ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

కవిత ; : మనః తిమిర సంహారం
..............................
అజ్ఞాన తిమిరాన్ని మనసున తొలగించి
సుజ్ఞాన కాంతులతో మనసును నింపే
దీప జ్యోతికి వందనం వెలుగు కాంతికి అభివాదం
మూసిన కనురెప్పల మాటున నీకై నీపైనే ధ్యానం...
మనసు నిండా నిలుపుకున్న శ్రీమూర్తికి వందనం...
ప్రశాంతమైన చిత్తంతో నిర్మలమైన మనస్సుతో...
నిష్కామంగ చేస్తున్నామీ ప్రార్థన మనసు నివేదన
'సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతంటూ
ఇదే కదా చక్కని జీవనానికి ఆధారం
ఇదే కదా మానసిక సాంత్వనకు సోపానం
ఇదే కదా ముందు తరాలకు ఆదర్శం
ఇదే కదా ఎల్లరు నేర్వవలసిన సత్యం

No comments: