ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 19 February 2013

1) వ్యక్తుల సంభాషణ పర్వంలో వినయం, ఓర్పు, మర్యాద ఆర్ద్రత, హుందాతనం ఇత్యాది ముడిపడివుంటే వ్యవహార సానుకూలత పెరిగి, ఎదుటి వారిని ఆకట్టుకొనడం జరుగుతుంది.

2) వ్యక్తులతో వ్యవహారంలో ముందు మనం ప్రేమించడం, గౌరవించడం మర్యాదగా వ్యవహరించడం ముఖ్యం అట్లాగే ఎదుటివాళ్ళు మనల్ని అంతే గౌరవిస్తున్నారా అన్నది పట్టించుకోకపోవడం వివేకం, అభిలాషనీయం.

3) వ్యక్తుల జీవితాలలో సంప్రదాయమంటే మనకి మార్గదర్శకంగా వుండే అంశమని భావించాలి గాని మనల్ని కట్టి పడేసి బంధిచేది కాదని తెలుసుకుని మెలిగితే జీవితం సాఫీగా సాగిపోతుంది.

No comments: