"ముగ్ధమోహనం" (32nd chapter)
(26-02-2013)
.....................................
"మై డియర్ ఎనిమి..ప్రియాతి ప్రియమైన ఆకలీ...నువ్వంటే నాకు భయం...గౌరవం...ఎక్కడో ఓ రచయిత ఈ వాక్యం రాసినప్పుడు నవ్వుకున్నాను...ఇప్పుడేంటో నవ్వు బదులు ఆకలే ముందు వస్తోంది." రెండు చేతులు పొట్ట మీద పెట్టుకుని ఆకలితో మాట్లాడుతోంది.
మనిషిని సృష్టించిన దేవుడు అక్కడితో వూర్కోకుండా ఆకలినీ వెంటనే పుట్టించాలా? దేవుడికి ఆకలిదప్పులు లేవు కాబట్టి వుండవు కాబట్టి...ఆకలి బాధ తెలియదు.
"ఆకలి మేఘం, ఆకాశమనే దేహాన్ని కమ్ముకొని బాధను వర్షించింది.
ఆ యాచకుడు పూర్ణిమ ఇచ్చిన ప్రసాదం తిని ,కోవెలలో కొలువైన నాథుడిని చూసి, జగన్నాథార్పణం ...అనుకున్నాడు. ఆ తర్వాత పూర్ణిమ వైపు చూసాడు.
నిండు గోదారి, ఆకలి కావేరిగా మారినట్టు అనిపించింది, దేవుడు కూడా ఏడుస్తాడా? ఆ యాచకుడు ముగ్ధ ఇంటి వైపు కదిలాడు. ఆకాశం మేఘావృతమైంది.
***************************************************************************************************
"దేవరొచ్చాడు...జంగమదేవరొచ్చాడు...జాగుసేయక రాతల్లీ ...."
హాల్ లో కూచొని కాళ్ళకున్న పట్టీలు సరిచేసుకుంటున్న ముగ్ధ ఆ మాటలు విని బయటకు వచ్చింది.
ఆరడుగుల ఆజానుభావుడు...నుదిట విభూది...చేతిలో డమరుకం...చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే రూపం...
"కీడు కూతవేటు దూరంలో వుంది తల్లీ...రాకాసి ఒక్కటి నిన్ను చేరవచ్చే...చీకటి మేఘాలు కమ్ముకొచ్చే...భద్రం తల్లీ..."
జంగమదేవర మాటలు విని క్షణకాలం భయపడిపోయింది. భీతావహరిణి అయింది.
ఏమిటి స్వామీ మీరు చెప్పేది? భయంగా అడిగింది.
"జరుగబోయే సత్యం తల్లీ...నిన్ను కాయడానికి జగన్నాథుడే వస్తున్నాడు తల్లీ...ఇది ఆ జగన్నాథుని ప్రసాదం..
ఈ పంచ భక్ష్య పరమాన్నాలు నీకు కావలసినవారికి పెట్టి వారి కడుపు నింపితే అంతా మంచే జరుగు" అంటూ తన జోలెలో ఉన్న పెద్ద అరటాకులోని ఆహార పదార్ధాలు ఉన్న విస్తరి ముగ్ధ చేతిలో పెట్టాడు .
వాటిని కళ్ళకు అడ్డుకుని తీసుకుంది."స్వామీ చిన్న సందేహం " భక్తిగా అడిగింది ముగ్ధ.
"దేహానికి వచ్చే సందేహాలు ...చెప్పేను జీవిత సత్యాలు ...అడుగు తల్లీ"
"మీరు శివ..." ముగ్ధ మాట పూర్తీ కాకుండానే...
"శివకేశవులు వేరు వేరు కాదు తల్లీ..."చెప్పి "వర్షపు చినుకు ఆహారం మీద వాలక ముందే ప్రసాదం గొంతు దాటి వెళ్ళాలి తల్లీ" అంటూ వడి వడిగా పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు...అదృశ్యమై పోయాడు.
**********************************************************************************************************
ముగ్ధకు పూర్ణిమ గుర్తొచ్చింది. గుడి దగ్గరే వుంటుంది. దేవుడ్ని తిట్టుకుంటూ...వెంటనే ఆకాశం వంక చూసింది....
మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తండ్రి పూజ గదిలో వున్నాడు. తమ్ముడు కార్టూన్ నెట్ వర్క్ చూస్తున్నాడు.
పూల సజ్జలో ఆహార పదార్థాలు తీసుకుని బయల్దేరింది.
********************************************************************************************************
గుడిలో స్థంభానికి ఆనుకుని కూచొని మూసి ఉన్న గుడి తలుపుల వైపు చూస్తూ."నన్ను తప్పించుకోవడాని తలుపులు వేసుకున్నవా? రేపు తలుపులు తెర్చుకున్నాక చెబుతాను."తలను వెనక్కి వాల్చి అంది.
"దేవుడ్ని కాసేపు రెస్త్ కూడా తీసుకోనివ్వవా? ముగ్ధ వచ్చి పూర్ణిమ పక్కన కూచుంటూ అడిగింది
"నాకూ,ఆయనకు రోజూ ఉండేదే కానీ నువ్వేంటి....ఈ టైములో ...కొంప దీసి నా కోసం "పంచ భక్ష్య పరమాన్నాలు తేలేదు కదా "నవుతూ అడిగింది.
"కొంప తీసే తెచ్చాను.సజ్జ లో నుంచి అరటాకుతీసింది. నిజంగానే పంచ భక్ష్య పరమాన్నాలు..
"ఏయ్ ..ఏమిటివి? ఏమిటీ విశేషం...కడుపులో శ్రీహరికోట రాకెట్లు పరుగెడుతున్నాయి."
జంగమ దేవర గురుంచి చెప్పలేదు. చెబితే కొట్టి పారేస్తుంది . తినక పొతే?
పూర్ణిమ గబ గబ తింటోంది. పొల మారింది ...
"ఏయ్ ముగ్ధ నన్నెవరో తలుచుకుంటున్నారు. నీ దేవుడేమో...?" అంది.
వాటర్ బాటిల్ ఇచ్చింది. చివరి మెతుకు వరకూ తిన్నది. చీర కొంగుతో మూతితుడుచుకుంది.
"ముగ్దా నువ్వు నాకో,నేను నీకో బాకీ వున్నాం...లేకపోతె ఈ రుణానుబంధం ఏమిటే? కళ్ళు కన్నీటి చెలమలు అయ్యాయి.
"కాదు మన ఇద్దరికీ ఆ దేవుడు "మన స్నేహం " బాకీ వున్నాడు " అంది ముగ్ధ .
ఆకాశం లో మెరుపులు."ముగ్దా ...నువ్వు ఇంటికి వెళ్ళిపో వర్షం వచ్చేలా వుంది "అంది పూర్ణిమ.
"పూర్ణిమా నువ్వూ రారాదు. ఈ వర్షం లో ఇక్కడెందుకు ? ముగ్ధ అంది.
తల అడ్డంగా తిప్పి "అయినా నేను వస్తే నీ దేవుడు ఒంటరైపోడూ...నువ్వెళ్ళు" అంది.
పూర్ణిమ మొండితనం తెలుసు.అందుకే సజ్జ తీసుకుని లేచింది. గుడి ఆవరణ దాటుతుండగా పెద్ద పిడుగు శబ్దం. ఒక చినుకు ముగ్ధ నుదురుని తాకింది.
(ఆ తర్వాతేమైంది? రేపటి సంచికలో)
...........................................................
విసురజతో ముఖాముఖి
........................
వి.మనస్విని (సింగపూర్ )
(విసురజ గారికి...క్షమించాలి...విసురజ అంటే అమ్మాయి అనుకున్నాను.ఎందుకంటే స్త్రీ లాలిత్యం ,హృదయం,ఆమెలోని సున్నితత్వం,భావుకత్వం,అమ్మాయిలకే బాగా తెలుసు....అని నా ఫీలింగ్.నేను సీరియల్స్ చదవడం మానేసి చాలా కాలమైంది.(చదివించేలా రచనలు రావడం లేదంటే అతిశయోక్తి కాదేమో?) అనుకోకుండా ఓ రోజు మేన్ రోబోలో ఓ చాప్టర్ చదివాను. ముగ్ధ కార్తికేయకు జామకాయ ప్రేమతో పంపే సన్నివేశం. నిజం చెప్పాలంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మీకొచ్చిన ఆ థాట్ కు హేట్సాఫ్ .
ప్రేమంటే బొకేలు, పబ్బులు అనుకుంటారు.ఒక మెచ్యూర్డ్ లవ్...చూసాను. మా వారితో కూడా చెప్పాను. పాతికేళ్ళ క్రితం కార్తికేయ కలిసివుంటే నా చాన్స్ ఎలా ఉండేదో...అని.ఆఫ్ కోర్స్ మా వారు కూడా కార్తికేయలా ప్రేమించే వారే, అలా మీ ముగ్ధమోహనానికి ఫ్యాన్ ని అయ్యాను. నిన్నచూస్తే పూర్ణిమను ఆకలి తో వుంచేసారు. ముగ్ధను కాపాడడానికి కార్తికేయ వున్నాడు. మరి పూర్ణిమను కాపాడడానికి ఎవరున్నారు? మీకిది న్యాయమా?
విసురజ: మనస్విని గారికి మనఃపూర్వక నమస్కారాలతో...రెండు వందల పై చిలుకు పదాల మెయిల్ లో వేన వేల మైళ్ళ అభిమానం కనిపించింది. ధన్యోస్మి. నేను అమ్మాయి అనుకున్నారు....అమ్మాయిని కాదు కానీ అమ్మాయిల మనసు తెలిసిన వాడ్ని...కొంచెం ఎక్కువ స్త్రీ పక్షపాతిని. కార్తికేయ ఆపదలో వున్న వారిని కాపాడుతాడు. పూర్ణిమను పస్తు ఉంచిన తప్పు ఆ దేవుడిదా? అయినా ఆ దేవుడికి మాత్రం ఇష్టమా? పూర్ణిమ ఆకలితో అలమటిస్తే నేను మాత్రం చూడగలనా? దేవుడు మాత్రం భరాయించగలడా? ఈ రోజు అధ్యాయం చూడండి. అయినా దేవుడినే తర్జని చూపి నిలదీయగల పూర్ణిమను నేనేం చేస్తాను చెప్పండి. మీ అభిమానమే పూర్ణిమ అవతార ఆంతర్యం అనుకోండి. మీ అభిమానానికి మరో సారి ధన్యవాదాలతో....మీ విసురజ)

No comments:
Post a Comment