన్యమైన వేళ......
ఆగష్టు 1 సీరియల్ కు లిఖించా ఈ చివరి మాట....
కేవలం హీరోయిజాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఒకే ప్రాణంగా బ్రతికిన
రెండు దేహాలు...విడిపోతే పడే ఆవేదన, తపన ఆపై ఒకరికై ఒకరు పరితపించి
కొనసాగించిన నిరంతర అన్వేషణ. ప్రణవి చంద్రహాస్ ల మధ్య వున్న అనుబంధం...తన
ప్రాణం ..ఇక లేదని తెలియబరచినా నమ్మని వైనం ఆ నమ్మకం...సర్వాన్ని, తన
సమస్తాన్ని వదిలి ఆమె కోసం కొనసాగిన అతని అన్వేషణ...ప్రేమను కొత్త కోణంలో
చూపించాలనే నా ప్రయత్నానికి తొలి అడుగు. రాధాచంద్రిక పాత్రలోని ఆర్ద్రత,
సాత్యకి పాత్ర ఔన్నత్యం, విశాల హృదయం, ప్రణవి ,చంద్రహాస్ ల చుట్టూ
అల్లుకున్న అందమైన తనూలతలు ...చివరికి మరియప్ప భార్య ఆత్మతో సహా . ..
స్టీఫెన్ లాంటి స్వార్ధపరుడు, నాంపల్లి లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్,
మెహతా లాంటి నమ్మకద్రోహి, మరియప్ప లాంటి క్షుద్రమాంత్రికుడు . .ఈ వ్యవస్థలో
చీడ పురుగులు....ఇలాంటి వాళ్ళని ఏరి పారేయడానికి, ప్రతి ఒక్కరు అంటే మీరే
ఒక 'కార్తికేయ' కావాలి. ఒక చంద్రహాస్ కావాలి.
ప్రతి వ్యక్తిలోనూ ఒక
వ్యక్తిత్వం వుంటుంది. అది పాజిటివ్ గా వుంటే ఎనర్జీ అవుతుంది లేదంటే
భస్మాసుర హస్తం అవుతుంది. మన ఉనికిని కోల్పోయేలా చేస్తుంది.
అందుకు ఈ ఆగష్టు 1....ఒక దృష్టాంతరం ఒక ఉదాహరణ కావాలని రాసిన రచన, చేసిన ప్రయత్నం యిది.
మీ అభినందన వ్యాక్యముల నిర్మాణమే నా అక్షరాలకు అమృతమనే సిరా, నేను
ఎంచుకున్న మార్గం మంచిదన్న భావసౌలభ్యం అలాగే అంబరమంటే ఆత్మావిశ్వాసం
అవుతుంది.
ఎప్పటికీ
మీ
విసురజ
Showing posts with label ఆగష్టు 1. Show all posts

Wednesday, 26 June 2013
ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
18-06-2013 (chapter-69)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
సూర్యుని తీక్షణత ఆమె ఏకాగ్రతను ఏమీ చేయలేకపోతుంది.సూర్యుని తేజస్సు ఆమె వర్చస్సుని చూసి నివ్వెరపోతుంది. మానవమాత్రులు భరించలేని శిక్షణ. ఇలాంటి అతి భయంకరమైన శిక్షణ పొందిన ఆరుగురిలో ఒక వ్యక్తి.మహిళగా ఒకే ఒక వ్యక్తి.
దూరంగా ఒక డేరా....ఆ డేరాలో వున్న అతి శక్తివంతమైన వాకీటాకీ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి.ఎమర్జెన్సీ సిగ్నల్స్.మోహన డేరా దగ్గరికి వెళ్ళింది.
అటు వైపు నుంచి వినిపించిన గొంతు...వేల మైళ్ళ దూరంలో వున్న,సప్తసముద్రాల ఆవల వున్న...శబ్దాన్ని చేధించుకుని గుండె పొరలను తాకే స్వర ధ్వని. అవతలి వైపు నుంచి కార్తికేయ గొంతు వినిపించింది. గాలి హిమాలయాలకు వెళ్లి హిమాన్ని తోడు తీసుకుని వచ్చినట్టు....చెవి దగ్గర పెదవులు ఆన్చి మాట్లాడినట్టు....
"మోహనా ఎలా వున్నారు...మీరో సాయం చేయాలి..."కార్తికేయ చెప్పసాగాడు.
*****************
"మీరు ఆజ్ఞాపించండి...శిరసావహిస్తాను...నేను బయల్దేరుతున్నాను " వాకీటాకీ ఆఫ్ చేసింది. కొద్ది సేపటిలో నిరంతరం సిద్ధంగా వుండే ప్రత్యేక హెలికాప్టర్ వచ్చింది.అది గగనతలం లోకి దూసుకు వెళ్ళింది.
ఒకప్పుడు తన కోసం వేటాడిన హెలికాప్టర్ ఇప్పుడు తనను సగౌరవంగా తీసుకువెళ్తుంది.ఒక మంచికి,దేశభక్తి కి దక్కే గౌరవం ఇలానే వుంటుంది.
మోహన కు చాలా సంతోషంగా వుంది.ఆ దేవుడే తనని సాయమడిగాడు. ఈ విధంగా తను కార్తికేయ ఋణం తీర్చుకోబోతుంది.
***********************
చంద్రహాస్ ఆ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు తలుపులు బద్దలు కొట్టుకునివచ్చాడు..బయటకు వచ్చాక అర్ధమైంది కేవలం తన కోసం చేసిన ఏర్పాటు అని.తనని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం. ఒకప్పుడు వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీ వుండేది.ఇప్పుడు మోసమే వ్యాపారమైంది. స్టీఫెన్ ఎంతగా దిగజారాడో అర్ధమైంది.
ఆ ఆసుపత్రిలో ఓ మూల గదిలో దొరికిన బాంబులు ఇప్పుడు అతని స్వాదీనంలో వున్నాయి. అతని చేతిలో క్షణాల్లో బుల్లెట్స్ కురిపించే అత్యంత ఆదునాతనమైన మారణాయుధం.అంటే ఈ స్థావరాన్ని వాళ్ళుఅసాంఘీక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. కూని రోజుల క్రితం చదివిన ఓ వార్త గుర్తొచ్చింది.సముద్రమార్గం ద్వారా అక్రమ ఆయుధాలు వైజాగ్ తీరానికి చేరుతున్నాయని.వీటిని డిస్ట్రాయ్ చేయాలి. కార్తికేయ ఇచ్చిన సలహా కూడా అదే .వీటితో పాటు వీటిని రవాణా చేసిన వారిని కూడా....
చంద్రహాస్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో మాఫియా అతడిని చుట్టుముట్టింది.ఈ పరిణామం చంద్రహాస్ ఊహించినదే. చంద్రహాస్ చేతిలోని మారణాయుధం నిప్పులు కక్కింది. ఎదుటివారికి ఎటువంటి అవకాశం లేకుండానే ,నేర చరిత్ర కలిగి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే యాంటీ సోషల్ ఎలిమెంట్స్,మాఫియా భూస్థాపితమైంది.కొద్ది సేపటిలో దేశాద్రోహులకు షెల్టర్ ఇచ్చిన ఆ భవనం పాపా ప్రక్షాళన గా పేలిపోయింది.అగ్నితో పునీతమైంది. తన అన్వేషణ ముగిసింది.ప్రణవి ఎడబాటు తనతో ఒక మంచి పని చేయించింది.
******************
కార్తికేయ డ్రైవ్ చేస్తూనే వాళ్ళని ఓ కంట కనిపెడుతున్నాడు. కారుని వెనక్కి తిప్పాడు.కారు అడవి మార్గానికి మళ్ళింది. అతడిని కార్నర్ చేస్తూ రౌండప్ చేసింది మాఫియా. కార్తికేయ వాళ్ళ కదలికలను గమనిస్తూనే వున్నాడు. కుడికాలు యాక్సిలేటర్ మీద బలంగా పడింది. అది స్పెషల్ గా డిజైన్ చేయబడిన కారు. వేగంగా దూసుకు వెళ్ళిన కారు ఎదురుగా వచ్చిన మాఫియా వాహనాన్ని డీ కొట్టింది.
కొద్ది నిమిషాల వ్యవధిలోనే మాఫియా కు సంబంధించిన వాహనాలు తుక్కు తుక్కయ్యాయి. కార్తికేయ చేయి డాష్ బోర్డు లోకి వెళ్ళింది.అందులో నుంచి అతి శక్తివంతమైన బాంబ్ బయటకు తీసాడు.సేప్తీ పిన్ లాగాడు...బలంగా గురి చూసి విసిరాడు. పెద్ద విస్పోటనం...ఏనాద్రో పోలీస్ ఆఫీసర్లను బాలి తీసుకున్న మాఫియా. బ్లాక్ మెయిల్స్...నది రోడ్డు మీద నరకడాలు..బాంబ్ పేలుళ్ళలో ఉగ్రవాదులతో చేతులు కలిపిన
మాఫియా...శరీరాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదురయ్యారు.
************
స్టీఫెన్ కు క్షణ క్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రణవి,ముగ్ధ,సంధ్య మాత్రం హ్యాపీ గా మాట్లాడుకుంటున్నారు.సంధ్య ఇదే చాన్స్ అన్నట్టు ప్రణవి కిడ్నాప్ తర్వాత జరిగిన సంఘటనలను రికార్డ్ చేస్తుంది.తనే సీరియల్ రాస్తానంటోంది. ఇదంతా చూస్తోన్న స్టీఫెన్ కు పిచ్చెక్కిపోతుంది. ఆ బిల్డింగ్ చుట్టూ సాయుధులు కాపలా వున్నారు.కార్తికేయ ఏమయ్యాడో ఇంకా తెలియడం లేదు.చంద్రహాస్ పొజిషన్ అర్ధం కావడం లేదు.పైగా సంధ్య మాటి మాటికి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగినట్టు..."మీ వాళ్ళు ఎంత మంది పోయారు ?అని అడుగుతూ ఇరిటేట్ చేస్తుంది. ఏ ఫోన్ పని చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏ ఒక్కరూ బ్రతికి లేరన్న విషయం ఇంకా స్టీఫెన్ కు తెలియదు.
సరిగా అదే సమయంలో తన బిల్డింగ్ పైన హెలికాప్టర్ శబ్దం వినిపించింది. సిసి టీవీలో ఆన్ చేసాడు.హెలికాప్టర్ నుంచి వేలాడుతూ కిందికి దిగుతోంది మోహన.
****************
(సీరియల్ ముగింపు ...రచయిత విసురజ చివరిమాట రేపటి సంచికలో )

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
17-06-2013 (Chapter-68)

కళ్ళు మూసుకుంది ప్రణవి...జరుగుతున్నది ఏమిటో కొద్ది కొద్దిగా అర్ధమవుతోంది. చిత్రంగా అనిపిస్తోంది. తమను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే...ఇంత కూల్ గా వుండడం ఏమిటి? అయినా భయం వేయడం లేదు....నిశ్చింత ....తమకు ఏమీ కాదు. కార్తికేయ వున్నారు...తన భర్త చంద్రహాస్ వున్నాడు. తన పక్కనే ముగ్ధ వుంది. నాంపల్లి కి ఎక్కడో భయం మొదలైంది. అతనికి కార్తికేయ గురించి బాగా తెలుసు. చంద్రహాస్ శక్తి సామర్ధ్యాలు తెలుసు.
అతనికి ఎన్నో నేరాలతో సంబంధం వుంది. అతని మీద రౌడీ షీట్ వుంది. అయితే అతని ఇలాంటి అనుభవం ఎదురవ్వడం మొదటి సారి. పైగా ఒకప్పుడు ఉగ్రవాదులను ఏరిపారేసిన కార్తికేయతో, చంద్రహాస్ లాంటి వ్యక్తితో వైరం...భయాన్ని కలిగిస్తుంది.
******************
స్టీఫెన్ కు క్షణ క్షణం టెన్షన్ పెరిగిపోతోంది. ఎదురుగా సంధ్యను చూస్తోంటే మరింత ఇరిటేషన్ వస్తోంది. తన పునాదులు కదిలిపోతాయన్నంత భయం...
భయం ప్రపంచంలో చావు కన్నా భయంకరమైనది. చావు ఒక్క సారే వస్తుంది ..భయం ఒక్క సారి మొదలైందంటే అది మనల్ని వెన్నంటి వుంటుంది .అనుక్షణం బౌతికంగా చంపకుండా చావు రుచిని చూపిస్తుంది. .మనం దాన్ని శాశ్వతంగా తరిమేసేవరకూ...స్టీఫెన్ లో భయం "తను తప్పు చేయడం వల్ల వచ్చింది."
మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు. చంద్రహాస్ ను చంపడానికి ఒక గ్రూప్ వెళ్ళింది. మాఫియాకు సుపారీ ముట్టింది. కార్తికేయను ఎదుర్కోవడానికి, అవసరమైతే అతడిని నిలువరించి బెదిరించడానికే ముగ్ధ, ప్రణవిని కిడ్నాప్ చేయిస్తున్నాడు.
*******************
కార్తికేయ సిటి లిమిట్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. అపటికే కార్తికేయను టార్గెట్ చేసిన మాఫియా గ్రూప్ అతడిని రౌండప్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. కార్తికేయ డేగ కళ్ళు ఆ విషయాన్ని పసిగట్టాయి. ఈ పరిస్థితుల్లో తను సిటీలోకి వెళ్ళడం క్షేమం కాదు. ఈ వార్ లో సామాన్య జనం బలికావడం ఇష్టం లేదు. రెండు రోజుల క్రితమే అతనికి ఈ విషయం తెలిసింది. విదేశాల నుంచి మాఫియా దిగుమతి అవుతోందన్నవిషయం. సుపారీ రూపంలో కరెన్సీ చేతులు మారిందన్న విషయం అతని నోటీసుకు వచ్చింది. అతని చేతిలో వున్న టాబ్లెట్ కంప్యూటర్ ఆన్ అయింది. ఓ వైపు డ్రైవ్ చేస్తూనే డిటేల్స్ చెక్ చేస్తున్నాడు. ఇటలీ, యుఎస్, చైనా ....మాఫియా లోని పెద్ద తలకాయలు వచ్చాయి. అందులో చాల మంది మీద "షూట్ ఎట్ సైట్ వుంది". కార్తికేయలో చిన్న అనుమానం....క్రమ క్రమంగా పెరిగి పెద్దవ్వసాగింది. వెంటనే ఇంటికి చేసాడు. ల్యాండ్ ఫోన్ కు...రింగవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. అంటే తన అనుమానమే నిజమైంది. వాళ్ళని అడ్డు పెట్టుకుని తమను టార్గెట్ చేయాలనీ. ఇలాంటి సమయంలో మాఫియా నుంచి ఎస్కేప్ అవ్వడం పెద్ద విషయం కాదు. తన భార్యను, ప్రణవిని కాపాడడం సమస్య కాదు.
కానీ ఈ ప్రయత్నంలో తను ఈ మాఫియాని వదిలివేయాలి. భారతదేశ ప్రశాంతతకు విఘాతం కలిగిస్తూ ఎక్కడో వుంటూనే ఇక్కడ అల్లకల్లోలం సృష్టించే మాఫియాని తను ఫినిష్ చేయాలంటే...అక్కడ ముగ్ద, ప్రణవి, సంధ్యలను కాపాడేవాళ్ళు కావాలి. చంద్రహాస్ కోసం మరో మాఫియా గ్రూప్ వెళ్ళింది. అతి ప్రమాదకరమైన "జెడ్ " మాఫియా...వాళ్ళని చంద్రహాస్ హేండిల్ చేయగలడు. ఇప్పుడు కావలిసినది ముగ్ధ, ప్రణవి, సంధ్యలను కాపాడే వ్యక్తి...శక్తి....
ఎందుకంటే స్టీఫెన్ దగ్గర వున్న మాఫియా జాంబానియా గ్రూప్ ....ఏ మాత్రం మానవత్వం, భయం లేని క్రూరత్వం వున్న గ్రూప్...
ఈ సమయంలో అమాయక ఆడవాళ్ళను కాపాడే శక్తి వున్న ఒకే ఒక మహా అస్త్రం...సెల్ ఫోన్ లో ఓ నంబర్ డయల్ చేసాడు.
**************
రాజస్థాన్ ఎడారి...మిట్ట మధ్యాహ్నం ...ఒక్కసారిగా ఇసుక తుపాన్ చుట్టుముట్టింది. అయినా చెక్కు చెదరకుండా..ఒకే ఒక కాలు మీద నిలబడి వుంది ...మో...హ...న . ముగ్ధ మోహన ..
(రేపటి సంచికలో ఒక అద్భుతం)

16-06-2013 (chapter-67)

చంద్రహాస్ చిన్నపాటి ఉద్వేగానికి లోనయ్యాడు.దానికి రెండు కారణాలు వున్నాయి.మొదటి కారణం ముక్కలైన మొబైల్ పనిచేయడం...రెండు ఎవరికైతే తను ఫోన్ చేయాలని అనుకున్నాడో ఆ వ్యక్తే ఫోన్ చేయడం .
కార్తికేయ ...ఒక్క సారి మాట ఇస్తే మాట తప్పని,మడమ తిప్పని వ్యక్తి...ఆన్ బటన్ ప్రెస్ చేసి "చెప్పండి కార్తికేయ గారు...ఎలా వున్నారు ?మీ నుంచి ఫోన్ రావడం సంతోషంగా వుంది.ఎంత సంతోషం అంటే ప్రణవి దొరికినంత సంతోషం...అంత పెద్ద బిజినెస్ టైకూన్ ఆ క్షణం ఒక మామూలు భర్త గా ,భార్యను అమితంగా, తన ప్రాణంగా ప్రేమించే భర్తగా ఎక్సయిట్ అయిపోతూ మాట్లాడుతున్నాడు.
"ప్రణవి గారు దొరికినంత సంతోషంగా కాదు...దొరికిన సంతోషమే..."కార్తికేయ చెప్పాడు.
ఒక్క సారి వేన వేల మలయా మారుతాలు తనని చుట్టుముట్టినట్టుగా ...ఎడారిలో మంచు వర్షం
కురిసినట్టుగా....వేల కోట్ల బిజినెస్ డీల్ ఓకే అయినా కలుగని సంతోషం...
కార్తికేయ మరియప్ప గురించి చెప్పలేదు..తను ప్రణవి,చంద్రహాస్ ని కాపాడడానికి చేసిన ప్రయత్నం,పోరాటం గురించి చెప్పలేదు.
"థాంక్యూ కార్తికేయ గారూ..నాకు తెలుసు..నా ప్రణవి ని కాపాడగలిగిన ఒకే ఒక వ్యక్తి మీరని....నేను వెంటనే వస్తున్నాను..ఇక్కడ నేను తేల్చవలిసిన బాకీ వుంది ."తనను పిచ్చాసుపత్రి సెట్ వేసి ఎలా బంధించారో క్లుప్తంగా చెప్పాడు.తను రాత్రి ఎదుర్కున్న విచిత్రమైన అనుభవం గురించి చెప్పలేదు.
"మీరు ఆ బాకీ తేల్చి వచ్చేయండి..ఇక్కడ బాకీ ఏమైనా మిగిలి వుంటే నేను చూసుకుంటాను."
చెప్పాడు కార్తికేయ.
***********************
తన వైపు గురిపెట్టిన రివాల్వర్ వైపు చూసి నవ్వింది సంధ్యాజ్యోతి. స్టీఫెన్ కోపంగా ,ఆశ్చర్యంగా సంధ్య వంక చూసాడు.
"ఒరేయ్ పిచ్చి కుంజా...నిన్ను చూస్తే జాలేస్తుంది.నీ చిన్న మెదడు...మాఫియ వాళ్ళ మోకాల్లో వుందనిపిస్తుంది. అసలు నాకు తెలియక అడుగుతాను...ఈ డబ్బంతా ఏం చెసుకుంటావ్ ? నీకు ఒక్కరు కాదు ఇద్దరు మొగుళ్ళు ...అనవసరం గా నాతొ సెన్సార్ మాటలు మాట్లాడించకు ..నన్ను కాల్చేసి బ్రతుకుదామనే...నువ్వు నన్ను పేలిస్తే నా బాడీ లో సీక్రెట్ గా నేను దాచుకున్న బాంబ్ పేలుతుంది.కావాలంటే ట్రై చేసి చూడు. ఇన్ కేస్..నువ్వు తప్పించుకునా కార్తికేయ,చంద్రహాస్ నిన్ను కుక్కను కొట్టినట్టు...వద్దులే నిను కుక్కతో పోలిస్తే కుక్క ఫీల్ అవుతుంది.బురదలో పందిని కొట్టినట్టు కొడతారు... తర్వాత నీ ఇష్టం " చెప్పి కళ్ళు మూసుకుని .క్షణం తర్వాత ఓరకంటితో స్టీఫెన్ రియాక్షన్ చూస్తోంది.
బలవంతంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు స్టీఫెన్...సంధ్య కాన్ఫిడెంట్ గా మాట్లాడ్డం తో అతనిలో చిన్న సందిగ్ధం...ఆమె ఏ ధైర్యంతో అలా మాట్లాడుతుంది ? ఇపుడే తను తొందర పాడడం కన్నా,ప్రణవి,ముగ్ధ వచ్చే వరకూ వెయిట్ చేసి అప్పుడు అందరినీ ఒకే సారి ఫినిష్ చేస్తే...?ఆ ఆలోచన అతని ఈగో ని సంతృప్తి పరచింది.
కానీ ఆ ఆలోచనే అతన ప్రాణాన్ని తీసుకుంటుందని ఆ క్షణం తెలియదు.
********************
ముగ్ధ ఇంట్లోకి ప్రవేశించాడు నాంపల్లి ...అతని వెంట మాఫియా గ్యాంగ్ వుంది.కైకేయ ఇంట్లోకి ఒంటరిగా ప్రవేశించే ధైర్యం అతనికి లేదు.వాళ్ళు లోపలి వెళ్ళే సరికి ముగ్ధ,ప్రణవి మాట్లాడుకుంటున్నారు.చంద్రహాస్ గురించి,అతను తనను ఎంతగా ప్రేమిస్తాడో మురిసిపోతూ చెబుతోంది.
ముగ్ధ ప్రణవి మాటలు వింటోంది.భర్త గురించి భార్య చెప్పే మాటలు ఎంత అందంగా వుంటాయి.ఒకప్పుడు తను కార్తికేయ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఫీలింగే కలిగేది.చంద్రహాస్ బయల్దేరాడు అన్న విషయం కార్తికేయ ఫోన్ చేసి ముగ్ధకు చెప్పాడు.ముగ్ధ ప్రణవి కి చెప్పింది.
ఆ క్షణమే భర్తకి ఫోన్ చేద్దామని అనుకుంది.ప్రణవి కానీ అతని గొంతు వినడానికి ముందు అతడిని చూడాలి.అతని స్పర్శలో కరిగిపోవాలి.అందుకే అతడి కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో వచ్చాడు నాంపల్లి.
ముగ్ధ వాళ్ళని చూడగానే బెదిరిపోలేదు...ఇలాంటివి చాలా చూసింది. మాఫియా వాళ్ళని చుట్టుముటింది.
"ఏంటి కిడ్నాపా ? ఓకే "అని ప్రణవి వైపు తిరిగి "మీరు ఫ్రెషప్ అవుతారా ?కాసేపు వాళ్ళ గెస్ట్ లుగా వందాం. యాక్షన్ మూవీస్ చూసి చాలా కాలం అయింది ...వీళ్ళు తమ ప్రతాపం ఇంటి మీద చూపించడం...మళ్ళీ సామాను సర్దుకోవడం...వేస్ట్...ఏమంటారు అంది "
ప్రణవికి సీన్ అర్ధమైంది.ఆమెకూ ఉత్సాహమానె వుంది...ఎందుకంటే చంద్రహాస్ రాబోతున్నాడు.ఇప్పుడు తనని,తమని ఎకారూ ఏమీ చేయలేరు. కార్తికేయ,చంద్రహాస్ ఇద్దరూ కలిస్తే..ఈ ప్రపంచంలో మాఫియా వచ్చినా ఏమీ కాదు.
ప్రణవి,ముగ్ధ కామ్ గా లేచి వాళ్ళ వెంట నడిచారు.షాకవ్వడం వాళ్ళ వంతయింది.
********************
ఎనిమిది దేశాల నుబ్చి వచ్చిన మాఫియా మూడు గ్రూపులుగా చీలింది. బ్లాక్ క్యాట్ కమెండో శిక్షణ పొందిన వాళ్ళు...మనుష్యులను అతి కిరాతకంగా చంపేవాళ్ళు...ఈ గ్రూపులలో వున్నారు.ఒక గ్రూప్ వైజాగ్ లో చంద్రహాస్ ని ఫినిష్ చేయడానికి,మరో గ్రూప్ కార్తికేయను ,ఇంకో గ్రూప్ ఒక వేళ వాళ్ళిద్దరూ తప్పించుకుని వస్తే,ముగ్ధ,ప్రణవి లను అడ్డం పెటుకుని అందరినీ ఫినిష్ చేయడానికి.
********************
(ఈ క్లయిమాక్స్ ని మీరు గెస్ చేయగలరా ? గెస్ చేయగలిగితే మాకు ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు లోగా మెయిల్ చేయండి. మీరూహించని ముగింపును రచయిత విసురజ మీ కోసం రాసారు..గెస్ చేయగలరా ?
)

Tuesday, 25 June 2013
ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
15-06-2013 (Chapter-66)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ముగ్ధ ప్రణవి గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో కాఫీ గ్లాస్....ప్రణవి ముగ్ధ వంక చూసి అడిగింది "నేను ఎక్కడున్నాను? మీరు?" ఇంకా ప్రణవి ఒక విధమైన షాక్ లోనే వుంది. ముగ్ధకు ప్రణవి మానసిక పరిస్థితి అర్ధమైంది.
"ముందు మీరు రిలాక్స్ అవ్వండి" అంది కాఫీ ఇస్తూ.
రెండు కణతలు బలంగా నొక్కుకుంది. ఒక్కో విషయం ఆమె జ్ఞాపకాల అరలో నుంచి బయటకు వస్తున్నాయి. ఆమె జ్ఞాపకాల్లో చంద్రహాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రణవి ముగ్ధ పక్కనే కూచొని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు తాజ్ మహల్ దగ్గర జరిగిన ప్రమాదం నుంచి ఈ క్షణం వరకు...
క్షణాలు కన్నీటి కణాలై బయటకు వస్తున్నాయి.
తన కోసం ఇంతటి అన్వేషణ మొదలైందా? ఇప్పుడు తన భర్త ఎక్కడున్నాడు? ఎలా వున్నాడు? తనకు రెక్కలు వస్తే గాలిలో ఎగిరి తన భర్త ముందు వాలిపోయేది. అసలు అతనికి దూరంగా తనెవరో, తనకే తెలియకుండా ఎలా బ్రతికింది?
ప్రణవి చేయి పొట్ట మీదికి వెళ్ళింది." అతని తాలూకు స్పర్శ, జ్ఞాపకం. ఇక్కడే ఇక్కడే వుంది...అందుకే తను బ్రతికి వుంది" ఆ ఆలోచన ఆమెకు తృప్తిని కలిగించింది. ముగ్ధ వైపు చూస్తూ రెండు చేతులు జోడించింది.
"మీ గురించి విన్నాను...కార్తికేయ గారు దేశానికి చేసిన మేలు తెలుసు...మిమల్ని కలవడం నా అదృష్టం..నా కోసం మీరు తీసుకున్న జాగ్రత్త...ఓ సోదరిలా ఆదుకున్న సంఘటన నేను మర్చిపోలేను" కృతజ్ఞతాపూర్వకంగా అంది.
"మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంది. చంద్రహాస్ గారు వచ్చేస్తారు..మీరు కంగారు పడకండి. .ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి." ముగ్ధ చెప్పింది.
ప్రణవి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు భర్త కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు...? శత్రువును చీల్చి చెండాడుతూ తన కోసం వస్తూ ఉంటాడు.
ఆ ఆలోచన ఆమెకు వేన వేల బలాన్ని ఇచ్చింది.
****************
కళ్ళు తెరిచి చూసిన చంద్రహాస్ కు అంతా కలలా అనిపించింది. రాత్రి కనిపించిన భీకర ఆకారం లేదు...అక్వేరియం మామూలుగానే వుంది. ఇదంతా తన భ్రమా ? లేదు భ్రమ కావడానికి వీలులేదు...ఏదో జరిగింది...ఏ అదృశ్యశక్తో తనని కాపాడింది. ఒక్కో సంఘటన గుర్తుకు వస్తున్నాయి. తనకు యాక్సిడెంట్ అవ్వడం మొదలు...ఈ క్షణం వరకూ....జేబులు తడుముకున్నాడు. తన మొబైల్ లేదు...నిన్నటి వరకూ తన చుట్టూ వున్నా మంచాలు ఇప్పుడు లేవు...అంటే తన వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. ఆ విశాలమైన హాల్ వైపు మరో సారి చూసాడు. ఆ చివరికి వెళ్ళాడు. తలుపు వేసి వుంది. అవతలి వైపు నుంచి డోర్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.
చంద్రహాస్ కళ్ళు అక్కడి పరిసరాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతని దృష్టి మంచం కింద పడింది. అక్కడ తన మొబైల్ వుంది.ముక్కలై వుంది. వెళ్లి ఆ ముక్కలను చేతిలోకి తీసుకున్నాడు.అ ముక్కలను ఒక్కటి చేసే పనిలో వున్నాడు...నిమిషాలు గడుస్తున్నాయి...అతని పట్టుదల, ఏకాగ్రత ముందు విధి ఓటమి తల వంచింది.
మొబైల్ ని ఆర్డర్ లో పెట్టాడు. సిమ్ పెట్టాడు, ఆన్ చేసాడు...
అతడు మొబైల్ ఆన్ చేసిన రెండవ నిమిషం మొబైల్ రింగ్ అయింది. కార్తికేయ నుంచి వచ్చిన కాల్ అది.
************************
స్టీఫెన్ మొదటి సారి భయపడ్డాడు...ఆ భయం చావు భయం కన్నా భయంకరంగా అనిపించింది. లాప్ టాప్ లో ఒక్కసారి మెరుపులు కనిపించాయి. మరియస్ప్ప రక్తం కక్కుకుని చనిపోవడం కనిపించింది. అతని ఊహకు అందని విషయం క్షణాల్లో జరిగిపోయింది.
కొద్ది సేపటి క్రితమే తెలిసిన మరో విషయం ప్రణవి కార్తికేయ ఇంట్లో ఆశ్రయం పొందుతుందని.....
వెంటనే అతని క్రిమినల్ బ్రెయిన్ పనిచేయడం మొదలు పెట్టింది. కార్తికేయను ఎదురించడం సాధ్యం కాదన్న విషయం తెలిసింది. ఇప్పుడు కార్తికేయకు చంద్రహాస్ తోడైతే....అగ్ని, గాలి ఒక్కటైతే....నాంపల్లి వైపు చూసి చెప్పాడు.
"నువ్వు కార్తికేయ ఇంటికి వెళ్ళు....అక్కడ ప్రణవి, ముగ్ధను తీసుకుని రా...నీతో పాటు మరి కొందరిని తీసుకువెళ్ళు...కార్తికేయ ఇంటికి చేరుకునేలోగా నువ్వు వాళ్ళని తీసుకుని రావాలి. ఆలస్యమైతే నిన్ను ఆ కార్తికేయ బ్రతకనివ్వడు."
నాంపల్లి వెంటనే బయల్దేరాడు. స్టీఫెన్, మెహతా వైపు చూసి "నువ్వు కార్తికేయ దృష్టిని డైవర్ట్ చేయాలి" లేదంటే కార్తికేయ ఇంటికి త్వరగా చేరుకుంటాడు. ముగ్ధ, ప్రణవి మనచేతిలో వుంటే కార్తికేయ, చంద్రహాస్ లను ఎదురించగలం." చెప్పాడు.
మెహతాకు అది కరెక్టే అనిపించంది. ఓసారి తన చేతిలో వున్న రివాల్వర్ వైపు చూసుకుని బయటకు నడిచాడు.
************
స్టీఫెన్ ఒక్కడే వున్నాడు. ఎదురుగా సంధ్యాజ్యోతి .
"నిన్ను చూస్తోంటే జాలేస్తుంది మిస్టర్ స్టీఫెన్" అతని వైపు చూసి అంది సంధ్య.
ఆశ్చర్యంగా, కోపంగా చూసాడు..."ఎంత ధైర్యం లేకపోతే తన దగ్గర బందీగా వుంది తననే కామెంట్ చేస్తుంది?
"ఓ పని చేయ్....చేసిన తప్పులు ఒప్పుకుని సరెండర్ అవ్వు....బుద్ధిగా కొన్నాళ్ళు జైలులో వుంది ఆత్మకథ రాసుకోవచ్చు...కావాలంటే నీ ఆత్మకథ నేను రాసి పెడతాను" తాపీగా అంది సంధ్య.
స్టీఫెన్ కోపం నషాళానికి అంటింది...రివాల్వర్ తీసి సంధ్య వైపు గురిపెట్టాడు.

14-06-2013 (Chapter-65)

సంధ్యాజ్యోతి ఒళ్ళు విరుచుకుంది. గుటకలు మింగాడు నాంపల్లి. అతని వైపు చూసి "ఫస్ట్ టైమా? అని అడిగింది.
"ఏమిటి ఫస్ట్ టైం?" అయోమయంగా అడిగాడు.
"అమ్మాయిని చూడ్డం.." అంది.
కోపంగా సంధ్య వైపు చూసాడు. ఓ వైపు స్టీఫెన్, మెహతా, టెన్షన్ గా వున్నారు. ఈ అమ్మాయి ధైర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.
"ఏంటీ అదోలా చూస్తున్నావు? మీ బాస్ ని పిలువు" గీరగా అంది సంధ్య.
మరో సమయంలో అయితే సీరియస్ గా రియాక్ట్ అయ్యేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కామ్ గా ఉండక తప్పడం లేదు. ప్రణవి తప్పించుకోవడం, మరియప్ప చేతబడి ఎదురు తిరిగే పరిస్థితి రావడం...చంద్రహాస్ ఇంకా చావకపోవడం....
సంధ్య నాంపల్లి వైపు చూసి "ఇదిగో అబ్బాయి మాట" అంది.
అరికాలి మంట నెత్తికి ఎక్కింది. కోపం నషాళానికి తాకింది. అప్పటికప్పుడు సంధ్య గొంతు పిసికి చంపేయాలన్నంత కోపమూ వచ్చింది. బలవంతాన కోపాన్ని అణుచుకుంటూ...అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
*******************
నిక్శూచిని నిద్ర లేపి క్షుద్ర మాంత్రికుల చరిత్రలో నిక్శూచిని నిద్ర లేపిన ఘనత సాధించాలని కలలు కన్నాడు మరియప్ప. ఆ కలలు కల్లలు కాబుతునాయని తెలిసినప్పుడు కలిగే కోపం, అసహనం..వాటికి తోడూ భయం అన్నీ ఒకే సారి కలిగాయి, మరియప్పలో...
అతనికి సెంటిమెంట్స్ లేవు...ఈ ప్రపంచంలో మరియప్ప లాంటి వాళ్ళు వున్నారు...మాంత్రికులుగా చెలామణి కాకపోయినా, మనుష్యుల రూపంలో వున్న హిపొక్రైట్స్ ..
నిక్శూచి ఒక ఆకారం కాదు..గాల్లో కలిసిపోతుంది...వర్షంలో కలిసిపోతుంది. ప్రపంచమంతా వ్యాపిస్తుంది. తన దుష్ట ప్రభావాన్ని చూపిస్తుంది.
కార్తికేయ నిక్శూచి ఆగమనాన్ని అడ్డుకోవడమే కాదు..శాశ్వతంగా దిగ్బంధించాలన్నంత పట్టుదలగా వున్నాడు. నిజానికి అతనికి ఇక్కడ జరుగుతున్నది పూర్తిగా తెలియదు. అతని అనుభవం..విచక్షణ కొంత ఊహించగలిగింది .
మరియప్ప కోపంతో ఊగిపోయాడు...తన క్షుద్ర ప్రయోగం భంగం అవుతుందని అర్ధమయింది.
అప్పటికే కార్తికేయ తన చేతిలో వున్న కొమ్మతో మరియప్ప మీద దాడి చేసాడు,
మరియప్ప కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. తన శక్తిని ధారపోసి కార్తికేయను తన చూపులతోనే రక్తం కక్కుకుని చనిపోయేలా చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే తన శక్తులను నిక్శూచిని నిద్ర లేపడానికి, ఉపయోగించాడో ఆ క్షణమే అతను శక్తులు కోల్పోయాడు. అంత కన్నా దారుణంగా తన జేవితాన్ని కోల్పోతున్నాడు ..
మరియప్ప ఏకాగ్రత దెబ్బ తిన్నది. క్షుద్ర ప్రయోగం ఎప్పుడైతే అసంపూర్తి మిగులుతుందో, అసంతృప్తితో వున్న నిక్శూచి అ ప్రయోగాన్ని చేపట్టిన వ్యక్తిని బలి తీసుకుంటుంది. మరియప్ప విషయంలోనూ అదే జరిగింది.
కార్తికేయ చేతిలోని కొమ్మ మరియప్ప తల మీద పడింది బలంగా...ఆ వేగానికి మరియప్ప పళ్ళు రక్తంతో సహా కింద పడ్డాయి. ఎంత వేగంగా నిక్శూచి పైకి వచ్చిందో...అంతే వేగంగా వెనక్కి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ,మరియప్పను బలి తీసుకుంది. ఒక్క సారిగా ప్రేతాత్మలు దాడి చేసినట్టు...ముందుకు తూలి పడిపోయాడు. ప్రేతాలు చుట్టుముట్టాయి....క్షణాల్లో రంగు మారుతూ...రక్తం భళ్ళున కక్కుకున్నాడు...తల పక్కకు వాలింది.
అతని భార్య ఆత్మ సంతోషించింది,
*******************
ఒక ఘోర విధ్వంసం తప్పిపోయింది. చెడుకు బాసటగా వుంది, క్షుద్రమైన చేతలతో..విర్ర వీగిన మాంత్రిక జాతిలోని చిట్టా చివరి వాడి జీవితం క్షుద్ర ప్రేతాల దాడిలో ముగిసిపోయింది. నిక్శూచి అసంతృప్తితో మళ్ళీ సమాధుల అడుగు పొరల్లోకి వెళ్ళిపోయింది.
ఒక క్షుద్ర మాంత్రికుడి జీవతం ఆ విధంగా అంతమైంది.
***************
ప్రణవి కళ్ళు తెరిచింది.తను ఎక్కడుంది? ఒక్క క్షణం అయోమయంగా చూసింది.తను ఎవరింటిలో వుంది ?
*************
(గతం గుర్తొచ్చిన ప్రణవి...వర్తమానం మర్చిపోయిందా? రేపటి సంచికలో)

13-06-2013 (chapter-64)

(ఆగష్టు 1 లో హీరో ఎవరు ? ఈ కథాంశం దీరోదాత్తత ప్రధానంగా కొనసాగిందా ? రచయిత ఈసీరియల్ లో చేసిన ప్రయోగం ఏమిటి ? విసురజ మనసులో మాట...సీరియల్ ముగింపులో...డోంట్ మిస్ ---చీఫ్ ఎడిటర్ )
జీవితం ఒక యుద్ధం...నిరంతరం పోరాడుతూనే వుండాలి.ఓడి పోవడమంటే గెలువగలిగి వుండి యుద్ధాన్ని మధ్యలో ఆపివేయడం...యోధుడి చివరిక్షణం కూడా పోరాటంలోనే కొనసాగాలి. మృత్యువు తన ముందు వుందని తెలిసినప్పుడు "నిస్సహాయంగా తలవంచడం కాకుండా,చివరిక్షణం వరకు పోరాడుతూనే ఉండాలన్న జీవిత సత్యాన్ని అనుభవాల ద్వారా....తెలుసుకున్న వ్యక్తి చంద్రహాస్"
తను భ్రమలో వున్నాడా ? అన్న ప్రశ్న నుంచి బయటకు వచ్చాడు.శక్తిని కూడదీసుకున్నాడు.మనసులో దైవనామ స్మరణ...చేతుల్లో ఆత్మవిశ్వాసపు ఆయుధం...పిడికిలి బిగించాడు.తన ఎదురుగా వున్న భీకర ఆకారాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు.
***************
స్టీఫెన్ మొహం స్వేదంతో తడిసిపోయింది.లాప్ టాప్ లో కనిపిస్తోన్న దృశ్యాలు చూసి ఖంగు తిన్నాడు.తను అమర్చిన కెమెరా లలో కనిపించిన దృశ్యం అతడిని భయానికి గురి చేసింది.పెద్ద గాలి...ఆ గాలిని చీల్చుకుంటూ ఓ వ్యక్తి ప్రళయకాల రుద్రుడిలా పరుగెత్తుకు వస్తున్నాడు.అతని చేతిలో కొమ్మ...శివుడి చేతిలో
త్రిశూలంలా అనిపించింది.
అతడిని ఎక్కడో చూసిన జ్ఞాపకం...మరియప్ప లాంటి మాంత్రికుడిని ఎదుర్కునే ధర్యం,తెగువ వున్న వ్యక్తి ఎవరున్నారు?చంద్రహాస్ తప్ప ? మరి ఇతనెవరు ? మృత్యువునే భయపడేలా చేయగల రౌద్రం అతడి మోహంలో కనిపిస్తోంది. స్మశానంలో మారిన వాతావరణం...మరియప్ప మోహంలో బాధ కనిపిస్తోంది.
*****************
చతుర్వేది వైజాగ్ చేరుకున్నాడు.చంద్రహాస్ నుంచి వచ్చిన చివరి కాల్ వైజాగ్ నుంచే...సేక్యూరితీచీఫ్ మెహతా కు సంబంధించిన వివరాలు తెలిసాయి.మేన్ రోబో నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది.చంద్రహాస్ చీఫ్ ఎడిటర్ తో మాట్లాడాడు....రిపోర్టర్ సంధ్యాజ్యోతి మెహతాను ట్రాప్ చేసింది.వైజాగ్ లో వున్న సారథి చంద్రహాస్ గురించి వెతుకుతూనే వున్నాడు.ప్రణవి సేఫ్ అన్న విషయం తెలిసింది.
ఇప్పుడు తెలియవలిసింది చంద్రహాస్ గురించి. చతుర్వేదికి ఒక నమ్మకం..చంద్రహాస్ మృత్యువుని ఎదురించగల వ్యక్తి అని...
అంత కన్నా మరో ధైర్యం కార్తికేయ...దేశాన్ని ఉగ్రవాదం బారి నుంచి కాపాడడమే కాదు..ఒక ప్రమాదకరమైన మిస్సయిల్ లాంటి మోహన ను దేశానికి పనికి వచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దిన కార్తికేయ తమకు అండగా వున్నాడు.
మరియప్ప పెదవులు చివరి క్షుద్ర మంత్రాన్ని ఉచ్చరించబోతున్నాడు.గాలిని చీల్చుకుంటూ వచ్చిన కార్తికేయ ...సమాధుల మీద వున్న ముగ్గుని,ముగ్గు మధ్యలో వున్న పిండి బొమ్మను తన చేతిలోని కొమ్మతో దూరం గా నేట్టేసాడు. ఎడమకాలితో మరియప్ప గుండెల మీద తన్నాడు. మరియప్ప ఊహించని పరిణామం..
నిక్శూచి సమాదిలోనుంచి లేచే చివరిక్షణం లోని పదవ వంతు...ఆకాశం పెద్దగా ఉరిమింది.మెరుపులు...నిక్శూచి ఆగమనాన్ని అడ్డుకునే హోరుగాలి....ప్రేతాత్మలు కకావికలమవుతున్నాయి. అప్పుడు జరిగిందా సంఘటన ...
***************
(ఏమిటా సంఘటన ?రేపటి సంచికలో )

12-06-2013 (chapter-63)

కొన్ని సంఘటనలకు లాజిక్కులు వుండవు...కొన్ని స్వార్ధాలకు విచక్షణ,మానవత్వం లాంటివి వుండవు...రాదాచంద్రిక జీవితంలో జరిగిన సంఘటనలకు విషాదమే సాక్షి సంతకం.
గుండె పగిలినప్పుడు శబ్దం రాదు...ఎందుకంటే గుండె గాజుతో తయారు చేయబడలేదు...అది లోహం కాదు...వస్తువూ కాదు...బ్రహ్మదేవుడు సృష్టించిన ఒకే ఒక ప్రాణం...అది మనసైన వాడి కోసమే నిరంతరం కొట్టుకుంటుంది.ఆ గుండె సవ్వడే మనిషిని బ్రతికిస్తుంది.
రాదాచంద్రిక గుండె పగిలింది..సుకన్య "భర్త గురించి చెప్పినప్పుడు"..తనను ల్యాండ్ ఫోన్ ద్వారా భర్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సుకన్య ఆధారాలతో సహా నిరూపించింది.తన ఆస్తి కోసమే ఈ పని చేసాడు అనుకుంటే కొద్దిగానైనా తృప్తిగా వుండేది. కేవలం మరో స్త్రీ కోసం ,తనను మోసగించాడు.తన నమ్మకాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు.
ఈ ప్రపంచంలో తన భర్తకు మించిన ఆస్తి మరోటి లేదని నమ్మింది.కానీ మరో స్త్రీ పొందు తన భర్తకు ముఖ్యమని తెలిసింది.ఆ రోజు మనసు బాగాలేక గుడికి వెళ్తుంటే దారిలో భర్త ,ఓ స్త్రీ...
గెస్ట్ హౌస్ కు వెళ్ళినప్పుడు శవంలా నటించిన స్త్రీ...ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు...తనకు నిజం తెలిసిన విషయం భర్తకు ఇంకా తెలియదు.
ఎంత స్వార్ధం...ఒక శరీరం మీద వ్యామోహం...రక్తమాంసాల దేహం...సిరలు,ధమనులు....రక్తం...కేవలం ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే వుండే దేహం...కొన్ని క్షణాల లేదా నిమిషాల రాపిడి...ఉద్వేగానికి గురి చేసే స్పర్శ...డబ్బుకు అమ్ముడు పోయింది.
"అందమైన ,అనుకూలమైన భార్య..ఏ క్షణమైనా, మీ సన్నిధిలో,మీ సాంగత్యంలో కరిగి కలిసి పోవడానికి,ఈ శరీర్తాన్ని పాన్పుగా మీ ముందు పరచడానికి సిద్ధం "అని చెప్పే భార్య,,,శయనేషు రంభలా,కార్యేషు దాసిలా వుండే భార్య వున్నా, మరో దేహం పై ఈ మమకారం ఎందుకు ? భర్త ను చూస్తే
అసహ్యం కన్నా ,జాలి ఎక్కువ కలిగింది....ఎందుకంటే తనలాంటి భార్యను అతను మిస్సవుతున్నందుకు...
ఒక్క క్షణం చనిపోవాలన్న ఆలోచనా వచ్చింది.ఒక పుస్తకంలో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి.
"మరణం పరిష్కారం కాదు...అనివార్యమైన చివరి వీడ్కోలు...అది మృత్యువు తనంతట తానూ వచ్చినప్పుడే వెళ్ళాలి.మనకై మనం వెల్ల కూడదు....నీ కోసం మిగిలి వున్నా అనుభవాలు ప్రోది చేసుకో...అనుభూతులు పదిలపర్చుకో...ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో..నీ కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవారు వచ్చినప్పుడు నువ్వు వారికి దాసోహమవ్వు..."
తను చనిపోకూడదు...ఒక బాలీ వుడ్ తార మరణం ఏం చెప్పింది? ఆమె ఆత్మహత్య ఎవరికీ లాభించింది ?అతను అన్నీ మర్చిపోతాడు...మరో స్త్రీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.ఆమె మరణం ఒక వాక్యంగా మిగిలిపోతుంది.
*******************
రాదాచంద్రిక ఆత్మహత్య చేసుకుంది.రైలుపట్టాల మీద శరీరం నుజ్జు నుజ్జయింది...గుర్తు పట్టడానికి వీల్లేకుండా...తన వీలునామాలో తన యావదాస్తి నిరుపేదల కోసం ఓ ట్రస్ట్ కు రాసింది.రాదాచంద్రిక భర్తకు ఇది కోలుకోలేని షాక్...భార్య మరణంతో ఆమె ఆస్తి దక్కలేదు...ఆమే దక్కలేదు...ఆస్తి లేని అతడిని అతని తాజా ప్రియురాలు వదిలేసింది.అతనిప్పుడు తన జీవితాన్ని జీరో నుంచి మొదలుపెట్టాలి..అతనిప్పుడు ఒక జీరో...అతని పక్కన ఒకటిగా నిలిచిన రాదాచంద్రిక విలువ ఇప్పుడు తెలిసివస్తుంది.
అప్పటికే ఆలస్యం అయింది..కాలచక్రంలో వర్తమానాన్ని ,భవిష్యత్తును పదిలపర్చుకుని జాగ్రత్తపడవచ్చు...గతాన్ని,గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము.
******************
ఆ రాత్రి రాదాచంద్రిక సుకన్యకు థాంక్స్ చెప్పింది.అనాథ శవాన్ని తన శవంగా ఈ ప్రపంచాన్ని నమ్మించినందుకు... ట్రస్ట్ వ్యవహారాలూ సుకన్య పర్యవేక్షణలో కొనసాగుతాయి.
"నేను విరక్తి తో వెళ్ళడం లేదు...జీవితంలో మగవాడు అంటే అసహ్యంతో వెళ్ళడం లేదు.నేను కోల్పోయిన ప్రేమను అన్వేషిస్తూ వెళ్తున్నాను..."ఆమే సెలవు తీసుకుంది.ఆమే ఇప్పుడు బేల కాదు...ఆమె మేలుకుంది...ఆమె చేతిలో మేలుకొలుపు ముచ్చట్లు పుస్తకం వుంది...
(తొందరపాటుతో మృత్యువును ఆహ్వానించిన జియాఖాన్ కు ఈ అధ్యాయం అంకితం...ఆత్మహత్య ఆలోచన వచ్చిన మరుక్షణం ఈ అధ్యాయం మీకు గుర్తుకు వస్తే...మీలో స్ఫూర్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తే...మీకు హేట్సాఫ్ ...రచయిత )
***************
కార్తికేయ చేతిలోని చెట్టు కొమ్మ మహా అస్త్రమై గాలిలోకి లేచింది.సమస్త క్షుద్ర శక్తులు ఏకమైన క్షణం...మరియప్ప తన రక్తంతో నిక్శూచిని సంతృప్తి పర్చాలనుకున్న క్షణం...ఉగ్రమై...మహోగ్రమై...భీకరమై...విలయ విధ్వంసమై....గాలిని చీల్చుకొని,భీభత్సాన్ని వెంటపెట్టుకుని..సమాధులను చీల్చుకుని ...కదిలిన నిక్శూచి...
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ ..)

Sunday, 23 June 2013
ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
11-06-2013 (chapter-62)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ప్రణవి కళ్ళు అలసటతో మూతలు పడుతున్నాయి.మ్ప్ప్తలు పడుతోన్న కళ్ళు గతాన్ని అన్వేషిస్తున్నాయి.క్షణకాల మాత్రం....లిప్తకాలం...ఒక్కో జ్ఞాపకం ఆమె ముందుకు రావడం మొదలుపెట్టాయి. తాజ్ మహల్ దగ్గర ప్రమాదం...ఆ ప్రమాదంలో తనకు తీవ్రమైన గాయాలు కావడం స్పృహ తప్పడం ..కళ్ళు తెరిచి చూస్తే.. అంతా చీకటి.
**************
అంతా చీకటి...కళ్ళు చిట్లించి చూసింది.ఏమీ కనిపించడం లేదు...ఆమె కళ్ళు చంద్రహాస్ ను అన్వేషిస్తున్నాయి.తనకేమైంది అని ఆలోచించడం లేదు..తన చంద్రహాస్ కు ఏమైందో అన్న ఆదుర్దా ఆమెది.
శక్తిని కూడతీసుకుని లేచింది.కాళ్ళకు ఏదో అడ్డం పడింది.తూలి పడబోయింది.అప్పుడు వెలిగాయి లైట్లు...ఒక్క క్షణం ఆ లైట్ల వెలుతురు చూడలేక కళ్ళు మూసుకుంది.
*************
"గుడ్ మార్నింగ్ ప్రణవి మేడం..."
ఆ గొంతు ఎక్కడో విన్న జ్ఞాపకం...కళ్ళు తెరిచి చూసింది.ఎదురుగా మెహతా....తమ సెక్యూరిటీ చీఫ్...రోజూ ఉదయమే గుడ్ మార్నింగ్ చెప్పే మెహతా...
"మీరా ?"ఆమె గొంతులో ఆశ్చర్యం...
"యస్..మేడం...రోజూ ఉదయమే మీకు శుభోదయం చెప్పే మీ సెక్యూరిటీ చీఫ్ ని.."
"నేను నేను ఇక్కడ ఎందుకు వున్నాను...? సర్ ఎక్కడ వున్నారు ?"అయోమయంగా అడిగింది.
"మీరు కిడ్నాప్ చేయబడ్డారు..."కూల్ గా చెప్పు మెహతా .
"వాట్...?కోపం,ఆశ్చర్యం ...
"యస్ మేడం...యాక్సిడెంట్ లో మీరు చచ్చిపోయారని ది గ్రేట్ చంద్రహాస్ సర్ అనుకుంటున్నారు...బాడ్ లక్ మీరు బ్రతికి పోయారు..ఇప్పుడు మీరు వెళ్లి " నేను బ్రతికే వున్నానని చెబితే...మమ్మల్ని బ్రతకనిస్తారా?పైగా ఎంత కష్టపడి ప్లాన్ వేసాం ? అందుకే మీరు కొన్నాళ్ళు మా గెస్ట్ గా వుండండి.మీరు చనిపోయారని నిర్ధారించుకుని చేసుకుని చంద్రహాస్ సర్ వ్యాపారాన్ని వదిలి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు...మీకో విషయం తెలుసా ...ఇంకా మీరు బ్రతికే వున్నారని వెతుకుతున్నారు...పేపర్స్ లో టీవీ లలో ప్రకటనలు ఇస్తున్నారు.../అంటూ ఆ వేల్టి పత్రికలూ ప్రణవి ముందు పట్టాడు.
ప్రణవికి ఏడుపు తన్నుకు వస్తుంది.తను చనిపోయినా బావుండేది...తను లేకుండా భర్త బ్రతకగలడా ? సెక్యూరిటీ చీఫ్ ఎంత పని చేసాడు ? రాజ్యాలు కూలిపోవడానికి అంతః పురరహస్యలు శత్రువుల చేతికి చేరడానికి నమ్మిన వారి నమ్మకద్రోహమే అని ప్రత్యక్ష్యంగా చూస్తుంది.
తన భర్తను ఎదురుగా ఎదుర్కోలేక ఇలా దొంగదెబ్బ తీస్తున్నారని అర్ధమైంది.
ఒకటి...రెండు..మూడు రోజులు గడిచిపోతునాయి.
పత్రికలూ వస్తునాయి..టీవీ తన ముందరే వుంది. మర్యాదలకు లోటు లేదు...తనను అడ్డుపెట్టుకుని తన భర్తను సాధించాలని చూస్తున్నారు ...
దీని వెనుక వున్నది స్టీఫెన్ అని అర్థమైంది. తను ఇక్కడి నుంచి తప్పించుకు పోవాలి..ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా పర్లేదు.
****************
ఆ రోజూ అర్ధరాత్రి వేళ తప్పించుకుంది.ఆమెను వెంటాడింది మాఫియా....ఆ ప్రయత్నంలో తలకు తీవ్రమైన గాయం తగిలింది.హైదరాబాద్ ఎక్కే రైలు ఎక్కింది.వృద్ధుడి ద్వారా రక్షించబడింది.కానీ జ్ఞాపకాన్ని కోల్పోయింది.నవీన్,వినోద్ లు కాపాడారు.వృద్ధుడు ప్రణవి ని వైజాగ్ తీసుకువెళ్ళాడు...
ఆ తర్వాత తన గతాన్ని వెతుకుతూ బయల్దేరింది.గతం ఆమె ముందు నిలిచింది.తన పేరు ప్రణవి...తను మిసెస్ ప్రణవీచంద్రహాస్....
ఆ దేవుడి సమక్షంలో ప్రణవి కి తనెవరో తెలిసింది.
*******************
ఓ దాడిలో బందించబడి వుంది సంధ్యాజ్యోతి. స్టీఫెన్ సంధ్య వైపు చూసి "వెరీ స్మార్ట్ గర్ల్...ఈ మెహతా కే చెమటలు పట్టించావు...ఇది చాలా సెంటిమెంట్ ప్లేస్... ఇక్కడే ప్రణవి మేడం ని బంధించాను...ఆమె ఎస్కేప్ అయింది.ఇప్పుడు నీ వంతు..."నవ్వుతూ చెప్పాడు మెహతా...
"ప్చ్...నిన్ను చూస్తే జాలేస్తుంది మెహతా...బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ చినప్పుడే కొబ్బరి పచ్చడి అయింది...నీ సెంటిమెంట్ ఏడ్చినట్టు...నీకు మెంటల్ అన్నట్టు వుంది...ప్రణవి మేడం లా నేను తప్పించుకొను...ఫరే చేంజ్ నువ్వే ఇక్కడి నుంచి తప్పించుకునేలా చేస్తాను.ఎన్సుకంటే నేను ఎక్కడున్నానో...నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువస్తున్నప్పుడు ఫాలో అయిన మా బాస్ కు తెలుసు...
********************
స్మశానంలో మరియప్ప ఏకాగ్రతను సాధించే ప్రయత్నంలో వున్నాడు.ఆలయంలో నుంచి వినిపించే గంటల ధ్వని వేన వేళ రెట్టిమ్పులతో అతని కర్ణ భేరిని బద్దలు కొట్టేలా వుంది.ఈ సమయంలో తను చివరి క్షణాన్ని విస్మరిస్తే ,తను ఘోరమైన చావును ఆహ్వానించవలిసివస్తుంది తన ఏకాగ్రతను దెబ్బ తీస్తున్నది ఎవరు ?అలాంటి ఆలోచన కూడా చేయకూడదు..నిక్శూచి చివరి దశలో వుంది.నిద్ర లేవడానికి క్షణాల వ్యవధి మాత్రమే..
*****************
చంద్రహాస్ శక్తిని,ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు."దేవుడా నువ్వు మనుష్యులను సృష్టించావు...ఆ మనుష్యులలో ఆత్మవిశ్వాసాన్ని సృష్టించావు...మాలో నువ్వు వున్నది నిజమైతే...నాకు శక్తిని ఇవ్వు...
కళ్ళు మూసుకున్నాడు చంద్రహాస్...
******************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

10-06-2013 (Chapter-61)

దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనివార్యం...మరియప్ప లాంటి క్షుద్రమాంత్రికుడి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరం. మనలోని ఈర్శాసూయ, ద్వేషాలు దుష్టశక్తులతో...మనకు మనమే చేతబడి చేసుకుంటున్నాం. మరియప్పలాంటి వాళ్ళు వీటికి ఆజ్యం పోస్తున్నారు. నిక్శూచిని నిద్రలేపగల ఒకే ఒక క్షుద్రమాంత్రికుడు, ప్రళయాన్ని సృష్టించడానికి, చివరి అంకాన్ని ప్రారంభించాడు. క్షణాల వ్యవధి.
ఒక విషవాయువు కొన్ని వేల ప్రజల జీవితాలను మృత్యువు సరిహద్దుకు చేరుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన విధ్వంసం, బాంబుల మోత..,వాటి ప్రభావం ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. భోపాల్ దుర్ఘటన అత్యంత విషాదకరం...సైన్స్ ...మేథస్సు...వక్రమర్గంలోకి వెళ్తే జరిగే ఉత్పాతం ...
ఒక క్షుద్ర ఆలోచన, క్షుద్రప్రయోగం ...గాలిలో కలిసి కలుషితమై, దాడి చేస్తే జరిగేది....నిక్శూచి లాంటి ఒక విష ప్రయోగమే...
(దక్షిణాఫ్రికాలోని ఒక ఆటవిక తెగలోని జాతి, ఒక రకమైన విష వృక్షాలతో తయారు చేసిన రసాయనాన్ని శత్రువుల మీద ప్రయోగిస్తారు. అది సేవించినవారు విపరీత ప్రవర్తనతో ఒకరికొకరి శత్రువులుగా మారిపోతారట....ముసలం కూడా ఇలాంటి కథనాన్ని చెబుతుంది. విపరీత ప్రవర్తన రూపంలో...రచయిత)
నిక్శూచికి ఆకారం వుండదు...ఎప్పుడు ఏ శరీరంలోకి ప్రవేశిస్తుందో...ఏ వస్తువులోకి చేరి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియదు.
చివరి క్షణాలు...మరియప్ప పైశాచిక ఆనందంలో వున్నాడు. "తను నిక్శూచిని నిద్రలేపుతున్నాడు...తిరిగి క్షుద్రప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. ఆ ఆనందాన్నినియంత్రిస్తూ గంటారావం... అది మామూలు శబ్దాలు కావు. అతని ఏకాగ్రతను దెబ్బతీసే శబ్దాలు.
కార్తికేయ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతనికి దైవ సంకల్పం అర్థమైంది, చేతిలో ఆయుధం లేదు...దష్టశక్తిని సంహరించడానికి మనిషి సృష్టించిన ఆయుధం అక్కర్లేదు...వెంకటేశ్వరస్వామి పాదాల చెంత గాలి దుమారానికి విరిగిపడిన కొమ్మ...ఒక్క క్షణం కార్తికేయకు మహామాన్వి ఖడ్గం గుర్తుకు వచ్చింది.
"నా కులదైవమా...నన్ను సదా వెన్నంటి వుండే దేవదేవుడా...ఇదే నీ సంకల్పం అయితే...నేను శిరసు వంచి శిరసావహిస్తున్నాను. నీ నామమే ఆయుధం..." రెండు చేతులు జోడించి ఆ విరిగిన కొమ్మను చేతిలోకి తీసుకున్నాడు. ఆ కొమ్మలోకి ఏదో దివ్యశక్తి వేంకటేశ్వరుడు విగ్రహంలోనుంచి ప్రవేశించినట్టు....
ఆ కొమ్మను చేతిలోకి తీసుకుని స్మశానం వైపు పరుగెత్తాడు.
ప్రణవికి స్పృహ తప్పుతోంది..ఆ స్పృహలో నుంచి..గతం గుర్తుకు వస్తోంది..
నిక్శూచి ఒళ్ళు విరుచుకుంటోంది.

09-06-2013 (Chapter-60)

ప్రణవి క్యాబ్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె ట్రాన్స్ లో వున్నట్టు వుంది. క్యాబ్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సైన్స్ కు అందని, తర్కానికి చేరని ఎన్నో సంఘటనలు చరిత్రలో వున్నాయి, ఒక అద్భుతమైన విషయం ...మన మేథస్సుకు పదును పెట్టవచ్చు.
ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి అతని ద్వారా హత్యలు చేయించిన సంఘటనలు నేరచరిత్రలో వున్నాయి. టెక్నాలజీ అప్పుడప్పుడు పక్కదారి పడుతుంది. క్రిమినల్స్ తమ పరిజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తారు. క్యాబ్ ని నడిపిస్తోన్న డ్రైవర్ నిద్రలో నడుపుతున్నట్టు వుంది. రాత్రి వేళ కావడం, క్యాబ్ జనసంచారం లేని ప్రాంతంలోకి రావడం వల్ల, నిర్మానుష్యమైన ఆ ప్రాంతం భయాన్ని ఎగదోస్తోంది. క్యాబ్ అడవిలాంటి ప్రాంతంలోకి ప్రవేశించింది. క్యాబ్ ని ఫాలో అవుతుంది, కార్తికేయ కారు. ప్రణవి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి కార్తికేయ సిద్ధంగా వున్నాడు. కారులో షిర్డీ సాయి, వెంకటేశ్వరస్వామి ప్రతిమలు రెండు వైపులా అతడిని సదా కాపాడుతున్నట్టు వున్నాయి.
క్యాబ్, కార్తికేయ కారు స్మశాన ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఆ ప్రతిమలలో నుంచి ఒక కాంతిపుంజం వెలువడిన ఫీలింగ్ కలిగింది, కార్తికేయకు.
***************
మలయప్ప ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కణతల్లో చిన్న నొప్పి లాంటిది. అతని క్షుద్రప్రయోగానికి ఏ శక్తో అడ్డుపడబోతుందన్న సంకేతం. కళ్ళు తెరవకూడదు. క్షుద్రప్రయోగం మధ్యలో ఆపకూడదు...నిక్శూచి నిద్రలేవడానికి తన క్షుద్రశక్తి ప్రతాపాన్ని చూపడానికి ఆయత్తమవుతుంది.
సరిగ్గా ఆ క్షణంలోనే క్యాబ్, కార్తికేయ కారు శిథిలమైన ఆలయం వైపు వెళ్తున్నాయి. కార్తికేయ మనసు ఒక్క క్షణం భక్తీ భావంతో పులకించింది. ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం, ఒక అమృత స్పర్శ...
****************
చంద్రహాస్ తన శక్తినంతా కూడతీసుకున్నాడు. ఎదురుగా వున్నా భీకర ఆకారం తనను కబళించదానికి వస్తోంది. ఎవరో తనను బంధించినట్టు....శరీరం సహకరించనట్టు...అతనికి చావు భయం లేదు...కానీ చనిపోయే లోగా తను తన ప్రణవిని ...తన ప్రాణాన్ని చూడాలి. తను ప్రాణంతోనే వుంది అన్న తన నమ్మకం నిజమవ్వాలి. తన స్పర్శతో ఇది నిజమే అన్న వాస్తవ స్వప్నం సాకారమవ్వాలి.
ఏ అదృష్ట శక్తో తనను కాపాడుతుందన్న నమ్మకం...తన ప్రణవిని చూడకుండా తను కన్నుమూయడన్నవిశ్వాసం.
ఆ వికృతాకారం చంద్రహాస్ కు వెంట్రుకవాసి దూరంలో వుంది.
నిక్శూచి నిద్రలేవడానికి క్షణాల వ్యవధి మాత్రమే వుంది.
********************
క్యాబ్, కారు రెండు ఆలయం ముందు ఆగాయి. ఒక్కసారిగా గాలి దుమారం...ఆకులు, చెత్త, ముళ్ళపొదలు...ఆ గాలిలో కొట్టుకుపోతున్నాయి. వాయుదేవుడు స్వామివారి ముందు మోకరిల్లాడు, ఆలయాన్ని శుభ్రం చేస్తున్నట్టు...గాలి కదిలింది. ప్రణవి క్యాబ్ దిగింది. ప్రణవిని దించిన క్యాబ్ వచ్చిన దారిలోనే కదిలింది. ప్రణవి మెడలోని సన్నటి బంగారు గొలుసు క్యాబ్ లో పడిపోయింది, ఆ క్యాబ్ డ్రైవర్ చేసిన సాయానికి అందిన ప్రతిఫలంగా..
ప్రణవి ఆలయంలోకి నడిచింది. తూలి పడబోయి గుడి పైభాగానికి వేలాడుతున్న గంటని పట్టుకుంది. గంట మోగింది ...గాలికి మిగితా గంటలు ఒకదానికి మరొకటి తగిలి మహా శబ్దాన్ని సృష్టించాయి. మామూలు శబ్దాలు కావు...సకల చరాచర సృష్టిని మేల్కొలిపే నాదాలు, శబ్దాలు...ఉరుములు, మెరుపులు..ఆ మెరుపుల్లో దూరంగా వున్న స్మశానం కనిపించింది కార్తికేయకు. తన కర్తవ్యం, ఆ దేవదేవుడి ఆంతర్యం అర్థమైంది.
******************
(దైవశక్తికి, దుష్టశక్తికి జరిగే పోరాటం ..రేపటి సంచికలో)

ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
08-06-2013 (Chapter-59)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ...
******************
మనసుకు జోలపాట పాడి నిద్రపుచ్చే అందమైన జ్ఞాపకం...ఎక్కడో అదృశ్యంగా ఉండిపోయింది. తానెవరో తెలియక పోవడం కన్నా, తెలుసుకునే ప్రయత్నంలో అనుభవించే బాధ అత్యంత వేదనాభరితంగా వుంటుంది. ఆ బాధను అనుభవిస్తోన్న ప్రణవి నిద్రకు దూరమైనది. ఆమె బాధను ముగ్ధ గమనిస్తూనే వుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఆమెది. తను పూజించే దేవుడిని ఒక్కటే కోరుకుంది. ప్రణవికి మంచి జరగాలి. మంచి మనసుతో ఆమె కోరుకున్న కోరికను దేవుడు తీర్చకుండా ఉంటాడా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.
********************
మరియప్ప రెండురోజులుగా కంటి మీద కునుకు లేకుండా వున్నాడు. నిక్శూచిని నిద్రలేపే మాంత్రికుడు, నిక్శూచి నిద్రలేచే వరకూ, తను నిద్రపోకూడదు. కంటి మీద కునుకు పడిందా?..అతి భయంకరమైన చావు చస్తాడు.
ఆ స్మశానంలో వున్న ప్రతీ దుష్టప్రేతం భయంతో వణికిపోతుంది. నిక్శూచి వికృత విశ్వరూపాన్ని చూసే శక్తి ఆ ప్రేతాత్మలకు లేదు. ఇదంతా చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ నిస్సహాయంగా ఉండిపోయింది.
తను ఏదో ఒకటి చేయాలి. నిక్శూచి నిద్ర లేస్తే జరిగే ఉత్పాతం తెలుసు...ప్రపంచంలోని మంచి తుడుచుకుపెట్టుకుపోతుంది. మనుషుల్లో దుష్ట ప్రవృత్తి పెరిగిపోతుంది. ఒకరికొకరు శత్రువులు అవుతారు.
వాంపయిర్స్ కన్నా ప్రమాదకరంగా తయారవుతారు.
ఆమె మనసులోనే దేవుడిని ప్రార్థించింది. "నువ్వున్నది ఎంత నిజమో..దుష్టశక్తులు వున్నది అంటే నిజం..నువ్వు వున్న చోట దుష్టశక్తులు వుండకూడదు. నువ్వు సృష్టించిన ఈ సృష్టిని నువ్వే కాపాడాలి."
మనఃస్పూర్తిగా దేవుడికి దణ్ణం పెట్టుకుంది. చిత్రంగా ఆమె ఆత్మ ఆమె ప్రమేయం లేకుండానే గాలిలోకి తేలి ఎగురుతోంది.
శ్మశానానికి దగ్గరలో వెంకటేశ్వరుడి కోవెల...వందల ఏళ్ళ క్రితం ముష్కరుల దాడిలో శిథిలమైన కోవెల...పాములు...పుట్టలు...చెట్లు ...దట్టమైన అడవిలాంటి ప్రాంతం...చిత్రంగా ఆ కోవెల మీదుగా ఆమె ఆత్మ ఎగురుతూ వెళ్తోంది.
"దేవుడా మా లాంటి ఆత్మలకు మిమ్మల్ని సమీపించే శక్తి వుండదు...కానీ నీ ఆలయం మీదుగా ఎగిరే అదృష్టాన్ని, నిన్ను దర్శించే భాగ్యాన్ని కలిగించావా తండ్రీ? నీ లీలల పరమార్థం ఏమిటి? ఏ దేవుడి సన్నిధికి, ఏ సత్కార్యాన్ని నాతో చేయించడానికి సంకల్పించావు?
తన ప్ర్తమేయం లేకుండా వెళ్తోంది ఆత్మ...గాలి దిక్సూచి అయింది...కార్తికేయ ఇంటి వైపు వెళ్తోంది ఆ ఆత్మ...
****************************
టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్ గాలిలోకి లేచింది. ఎదురుగా వున్న అక్వేరియాన్ని గట్టిగా తగిలింది. అక్వేరియం భళ్ళున పగిలింది. అందులోని చేపలు గిల గిలా కొట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా ఆ చేపలలో చలనం ఆగిపోయి, తిరిగి ప్రారంభం అయింది. చేపలు క్షణ క్షణం పెరిగిపోతున్నాయి.. ఒకటి, రెండు.మూడు ఆడుగుల పొడవు...బరువు...భయంకరమైన ఆకారం...డైనోసార్ లా అనిపిస్తోంది.
చంద్రహాస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసాడు. తను త్రీడీ సినిమా చూస్తున్నాడా? తను కలగంటూన్నాడా? భయంకరమైన వింత ఆకారంలో వున్న చేప ఆ గదిలో మూడవ వంతును ఆక్రమించింది. ఏ క్షణమైనా ఆ ఆకారం నోటిలోకి వెళ్ళడానికి సిద్ధంగా వున్నట్టు వుంది అక్కడి వాతావరణం...
ఆ ఆకారం చంద్రహాస్ ని సంపీపించింది.
అదే సమయంలో...
***********************
మరియప్ప భార్య ఆత్మ కార్తికేయ ఇంటిని సంపీపించింది. గుమ్మం ముందు నిలువెత్తు వెంకటేశ్వరుడి ప్రతిమ...మరో వైపు షిర్డీ సాయి ప్రతిమ...ఆ రెండు దైవాలకు నమస్కరించింది ఆత్మ...చిత్రంగా ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ప్రణవి గది తలుపు తెరుచుకుంది. ప్రణవిని చేరింది ఆత్మ.
కళ్ళు తెరిచింది ప్రణవి. ట్రాన్స్ లో వున్నట్టు లేచింది. తన గదిలో నుంచి బయటకు వచ్చింది. హాలులోకి వచ్చింది. బయటకు నడిచింది.
అ ఇంట్లో వున్న పూజగాదిలోని హారతి గంట గాలిలోకి లేచింది. గణ గణ శబ్దం.
కార్తికేయ లేచాడు. ఈ వేళలో దేవుడి హారతి గంట మోగడం ఏమిటి? హాలులోకి వచ్చాడు. బయటకు నడుచుకుంటూ వెళ్తోన్న ప్రణవి కనిపించింది.
********************
టాక్సీ స్టాండ్
అర్ధరాత్రి వేళ అంతా కునికిపాట్లు పడుతున్నారు. మరియప్ప భార్య ఆత్మ ఓ క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది.
ఆ క్యాబ్ డ్రైవర్ లేచాడు...కారు స్టార్ట్ చేసాడు. కారు ముందుకు కదిలింది. ట్రాన్స్ లో వున్నట్టు డ్రైవ్ చేస్తున్నాడు. కారు ప్రణవి ముందు ఆగింది. ప్రణవి కారులో కూచుంది. కారు ముందుకు కదిలింది.
**************
కార్తికేయ ప్రణవి నడుచుకుంటూ వెళ్ళడం, కారు ఆమె పక్కన ఆగడం గమనించాడు. అతని అయోమయంగా వుంది. వెంటనే కారు దగ్గరికి వెళ్ళాడు. లక్కీగా కారు కీస్ కారుకే వున్నాయి. కారు స్టార్ట్ చేసాడు. ప్రణవి కారును ఫాలో అవుతున్నాడు.
*****************
( ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

Thursday, 20 June 2013
ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
07-06-2013 (chapter-58)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ఆగష్టు 1...
ఆ రోజుకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది.చంద్రహాస్ పుట్టిన రోజు...అదే రోజు చంద్రహాస్,ప్రణవి ల పెళ్లిరోజు...అందుకే ఆగష్టు 1 తాజ్ మహల్ సాక్షిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు.సెక్యూరిటీ చీఫ్ మెహతా ఆ బాధ్యత స్వీకరించాడు.
మెహతాకు ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా కళ్ళ ముందే కదలాడుతుంది.ఆ విధ్వంసానికి అతనే ప్రత్యక్ష్య సాక్షి...సూత్రధారి..
ఆ కుట్రలో వున్నమరో వ్యక్తి స్టీఫెన్.
**************
ఆగష్టు 1...
మెహతా తనకు ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత స్టీఫెన్ చాంబర్ లోకి వెళ్ళాడు. స్టీఫెన్ మెహతా కోసమే ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ ఎదురెదురు కూర్చున్నారు.
"చెప్పండి మెహతా ....ఈ రోజు ఆగష్టు 1 కదా...మీ బాస్ బిజీగా వుంది ఉంటాడు...ప్రధాన మంత్రి మొదలు ప్రతీ ఒక్కరూ గ్రీటింగ్స్ చెబుతూనే వుంటారు..."నవ్వుతూ అన్నాడు స్టీఫెన్.
"అందులో మీరు కూడా ఉన్నారుగా "నవ్వుతూనే అన్నాడు మెహతా..
"తప్పదుగా...నవ్వుతూనే కత్తులతో పొడుచుకునే యుద్ధం మనది...ఓకే...ఇంతకీ ప్రెజెంట్ పొజిషన్ ఏమిటి ? ఈ బర్త్ డే డెత్ డే గా,పెళ్లిరోజు చావురోజు గా మారుతుందా ? " అడిగాడు స్టీఫెన్.
"పెద్ద మొత్తంలో మీ దగ్గర తీసుకున్నాను...మీ కోరిక తీర్చకుండా ఉంటానా ? బాస్ కళ్ళలో ఆనందం చూడడం నా బాధ్యత " మెహతా అన్నాడు.
"బాస్ అంటే నేనా ? చంద్రహాసా ?"
"ఆ బాస్ జీతం మాత్రమే ఇస్తారు.మీరు విలాసవంతమైన జీవితం ఇచ్చారు...అయినా నన్ను చంద్రహాస్ దగ్గర పని చేయమని చెప్పింది..అందుకు మార్గంవేసిందీ మీరేగా ? అందుకేగా ఎప్పటికప్పుడు అక్కడి వివరాలు మీకు చేరవేస్తున్నాను "
" ప్రతీ ఇన్ఫర్మేషన్ కు పాయింట్స్ అదే కాష్ రూపంలో నీకు ముడుతూనే వున్నాయి.శత్రువు ఎప్పుడు మన పక్కనే వుండాలి...అది సరే చంద్రహాస్ తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్న విషయం ఎవరికి తెలుసు ?
"సెక్యూరిటీ చీఫ్ గా నాకు మాత్రమే తెలుసు...అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాను...తాజ్ మహల్ చూసి అక్కడి నుంచి సరాసరి ఆ షాజహాన్ దగ్గరికే వెళ్ళే ఏర్పాటు చేసాను...పైలట్ కు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను. గుడ్ న్యూస్ సారీ చావు న్యూస్ తో మీ దగ్గరికి వస్తాను " చెప్పి కాసేపు అక్కడ వుండి
బయటకు వచ్చాడు.
******************
తాజ్ మహల్ దగ్గర చంద్రహాస్,ప్రణవి సెలబ్రేట్ చేసుకుని బయటకు వచ్చి ప్లయిట్ ఎక్కగానే పేలిపోయే ఏర్పాటు జరిగింది. ఎక్కడో చిన్న పొరపాటు..ముందు ప్రణవి వచ్చింది...అదే టైములో ప్లయిట్ బ్లాస్ట్ అయింది. పైలట్ స్పాట్ డెడ్...ప్రణవి గాయాలతో ఉంది.మెహతా క్రిమినల్ బ్రెయిన్ షార్ప్ గా పని చేసింది.
క్షణాల్లో ప్రణవి ని తప్పించాడు. ఓ అనాథ శవాన్ని ఆ మంటల్లో ఆహుతి చేసాడు...
ప్రణవి స్టీఫెన్ దగ్గర బందీగా ఉంది. చంద్రహాస్ ని మానసికంగా దెబ్బ తీయడానికి ప్రణవి ని ఆయుధంగా వాడుకోవాలన్నది వాళ్ళ ప్లాన్.
*********************
కారు సడెన్ బ్రేక్ తో ఆగింది.ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాడు మెహతా....కట్టుదిట్టమైన భద్రతా మద్య కూడా తప్పించుకున్న ప్రణవి...
తమ కారును ఎవరో ఫాలో చేస్తున్నారు...ఎవరో కాదు...సంధ్యాజ్యోతి...
ఇదే సరైన సమయం...సంధ్యను కిడ్నాప్ చేయాలి...తనని ఘోరంగా అవమానించిన సంధ్య మీద పగ తీర్చుకోవాలి.
నాంపల్లి కి సైగ చేసాడు ...కారు స్లో చేసాడు....వెనక నుంచి అక్తివా మీద వస్తోన్న సంధ్య ఆగిపోయింది.అప్పటికే ఆలస్యమైంది.
********************
అదే సమయంలో చంద్రహాస్ ఉలిక్కిపడి లేచాడు.గాఢమైన నిద్రలో నుంచి లేచాడు...ఓ మూలాన వున్నా అక్వేరియంలో చేపలు భయంతో పరుగులు తీస్తున్నాయి.ఓ నల్ల పిల్లి భయంతో పరుగులు తీస్తుంది.గోడ గడియారంలోని పేద ముళ్ళు వేగంగా వెనక్కి తిరుగుతుంది. పైన వున్న సీలింగ్ ఫ్యాన్ కిందికి జారుతోంది.
అక్కడ భయం ...భయంగా చూస్తోంది .
*****************
(రేపటి వరకూ ఈ సస్పెన్స్..)

06-06-2013 (Chapter-57)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ
******************
అక్కడ గాలి స్తంభించినట్టు అయింది. ఒక సాదా సీదా అమ్మాయిలా భావించాడు. అప్పుడే జర్నలిస్ట్ గా వచ్చిన పిల్ల కాకిలే అనుకున్నాడు. సంధ్యాజ్యోతి మెహతా వైపు చూసి చెప్పింది "ఏడు ఏడు ఊచలు కావాలి మీ కోసం...మీరు జైలులో లెక్కించడం కోసం..."
మెహతా మొహం ఎర్రబడింది...అవమానంతో ...కోపంతో....తన అనుభవమంత వయసు లేని ఓ వ్యక్తి, అదీ ఆడది, ఈగో...మేల్ ఈగో...
"నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలనని అనుకుంటున్నావా?" తాపీగా అడిగాడు, తనను తానూ కంట్రోల్ చేసుకుంటూ, మెహతా.
"నేను వెళ్ళడానికి వస్తే కదా...మిమల్ని నాతో తీసుకు వెళ్ళాలనే వచ్చాను" అంది నింపాదిగా అతని వైపు చూస్తూ...
"ఏమిటీ అమ్మాయి ధైర్యం?"మెహతాలో చిన్న కలవరపాటు.
"మిస్టర్ మెహతా సర్...నాకు అప్పుడప్పుడు దొంగచాటుగా వీడియో తీయడం అలవాటు...అయితే దొంగ నా...(ఎడిట్....) వాళ్ళనే తీస్తాను...ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ అని 'తెహల్కా' తర్వాత నామకరణం పాపులర్ అయింది. మీరు, రామతీర్థం, స్టీఫెన్ ముగ్గురూ కలిసి వున్న దృశ్యాలు, సంభాషణలు రికార్డ్ చేసాను...ఆడియో మంచి క్వాలిటీ...మరో విషయం...నో ఎడిటింగ్....మార్కెట్ లో సేల్ కన్నా పోలీస్ స్టేషన్ లో మంచి గిరాకీ వుంటుంది. టీజర్ వుంది చూస్తారా? ఈ మధ్య టీజర్స్ బాగా పాపులర్ అయ్యాయి...అలా రిలీజ్ చేద్దామా?" సంధ్య మెహతా వైపు చూసి అడిగింది.
మొహానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు, సంధ్య అబద్ధం ఆడుతున్నట్టు అనిపించలేదు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది. ఇప్పుడు తనేం చేయాలి?ఇక్కడ ఆఫీసులో గొడవ అయితే కష్టం..పైగా చంద్రహాస్ కనిపించడం లేదన్న అనుమానం వుంది. ఈ పరిస్థితుల్లో తొందరపడకూడదు. పోనీ సంధ్యని కిడ్నాప్ చేస్తే...ఆ పని నాంపల్లి కి అప్పగిస్తే ....
సంధ్యాజ్యోతి మెహతా వైపు చూసి హ్యాండ్ బాగ్ లో నుంచి మొబైల్ తీసింది. "ఎడిటర్ సర్..నేను ది గ్రేట్ జర్నలిస్ట్ సంధ్యని..ఇక్కడ మెహతా సర్ నన్ను కిడ్నాప్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. డ్రెస్ లు తెచ్చుకోలేదు...ఎన్ని రోజులు కిడ్నాప్ చేస్తాడో తెలియదు. కొత్త డ్రెస్ లు కొనిపెట్టమని చెప్పండి. మరో విషయం సర్ .."నేను ఆఫీసు పని మీద కిడ్నాప్ అవుతున్నాను, కాబట్టి శాలరీ కట్ చేయకండి సర్...ఫోన్ మెహతా సర్ కు ఇవ్వమంటారా? వన్ సెకన్ సర్.." అంటూ మొబైల్ మెహతాకు ఇచ్చింది.
పామును చూసినట్టు చూసాడు మొబైల్ వైపు. తర్వాత సంధ్య వైపు తిరిగి "చూడండి ఇది పెద్ద వాళ్ళ వ్యవహారం...మీ మంచి కోరి చెబుతున్నాను.
ఆ క్యాసెట్ ఇచ్చి వెళ్ళిపొండి." ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు.
"నేనూ మీ మంచి కోరి చెబుతున్నాను...హాయిగా మా ఆఫీసులో సెక్యూరిటీగా పనిచేయండి. అప్రూవర్ గా మారండి." సంధ్య అంది.
మెహతాకు అర్ధమైంది.తను ట్రాప్ లో ఇరుక్కున్నాడు. దీన్ని డీల్ చేయవలిసింది స్టీఫెన్ మాత్రమే. పైగా ఈ మ్యాటర్ ప్రెస్ లో వస్తే చాలా రిస్క్ అవుతుంది. కాస్త దూరంగా వచ్చి స్టీఫెన్ కు ఫోన్ చేసాడు. ఏం చేయాలో స్టీఫెన్ చెప్పాడు.
మెహతా స్టీఫెన్ తో మాట్లాడిన తర్వాత సంధ్య దగ్గరికి వచ్చి "మీరు వెళ్లిపోవచ్చు" అన్నాడు.
"ఎక్కడికి? వెళ్ళడానికి వచ్చింది? మీతో కిడ్నాప్ చేయించుకోవాలని తెగ సరదాగా వుంది. కిడ్నాప్ ఎలా వుంటుందో తెలియదు. నేను మెంటల్ గా ప్రిపేర్ అయి వచ్చాను. ప్లీజ్ కిడ్నాప్ చేయండి." రిక్వెస్ట్ చేసింది సంధ్య.
మతిపోతోంది మెహతా కు...వెంటనే బయటకు నడిచి నాంపల్లికి సైగ చేసాడు. రెండు నిమిషాల్లో అక్కడి నుంచి బయటకు నడిచారు ఆ ఇద్దరూ...
వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన వెంటనే సంధ్యాజ్యోతి చీఫ్ ఎడిటర్ కు ఫోన్ చేసింది.
"అంతా మీరు చెప్పినట్టే జరిగింది సర్" చెప్పింది.
*****************
కారులో వెళ్తున్నారు మెహతా, నాంపల్లి...అతని ప్లయిట్ బ్లాస్ట్ అయిన రోజు గుర్తుకు వచ్చింది.
చాలా తెలివిగా వేసిన పథకం...ఆ రోజు ఏం జరిగింది?
ఈ కథనే మలుపు తిప్పిన ఆ సంఘటన నేపథ్యం ఏమిటి?

05-06-2013 (Chapter-56)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
మండుటెండల్లో మంచు వర్షం కురిసిన ఫీలింగ్ ...ఎవరతను...తనను స్పృశించిన ఆ స్పర్శ ఎవరిది? తన జ్ఞాపకాల అరను తరచి తరచి ప్రశ్నోస్తోంది? సమాధానం లేదే ...రాత్రి పీడ కల..ఇప్పుడీ మధుర జ్ఞాపకం...ఏమిటీ వైరుధ్యం? ఏమిటీ విచిత్రం? ఏదో గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం...కానీ గుర్తుకు రాని దైన్యం. దూరం నుంచి ఇదంతా గమనిస్తోన్న ముగ్ధకు బాధేసింది. ఒక్క క్షణం వెళ్లి "నువ్వు ప్రణవివి...ది గ్రేట్ చంద్రహాస్ భార్యవి" అని చెప్పాలని వుంది. కానీ పరిస్థితులు చెప్పనివ్వడం లేదు.
**************
సెక్యూరిటీ చీఫ్ మెహతా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. స్టీఫెన్ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. చంద్రహాస్ స్టీఫెన్ కస్టడీలో వున్నట్టు తెలిసింది. తనకు భారీగానే ముడుతుంది. ఇన్నాళ్ళు స్టీఫెన్ తరపున పని చేస్తూ వచ్చాడు. అతను చెప్పినట్టు వింటూ వచ్చాడు.
అంగరక్షకులు ఎవరిని కాపాడాలో వారినే బలి తీసుకున్న దేశంలో, ఒక ఇందిరాగాంధీ నేలకు ఒరిగిన కర్మభూమిలో గజానికో మెహతాలు...సిద్ధంగానే వుంటారు. అంతఃపుర రహస్యాలు మరణ శాసనాలు అవుతాయి.
చంద్రహాస్ ని ఫినిష్ చేసే తలారి పని నాంపల్లికి అప్పగించాడు స్టీఫెన్...మరో పక్క మరియప్ప క్షుద్రప్రయోగం...ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, స్టీఫెన్ వేసిన స్కెచ్ యిది. ఇప్పుడు తన పాత్ర అంతఃపుర రహస్యాలు చేధించాలి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ సేకరించాలి. అన్నింటికన్నా ముందు చంద్రహాస్ కనిపించడం లేదన్న విషయాన్ని ఫోకస్ చేయాలి...అదే సమయంలో చంద్రహాస్ భార్యని వెతుకుతూ వైజాగ్ వెళ్లి అక్కడ పిచ్చివాడుగా మారాడన్న ప్రచారం చేయాలి.
ఆర్ధిక మూలాలు దెబ్బతీయలి.
చంద్రహాస్ తన ఆస్తులకు ఏకైక వారసురాలిగా ప్రణవిని నియమించాడు. ఈలోగా ప్రణవిని ట్రేస్ చేయాలి. దీనితో పాటు తను చేయవలిసిన మరో ముఖ్యమైన పని ఒకటుంది.
డాక్టర్ చతుర్వేదిని చంపేయాలి...
ఇలాంటి కుట్రలు...ఆర్ధిక ప్రపంచంలో, వ్యాపార ప్రపంచంలో వెలుగు చూడని చేదు నిజాలు.
********************
సంధ్యాజ్యోతి సెక్యూరిటీ ఆఫీసులోకి వచ్చింది. నానా హంగామా చేసింది. చివరికి సెక్యూరిటీ అతి కష్టమ్మీద సంధ్యని చేతుల మీద ఎత్తుకుని సెక్యూరిటీ చీఫ్ మెహతా ముందు నిలబెట్టారు.
"మేడం...ఏమిటీ న్యూ సెన్స్ ...మీ మీడియా వాళ్ళు ఇలా చేయవచ్చా? అంతకు ముందు సంధ్యను చూసిన గుర్తు...పొలయిట్ గా అడిగాడు.
"మీ సెక్యూరిటీ గార్డ్ నాకు కన్ను కొట్టాడు...ఆఫ్ కోర్స్ నేను అందంగా వుంటాను...అంత మాత్రం చేత ఎంత అందంగా వుంటే మటుకు కన్ను కొట్టడమేనా? " డాభాయించి అడిగింది సంధ్య.
షాకయ్యాడు మెహతా...సెక్యూరిటీ గార్డ్ వంక చూసాడు.
"చ చ యితను కాదు...బయట నల్లగా, బొగ్గు స్కామ్ లో నిండా మునిగిన వాడిలా ఉంటాడే అతను..." అంది.
మెహతా మరోసారి షాకయ్యాడు. ఎందుకంటే అతను సెక్యూరిటీ గార్డ్ కాదు. ఎవరికీ అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డ్ వేషంలో వచ్చిన నాంపల్లి.
ఓ సారి సంధ్య వైపు చూసాడు...ఆమె మెహతా వైపు చూసింది. అతనికి అర్ధమైంది. అతను సంధ్యను తక్కువగా అంచనా వేసాడు. అంటే...సంధ్య కావాలనే...
"చూడండి మిస్టర్ మెహతా ...అతను ఇంకా హాలులో నుంచి నా వైపే మిర్రి మిర్రి చూస్తున్నాడు..నేను ఈ విషయం వెంటనే చంద్రహాస్ గారికి చెప్పాలి. నాకు చంద్రహాస్ గారి అప్పాయింట్మెంట్ కావాలి అంది సంధ్య.
"సర్ లేరు ...మేడం మీరు వెళ్ళండి...ఆ సెక్యూరిటీ గార్డ్ ని నేను మందలిస్తాను." మెహతా నచ్చచెప్పబోయాడు.
"వాడిని వదిలిపెట్టను...రేపు నా వెంట పడితే...నేను బస్సులో వెళ్ళగలనా? అసలే క్రైమ్ రేటింగ్ పెరిగిపోయింది. పోనీ ఓ పని చేస్తాను...అతడి ఫోటో తీసుకుంటాను. మా మేన్ రోబోలో అతడి ఫోటో పెడతాను. ఫ్యూచర్ లో పనికి వస్తుంది, లేదా వీరి వీరి గుమ్మడి కాయ.. వీరి పేరు నాంపల్లి ...వీరికి ఇక్కడ ఏం పని? అని కాప్షన్ రాసి" గుర్తు పట్టిన వారికి నాంపల్లి చేతుల మీదుగా ఒక హత్య ఫ్రీ అని" పెడదాం బావుంటుంది, మరి బహుమతిని స్పాన్సర్ చేసిన వారు స్టీఫెన్
గ్రూప్ అని కూడా పెట్టవచ్చు." మెహతా వంక చూసి అంది.
మెహతాకు అర్ధమైంది. సంధ్యాజ్యోతి అన్నీ తెలుసుకునే వచ్చింది. జర్నలిస్ట్ అంటే మొదటి సారి భయం కలిగింది, అతనికి. ఆమెను మామూలు ఆడపిల్ల అనుకున్నాడు. ఏవో ప్రెస్ నోట్స్ రాసుకుంటుంది అనుకున్నాడు. కానీ సూక్ష్మ రూపంలో వుండే అతి శక్తివంతమైన బాంబ్ అని ఇప్పుడు తెలిసింది.
"మీకు ఎంత కావాలి? అడిగాడు మెహతా..
"దట్స్ గుడ్...మీరు వెరీ స్మార్ట్ ...ఏడు..నా లక్కీ నంబర్కు ఒకటి ప్లస్ చేసాను .." చెప్పింది సంధ్య
"సెవెన్ ...ఏడు లక్షలా ?
"కాదు.."
"మరి కోట్లా.." షాకై అడిగాడు మెహతా...
అతను ఇంకా షాకయ్యేలా చెప్పింది సంధ్య.
****************
(అదేమిటో గెస్ చేయగలిగితే ఈ రోజు రాత్రి పన్నెండులోగా చెప్పవచ్చు..లేదా రేపటి సంచిక చూడవచ్చు ...సస్పెన్స్ to be continued ...)

04-06-2013 (Chapter-55)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ...
******************
స్వార్ధం...ఈ ఒక్క పదం ఒక్కోసారి మహావిధ్వంసాలను సృష్టిస్తుంది. విషాదాలను ఆవిష్కరిస్తుంది. ఈ ప్రపంచంలో మన ఉనికి ఎంత కాలం? మన శ్వాస ఎంత కాలం?అశాశ్వతమైన భౌతిక జీవితం కోసం చేసే భౌతిక దాడులు, ఈర్శాద్వేషాలు చివరికి విషాదాన్నే మిగులుస్తాయి...ఈ సత్యం తెలిసేసరికి, తెలిసేలోపే మనం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాం.
***************
స్టీఫెన్ లాప్ టాప్ లో కనిపించే దృశ్యాలు చూస్తున్నాడు. అతని పెదవుల మీద ఒక వికృతమైన, పైశాచిక ధరహాసం...డాక్టర్ మీద దాడి చేయబోతున్నాడు, చంద్రహాస్. చంద్రహాస్ లాంటి బిజినెస్ టైకూన్ ని తను పిచ్చివాడిగా చిత్రీకరించాడు. చాలా నాటకీయ సంఘటన.
ఒక సినిమా రచయిత సృజించినట్టు సృష్టించిన సన్నివేశం...
కథల కోసం పాత సినిమాలను వెతుక్కోవడం...సన్నివేశాల కోసం పాత సినమాల్లో వాటిని ముక్కలు ముక్కలు చేయడం...చంద్రహాస్ ని తెలివిగా ఎలా దెబ్బ తీయాలా? అని ఆలోచిస్తోన్న సమయంలో ఒక నిర్మాత, స్టీఫెన్ దగ్గరికి వచ్చాడు. అతని ఫైనాన్సు కావాలి...అతని కూడా ఒక రచయిత వచ్చాడు.
"సర్ మంచి కథ...హీరో డేట్లు వున్నాయి...అతనికి అడ్వాన్సు పే చేయాలి. హీరొయిన్ కి కొంత ఇవ్వాలి...మీరు దయ తలిచి..." ఆ నిర్మాత నీళ్ళు నమిలాడు. ఇలాంటివి స్టీఫెన్ కు కొత్త కాదు. ఆగిపోయిన సినిమాలకు ఫైనాన్సు చేసి..వాటి హక్కులను తీసుకోవడం అతనికి మామూలే
... కానీ ఇప్పుడు ఆ మూడ్ లో లేడు.
"సర్ ఇందులో మంచి మంచి ట్విస్ట్ లు వున్నాయి. హీరోని విలన్ ముప్పతిప్పలు పెడతాడు. పిచ్చివాడిగా తయారుచేస్తాడు. ఇది విలన్ ఆడే మైండ్ గేమ్ .." రచయిత చెప్పుకుపోతున్నాడు ..
స్టీఫెన్ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు...రచయితను తన చాంబర్ లోకి తీసుకువెళ్ళాడు..,
**************
విలన్ హీరోకి యాక్సిడెంట్ చేయిస్తాడు..హాస్పిటల్ ని సృష్టిస్తాడు...డాక్టర్స్, రోగులు...అంతా సెట్ చేస్తాడు...అతనికి పిచ్చి ఉందనే భ్రమను కలిగిస్తాడు...మానసికంగా దెబ్బ తెస్తాడు..." ఆ తర్వాత స్టీఫెన్ కు అక్కరలేదు...రచయిత తన కథను వింటున్న స్టీఫెన్ కు పూర్తీ కథ చెప్పాలని ఉత్సాహపడ్డాడు. కానీ స్టీఫెన్ కు కావల్సింది కథ కాదు...చంద్రహాస్ కధను ముగింపు చేయ సన్నివేశ కల్పన. రామతీర్థానికి ఇచ్చిన డబ్బులో పదవ వంతు రచయితకు ముట్టింది. కానీ స్టీఫెన్ ఆ కథ మొత్తం విని వుంటే ఈ కథ మరోలా వుండేది. అందుకే అంటారు పెద్దలు.. కంగారు పడితే గుడ్డు పెట్టడం పొదగడం అవుతుందా, అయినా విలనిజానికి విజయం వుంటుందా. మహా పండితుడు శక్తిశాలి రావణుడైన విజయం అందేడా.. అధర్మంచే ధర్మం చెర పట్టబడినా, అంతిమ విజయం ఎల్లప్పుడూ ధర్మందే కదా.
*****************
చంద్రహాస్ కు యాక్సిడెంట్ చేయించాడు..అతడిని ఇరిటేట్ చేయాలి...కన్ఫ్యూజన్ లో ఉంచాలి ...ఈ అవకాశాన్ని తను ఉపయోగించుకుని బిజినెస్ సర్కిల్ లో భార్య మరణంతో "పిచ్చివాడైన "చంద్రహాస్" అనే వార్త ను క్రియేట్ చేయాలి, సర్కులేట్ చేయించాలి.
****************
అక్కడ లాప్ టాప్ లో చూపుతున్న వైనమైన చంద్రహాస్ డాక్టర్ మీద ఎటాక్ చేయడం, అందరు అతనిని పట్టుకుని అతనికి మత్తు ఇవ్వడం జరిగిపోయాయి. తెల్ల వారితే అసలు డ్రామా మొదలవుతుంది.
*******************
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. ప్రణవి లేచింది. కిటికీ రెక్కలు తెరిచి బయటకు చూసింది. అక్కడ ఓ వ్యక్తి...తన వైపు చూసి చేతులు చాచాడు...నిర్మలమైన నవ్వు...కురిసే మంచులో నడుస్తూ తన వైపే వస్తున్నాడు. ఆ చిరునవ్వు చిరపరిచితమే....అతను కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీలోనుంచి రెండు చేతులు లోపలి పెట్టాడు. ఆమె చెంపలను తాకాయి...చల్లగా...
*************
(ఈ భావోద్వేగం రేపటి వరకూ...)

03-06-2013 (Chapter-54)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
వాతావరణంలో ఏదో మార్పు ...అది సహజసిద్ధంగా వచ్చిన మార్పు కాదు...ప్రకృతికి చేతబడి చేసినట్టు...గాలిలో ఏవో వికృత శబ్దాలు...సంధ్యాజ్యోతి నొప్పి భరించలేకపోతుంది. డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి." ఇది ప్రకృతి పరమైనదే...స్త్రీకి అనివార్యమైనది"...కానీ ఈ నొప్పి ఆ నొప్పి కాదు....
గాలి వేగానికి సాయి ప్రతిమ కింద పడబోతుంది...పడబోతోంది...మంచం మీది నుంచి అలానే కింది దొర్లి నేల మీద పడుతూ....సాయి ప్రతిమను అందుకుంది. చిత్రంగా గాలి స్తంబించింది. సంధ్యాజ్యోతి కనులు మూతలు పడుతున్నాయి.
*******************
ఎనిమిదవ అడుగువేయబోతున్న చంద్రహాస్ ఎవరో ఆపినట్టు ఆగాడు...ఆ పరిసర ప్రాంతంలోకి వచ్చిన గుడ్లగూబ తనకు కావలిసిన ఆహారం వెతుక్కుంటున్నట్టు వుంది. ఎక్కడి నుంచో గాలిలో ప్రయాణిస్తూ ప్రేతాత్మ అక్కడికి వచ్చినట్టు వుంది.
ఆసుపత్రిలో కరెంట్ పోయింది. చిమ్మ చీకటి...మరియప్ప చేస్తోన్న ప్రయోగంలో ఒక అంకం పూర్తవుతుంది. ఈ ప్రయోగాన్ని చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ దేవుడితో మొరపెట్టుకుంది .
"దేవుడా ఒక మనిషిని క్షుద్రశక్తితో బలి తీసుకునే ఇలాంటి వికృత చర్యలను నువ్వు అడ్డుకోలేవా? నువ్వు సృష్టించిన ప్రాణులకు నువ్వే రక్ష ...ఈ ఆత్మను బలిగా స్వీకరించి మంచి మనుష్యులను కాపాడు"
ఆ ఆత్మ మొరను దేవుడు ఆలకించాడా? అక్కడ మరియప్ప తదుపరి అంకానికి సిద్ధమవుతున్నాడు. ఈ అంకం ఏమిటంటే శరీరంలోని రక్తాన్ని పీల్చి, మనిషి జ్ఞాపకశక్తిని హరించి, ఒక్కో అవయవం పనిచేయడం మానేసి....మంచానికి అతుక్కుపోయి మరణాన్ని చేరుకునే తంతు....
****************
కలత నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది ప్రణవి. కలత నిద్రలో కలవరపెట్టే పీడ కలలు ...తనకు సంబంధించిన మనిషికి ఏదో కీడు జరుగబోతుంది. లేచి సింక్ దగ్గరికి వెళ్లి మొహం కడుక్కుంది. పూజగదిలోకి వెళ్ళింది. సాక్షాత్తు కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు ఒక వైపు...షిర్డీ సాయినాథుడు మరో వైపు...సూర్యచంద్రులు ఆ దైవాల ముందు మోకరిల్లినట్టు...కాంతి పుంజాలు ఆ విగ్రహాల చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు...
వారి ముందు నిలబడి రెండు చేతులు జోడించింది. "నేనెవరో నాకు తెలియని ఈ విచిత్ర, విషాద దుస్థితి నుంచి నన్ను బయటకు తీసుకురాకపోయినా,...నా వాళ్లకు, నా ప్రాణసమానమైన, నా వ్యక్తికీ ఏమీ కాకుండా చూసే భారం నీదే..."
హాలులో నుంచి ఇదంతా గమనిస్తూనే వున్న కార్తికేయ మనసు ఒక్క క్షణం బాధతో విల విల్లాడింది. ఒక్క క్షణం "చంద్రహా స్ గురించి చెప్పాలనిపించింది. కానీ ఇది తగిన సమయం కాదని" ఆగిపోయాడు.
********************
చంద్రహాస్ కు మెలుకువ వచ్చింది. తను మంచం మీద వున్నాడు...ఎవరో శరీరంలోని రక్తాన్ని తోడేసిన ఫీలింగ్...డాక్టర్స్ తిరుగుతున్నారు...తన పక్కన వున్న వాళ్ళు పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు.
"ఎక్స్ క్యూజ్ మీ ..." ఓ డాక్టర్ ని పిలిచాడు చంద్రహాస్ ..
ఆ డాక్టర్ ఆ మాటలు వినిపించుకోనట్టు ముందుకు వెళ్ళాడు. మరో సారి పిలిచాడు...అయినా నో రెస్పాన్స్ ...చంద్రహాస్ లేచి డాక్టర్ దగ్గరికి వెళ్లి అతని భుజాలు పట్టి కుదిపాడు. డాక్టర్ నిర్లక్ష్యంగా చూసాడు.
కోపంతో చంద్రహాస్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

Wednesday, 19 June 2013
ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
02-06-2013 (Chapter-53)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ఒక రచయిత రాసే కథలో ఎన్నో మలుపులు...తన మేథాశక్తితో చదువరులను ఆకట్టుకోవడానికి ఎన్నో నాటకీయ సంఘటనలు....కానీ నిజజీవితంలో విధిని మించిన గొప్ప రచయిత ఎవరు? విధాతను మించిన మహా రచయిత ఎవరు? ఊహకు అందని జీవితాన్ని రచించే సూత్రధారి...వాస్తవ పాత్రలను పరుగులు పెట్టించే దర్శకుడు.
కార్తికేయ వంకే చూస్తోంది ముగ్ధ...అవును ...తమ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. ప్రణవి మతిస్థిమితం కోల్పోవడం ఎంత విషాదం?
"ముగ్దా...ఒక్కోసారి చంద్రహాస్ ని చూస్తోంటే...తను నా కవల సోదరుడేమో అనిపిస్తోంది..."
"అవునండీ...ప్రణవిని చూస్తోంటే మొన్నటి నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది...తాజ్ మహల్ సన్నివేశం గుర్తొస్తే ...ప్రణవిలో నేనే కనిపించాను....బహుశా నేను, ప్రణవి పోయిన జన్మలో కవలలం కాబోలు" అంది ముగ్ధ.
కార్తికేయ దీర్ఘంగా నిశ్వసించాడు..ప్రణవికి తానెవరో చెబితే..వెంటనే చంద్రహాస్ ని చూడాలంటుంది...ఇరవై నాలుగు గంటలుగా చంద్రహాస్ ఆచూకి తెలియడం లేదు... ప్రణవి ఆ రోజు ప్లయిట్ బ్లాస్ట్ అయిన తర్వాత ఎలా మిస్సయిందో తెల్సుకోవాలి? అసలు ఇన్నాళ్ళు ప్రణవి ఎక్కడున్నట్టు? ఈ సమాధానం తెలియాలంటే తను వైజాగ్ వెళ్ళాలి...అపుడు ఇక్కడ ప్రణవిని చూసుకునేదెవరు?
********************
గబ్బిలాల వాసన ఆ పరిసరాలను చుట్టుముట్టింది. నిక్శూచికి ప్రీతిపాత్రమైన వాసన....తల క్రిందులుగా వేలాడుతూ నిక్శూచిని ఆహ్వానిస్తున్నట్టు....మరియప్ప పాడుబడిన సమాధి మీద కూచున్నాడు. తరతరాలుగా తమకు ఈ క్షుద్రవిద్యలు నేర్పిన తమ పూర్వీకులను ఆహ్వానిస్తూ, వాళ్లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాడు...పదమూడవ తరానికి చెందిన మరియప్ప చిట్టచివరివాడు...
కేవలం క్షుద్రవిద్యలు తమ వారసులకు అందించడానికి మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ తర్వాత తమ భార్యలను క్షుద్రశక్తులను సంపాదించడానికి బలి ఇచ్చే క్షుద్ర సాంప్రదాయం వున్న మరియప్ప మాంత్రిక వంశంలో ఓ అపశ్రుతి జరిగింది. మరియప్ప భార్య ఈ క్షుద్రవిద్యలకు వ్యతిరేకి. తన బిడ్డ క్షుద్ర మాంత్రికుడు కావడం...క్షుద్రదేవతలను ఉపాసించడం నచ్చలేదు.
దేవుడికి వ్యతిరేకంగా తన బిడ్డను చూడకూడదు అనుకుంది. బిడ్డ పుట్టిన వెంటనే తన చేతులతో చంపడానికి మనసు రాలేదు.
తనకు తెలిసిన క్షుద్రవిద్యతో బిడ్డను చంపేసింది...తనూ నిక్శూచికి బలైంది...రెండవ బిడ్డ వారసుడిగా పనికి రాడు...ఆ విధంగా మరియప్ప వంశంలో చిట్టచివరి వాడయ్యాడు. తన శిష్యుడి మరణంతో మరో సారి నిక్శూచిని నిద్రలేపి తన శక్తులను తిరిగి పొందాలని అనుకున్నాడు.
దూరంగా, భయంగా ఈ తంతును చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ మౌనంగా నిట్టూర్చింది. బాధగా చూస్తోండిపోయింది.
******************
ఉలిక్కిపడి లేచాడు చంద్రహాస్ ...అతని మొహం చెమటతో తడిసిపోయింది. ఉదయం జరిగిన సంఘటన ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగింది. డాక్టర్స్ రావడం తనను పరీక్షించడం...అన్నీ గుర్తొచ్చాయి...
అసలు ఉదయం ఏం జరిగింది? తను లేచి బయటకు వెళ్తుంటే "తను వెళ్ళకుండా ఆపారు"
బలవంతంగా తనకు పరీక్షలు చేసారు. చివరికి తనకు పిచ్చి అని కన్ఫర్మ్ చేసారు. అప్పుడు తను కోపంగా రియాక్ట్ అవ్వడం గుర్తొచ్చింది. తనకు మత్తు ఇవ్వడం గుర్తొచ్చింది. తిరిగి ఇప్పుడు మెలుకువ వచ్చింది.
ఇది...ఇది పిచ్చాసుపత్రినా? తను పిచ్చివాడా? నో ..నెవ్వర్...ఏదో జరుగుతుంది? లేచి చుట్టూ చూసాడు...అంతా ముసుగుతన్ని పడుకున్నారు...బయట కుర్చీలో కూచోని కునికిపాట్లు పడుతున్నాడు బాయ్ ...
బెడ్ లాంప్ వెలుతురూ...తను ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఒక్కో అడుగు వేస్తూ బయటకు వస్తున్నాడు...
************************
"గ్రీహోం...ద్రుహోం..క్రోహోం..నిక్శూచి ఆవాహం..." మరియప్ప గొంతులో నుంచి క్షుద్రోచ్చారణ మొదలైంది. పదమూడు సమాధుల మధ్య నిద్రలో వున్నా నిక్శూచిని నిద్రలేపుతున్నాడు మరియప్ప...ఆ ప్రాంగణంలో గాలి స్థంబించింది. నక్కలు భయంతో పరుగుతీశాయి..తీతువు పిట్టలు బిగదీసుకున్నయి.
ఒక్కో అంకాన్ని దాటుతూ చివరి అంకానికి చేరుకున్నాడు..ఈ అంకాన్ని పూర్తిచేస్తే జరిగే ఉత్పాతం భయంకరంగా వుంటుంది.
*****************
చంద్రహాస్ ఏడవ అడుగు వేసాడు..ఎనిమిదవ అడుగు పడుతుండగా...ఆ పరిసరాల్లోకి ఓ గుడ్లగూబ వికృతమైన శబ్దంతో, వాసనతో ప్రవేశించింది.నిక్శూచి ఆగమనానికి అది గుర్తు...
ఉలిక్కిపడి లేచింది ప్రణవి...
సంధ్యాజ్యోతికి ఒక్కసారి మెలుకువ వచ్చింది...టేబుల్ మీద వున్న సాయి ప్రతిమ...రచయిత విసురజ ఇచ్చిన ప్రతిమ...విసురుగా వచ్చిన గాలికి కింద పడబోయింది. సంధ్యాజ్యోతి సాయి ప్రతిమ పడకుండా పట్టుకోబోయింది. అప్పుడే సన్నగా కడుపులో నొప్పి...పేగులు మెలి పెడుతున్నట్టు...
*****************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ....)

01-06-2013 (chapter-52)

అర్ధరాత్రి 11-59 నిమిషాలు.....
తాజ్ మహల్ ముందు చంద్రహాస్, ప్రణవి....వెన్నెలే వెలుతురై, కన్నుల పండువగా కనుల ముందు నిలిచినట్టు...తాజ్ మహల్ మెరిసిపోతుంది...అనుభూతి పర్యంతమైన, ఉద్విగ్నభరిత క్షణాలు...మాటరాని మౌన భాషని ఆశ్రయించినట్టు....
ప్రణవి తాజ్ మహల్ అందాలను చూడడం లేదు..తాజ్ మహల్ లో ఆమెకు షాజహాన్ కనిపించడం లేదు...చంద్రహాస్ కనిపిస్తున్నాడు...కొన్ని కోట్లు విలువచేసే వ్యాపార ఒప్పందాన్ని కాలితో తన్నేసాడు....ముఖ్యమైన కార్యక్రమాలను వదులుకున్నాడు...ఒక దేశానికి సంబంధించిన వ్యాపారపరమైన కాంట్రాక్ట్ ని పక్కన పెట్టాడు. చార్టెడ్ ప్లాయిట్ బుక్ చేసాడు...అనుమతులు సంపాదించాడు...
అన్నింటి కన్నా...అన్నింటికన్నా ...అన్నింటికన్నా ...తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు పెళ్లి చేసుకునే వెయ్యి మంది జంటలకు ప్రణవి పేరు మీదుగా మంగళ సూత్రాలు అందించాడు.
"ఈ ప్రపంచంలో డబ్బును సంపాదించేవారు కోట్ల సంఖ్యలో వున్నారు....కానీ ఆ డబ్బును ఖర్చు పెట్టేవారు...ప్రేమను పంచేవారు....ప్రేమను ప్రదర్శించేవారు...ఒక్క తన చంద్రహాస్ మాత్రమే...
అన్నీ చేసి,తన కోసం ఇన్నీ చేసి మామూలుగా, ఇది గొప్ప విషయమే కాదన్నట్టు....తన భుజం మీద తలపెట్టి తాజ్ మహల్ లో తననే చూస్తోన్న తన భర్తను చూస్తుంది...
ప్రపంచంలో ఇంత గొప్ప భర్త తనకు తప్ప ఎవరుంటారు? ప్రణవి భర్త వంక ప్రేమగా చూసింది. ఆమెకు మాటలు రావడం లేదు. ఒక మాట తన నోటి నుంచి బయటకు రాకుండానే ఆచరణలో పెట్టి చూపించే భర్త...ఒక్క క్షణ తను భర్తను కోరిన కోరిక గుర్తొచ్చి మొహం ఎర్రబడింది.
ఈ ప్రపంచంలో ప్రేమతో నిండిన ప్రతీ ఇల్లు తాజ్ మహలే....ప్రేమ మహలే...ప్రేమంటే నిర్వచనం తను, తన భర్త ...తన భర్త అంటే ప్రేమ...ఆ క్షణం ప్రణవికి ప్రపంచాన్ని జయించినంత సంబరంగా వుంది.
కానీ మరుక్షణం ఏం జరుగబోతుందో తెలియదు.
************************
చంద్రహాస్ తాజ్ మహల్ అందాలను చూస్తున్నాడు. అతని మనసేదో కీడుని శంకిస్తోంది. ప్రణవికి ఇంకా తాజ్ మహల్ ని చూడాలని అనిపించలేదు. అదే మాట భర్తతో చెప్పింది ఆశ్చర్యంగా చూసాడు చంద్రహాస్.
"తాజ్ మహల్ ఒక కట్టడం...కదలిక లేని ప్రేమ చిహ్నం...నా ఎదురుగా వున్న ఈ తాజ్ మహల్ ని, నా కళ్ళ ముందు వున్న తాజ్ మహల్ ని వదిలేసి, మరో తాజ్ మహల్ ని చూడడానికి వచ్చాను." భర్త భుజం మీద తల వాల్చి అంది.
చంద్రహాస్ భార్య వంక చూసి..."ఈ క్షణం ఇక్కడే నీతో రొమాన్స్ చేయాలనిపిస్తుంది" సరదాగా అన్నాడు. ఆ ఫీల్ ని అనుభూతిస్తూ అన్నాడు...
"మీ అనుభూతిలో ఐక్యమవ్వడానికి నేను సదా సంసిద్ధం..." అంది.
చంద్రహాస్ ప్రణవిని హత్తుకున్నాడు..వేన వేల స్పర్శల వెచ్చని ఊపిరులు అక్కడ పురుడు పోసుకున్నాయి.
ప్రణవి ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది.
దూరంగా వీళ్ళని తీసుకువచ్చిన ప్లయిట్ వుంది.
**************
ప్రణవి ముందు నడుస్తోంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా...? అని వుంది. ఇంటికి వెళ్ళగానే భర్త పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవాలి, తాజ్ మహల్ దగ్గర పుట్టిన రోజు జరుపుకోవాలన్న ఆలోచన విరమించుకుంది. ప్లయిట్ లో కేకు వుంది.
ప్రణవి ప్లయిట్ ని సమీపించింది. అప్పుడు జరిగిందా ఊహించని దుస్సంఘటన. పెద్ద విస్ఫోటనం....
తాజ్ మహల్ సాక్షిగా....
***************
కార్తికేయ నిట్టూర్చాడు...ముగ్ధ అలానే ఉండిపోయింది. కళ్ళ ముందు విషాదం కనిపిస్తుంది.
"ప్లయిట్ పేలిపోవటంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి...ఆ పేలుడులో పైలట్ శరీరం ముక్కలైంది. ప్రణవి అనిపించలేదు. బహుశా బూడిదలో కలిసిపోయింది అనుకున్నారు. ఆ క్షణం నుంచి చంద్రహాస్ భార్య బ్రతికే ఉందన్న నమ్మకంతో అన్వేషిస్తున్నాడు. మరో పక్క ఈ బ్లాస్ట్ కు సంబందించిన వివరాలు సేకరిస్తున్నాడు. దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ప్రణవిని గుర్తుపట్టాను...అయితే ఈ పేలుడు వెనుక, ప్రణవి అదృశ్యం వెనుక మిస్టరీ తెలుసుకోవాలి. అప్పటి వరకూ ప్రణవి...తన జ్ఞాపకాలు గుర్తుకు లేకుండా ఉంటేనే మంచిది.
ఇందాకే తెలిసిన మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే చంద్రహాస్ కన్పించడం లేదు...
*****************
అదే సమయంలో నిక్శూచి ప్రయోగం మొదలైంది.

Tuesday, 18 June 2013
ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
30-05-2013 (Chapter-50)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
(ఈ అధ్యాయంలో చంద్రహాస్ జీవితంలో అసలు ఏం జరిగిందో తెలిపే..,కథలోని కీలకమైన మలుపు రావాలి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరి ద్వారా చెప్పించాలి? అన్న ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముప్పయి ఆరు గంటలు పట్టింది. ప్రణవి ద్వారా, చంద్రహాస్ ద్వారా...కాకుండా కార్తికేయ ద్వారా చెప్పించే ఈ ప్రక్రియ....మీకూ నచ్చుతుందని నా నమ్మకం...ఎందుకంటే నా ప్రతీ అక్షరానికి స్ఫూర్తి ప్రదాతలు మీరే.... రచయిత)
"ప్రణవి...మిసెస్ ప్రణవీ చంద్రహాస్ .." విస్మయంగా అంది ముగ్ధ
"అవును...ప్రపంచమంతా అన్వేషిస్తోన్న ప్రణవి...మనల్ని చేరింది...తన ప్రాణాలు కాపాడమని మన కులదైవం శ్రీ వేంకటేశ్వరుడు పంపించాడు...తనని క్షేమంగా తన భర్త దగ్గరికి చేర్చమని మన ఇష్టదైవం ఆ సాయి మన దగ్గరికి చేర్చాడు ."
"ఆమె ప్రణవి
అని ,మీకెలా,ఎప్పుడు తెలిసింది?"
"చంద్రహాస్ నన్ను కలిసాడు.." ఒక విభ్రాంతికర విషయాన్ని చెప్పాడు.
ముగ్ధ ఆశ్చర్యంగా భర్త వంక చూసింది.
"అవును ముగ్ధా...చంద్రహాస్ వైజాగ్ కు వెళ్ళే ముందు నన్ను కలిసాడు. తన భార్య ప్రణవి కనిపించడం లేదని చెప్పాడు...తనకు మాఫియా నుంచి ప్రాణభయం ఉందనీ చెప్పాడు. కొనసాగించాడు కార్తికేయ...ముంబాయిలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను గుర్తుందా? అప్పుడు మనకు హెల్ప్ చేసింది చంద్రహాస్ గారే...అలా పరిచయం...అసలు జరిగింది ఏమిటో నీకు తెలియాలి....
రామాయణ మహా కావ్యం వాల్మీకి ద్వారా విరచితమైంది...పరమ పావనమైనది...
చంద్రహాస్ జీవితంలో జరిగిన ఓ ఘట్టం...కార్తికేయ ద్వారా తెలుస్తోంది.
"ఒక సెలబ్రిటీ జీవితంలో ఎదురైనా సంఘటన...వ్యాపార సామ్రాజ్యంలో శత్రువులు, ప్రత్యర్థులు, ఎలా వుంటారు? అసలు చంద్రహాస్ లాంటి బిజినెస్ టైకూన్ జేవితంలో ఎదురైనా విషాద సంఘటన...డబ్బు వున్నా వాళ్ళు హ్యాపీగా వుంటారు అనుకునే వారికి ఇది ఒక నిజమైన కథ...వ్యథ..."
కార్తికేయ ప్రణవి వున్న గది వైపు చూసాడు...అలిసి పోయి పడుకుంది. ముగ్ద వెళ్లి బెడ్ షీట్ కప్పి వచ్చింది. వచ్చే ముందు తలుపు దగ్గరగా వేసింది.
కార్తికేయ చెప్పడం మొదలుపెట్టాడు...ఎదురుగా టేబుల్ మీద వాల్మీకి రామాయణం వుంది.
"సీతా సాధ్వి బంగారు లేడీ అడిగిందో లేదో తెలియదు కానీ ప్రణవి తన భర్తను ఓ కోరిక కోరింది.. అదీ తన భర్త పుట్టిన రోజైన...
ఆగష్టు 1 రోజున....
********************
అదే సమయంలో మరియప్ప స్మశానంలో క్షుద్రక్రతువు నిర్వహిస్తున్నాడు...దెయ్యం వున్న చోటు దేవుడు ఉంటాడు...దేవుడిని నమ్మినప్పుడు దెయ్యాలు దేవుడి ఉనికిని నిర్వీర్యం చేయాలనే వ్యర్థ ప్రయత్నాలు చేస్తాయి.
తన శిష్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. క్షుద్ర శక్తుల ఉనికి తెలియజేయాలని అనుకున్నాడు. బిత్రోచిని నిద్ర లేపి తాంత్రిక ప్రపంచానికి తానేమిటో నిరూపించాలనుకున్నాడు మరియప్ప.
చేతబడిలో అతి ప్రమాదకరమైన పదమూడవ అంకం...నిక్శూచి..
గాలిలో, వానలో, చీకటిలో వేగంగా ప్రయాణించి ఎదుటి వ్యక్తిని ఆవహించే ప్రేతం...దాని ప్రవేశమే భయానకం...నిక్శూచిని ప్రయోగించిన పన్నెండు మంది మాంత్రికులు నిక్శూచికి బలయ్యారు...అతి ప్రమాదకరమైన ప్రయోగం...నిక్శూచి నిద్ర లేచే సమయంలో ఎవరూ మెలుకువగా వుండకూడదు...తాంత్రికుడు చాలా ధైర్యంగా వుండాలి..
పదమూడవ అంకం మొదలైంది.
మరియప్ప నిక్శూచిని నిద్ర లేపగలడా?
నిక్శూచి నిద్ర లేస్తే?
(ఒక చారిత్రాత్మక సంఘటన...ప్రపంచానికి తెలియని ఆగష్టు 1...నేపథ్యం ...రేపటి సంచికలో)

Subscribe to:
Posts (Atom)