ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

మరులు విరులై హృదిలో విరబూస్తే
తలంపు మనసు కిటికీలు తెరిపిస్తే
వలపు కడలికెరటమై ఎదలో దుమికితే
తాపం తనువెల్ల తరిమి తరిమి తడిమితే
యువతలో నవభావం లాలసే ఉబికొస్తే
చిగురించిన చిరుప్రేమ చిందులే తొక్కితే
కలిసిన మనసులే కనులు ద్వారలు మూసేస్తే
చెంపలు తాకిన ఊపిరే మది కోరిక సందేశాలిస్తే
తాకిన చేతులే తనువు తహతహలు తెలిపితే
పడకలైన పచ్చిక బైర్లే వేడి నిట్టూర్పులకు వడిలి సిగ్గుతో పచ్చబడే
విసురజ 20DEC12

No comments: