ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 19 January 2015

స్వగతాలు: 5::

వైజాగ్ లో సీతమ్మధార లో వుండేవాళ్ళం..అక్కడ నుండి, రోజూ, మిత్రులందరం కలిసి స్కూల్ కి (వి.టి. కాలేజ్) బస్సులో వెళ్ళేవాళ్ళం.. అది ఒక కాన్వెంట్ స్కూల్.. నేను పది క్లాసు చదవకనే దానికి సరిసమానమైన మెట్రిక్ (ఆంధ్ర యూనివర్సిటి.. 1981) నుంచి పాసయ్యా.. అదీ 13 ఏళ్ళ 9 నెలలకే. అదే పదో క్లాస్ అయితే 15 సంవత్సరాలు నిండి వుండాలి...మెట్రిక్ ని చదివింది చిన్నప్పటి నుండి కూడా ఇంగ్లీష్ మీడియం కావున ఇబ్బంది లేకుండా డాక్టర్ సర్టిఫికేట్ సహాయంతో పూర్తి చేశా.. మా తండ్రి గారు పోలీసు విభాగంలో పనిచేయడం ఆపై స్వతహాగా వారికున్న పరిచయాలు మూలాన పది లేక తత్సమానమైన కక్ష పరీక్షలో కావాల్సిన ఏజ్ కన్నా తక్కువున్నా తెల్సిన డాక్టర్ ఇచ్చిన ప్రమాణ పత్రంతో పరీక్షం రాయడం ప్రధమ తరగతిలో ఉత్తీర్ణం కావడం జరిగింది.. పెద్దవాళ్ళు దూరంగా కనబడినా సరే దండం పెట్టేవాళ్ళం.. అత్తయ్య/పిన్ని/మావయ్యా/అన్నయ్య/బాబాయి ఇలా గౌరవంగా పిలుచుకునే వాళ్ళం , అలా పలకరించే వాళ్ళం
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నేడు వెనక్కి తిరిగి చూసుకుంటే, వయసుకు తగ్గ పరిణితి నాకు అప్పుడు లేదు చదువులోను వ్యవహారంలోనూ మరి ఊహల్లోనూ...
అట్లా ఇంటర్, పైగా డిగ్రీ మొదటి సంవత్సరంకి వచ్చేటప్పటికి వయసు 16 కూడా పూర్తిగా నిండలేదు.. ఇంకా ఆటలు .... కర్రా బిళ్ళ , గాలిపటాలు, గోళీలు, డీఫ్, ఏడు పెంకులు ఇత్యాదివి... నిక్కర్లు వేసుకుని అడేస్తుంటే, ఆ దారమ్మట వెళ్లివచ్చే నా క్లాస్మేట్స్/ అమ్మాయులు, అందరు నవ్వుతుండేవారు.. నాకు సిగ్గుసృహ కూడా వుండేది కాదు.. పట్టింపు అస్సలే వుండేది కాదు...
నేటిరోజుల్లో పిల్లలు అస్సలు ఆటలంటేనే దూరంగా వుంటున్నారు. శరీర వ్యాయాయంకి అలవడటం లేదు..పైగా వారికి చచ్చేంత సిగ్గు.. ఆపై షార్ట్స్ లేక ఏమి బట్టలు వేసుకోవాలన్నా..ముందు టాగ్స్, బ్రాండ్స్ చూస్తున్నారు...పైగా ప్రీ నర్సరి, నర్సరీ, కిండర్ గార్టెన్ అంటూ పిల్లలని నలిపేస్తూ 16 ఏళ్ళ అయినా పదో క్లాసుని దాటనివ్వటం లేదు..ఎప్పుడు చదువులు పూర్తిచేస్తారు, ఎప్పుడు తమ వాళ్ళకు ఊతం అవుతారు.. ఇదే నన్ను నిత్యం తొలిచేసే సమాధానం దొరకని ప్రశ్న.. ఇప్పటి పిల్లలకు ఇంటికి ఎవరొచ్చినా, ఫోన్ చేసినా, తెలిసినా కూడా నమస్తేలు స్వాగతాలు వుండవు.. ఏదో మనం మరో గ్రహం నుంచి దిగినట్టు చూసి మరలుతుంటారు, ఇంట్లోనూ, బయటను కూడా.. ఇది చాల అసంబద్ద ఖండన విషయం.. వారి అట్టి ప్రవర్తనకు నేనైతే పెద్దలనే తప్పు పడతా...చెప్పందే పిల్లలకు తెలియదుగా..
ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే పిల్లలు సిగ్గును వదిలి కలివిడిగా ఉంటూ తర్కపు మస్తిష్కాన్ని పెంపొందించుకుంటేనే రాబోవు రోజుల్లో వారికి మనుగడ వుండేది
పైగా తల్లిదండ్రులకు, పెద్దలకు కూడా నా విన్నపం ఏమిటంటే మీ మీ పిల్లలపై మక్కువ, నియంత్రణ వుండాలి... అది సహజమే కానీ వారిపై అతిప్రేమ, అతిగా వారిని కంట్రోల్ చేయుట అనర్దాలకే దారితీయు..వారికీ పలకరింపులు... అందుకే పెద్దవాళ్ళు పిల్లలకి చదువులుతో పాటు బుద్దులు, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడాలు నేర్పాలి..
............. 

No comments: