ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) విపణిలో మన సరుకు ఏదైనా అమ్ముడవ్వాలంటే సరుకులో నాణ్యత వుంటే సరిపోదు, సరుకు అమ్మే నైపుణ్యం వుండాలి, దేశ కాల మాన పరిస్థితులు అన్నీ గమనించి మెలగాలి. ఎంత మంచివైనా...చలికాలంలో చన్నీళ్ళు, ఎండాకాలంలో వెన్నీళ్ళు, అడివిలో కట్టెలు అమ్ముడు పోవు. గమనించి మెలగండి, జీవితంలో ఎదగండి.

2) లోకంలో మనమెంత తెలివైనవారమైనా ఏదైనా వ్యవహారంలో పట్టు విడుపు, సమయం సందర్భం, ముందు వెనకా అన్నిటిని మించి మధురమైన పలుకు, నాలుక మీద నియంత్రణ వుండాలి. పలుకు మంచిదైతే పదుగురూ పట్టం కట్టు, ప్రాణం పెట్టు.

No comments: