ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 20 April 2013

విసురజ (సీరియల్ )ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
17-04-2013 (7th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
మిర్రర్ డిటెక్టివ్ ఏజెన్సీ...
మూడవ అంతస్తులో వున్నా ఆ డిటెక్టివ్ ఏజెన్సీ లోకి అడుగు పెట్టగానే కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా వుంది. ద్వారానికి రెండు వైపులా రివాల్వర్ ఇమేజ్ లు..తలుపు దగ్గరికి వెళ్ళగానే ఎవరో తెరిచినట్టు తలుపు తెరుచుకుంది. కుడివైపు రిసెప్షనిస్ట్ ....ఎడమ వైపు పెద్ద సోఫా...గోడకు వేలాడుతున్న ప్లాస్మా టీవీ...అందులో అపరాధపరిశోదన సీరియల్స్ వస్తున్నాయి.
ఆ హాల్ లో నాలుగు వైపులా కెమెరా లు...లోపల స్టాఫ్ వున్నారు.కంప్యూటర్ల ముందు కూచోని ఎవరి పనిలో వారు బిజీగా వున్నారు. తప్పిపోయిన వారి వివరాలు,క్రైమ్ రేటింగ్ డిటేల్స్ చెక్ చేస్తున్నారు.ఆ డిటెక్టివ్ ఏజెన్సీ కి చైర్మన్ మాళవిక...నలభై అయిదేళ్ళ మాళవిక ఇంకా తక్కువ వయసు వున్నట్టు కనిపిస్తోంది.ఆమె తన వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపదు.ఇతరుల గదిలోకే కాదు...మనసులోకీ వారి అనుమతి లేకుండా తొంగి చూడకూడదని ఆమె ఫీలింగ్.
దాదాపు పదేళ్ళ క్రితం ఈ ఏజెన్సీ ని స్థాపించింది.చాలా మందికి ,ఎక్కువ మందికి ఒక అపోహ...డిటెక్టివ్ అనగానే హత్యల కేసులు మాత్రమే పరిశోదిస్తారని... కానీ చాలా కేసులు విచిత్రమైన కేసులు కూడా పరిశోధిస్తారు.
భర్త మీద అనుమానం వున్న బార్యలు,బార్య మీద నిఘా పెట్టె భర్తలు,కాబోయే పార్టనర్ కు సంబంధించిన వివరాలు,వ్యాపార రహస్యాలు...ఇలా చాలా కేసులు డిటెక్టివ్ ఏజెన్సీ కి వస్తాయి.కొందరు మోరల్ వేల్యూస్ కి కట్టుబడి కొన్ని కేసులు మాత్రమే టేకప్ చేస్తారు.అలాంటి వాటిలో మిర్రర్ డిటెక్టివ్ ఏజెన్సీ ఒక్కటి.
ప్రతి రోజు ఉదయం పదికల్లా షార్ప్ గా ఆఫీసులో వుంటుంది, టేబుల్ ముందు కబుర్లు చెప్పుకోవడం నచ్చదు.లంచ్ టైం లో ఎవరిష్టం వారిది.
టైం ఉదయం పది....
మాళవిక తన కేబిన్ లోకి ఆడుదు పెట్టింది.ఆ కేబిన్ చాలా నీట్ గా వుంది . తన సీట్ లో కూచోగానే రిసెప్షనిస్ట్ జ్వాల వచ్చింది."గుడ్ మార్నింగ్ మేడం,,మీ కోసం ఎవరో హర్ష గారట ,,,,వెయిట్ చేస్తున్నారు" చెప్పింది.
"రమ్మనండి "చెప్పింది మాళవిక.రెండు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి లోపలి వచ్చాడు.వయసు నలభైకి పైగా వుంటుంది.మనిషి అందంగానే వున్నాడు.ఏదో బాధలో షేవ్ చేసుకోనట్టు లైట్ గా మాసిన గడ్డం.
"చెప్పండి "అంది మాళవిక.
కొద్దిగా సంశయం గా చూసాడు.మాళవిక కు అతని ఫీలింగ్స్ అర్ధమయ్యాయి." ఇక్కడికి వచ్చేవారు ఏదో ఒక సమస్యతో వస్తారు...లాయర్ల దగ్గర,డాక్టర్స్ దగ్గర ఏదీ దాయకూడదు అంటారు..డిటెక్టివ్ ల దగ్గర కూడా యాడ్ చేసుకోవాలి " నవ్వి " కాఫీ లేదా కూల్ డ్రింక్ ?అడిగింది.
" థాంక్స్ మేడం..నా సమస్య ఏమిటంటే ...నా బార్య..."
"ఎలాంటి సమస్య ? మీ బార్య క్యారెక్టర్ మీద మీకు అనుమానమా ? అడిగింది మాళవిక.
ఒక క్షణం మౌనం గా వున్నాడు.
"మా దగ్గరికి వచ్చే చాలా కేసులు ఈ అనుమానం చుట్టే తిరుగుతాయి...దీనికి కారణాలు వెరీ సింపుల్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు.ఇద్దరికీ తగినంత ప్రైవసీ ,కావాలిసినంత స్వేచ్చ వుంటుంది.అప్పుడే అభద్రతాభావం మొదలవుతుంది. ఒకరి మీద మరొకరికి అనుమానం....ఈ అనుమానం హత్య వరకు,ఆత్మహత్య వరకు వెళ్తుంది...ఈ ప్రపంచం లో అతి భయంకరమైన జబ్బు ఏదైనా వుంటే అది ఖచ్చితం గా అనుమానమే అని నా ద్దేశం."చెప్పింది మాళవిక.
"కావచ్చు...కానీ నా బార్య మీద నాకు అనుమానం లేదు..తను పరాయి పురుషుడితో నగ్నం గా ఒకే బెడ్ మీద వున్నా నేను అనుమానించను.బహుశా నా దృష్టి లోపం అనుకుంటాను."చెప్పాడు హర్ష.
అతని వైపు పరిశీలనగా చూసింది.అతను సీరియస్ గానే చెబుతున్నాడు.అతను చెప్పిన ఒకే ఒక వాక్యం ఆమెను ఆకట్టుకుంది."నా బార్య పరాయి పురుషుడితో..." ఈ నమ్మకం కోల్పోయి ఈ ప్రపంచం లో ఎంతో మంది బార్యాభర్తలు విడిపోతున్నారు..కొట్టుకుంటున్నారు...మనశాంతి కోల్పోతున్నారు....
"ఈ మధ్య నా బార్య నన్ను విపరీతంగా ప్రేమిస్తుంది?
"అంటే?
"ఇదివరటికన్నా ఇంకా ఎక్కువ ప్రేమను చూపిస్తుంది...మాములుగానే తన ప్రేమను నేను తట్టుకోలేను....ఇప్పుడు చూపించే ప్రేమ అసలు తట్టుకోలేకపోతున్నాను ..ఈ ప్రేమ వెనుక వున్న కారణం నాకు తెలియాలి .
"ఇదో కూడా అనుమానమే కదా...నవ్వుతూ అడిగింది మాళవిక.
"కాదు ప్రేమ..తను ఇంత ప్రేమ ను ఎందుకు చూపిస్తుంది"అన్నది నేను తెలుసుకోవాలి.
"ఓకే...ఇలాంటి కేసు మొదటిసారి టేకప్ చేస్తున్నాం ...బార్య అతి ప్రేమను పరిశోదించమని చెప్పే భర్త .."
"థాంక్స్ మేడం...మరో విషయం...నేను మీ దగ్గరికి వచ్చినట్టు తనకు ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు "
"ఈ విషయం లో మీరు నిశ్చింతగా ఉండవచ్చు...మేము ప్రతీ విషయాన్ని గోప్యం గానే ఉంచుతాం...మీ బార్య డిటేల్స్ రిసెప్షన్ లో ఇచ్చి వెళ్ళండి."
"సారీ మేడం..నా బార్య గురించి ,ఈ కేసు పరిశోదన గురించి మరో వ్యక్తికి తెలియకూడదు...ప్లీజ్ మేడం...ఇవిగోండి మా ఆవిడకు సంబంధించిన వివరాలు...అంటూ ఓ కవర్ ఇచ్చాడు."
అతని ఫీలింగ్స్ ఆమెకు అర్ధమయ్యాయి.ఆ కవర్ తీసుకుంది.అతను పర్స్ తీసి "మేడం మీ ఫీజు ?
"వుంచండి ...కేసు పూర్తయ్యాక తీసుకుంటాను...అన్నట్టు మీ బార్య పేరేమిటి ?
"రాదాచంద్రిక "చెప్పాడు హర్ష...బార్య పేరు కరెక్ట్ గానే చెప్పాడు...తన పేరు మాత్రం ?
*****************
సమయం పదీ ముప్పయి...
ఆఫీసులోకి ఎంతరయింది సుకన్య...ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి.రాత్రి నిద్రలేనట్టు...
(హర్ష కథేమిటి ?సుకన్య ఏం చేయబోతుంది?అసలీ రాదాచంద్రిక ఎవరు ? రేపటి సంచికలో కలుద్దాం )

No comments: