ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 18 December 2014

1) చేసిన పని పదిమందికి నచ్చిందా లేదా అందరు మెచ్చారా అని వ్యాకులపడే కంటే మనస్సాక్షి ఆ పనిని/చేష్టని/క్రియని చేయు ఒప్పిందా, నప్పిందా అని యోచిస్తే మనం మానిసికంగా క్రుంగము
2) ఆందోళనతోను, ఉద్రేకంలోను, అశాంతతతోను లేక విపరీతమైన మొహంతోను తీసుకునే కీలక నిర్ణయాలతో బోర్ల పడే ఛాన్సులే ఎక్కువ..
3) ఎదురయ్యే సమస్యల నివారణలో సాధ్యమైతే ఏదైనా సాయం చేసి వాటిపై గెలుపుకు దోహద పడు కానీ వాటిని మరింత జటిలం చేసేలా మటుకు వ్యవహరించకు... 

No comments: