ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 17 December 2014

శివ స్తుతి "శివోహం"..

తిరిపెముతో వర్ధిల్లు త్రిశూలధారి 
త్రినేత్రునికి వందనాలు
సర్పాభారణలతో తిరుగాడు సుందర
సుందరేసునికి వందనాలు
కాలకూటవిషాన్నే కంఠ ధరించిన
మహాకాలునికి వందనాలు
అడగంగా అత్మజ్యోతినే బహుమతిచ్చిన
అరుణాచలేసునికి వందనాలు
ప్రణమిల్లి మొక్కి ప్రార్ధిస్తే
సులభంగా వరాలిచ్చే పరమేశ్వరునికి వందనాలు
మోకరిల్లి త్వమేవ శరణంటూ
సాగిలపడితే మురిసే మహేశ్వరునికి వందనాలు
అమృతం పంచ వచ్చిన 

మాయామోహిని వెంటబడ్డ ఆనందమూర్తికి వందనాలు
రుద్రాక్షలతో నమకచమక రుద్రజపాలతో 
మెత్తబడి వరాలిచ్చే రౌద్రరూపసికి వందనాలు
తిమిర సంహారం నిత్యయజ్ఞంలా నిర్వహించే
త్రిలోకపతికి వందనాలు
భక్తులను బ్రోచి భవభందాలను తొలిగించే భక్తనృపాలునికి వందనాలు
నర్తనవేళ ఝణకంకణశబ్దాలతో అలరించే
నటరాజమూర్తికి వందనాలు
అత్మజకు అనురక్తితో (తన) శరీరంలో సగమిచ్చే
అర్దనారీశ్వరునికి వందనాలు

లోకంలో సర్వులను కనురెప్పలా కాచే
లోకభందుకు వందనాలు
పుడమిలో ఎల్లరకు పురాషార్దం తెలియచెప్పే
ప్రేమసింధుకు వందనాలు
కలిమిలేముల తేడాలు చూపక కరుణించే
కల్మషరహితునకు వందనాలు
దీనజనులను కృపతో ఆదరించి పరిరక్షించే
ధవళాచలేసునికి వందనాలు 

No comments: