ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

" ముగ్ధమోహనం " (29thchapter )
(23-02-2013)
హైదరాబాద్...
ఎందరో పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చి బ్రతుకు పోరాటం చేసే నిరుద్యోగులు ,నిరక్షరాస్యులు .నిరుపేదలు....
అందరికీ నీడనిచ్చే భాగ్యనగరం.విభిన్న సంస్కృతులను తనలో కలుపుకున్న హృదయ వైశాల్యం వున్నా చార్ సౌ కా హమారా షహర్...
గోల్కొండ కోట,నవాబుల అలనాటి దర్జా,ట్యాంక్ బండ్ అందాలు,ఒకప్పటి టాంగాలు మట్టి రోడ్లు...
అలనాటి వైభవాల ఆనవాళ్ళు....
క్రమక్రమం గా కనుమరుగవుతూ,కాంక్రీట్ మయమయ్యే రహదారులే కాదు మానవ సంబంధాలు వ్యక్తిత్వపు ఉనికిని కోల్పోతున్న వేళ..,
మనుష్యులకు పట్టని మతం,మతోన్మాదులకు ఆయుధమైంది. ఉగ్రవాదం ఉన్మాదం అయింది.
ప్రతీకారేచ్ఛ పైశాచికత్వమైంది.నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది.దిల్ సుఖ్ నగర్ రక్తసిక్తమైంది.
ప్రభుత్వ స్పందన,రాజకీయ నాయకుల పరామర్శలు.మీడియా హడావుడి,షరా మామూలే.
కొద్ది క్షణాల క్రితం చనిపోతామన్న వూహ కూడా వచ్చి వుండదు..
ఈ నరమేధం వెనుక వున్నవాళ్ళు దొరికేదేప్పుడు?పోలీసులే వెతకాలా?ప్రజలూ సైనికులై కదలాలి.ఉగ్రవాద జాడ కనిపిస్తే సమూలం గా పెకిలించివేయాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగింది మోహన.ఆమె దిగిన పది నిమిషాల తర్వాత హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
********************************************************************************************************
రజ్వీ ..ఉగ్రవాద సంస్థలకు సుపరిచితమైన పేరు.ప్రపంచం లోడబ్బు తప్ప మరేదీ ఉపయోగపడదు..అని నమ్మే వ్యక్తి.
కేవలం కిరాయి డబ్బుల కోసమే ఉగ్రవాది అన్న ట్యాగ్ లైన్ ధరించాడు.
"సుపారీ" తీసుకుని హత్యలు చేసే మాఫియా కు,రజ్వీ కి పెద్ద తేడా లేదు.
ఆయుధాలు ఉపయోగించడం లో శిక్షణ ఇవ్వడం,ఆయుధాలు అక్రమ రవాణ చేయడం, అతని వృత్తి.
సిక్వీ ని కాపాడే పని మీద వచ్చి స్పెషల్ ఫోర్సు చేతిలో చిక్కాడు, రెండు రోజులు గా అతడిని ఎవరూ ఏమీ అడగడం లేదు.
అతనితో పాటు పట్టుబడిన వాళ్ళను ఏం చేసారో తెలియదు.పెద్ద గది.కూలర్ వుంది.టీవీ వుంది.
ఫ్రిజ్ వుంది.ఫ్రిజ్ లో తినడానికి పళ్ళు వున్నాయి.ల్యాండ్ ఫోన్ వుంది.
చాలా ఆశ్చర్యం గా వుంది రజ్వీకి...తను పట్టుకోగానే టార్చర్ చేస్తారని ఊహించాడు.
టార్చర్ ని తట్టుకునే శిక్షణ తీసుకున్నవాడు.తప్పనిసరి అయితే మేడలో వున్నా సూసైడ్ పిల్ మింగాలి...
అప్పుడు తడిమి చూసుకున్నాడు...సూసైడ్ పిల్ లేదు.
అసలు తనని ఏం చేస్తారు? రెండు రోజులుగా అతడ్ని కుదురుగా ఉండనివ్వడం లేదు ఈ ఆలోచన.
తన సెల్ ఫోన్ లేదు...జేబులో వున్న పర్స్ భద్రం గా వుంది.
************************************************************************************************************************************************************************************************
ఇప్పుడు తననేం చేస్తారు? తనను విడిపించడానికి ఎవరొస్తారు? మిగితా వాళ్ళంతా ఏమైనట్టు?
తనను రక్షించమని ఫోన్ చేయాలి.ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ తీసి నంబర్ డయల్ చేయబోయి ఆగిపోయాడు.
ఈ పోలీసులను నమ్మడానికి వీల్లేదు.తను ఏ నంబర్ కి ఫోన్ చేస్తున్నాడో తెలుసుకోవడం కష్టం కాదు.
రెండు నిమిషాల తర్వాత మెల్లిగా తలుపు తెరచుకున్న శబ్దం ...
ఓ మూలాన వున్న ప్లోవేర్ వాజ్ చేతిలోకి తీసుకున్నాడు..కుడి చేత్తో పట్టుకున్నాడు.
ఎవడొచ్చినా వాడి తల బద్దలు కొట్టాలి...అని మైండ్ లో ఫిక్స్ అయ్యాడు.
తలుపు తెరచుకుంది.రెండు తలుపులు తెరచుకున్నాయి.కానీ ఎవరూ రాలేదు.ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు.
ఒకటి...రెండు..మూడు నిమిషాలు గడిచాయి...ఎవరూ రావడం లేదు.అదేమిటి?
వాజ్ ని అలాగే పట్టుకుని బయటకు నడిచి షాక్ అయ్యాడు.తలుపుల బయట చుట్టూ గోడ....బయటకు వెళ్ళడానికి లేదు.
మరి తలుపులు ఎవరు...ఎలా తెరిచినట్టు? లోపలి వచ్చి మరోసారి షాక్ తిన్నాడు.టేబుల్ మీద బిర్యాని ప్లేట్...పొగలు కక్కుతోంది.
"త్వరగా చల్లారక ముందే తినేసేయ్...."వెనుక నుంచి మాటలు వినిపించాయి.వెనక్కి తిరిగి చూస్తే ఆరడుగుల మనిషి.దృడం గా వున్నాడు .
"ఎలా వచ్చాడు? తనలో తనే గొణుక్కున్నాడు. ఆరడుగుల మనిషి ముందుకు నడిచి వార్డ్ రోబ్ తెరిచి లోపలి వెళ్ళాడు.
వార్డ్ రోబ్ డోర్ మూసుకుంది.అందులోనుంచి అతను తిరిగి బయటకు రాలేదు.చుట్టూ నాలుగు వైపులా నాలుగు వార్డ్ రోబ్స్...అంటే ?
రజ్వీ తల తిరిగి పోయింది. ఎదురుగా గోడ మీద ప్లాస్మా టీవీ లాంటి స్క్రీన్లో ఓ దృశ్యం.
"ఇందాక తను ప్లవర్ వాజ్ తీయడం.చేత్తో పట్టుకోవడం...దగ్గరి నుంచి బిర్యాని తింటున్నసన్నివేశం వరకు .లైవ్ లో వస్తున్నట్టు వస్తుంది."
బుర్ర తిరిగి పోయింది.
అంత కన్నా బుర్ర తిరిగి పోయే వార్త ...
బోర్ గా అనిపించి రిమోట్ తో టీవీ ఆన్ చేసాడు.
(టీవీ లో వచ్చిన ఆ వార్త ఏమిటి ?రేపటి సంచికలో )
www.manrobo.net

No comments: