ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

1) విధి నెరిపే వింత జీవిత నాటకంలో మనమందరం పాత్రలమే..ఎవరి పాత్ర వారు నిర్వహించాలి,,, ఒకోమారు అందరి పాత్ర తీరు ఒకేలా వున్నా కాకపోతే వారు పలికే డైలాగులు మాత్రం పాత్ర స్వభావం బట్టి వుంటుంది...
2) గెలుపు గుర్రం ఎక్కాలంటే నిష్ఠ మరియు నిబ్బరం అలవర్చుకున్న మంచి రౌతు అయ్యుండాలి... అలాగే కోరికల కళ్ళేలను కూడా గట్టిగా లాగి పట్టుకుని ముందుకు సాగాలి
3) నిజాయితీగా నిజం ఒప్పుకునేందుకు హృదయంలో సత్యం పట్ల అభిమానంతో పాటు సచ్చీలతతో బ్రతుకు నెరపడంపై పూర్తి విశ్వాసం వుండివుండాలి...

No comments: