ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

" ముగ్ధమోహనం " (30thchapter )
(24-02-2013)
హైదరాబాద్...
బంజారాహిల్స్ రోడ్ నంబర్ పన్నెండు ...
అర్ధరాత్రి రెండు దాటింది. అక్కడ వున ఓ భవంతి లో లైట్లు వెలుగుతూనే వున్నాయి. నలభై ఏళ్ళు దాటిన ఒకావిడ కంప్యూటర్ ముందు కూచోని వుంది.ఆమె పొడవాటి చేతి వ్రేళ్ళు కీ బోర్డు మెడ చక చక కదులుతున్నాయి.దాదాపు మూడు గంటలుగా ఆమె అవిశ్రాంతం గా పని చేస్తూనే వున్నా ఆమె మొహం లో అలసట కనిపించటం లేదు.
ఆమె కళ్ళ ముందు దిల్ సుఖ్ నగర్ బాంబ్ దుర్ఘటన వెన్నాడుతుంది.బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి..వారిలో కొందరికి రక్తం అత్యవసరం.వెంటనే రంగం లోకి దిగింది.ముందుగా తన రక్తం ఇచ్చింది.ఆమెను వెన్నంటి వున్న సేన రామదండులా కదిలింది.దిల్ సుఖ్ నగర్ చేరింది.అర్ధరాత్రి దాటినా ఒంటరిగా బయల్దేరింది.
"అత్తయ్యా నన్ను రమ్మంటారా?"కోడలు అడిగింది.
"వద్దు తల్లీ ఉదయం నుంచి పని చేస్తూనే వున్నావ్...వెళ్లి పడుకో " ప్రేమగా చెపింది

కష్టాల్లో వున్న వారికి విజిటింగ్ అవర్స్ వుండవన్నది ఆమె నమ్మకం.యు ఎస్ ఎ లో వున్న హైదరాబాద్ లో వున్నా తన మూలాలు మరచిపోని వ్యక్తి.
రెండు గంటల క్రితమే కార్తికేయ నుంచి ఫోన్.హైదరాబాద్ లో వున్న బాంబ్ బాధితులను ఆదుకోమని...అపటికే ఆ పనిలోనే వుంది ఆవిడ.
ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే ఆకర్లేదని నమ్మిన మనిషి.తండ్రి నుంచి రాజనీతి శాస్త్రాన్నినేర్చుకుంది.
రాజకీయ విలువలకు పట్టం కట్టిన కోన ప్రభాకర రావ్ తనయ గా గర్వపడుతూనే ఆ తండ్రి ఆశయాలు కొనసాగుస్తున్న ఆవిడ...
మాలతి దేచిరాజు
కొన్నాళ్ళ క్రితం ఏర్పడ్డ ఓ చిన్న సంస్థ ఆసరా..శ్వాసించడమే కష్టమై పోతోన్న మానవత్వానికి ఆసరా ఇవ్వాలని...
విలువల వలువలు కోల్పోయే వ్యవస్థకు ఆసరా గా నిలబడాలని చేసినా ఉడతా ప్రయత్నం ఇప్పుడు వారథి గా మారింది.వ్యక్తి కి బహువచనం శక్తిగా అవతరించింది.
ఆమె డ్రైవ్ చేస్తోండగానే ఫోన్...కార్తికేయ నుంచి."మాలతి గారు నేను ఓ ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వస్తున్నాను."అన్న సందేశం.
కార్తికేయ రాక ఈ కథను మరో మలుపు తిరుగుతుందని ఆ క్షణం తెలియదు మాలతికి.
ఆమెకు తెలిసింది సమస్యలను దైర్యం గా ఎదుర్కోవడమే.
మాలతి కారు హాస్పిటల్ లోకి ప్రవేశించింది.అప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది మోహన.
ఈ సంఘటన జరగడానికి గంట ముందు...
*****************************************************************************************************
రజ్వీ టీవీ లో కనిపించిన దృశ్యం చూస్తూ అలాగే వుంది పోయాడు.తను చూస్తున్నది నిజమేనా?
టీవీ చానెల్ లో వార్తలు.
సిక్వీ మరణం తర్వాత ,స్పెషల్ ఫోర్సు కు దొరికిన కొందరు ఉగ్రవాదులు గంట క్రితం పారిపోయే ప్రయత్నం చేయడంతో స్పెషల్ ఫోర్సు వారిని ఎన్కౌంటర్ చేసింది.
స్క్రీన్ మీద మృతదేహాలు...కుప్పగా పోసినట్టు...
వారు వేసుకున్న దుస్తులు రక్తసిక్తం అయ్యాయి.గుర్తు పట్టడానికి వీలులేని విధం గా వున్నాయి.
రజ్వీ గుండె వేగం గా కొట్టుకుంటుంది. నిజంగా పారిపోయారా?పారిపోయేలా చేసి చంపేసారా?
ఇప్పుడు తన పరిస్థితి...?బలి ఇవడానికి ముందు మేకను మేపినట్టు ...తనని...అందుకే ఇంత ఫ్రీగా వదిలిపెట్టారా?
తన వెనుక వార్డ్ రోబ్ తెరుచుకున్న చప్పుడు....టీవీ రిమోట్ తో టీవీ కట్టేశాడు.ఏమీ తెలియనట్టు వున్నాడు.
కార్తికేయ అతనితో పాటు మరో ఇదరు ఆఫీసర్లు వచ్చారు.కార్తికేయ రజ్వీ ఎదురుగా వున్న కుర్చీలో కూచున్నాడు.ఇద్దరు ఆఫీసర్ల వైపు చూసాడు.
"సర్ ...మనం తెలుగులో మాట్లాడుకుందాం.వీడికి తెలుగు రాదు."ఒక ఆఫీసర్ చెప్పాడు.
"ఓకే ...వీడిని కూడా పారిపోయేలా చేసి ఎన్కౌంటర్ చేసేద్దాం.కోర్ట్ కు ప్రొడ్యూస్ చేయడం...సాక్ష్యాలు...ఎవిడెన్స్ ...అపీల్ ,క్షమాబిక్ష ఇవన్నీ అవసరమా ".? కార్తికేయ అన్నాడు.
"మీ ఇష్టం సర్ ..వీడికి కాపలా కాయలేక చచ్చిపోతున్నాం.అప్పటికీ మీరు చెప్పినట్టే రోజూ ఫుడ్డులో స్లో పాయిజన్ ఇస్తున్నాం ..మిగితా వాళ్ళు మన మాట వినక ఎన్కౌంటర్ అయ్యారు.వేదోక్కడే మిగిలాడు.వీడ్ని కూడా ఆ ఖాతాలో కలిపిస్తే లెక్క సరిపోతుంది."మరో ఆఫీసర్ చెప్పాడు.
"ఓకే వీడ్ని వదిలేస్తున్నామని చెప్పండి...వద్దొద్దు మనం వెళ్లి పోదాం...డోర్స్ ఓపెన్ చేయండి.పారిపోయే ముందు షూట్ చేయండి."అంటూ లేచాడు కార్తికేయ.
ఆ సంభాషణ అంతా వింటున్నాడు రజ్వీ .
అతను ఆంధ్ర ప్రదేశ్ లో రెండేళ్ళు వున్నాడు...తెలుగు నేర్చుకున్నాడు.వీళ్ళ మాటలు శ్రద్ధగా విన్నాడు.
"సర్ వీడి తల మీద పాతిక లక్షల రివార్డ్ వుంది.ఒక లక్ష వీడి పేరు మీద సమాధి కట్టడానికి ఖర్చు చేస్తే మిగితా ఇరవై నాలుగు లక్షలు పంచుకుంటే ఎనిమిది లక్షలు తల ఒక్కింటికి "ఓ ఆఫీసర్ చెప్పాడు.
"వీడ్ని ప్రాణాల తో అప్పగిస్తే మోహన కోటి రూపాయలు ఆఫర్ చేసింది.మోహన రహస్యాలు వీడి దగ్గర వున్నాయి.అపుడు మన అమౌంట్ షేర్ పెరుగుతుంది..కార్తికేయ తాపీగా చెప్పాడు "
రజ్వీ మెదడు పని చేయడం మానేసింది.తన వెనుక ఇంత కుట్ర ఉందా?రజ్వీ వెంటనే కార్తికేయ దగరికి వెళ్ళాడు.అతని రెండు చేతులు పట్టుకున్నాడు.
"సర్ నన్ను క్షమించండి.నాకు తెలుగు వస్తుంది "
"వాట్ ...అదిరి పడ్డారు...అలా నటించారు.
"అవును సాబ్...నేను డబ్బు కోసం ఏ పనైనా చేసే బేవార్స్ ని ,ఆ మోహన గురించి మొత్తం చెబుతాఆను.నన్ను వదిలేయండి.నన్ను పట్టుకుంటే మహా అయితే కోటి...అదే ఆ మోహన అయితే కోట్లు...కోట్లు వస్తే?కార్తికేయ కాళ్ళ మీద పడిపోయాడు.రజ్వీ.
రజ్వీ చెప్పడం మొదలుపెట్టాడు.అందరి మొహాలకు చెమటలు పట్టాయి.
మహా విధ్వంస రచన...
లేచాడు కార్తికేయ....రివాల్వర్ రజ్వీకి గురి పెట్టాడు
"సాబ్ అంతా చెప్పాను...రజ్వీ భయం గా అన్నాడు.
"వందల మందిని చంపి,ఊచకోత కోసి ప్రాణభయం తో నిజం చెప్పిన నీలో పరివర్తన రాదు రజ్వీ...నిజం ఇప్పటికైనా చెప్పావు కాబట్టే చిత్రహింసలు లేని మరణాన్ని ప్రసాదిస్తున్నాను."సైలెన్సర్ అమర్చబడ్డ ఆ రివాల్వర్ నిశ్శబ్దం గా తన పని పూర్తీ చేసింది.మిగితా ఉగ్రవాదుల మృతదేహాలు ఇలానే పక్క గదిలో వున్నాయి.
జస్ట్ కార్తికేయ ఆడిన మైండ్ గేమ్.
*********************************************************************************************************
విశాలమైన ఆ గదిలో నిరుద్యోగ యువత మత్తులో వుంది. ఎదురుగా డయాస్ మీద మోహన.వాళ్ళంతా ట్రాన్స్ లో వున్నారు.
ఇప్పుడు వారిని ట్రాన్స్ లోకి పంపుతుంది మోహన ....
(ఆ తర్వాత జరుగ బోయే తీవ్ర పరిణామం ఏమిటి?రేపటి సంచికలో )

No comments: