ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---70)
(05-04-2013)
......................................
యుగాంతం ఎలా వుంటుంది..?.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణ నిర్యాణం ఎలా జరిగింది?
ఒక ప్రళయం తర్వాత ప్రకృతి ఎలా వుంటుంది?
ప్రపంచానికి తెలియదు...ఈ ప్రజలకు తెలియదు..ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీడియాలో వార్తలు....చర్చావేదికలు..నిరసనలు...పోలీసులు రంగంలోకి దిగుతారు.
కానీ ఒక దేశ స్వాతంత్ర్యానికి, ముప్పు వాటిల్లిందని ఎందరికి తెలుసు? రాత్రి కాగానే ముసుగు తన్ని పడుకునే సగటు మనుష్యులు, ఆఫీసు నుంచి రాగానే అలిసి, కాసేపు టీవీ సీరియల్స్ వార్తలు చూసి పడుకునే ఉద్యోగస్తులు, ఇలా రక రకాల మనుష్యులు...ఒక రాత్రి ఏం జరుగుతుంది? సరిహద్దుల్లో వుండే జావాన్లు వణికించే చలిలో ఎలా కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తారు? ఇవన్నే మనలో చాలా మందికి తెలియవు? తెలుసుకునే ప్రయత్నం చేసేవారెవరు?
అట్లాగే చాల మందికి కార్తికేయ చేసిన సాహసం, చూపిన ధైర్యం తెగువ తెలియవు. చాలామందికి వుండే ప్రచార కుతి, కీర్తి కండూతి పట్ల మమకారం లేవు. కార్తికేయకి తెలిసినదల్లా కర్తవ్య నిర్వహణ, దేశరక్షణ అందులో ప్రాణం పోయినా అది మిన్న అన్న భావన. కార్తికేయకు పదిముందు తన దర్పాన్ని, తన గొప్పతనాన్ని, వీరత్వాన్ని చాటుకోవడం, ప్రదర్శన చెయ్యడం అస్సలు నచ్చదు. అందుకే కార్తికేయ సవినయంగా రాష్ట్రపతి నుంచి సెలవు తీసుకున్నాడు. తనకు ఏ అవార్డులు, అలంకారాలు వద్దన్నాడు.
దుష్టశిక్షణ కోసం అవతారం ఎత్తిన దేవదేవుడు, తన అవతార లక్ష్యం నెరవేరగానే....అవతారాన్ని చాలించినట్టు...ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని అణిచి, దేశాన్ని కాపాడాడో అప్పుడే తన పని ముగిసినట్టు మామూలు కార్తికేయగా వీడ్కోలు తీసుకున్నాడు.
శ్రీనివాస్ లాంటి సమర్ధుడైన ఆఫీసర్ ని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడమని విజ్ఞప్తి చేసాడు.
మోహన చివరి క్షణంలో చేసిన సాయాన్ని గుర్తుంచుకుని, ఆమెను వదిలి వేయవలిసిందిగా, భవిష్యత్తులో ఆమె వల్ల ఏ ప్రమాదం జరిగినా తనే బాధ్యత వహిస్తానని చెప్పాడు.
జర్దార్ కొడుకు బాధ్యత వ్యక్తిగతంగా తనే తీసుకున్నాడు.
"ఇంత మందికి ఇన్ని చేసి, తన కోసం ఏ కోరికా కోరలేదు..." రాష్ట్రపతి మొదటి సారి కార్తికేయకు మనసులోనే సెల్యూట్ చేసాడు .
**************************
న్యూ ఢిల్లీ...
కార్తికేయ సరాసరి అంజలి దగ్గరికి వచ్చాడు.అక్కడే వుంది హేమంత.
"ఏం జరిగింది? అడిగాడు కార్తికేయ.
"చిన్న పని వుందని వెళ్ళింది..ఎంతకీ రాకపోయేసరికి అంజలి భయమేసి నాకు ఫోన్ చేసింది." హేమంత చెప్పింది.
"మోహనకు సంబంధించిన వస్తువులు ఇక్కడే ఉన్నాయా? కార్తికేయ అడిగాడు.
"ఉన్నాయి ...అంజలి మోహనకు సంబంధించిన వస్తువులు తీసుకువచ్చింది. మోహనకు సంబంధించిన దుస్తులు...రివాల్వోర్, బుల్లెట్స్....వివిధ పేర్లతో వున్నా పాస్ పోర్ట్ లు ...వాటి మీద రెడ్ కలర్ స్కెచ్ తో అడ్డంగా ఇంటూ మార్క్ పెట్టింది.క్ రెడిట్ కార్డ్స్...డబ్బు...డాలర్స్....అన్నీ వెదికాడు...దుస్తుల అడుగున ఓ మెడికల్ రిపోర్ట్...
వణుకుతోన్న చేతులతో ఆ రిపోర్ట్ చదివాడు.
కార్తికేయ మొహం కళ తప్పింది. ఒక కన్నీటి చుక్క అతని కనుకొలకుల నుంచి ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడింది. మోకాళ్ళ మీద కూచున్నాడు. మోహన కు క్యా...న్స...ర్...
అదీ చివరి క్షణాల్లో...
అప్పుడు వినిపించిందో గొంతు..
"ఎక్స్క్యూజ్ మీ"
అందరు తల తిప్పి చూసారు...ఆజానుభావుడు....కళ్ళలో తేజస్సు..చూడగానే నమస్కరించాలని అనిపించే రూపం...కార్తికేయ వైపు వచ్చి చేయి చాపి..."నా పేరు జగన్నాథ్.." అన్నాడు.
"మీరు...?
"డాక్టర్ సాకేత్, నా కొడుకు హి ఇస్ ... s /o జగన్నాథ్ ..మోహనకు సర్జరీ చేస్తోన్న చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ సాకేత్ మా అబ్బాయే..." కాసింత గర్వంగా చెప్పాడు.
"ఓహ్..గ్రేట్ సర్...మీ రాక మాకు ఆనందంగా వుంది...మీరు..."
"మీ లాంటి దేశ భక్తుడిని స్వయంగా అభినందించి పోదామని వచ్చాను "
"మీకు మీకెలా తెలుసు? కార్తికేయ ఆశ్చర్యపోతూ అడిగాడు .
"ఒకప్పుడు RAW ఆఫీసర్ ని..."
కార్తికేయ విస్మయానందంతో చూసాడు".రిసెర్చ్ & ఎనాలిసిస్ వింగ్ ..." జగన్నాథ్...ఈ పేరు ఎక్కడో విన్న గుర్తు....యస్...సమర్థుడైన......... రా....ఆఫీసర్...రాజకీయ పరమైన కారణాలతో...ప్రభుత్వంతో విభేదించి బయటకు వచ్చిన ఆఫీసర్...పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఒంటి చేత్తో ముగ్గిరిని హతం చేసాడు .ఉగ్రవాదులును మట్టి కరిపించాడు. అలాంటి గొప్ప వ్యక్తీ తనను వెతుక్కుంటూ...
రెండు చేతులు జోడించాడు కార్తికేయ...
జగన్నాథ్ కార్తికేయను దగ్గరికి తీసుకున్నాడు."నేను మరో పని మీద కూడా వచ్చాను...మోహన గురించి"
"మోహనకు ఎలా వుంది సర్" కార్తికేయ ఆందోళనగా అడిగాడు.
"సర్జరీ జరుగుతుంది. ఆపరేషన్ కు ముందు "ఆమె తరపున సంతకం ఎవరైనా చేస్తారా? అని అడిగితె "తనకు వున్నా ఒకే ఒక ఆత్మీయులు మీరే" అని చెప్పింది...మీరు అందుబాటులో లేరనీ చెప్పింది. అప్పుడే మీ గురించి, మోహన గురించి ఎంక్వయిరీ చేసాను.. రిలేషన్ అనే చోట...మీ గురించి దేవుడు...అని రాసింది. నా మనసు చెమర్చింది. తన గురించి చెప్పవద్దని అంది. అయినా మనసాగక వచ్చాను." చెప్పాడు జగన్నాథ్.
"ప్లీజ్ సర్ నేను మోహనను వెంటనే కలవాలి" అన్నాడు కార్తికేయ.
అంతా వియస్సార్ హాస్పిటల్స్ కు బయల్దేరారు.
***************************
***************************
హాస్పిటల్ కు బయల్దేరుతుండగా డాక్టర్ రాధారాణి నుంచి ఫోన్..ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని రాధారాణి చెబుతున్నది విని ఆశ్చర్యపోయాడు. మోహన స్వయంగా వాళ్ళను విడిపించడం, ఉగ్రవాదులను ఏరిపారేయడం...ఒంటరిగా అడవిలోకి వెళ్ళడం...అదీ మృత్యువు సరిహద్దుల్లో ఉండి...ముగ్ధకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. మోహనే స్వయంగా ఓ కార్పోరేట్ హాస్పిటల్ తో మాట్లాడి వాళ్లకు పెద్ద మొత్తం ఆఫర్ చేసింది ఆపరేషన్ థియేటర్ కోసం...
అంతా వియస్సార్ హాస్పిటల్ కు బయల్దేరారు.
*******************

హాస్పిటల్ కు వెళ్లేసరికి ముగ్ధ ఎదురువచ్చింది...కొద్ది క్షణాల మౌనం...ఒక ఆత్మీయ ఆలింగాన స్పర్శ వాళ్ళ ఎడబాటును కాంపెన్సేట్ చేసింది. విద్యారణ్య స్నేహపూర్వకంగా చేయిచాచాడు. డాక్టర్ రాధారాణి కార్తికేయ వైపే చూస్తోండిపోయింది. ఈ మహా కలయికకు సూత్రధారి, దుష్టశిక్షణకు అవతరించిన వ్యక్తి...చెక్కుచెదరని కార్తికేయ నిబ్బరానికి మనసులోనే అభినందనలు తెలిపింది.
అంతా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చారు.
బయట గ్రీన్ లైట్ వెలుగుతూ వుంది.
డాక్టర్ సాకేత్ వీళ్ళకు ఎదురు వచ్చాడు...వస్తూనే ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు.
"ఆపరేషన్ సక్సెస్ అయింది...కానీ మోహన కనిపించడం లేదు..."
విషాదపు మేఘాలు కమ్ముకున్నాయి...
****************************

No comments: