ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label ఏక్ తార. Show all posts
Showing posts with label ఏక్ తార. Show all posts

Monday, 19 January 2015

పిల్లా నీ మెరుపు ముందు దిగదుడుపే ...........కోటి కాంతులైనా వెన్నెల వన్నెలైనా
పంచదార ఏపాటి..... పంచిన మనసు అందించే తీపి ముందు
భ్రాంతి కూడా విభ్రాంతయ్యే.......కష్టేఫలితో ఊహే వాస్తవమై ఎదుటే నిలుస్తే
ఏడడుగుల మాటేమిటో తేల్చవు ....అనుభందాలు అనుభూతులను కోరడం తప్ప
సంతోషాల సంరంభమే ఎదలో...కాంతులీనుతూ కోమలి వర్చస్సే వర్ధిల్లా..
నుదిటిన ఉదయ సింధూరమే.....ఆలింగన సంస్కారాల్లో మోమంటిన కుంకుమ
తెలీనివన్నీతెలిపేదే ప్రేమంటే......అంకితాలు అర్పణాలు త్యాగాల పాఠ్యంశాలతో
మరులపాన్పు పరచడమే తరువాయి,,,,,,,వన్నెచిన్నెల నవవసంతం వధువైతే...
నీకై వేచి బాధల్ని సైచి వలపు పవర్ తెల్సా 
నన్నోడి తన్ని గెల్చి నిన్ను కల్సి నన్ను తెల్సా
పండుగ పేరంటం పిలుపులకొచ్చే...మూడ్రోజుల ముచ్చట్లు చూడరమ్మని
నోట్లకట్టల బరువుతో డాబు బాబు దర్పం పెరిగే...స్వేధపు పేదల కష్టాల్లా
కధల రేవునే ఎంచుకున్నా..డస్సిన మనసునావ తీరపు ఎంపికలో...
ఓర్నాయనో ఎందుకమ్మా అన్నీ వగలు...నగలతో నవలావణ్యాలు రూపుకొచ్చేనా
అమిత ప్రేమ నింగిమేఘానికి నేలంటే... చినుకుముత్యమై ముద్దాడి తరించే.
పరిమళించే సోకు పల్లకీలో ఊరేగు....సిగ్గుచీర కడితే సౌందర్యం
పల్లకీ మోసే సౌందర్యమే వినమ్రతతో...అందమే లలనై పల్లకీనెక్క.

.అనుభూతలందించే వేళ...మరులసిరులు వలపుగిరులు సమవుజ్జీలే
గతమే జీవనగీతాల ఆలాపనై వినవస్తే 
బ్రతుకే తడిమేస్వరాల రవళిగా తెలిసే .
గతాన్ని నిత్యం అవగతమంత్రం చేసుకున్నా 
రేపుని దిద్దుకుని స్వాగతించే క్రమంలో ......
ప్రేమ క్షాత్ర పరీక్షల్లో నెగ్గేస్తా....నవ్వుతూ నువ్వే ఎదురొస్తే...