" ముగ్ధమోహనం " (31thchapter )
(25-02-2013)
"ఎక్కడ ప్రజల అమాయకత్వం వూపిరిపోసుకుంటుందో....ఎక్కడ నిరాశగా,నిస్పృహలతో యువత నిస్తేజమవుతుందో...అక్కడ అవకాశవాదం తన వికృత క్రీడ మొదలు పెడుతుంది.
లక్ష్యాన్ని ఏర్పరుచుకుని అవాంతరాలను అధిగమించి గమ్యపు నింగికి ఎగిసే స్ఫూర్తిదాయక యువత ఓ పక్క ,నిరాశ,అభద్రతాభావం,డ్రగ్స్కు బానిసయ్యే బలహీనత తో పాతాళానికి జారిపోయే యువత మరో పక్క....
సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేస్తుంది మోహన.
డ్రగ్స్ ని ఎరగా వేస్తుంది.అందమైన ప్రపంచం అంటే మత్తులో వుండడం అని నమ్మిస్తుంది.
అలాంటి వారిని తన ఆధీనం లోకి తెచ్చుకుంటుంది.హైదరాబాద్,ముంబై,లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వారిని తయారు చేసింది.
అక్కడ వున్న వాళ్ళంతా పాతిక నుంచి ముప్పయ్యేళ్ళ వయసు వున్న వారే....
ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలంటే వెళ్ళాను ఉపయోగించుకుంటుంది.ఇకడి వ్యవహారాలూ చూసే వ్యక్తి నిక్సన్.
గోవా నుంచి మత్తు మందులు తీసుకు వచ్చి ఇక్కడ విక్రయిస్తుంటాడు.
కొందరు సినిమా వాళ్ళనూ ఈ రొంపిలోకి దింపిన క్రెడిట్ అతనిదే.
ఉగాండా నుంచి చదువు కోసం వచ్చి గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నాడు.
ఆర్ధికం గా ఇబ్బందుల్లో ఉన్నవారిని ,డిఫ్రేషన్ లో వున్న వారిని ట్రాప్ చేస్తాడు. లేదా అలాంటి పరిస్థితి సృష్టిస్తాడు.
నిక్సన్ వల్ల దాదాపు రెండువేల మంది డ్రగ్స్ కు అలవాటు పడి తమ కెరీర్ నాశనం చేసుకున్నారు.
నిక్సన్ మాత్రం డ్రగ్స్ తీసుకోడు.
************************************************************************************
మోహన ఎదురుగా వున్న వారి వైపు చూస్తోంది.వాళ్ళ కళ్ళలో కాంతి లేదు..ఆశ...
కాసేపు వెయిట్ చేస్తే డ్రగ్స్ ఇస్తారని.మొహాలు పాలిపోయి వున్నాయి.మోహన ఎదురుగా వున్న టేబుల్ మీద హెరాయిన్ పాకెట్స్ వున్నాయి.
అందరూ వాటి వంక ఆశగా చూస్తున్నారు.అది గమనించింది మోహన.ఈ ప్రపంచంలో డబ్బు కన్నా,మత్తు ఎక్కువ కిక్కుని ఇస్తుంది...
మనుష్యులను బలహీనం గా మారుస్తుందన్న నమ్మకం ఆమెది.
ఒక్కసారిగా ఆ హాల్ లో లైట్లు ఆరిపోయాయి.ఓ లైట్ మోహన మొహం మీద ఫోకస్ అయింది.
ఆమె మొహం ఎరుపు రంగులో ప్రమాదాన్ని సూచిస్తున్నట్టు వుంది.
****************************************************************************************
"మీరంతా నా వైపే చూస్తున్నారు...నా మాటలే వింటున్నారు.మీకేదీ కనిపించడం లేదు...ఇంకేమీ వినిపించడం లేదు "మోహన గొంతు గంభీరం గా ఆ హాల్ లో ప్రతిధ్వనిస్తుంది.
ఓ సారి అందరి వైపు చూసి "మీరు చాలా తెలివైన వాళ్ళు...అయినా మీకు గుర్తింపు లేదు.బాధ పడకండి.మన రాజ్యం వస్తుంది...మీరే మోనార్క్ లు అవుతారు.
అప్పటి వరకూ ఎంజాయ్ చేయండి.జల్సా చేయండి.భయాలు,బిడియాలు వదిలేయండి.ఎంజాయ్..."
హాలంతా చప్పట్లతో మార్మోగింది.
మోహన మాటలకు అందరూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు...
ఒక్కరు తప్ప....సంధ్యా రాణి ...జర్నలిస్ట్...డ్రగ్స్ రాకెట్ మీద పరిశోధన చేస్తోన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.
కేవలం ప్రెస్ మీట్స్,మంత్రుల వాగ్దానాలు,అసెంబ్లీ కవరేజీలు ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు.
అందుకే మూడు నెలలుగా ఈ ఆపరేషన్ మొదలు పెట్టింది.మోహన ను సంద్యారాణి చూడ్డం మొదటి సారి.
ఏ హిప్నాటిస్ట్ అయినా ,ఎదుటి వారి అంగీకారం లేకుండా,తమ ట్రాన్స్ లోకి తీసుకు వెళ్ళలేరు.వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకుంటే తప్ప.
తను చేస్తున్నది రిస్కీ ఆపరేషన్ అని దీని పర్యవ్యసానం తీవ్రం గా ఉంటుందని తెలియదు ఆమెకు.ఆమె కళ్ళ ముందుడ్రగ్స్ కు బానిస అవుతోన్న యువత భవిత కన్నీళ్ళతో కనిపించింది.
*****************************************************************************************
నిక్సన్ ,మోహన ఎదురెదురుగా వున్నారు...దూరం గా బలిష్టులైన పది మంది దృడకాయులు వున్నారు.
"నిక్సన్ మనం రిస్క్ జోన్ లో వున్నాం...యాసిక్ చనిపోయాడు...సిక్వీ ఆత్మహత్య చేసుకున్నాడు.నా అనుమానం నిజమైతే ఈ పాటికి రజ్వీ కూడా చనిపోయి ఉంటాడు.నెక్స్ట్ టార్గెట్ నువ్వే అవుతావు."అతని మొహం లోకి చూస్తూ చెప్పింది మోహన.
"మీరేం కంగారు పడకండి మేడం..హైదరాబాద్ లోకి అడుగుపెట్టే ధైర్యం ఎవరి వుంటుంది ?నిర్లక్ష్యం అన్నాడు నిక్సన్.
అంతే...రెండో క్షణం లోనే నిక్సన్ చెంప చెల్లుమంది.ఆ విసురుకు నిక్సన్ తూలీ పడిపోయాడు.అతని బుగ్గ ఎర్రగా కందిపోయింది.దూరం గా వున్న నిక్సన్ అనుచరుడు కోపం గా మోహన వైపు రివాల్వర్ గురిపెట్టి ట్రిగ్గర్ మీద వేలు బిగించాడు....నిక్సన్.వారిన్చేలోగా మోహన చేతిలోని రివాల్వర్ నిశ్శభ్డం గా బులెట్ రిలీజ్ చేసింది.ఆ అనుచరుడు కుప్పకూలిపోయాడు.చచ్చిపోయాడు.
ఇదంతా క్షణాల్లో జరిగింది.
"మేడం వాటీజ్ దిస్"అసహనం గా అన్నాడు నిక్సన్.
"నిక్సన్ ఇక్కడ నా ప్రశ్నలకు జవాబులు మాత్రమే వుండాలి ...ఎదురు ప్రశ్నలు వుండకూడదు. ముందు ఆ స్టుపిడ్స్ ని బయటకు పంపు."అది ఆజ్ఞ
క్షణాల్లో ఆ హాల్ లో వాళ్ళు లేరు.తమ సహచరుడి మృతదేహం తీసుకుని వెళ్లారు.
"సారీ మేడం "నిక్సన్ అన్నాడు.
"నేను సారీ ని ఒక్క సారే యాక్సెప్ట్ చేస్తాను.శత్రువు బలం తెలుసుకోకుండా నిర్లక్ష్యం గా వుండడం ప్రమాదకరం.యముడి లా ఇక్కడికి వచ్చేది ఎవరో తెలుసా కార్తికేయ...
అతనెవరో తెలుసా....ఆరు నెలలుగా మూడు వందల మందిని నియమించి తెలుసుకున్న నిజం ..."కళ్ళు మూసుకుంది మోహన.
కార్తికేయ గుర్తొస్తేనే ఆమె వణికిపోతుంది.

ఎప్పటిలానే దేవుడి ముందు నిలబడి రెండు చేతులు జోడించి "నేను నిన్ను పూజించడం లేదని ఫీల్ అవ్వకు.అలాగే నీ ప్రసాదం తింటున్నానని అనుకోకు.
నువ్వు చాలా బాకీ.నా ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు,నా బ్రతుక్కో అర్ధం నిఘంటువులో కనిపించే వరకు నీకూ,నాకూ మధ్య ఈ గొడవ ఇలానే వుంటుంది.త్వరగా సెటిల్ చేసుకో."దేవుడో తో చెప్పేసి పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని గుడి మెట్ల వరకు వచ్చి తినబోతుండగా
"ఆకలి తల్లీ...మూడ్రోజులుగా పస్తు "ఓ బక్కచిక్కిన వ్యక్తి యాచించాడు. ప్రసాదాన్ని తినబోతున్న పూర్ణిమ తన చేతిలోనే ప్రసాదం అతని చేతికి ఇచ్చి ఓసారి గుడి వైపు తిరిగి దేవుడి వైపు చూసి " ఆర్యూ హ్యాపీ "అని అడిగింది నిన్నటి నుంచి దాడి చేస్తోన్న ఆకలిని గుర్తు చేసుకుంటూ...
ఆ యాచకుడు...పూర్ణిమ వైపు చూస్తూఉండిపోయాడు
(ఇంతకీ కార్తికేయ ఎవరు?ఆ యాచకుడు ఎవరు రేపటి సంచికలో )

No comments:
Post a Comment