ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

కవిత: విదేశి విపణి వైపరీత్యం
.....................
పచ్చళ్ళమ్మే పాపాయికి ఏమయ్యింది, తన దుకాణం మూతపడింది
అప్పచ్చులమ్మే అప్పాజికి ఏమయ్యింది, తన దుకాణం మూతపడింది
వెచ్చాలమ్మే వెంకాయమ్మకి ఏమయ్యింది, తన దుకాణం మూతపడింది
చెగోడీలమ్మే చందర్రావుకి ఏమయ్యింది, తన దుకాణం మూతపడింది
పళ్ళు పూలమ్మే పార్వతమ్మకి ఏమయ్యింది, తన దుకాణం మూతబడింది
కాయగూరలమ్మే కాంతమ్మకు ఏమయ్యింది, తన దుకాణం మూతపడింది
వేరే చెప్పేది ఏముంది..విదేశీ విపణి నుంచి గుత్తేదార్లు పెత్తందార్లు రానున్నారు
మరోలా అనుకునేదేముంది..విదేశి కాసులపై మమకారంతో మన నేతలే ఒప్పేరు
వచ్చే మరో దేశపు బడా వ్యాపారులు మన దేశ ప్రగతి ఆర్ధిక పురోగతి కోసం వస్తారా
తెచ్చే కాసుల సంచీలతో ఈడ వాళ్ళు మనదేశ లాభానికై దందా చేయడానికోస్తారా
వారు మెచ్చే తమ దేశపు అజెండాను చావనిస్తారా
మనదేశ పురోగమనాన్ని మన జెండాని గౌరవిస్తారా
శుష్కనమ్మకాలు విడవండి సూటిగా ఆలోచించండి నేతల్లారా
........................
విసురజ

No comments: