ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

కవిత: మమత విరిసేనా
..........................
మూగబోయిన హృదయవీణ మరల పాడునా
వలచిన వనితే కాదని వెడిలిన వేళ
రాలిపోయిన పూలు మరల పూయునా
పూచిన తరువే కాదని రాల్చిన వేళ
వగపు విడిచి తలపు ఎదను తాకునా
మరులు పరి పరి నీ పాటే పాడిన వేళ
హృది వలపు గానం చేసేనా
పలికే పెదవులే మూగవైన వేళ
కదిలే కాలం ఎవరికొరకకైనా ఆగేనా
వెలుగు చీకట్లే కూడదని నక్కిన వేళ
ఓడిన బాటలో గెలుపు గుర్రం ఎక్కాలంటే
బ్రతుకు పోరులో నిత్యమీ సంఘర్షణ చేయాల్సిందే

No comments: