ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

" ముగ్ధమోహనం " (26thchapter )
(20-02-2013)
సిక్వీ మరణం కార్తికేయను కదిలించింది.అతను ప్రాణభయంతో మాత్రమే ఆత్మహత్య చేసుకోలేదు.
పశ్చాత్తాపం అతడి ప్రాణాలను పరిహారంగా అడిగింది.
మీడియా కు పరిస్థితి వివరించాడు.రేటింగులు..పోటీ అనేవి వదిలేసి సిక్వీ వార్తను ప్రముఖవార్తగా గుర్తించాయి.
తీవ్రవాదులకు కు పునరావాసం కలిగించి ,కేసులను సైతం ఎత్తివేసిన సందర్భాలు వున్నాయి.
బందిపోట్లకు క్షమాభిక్షలు వున్నాయి.పశ్చాత్తాపానికి గుర్తింపు వుండాలి.
సిక్వీ కుటుంబానికి దైర్యాన్ని ఇవ్వాలి.
తన మనసులోని మాటను మెయిల్ రూపంలో పెట్టాడు.అది రాష్ట్రపతి కి వెళ్ళిన మెయిల్.
నలభై ఎనిమిది గంటల తర్వాత సిక్వీ బార్యకు పోలీసు శాఖలో వుద్యోగం వచ్చింది.
అల్లా వున్నాడు...సిక్వీ పశ్చాత్తాపం మొర విన్నాడు....కార్తికేయ వున్నాడు.
***************************************************************************************
న్యూ ఎక్స్ ప్రెస్ కొరియర్ సర్వీస్ ...
ఆ కొరియర్ బాయ్ కి ఓ చెడ్డ అలవాటు వుంది. తను డెలివరి చేయాల్సిన కవర్ లు ఓపెన్ చేయడం.కవర్ లో కానీ ,గిఫ్ట్ బాక్స్ లో కానీ ఏమైనా విలువైనవి వుంటే తస్కరిస్తాడు..
ఈ కారణంగా అతడ్ని చాల చోట్ల పనిలో నుంచి తొలిగించారు.
ముగ్ధ ప్యాక్ చేసిన బాక్స్ అందంగా వుంది.అందులో విలువైనది ఏదో ఉంటుందన్న నమ్మకం. డెలివరి చేసే టైం లో ఆ బాక్స్ ఓపెన్ చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఆ బాక్స్ ని భద్రంగా ఓ పక్కన పెట్టాడు.అతని ఢిల్లీ లో సందులన్నీ కొట్టిన పిండే.
మూన్ కేఫ్ దాటితే మూడవ సందులో ,ఎంట్రీ గేటు నంబర్ ఫైవ్ కార్తికేయ ఇల్లు.
తను మూన్ హోటల్ లో కూచోని బాక్స్ సెట్ చేయాలి అనుకున్నాడు.
అతని బైక్ మూన్ హోటల్ వైపు వెళ్తోంది.
*******************************************************************************************
మోహన ఇరవై మూడేళ్ళ యువకుడి గెటప్ లో వుంది.చాలా రఫ్ గా కనిపిస్తోంది.ఢిల్లీ లో తన గురించి వేట మొదలైందని అర్ధమైంది.
రాబర్ట్ ఇండియాలోకి అడుగుపెట్టాడు.ఈ పరిస్తితుల్లో తను ఢిల్లీ లో వుండడం క్షేమం కాదు.ఎక్కడికి వెళ్ళాలి?మొదటి ప్రశ్న .
ఆ ప్రశ్నలో ఎన్నో సమాధానాలు వున్నాయి.
హోటల్ మూన్ దగ్గరికి వచ్చింది.ఆకలిగా అనిపించింది.సమోసా తిని టీ తాగితే?
మోహన కు అన్ని దేశాల ఆహారపు అలవాట్లు తెలుసు.ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలదు
మూన్ హోటల్ లోకి అడుగు పెట్టి .ఓ సారి చుట్టూ చూసింది.ఆమె డేగ కళ్ళు పరిసర ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
కార్నర్ టేబుల్ దగ్గర కూచుంది.అక్కడ ఓ కొరియర్ కుర్రాడు వున్నాడు.అటు ఇటు బిత్తర చూపులు చూస్తున్నాడు.వెళ్లి అతని ఎదురుగా కూచింది.
ఓ సారి అబ్బాయి గెటప్ లో వున్న మోహన వైపు చూసి అతని (మోహన )వల్ల తనకేమీ ప్రమాదం లేదని నిర్ధారించుకుని బాక్స్ ఓపెన్ చేయడానికి కుస్తీ పడుతున్నాడు.
మోహన ఓ కంట అతడ్ని కనిపెడుతూనే వుంది.క్షణాల్లో అక్కడి సీన్ అర్ధమైంది.
"బాక్స్ అలా ఓపెన్ అవ్వదు "మోహన చెప్పింది.
కొరియర్ కుర్రాడు భయంగా చూసాడు...తత్తర పడ్డాడు.
"భయపడకు....అదెలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తాను "అంటూ బాక్స్ ఓపెన్ చేసి చూపించింది.
ఆ కుర్రాడు షాకయ్యాడు.ఎంత ఈజీగా ఓపెన్ చేసింది.అంత కన్నా షాకైంది మోహన.
లోపల జామకాయ ..అది కాదు ఆమెను షాక్ కు గురి చేసింది.
ఆ జామకాయ మీద గోటితో అందంగా చెక్కిన అక్షరాలూ.
కా...ర్తి...కే...య..
బాక్స్ మీద అడ్రెస్ చూసింది.అది కార్తికేయ అడ్రెస్ .
మోహన మొహం లో మారుతోన్న రంగులు కొరియర్ కుర్రాడు చూసి వెంటే భయం తో చచ్చేవాడు.
అతని మొహం లో నిరాశ.
మోహన కుర్రాడి వంక చూసింది. పోనీలే...ఇంకో బాక్స్ ఓపెన్ చెయ్...అంది.
"ఇదే లాస్ట్ "అన్నాడా కుర్రాడు.
"పోనీలే ...నాకో పని చేసి పెడతావా?అంటూ జేబులో నుంచి అయిదు వందల నోట్ల కట్ట తీసి అందులో నుంచి ఓ అయిదు వందల నోటు ఇచ్చి
"ఓ మినరల్ వాటర్ బాటిల్ "తీసుకురా చిల్లర నువ్వే ఉంచుకో అంది.
ఆ కుర్రాడు ఆశ్చర్యం గా చూసాడు.మోహన నిజంగానే అన్నట్టు చూసింది.
"ఒక్కక్షణం లో వస్తాను "అంటూ బయటకు పరుగెత్తాడు.ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.ప్యాంట్ లో వున్న పాయిజన్ బాటిల్ తీసింది.
బ్యాక్ ప్యాకెట్ లో వున్న చిన్న సిరంజి తీసి పాయిజన్ బాటిల్ లోని విషాన్ని జామకాయలోకి ఇంజక్ట్ చేసింది.
ఇదంతా క్షణాల్లో జరిగింది.
ఆ కుర్రాడు వగరుస్తూ వాటర్ బాటిల్ తెచ్చి మిగిలిన డబ్బు ఇవ్వాలా?వద్దా? అని ఆలోచిస్తున్నాడు.
మోహన కామ్ గా బయటకు నడిచింది.కొరియర్ కుర్రాడు జామకాయను ఎప్పటిలా ప్యాక్ చేసి కార్తిలేయ ఇంటి వైపు బయల్దేరాడు.
"మై డియర్ ఎనిమీ ....కార్తికేయా నీ ప్రాణం విలువ కేవలం అయిదు వందలు "అనుకుంది.
ప్రియురాలు ప్రేమగా పంపించిన ఫలం తింటాడు.ఫలితం అనుభవిస్తాడు....మరణిస్తాడు.
హుషారుగా ఈల వేసింది మోహన.
****************************************************************************************
ఒక్క క్షణం ఆందోళనకు గురయ్యాడు కార్తికేయ.అతనికి వచ్చిన సమాచారం ప్రకారం మోహన హైదరాబాద్ వెళ్తుంది.అక్కడ ఏం చేయబోతుంది ?
అక్కడ మోహన కదలికలు కనిపెట్టాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి.
ఎవరతను...చిరుత వేగం...ప్రామాదానికి ఎదురు వెళ్ళే దైర్యం..మృత్యువును చూసి డోంట్ కేర్ అనే నిర్లక్ష్యం...అలాంటి ఆఫీసర్ ఎవరున్నారు?
అప్పుడు గురోచ్చిన పేరు
శ్రీనివాస్...శ్రీనివాస్ ఈడూరి
ఒకప్పుడు సిట్ ఆఫీసర్ .ఇప్పుడు ?
(ఎవరా శ్రీనివాస్ ? ఇప్పుడేం చేస్తున్నాడు ?రేపటి సంచికలో )

No comments: