ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

కవిత: ఎండల కాలం
............................
ఎర్రని ఎండలు మండే కాలమిది
తెల్లని మల్లెలు పూచే తరుణమిది

రోహిణి కార్తుల ఎండవేడిమి ప్రకోపాలిక్కడే
చల్లని రాత్రుల తీయనివలపు వెచ్చదనాలిక్కడే

కరెంట్ కోతల యమయాతనల కాలమిదే
చదవే విద్యార్ధులకు విషమ సమయమిదే

గుక్కెడు నీరుకై మాను మేను తపించే సమయమిదే
కడివెడు నీళ్లకై శుకం శునకం తల్లడిల్లే కాలమిదే

క్రొత్త జంటల వివాహసంబరాల సంరంభాల పర్వమిదే
మనువైనవారి తనువు తహతహల సీమోల్లంఘనము తరుణమిదే

పిల్లలకు వేసవికాలపు సెలవిలిచ్చే కాలమిదదే
యాత్రికులకు విహారాలకు పోయివచ్చే సమయమిదే
...................
Photo: కవిత: ఎండల కాలం 

విసురజNo comments: