ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 12 April 2013

1) తెల్లవారి వెలుగులో తన లక్ష్యాన్ని చూసి పరుగు మొదలెట్టి తన గోల్ చేరేవాడు వీరుడే. కానీ నిశిలో, చూపు సరిగ్గా అనని చిమ్మచీకటిలో సైతం తన లక్ష్యాన్ని గుర్తించి పయనం మొదలెట్టి తన గోల్ చేరినవాడు వీరుడు మరియు విజేత రెండు అవుతాడు.

2) ప్రశ్నలు సంధించే వారికి జవాబులు వినే ఓపిక వుండాలి. పైగా అటువంటి వారికి తమకి వచ్చిన జవాబులలో విషయాన్ని తత్వాన్ని మరియు మంచిని గ్రహించే గుణం వుండాలి. వేసే ప్రశ్న వివేచనతో వేసి, లభ్యమైన జవాబులతో జ్ఞానసముపార్జన పర్వంలో మరింత ముందుకు వెళ్ళాలి.
..............

No comments: