ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

నువ్వు లేని నిన్నలో
బ్రతుకున చీకటి నిండేలే

నవ్వు లేని నువ్వులో
వెన్నెల లేని పున్నమిలే

తలపు లేని వలపులో
మలపులే మలుపులు బాటలో
నువ్వున్న నేడులో
బ్రతుకులో వెలుగు వురికేలే

నవ్వున్న నువ్వులో
వెన్నెల పువ్వై పూసిందిలే

తలపే తలంపైన వలపులో
మలపులన్నీ మాయమైనవిలే

విసురజ

No comments: