ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label ఫ్యామిలి. Show all posts
Showing posts with label ఫ్యామిలి. Show all posts

Monday, 17 November 2014

శ్రీమతే రామానుజాయ నమః
మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు .. నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను...అన్నట్టుగా
ప్రతీసారి నా శ్రీమతి శరన్నవరాత్రులలో ఒకరోజు ఇంట్లో పూజ పెట్టుకోవడం..ఒక 25 మంది బలగాన్ని (ఆడవారు..ఆడించేవారు) పిలవడం పరిపాటే.. వీరందరూ కలిసి లలితావిష్ణు
సహస్ర నామ పారాయణ ఆపై భోజన చందన తాంబూలాది సేవలు వెళుతూ వెళుతూ వారిచ్చే దీవెనలు ఫ్రీ సలహాలు..చీరల, నగా నట్రా డిస్ప్లే లు అవీ కూడా షరా మామూలే..
ఆ రోజు ఉదయాన్నే మనం ఇంట్లోంచి గెటౌట్ అన్నమాట..పూజ ముగిసి వచ్చిన వారు, తిని, త్రాగి, త్రేన్చి వెళ్ళేదాకా తిరిగి ఇంట్లో ప్రవేశం వుండదు...అధమ పక్షాన ఇంట్లో ఉండవలసి వస్తే.. గదిలోంచి బయటకు రానేకూడదు ..ఇది ప్రతి మగవారికి వారి ఇంట్లో అందు సన్మానమే..షరా మామూలే..
మరి ఈ కధ ఏమిటా అంటారా ..ఈ రోజు రెండవ రోజు..బాలాత్రిపుర సుందరి అమ్మవారి అలంకారంలో దుర్గమ్మ కనిపిస్తుందని మా ఇంట్లో నా ధర్మపత్ని పెట్టుకుంది ఆ పూజ..వారి రాకముందే బయటపడదాము అనుకుంటే..శ్రీమతి ఒక ఆర్డర్ వేసే..ఏమి లేదు మరేమిటో అనేసేసుకున్నారు..చామంతుల కాడలను వలచి పెట్టమని..పూజా సామాగ్రిని సర్దిపెట్టమని..
స్నానం చేసేసి తయారై బయటకు వెళ్ళాల్సి వున్నా..స్వీయ శ్రేయస్సు, భోజన సౌలభ్యములు ఇత్యాదివి దృష్టిలో పెట్టుకుని బుద్దిగా కూర్చుని సదరు కుసుమాల కాడలను కసితీరా విరిచి 
పూలసజ్జను ఏర్పరచి శ్రీమతికి అంకితమిచ్చి బయటపడ్డా..వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమలో తేలిందేమిటంటే..పరవాన్నం, కట్టే పొంగలి, పులిహోరా, బజ్జీలు, వడలు, ఇవిగాక మిగతావి అన్నం, కూర, పప్పు, సాంబారు, పచ్చడి (కొబ్బిరి) ఇవన్నీ ఉండనే వున్నాయి..మొన్ననే మా పిన్నిగారబ్బాయి ఆత్రేయపురం నుండి తెచ్చిచ్చిన 
పంచదార పూతరేకులు కూడా నేటి అమ్మలక్కల విందుకు తయారుగా వున్నాయి.
చివరగా మరోటి తేలిందేమిటంటే.. వచ్చిన వాళ్ళల్లో ముందుగా వచ్చే పెద్దముత్తయిదువకు చీరా జాకెట్, మిగిలిన వాళ్ళందరికీ ఉచిత గిఫ్ట్ + బ్లౌస్ పీసు టోకుగా ఇవ్వాల్సి ఉంటుందని.. అలాగే మనమిచ్చేది మరొకరి కన్నా కాస్త డిఫరెంట్ గా ఉండాలన్న తపన గమనిస్తే
ఈ పూజ ద్వారా పుణ్యం పురుషార్ధం మాటెలా వున్నా ఈ బక్కోడి (సైజు కాదు) జేబు ఖాళీ అవ్వేనని ఇందుమూలముగా సవినయముగా మిగిలిన మగ మిత్రులందరికీ సానుభూతి కొరకై తెలియచేసుకుంటున్నా..
పొరపాటున కూడా నేనిలా అన్నానని/రాసానని మాయావిడకు చెప్పబాకండి..బతుకు బస్టాండ్ అయ్యిపోతుంది..
అందుకే సదా శ్రీమతే రామనుజాయ నమః అనుకుంటూ సాగిపోతుంటా..బక్కోడిగానే మిగులుతూ ఆనందంలో (ఉత్తినే) మునుగిపోతుంటా..ఈ భజనలో రక్తి భక్తి రెండూ వున్నాయిగా 

Friday, 31 October 2014

కవిత:మనసు రోదన

నాలో ఆలోచనల నిర్వేదమే 
నన్ను అలింగనం చేసుకున్నవేళ
నాన్నా నీ అనుభవాల సారధ్యమే
నా అలోచనారాహిత్యాన్ని ఆదుకునేగా
పుట్టిన కాలమానస్థితిగతులలో పెరిగిన వాతావరణంలో
జనకుడిమాటే జానకీరాముడి మాటై వెలుగొందినవేళ
ఇష్టమైన చదువేమిటో చదువు కష్టమేమిటో
ఎదమాట ఎదుటపడి చెప్పడమే గగనమైనవేళ
తండ్రిలా కాక స్నేహితుడిలా ఆదరించేవు
పసిమనసిష్టాలను పెరిగేవయసు కష్టాలను తెలుసుకున్నవు
తెలియని విషయాలేన్నొ విశేషముగా బోధించేవు
అన్నీనేర్పి ఎదిగినవేళా నీకు వూతమవ్వేవేళ
సెలవీయకనే మాకందరాని లోకాలకు వెళ్ళిపొయ్యేవు
నాన్నా నీతో కటిఫ్ నీతో పచ్చి అందామన్నా నువ్వంటే పిచ్చే
నన్ను నాన్న కన్నా అంటూ దగ్గరకు తీసుకునేదెవరు
నాన్న నీకై నిత్య రోధించే అమ్మను ఊరడించేదెవరు
నీ తలంపులేక మదివీధిలో తెల్లవారదే
నీకై కన్నీరించక నీ లోటు తెలియక తెల్లవారదే
నీకిష్టమైన అరటిపండు చూసినా
నేతిబీరకాయతో నోరూరించే కూరచేసినా
నీతో సరదాగా చీట్లపేక అడ్డాట అడివోడిన
నాటి నీ విజయగర్వపు చిహ్నాలను తలచినా
కనుకొనలవెంట నీరాగదు మనములో నీ స్మరణాగదు
సెలవందకనే ఏ దేవతలను అలరింప ఏగితివయ్యా
ఇలలో నీ పదచిహ్నపుముద్రలనే నిత్యం పూజిస్తునామయ్యా
వీలైతే ఒక్కపరి వచ్చిపోవయ్యా మాకు కలలోనైనా
అట్టాయితే మాత్రుశ్రీని ఆ విషయంచెప్పి ఊరడించవచ్చేమోనయ్యా
ఏమైనా ఏడున్నా సదా నీ దీవెనలు మాకందించు
మనశ్శాంతి అందేలా రుజుమార్గంలో పయనించేల మాకు ధైర్యమందించు 

Friday, 27 September 2013

వెన్నలాంటి సుమనస్కుడు
వెన్నెల వెలుగులకు సరిజోడు
సుగ్న్యానమును పంచే ఉత్తముడు
అందర్ని రంజింపచేసే వినయశీలుడు
గర్వంగా చెప్పుకునే నా ప్రియ అనుజుడు..
మనసారా వెయ్యేళ్ళు సుఖాలతో వర్ధిల్లాలని దీవిస్తూ
వెంకట మధుకి నేటి పుట్టినరోజు సందర్భముగా
ఇవియే నా శుభాకాంక్షలు,
మీరందరు కూడా చెప్పగలరు
.............
విసురజ (17.09.2013)

Wednesday, 25 September 2013

Photo: కవిత: వీడ్కోలు 
..................
అమ్మకూతుర్ని ఆడకూతుర్ని నాన్న బంగారాన్ని
ఇంటి మహలక్ష్మిని పుట్టింటి పరువుని ప్రేమదీపాన్ని 

పెరిగి పెద్దైనాక చదువుసంధ్యలు అబ్బినాక
వంటికి సొబుగులు అద్దినాక సోకులు సిగ్గులైనాక

పరిణయానికి వేళయ్యిందని నచ్చినింటికి నడవమంటే 
కన్నవాళ్ళని వున్నవూరుని తోబుట్టువులందరిని వదిలేసి వెళ్ళాలంటే 

అమ్మా..మనసు రావట్లేదే కంట నీరు ఆగట్లేదే
నాన్నా...నీ సం రక్షణ చక్రం వీడి అత్తారింటికి వెడుతున్న 

చిన్ననాడు మారాం చేసి నీ మనసు కష్టపెట్టుంటే మన్నించమ్మ 
ఎదిగేటప్పుడు మాట వినకుండా అల్లరి చేసుంటే మన్నించు నాన్నా 

మరువను ఏనాడు మీరు చూపిన అనురాగ అభిమాన త్యాగాలను
విడవను ఏనాడు మీరు నేర్పిన విలువల నడతల నడవడికను 

వెళ్ళి మళ్ళి వస్తానమ్మ కన్నీరు తుడుచోకోమ్మ
చల్లగా అశీర్వదించమ్మ అమ్మనాన్నల పేర్లు నిలబెట్టమని 
........
విసురజ

కవిత: వీడ్కోలు
..................
అమ్మకూతుర్ని ఆడకూతుర్ని నాన్న బంగారాన్ని
ఇంటి మహలక్ష్మిని పుట్టింటి పరువుని ప్రేమదీపాన్ని

పెరిగి పెద్దైనాక చదువుసంధ్యలు అబ్బినాక
వంటికి సొబుగులు అద్దినాక సోకులు సిగ్గులైనాక

పరిణయానికి వేళయ్యిందని నచ్చినింటికి నడవమంటే
కన్నవాళ్ళని వున్నవూరుని తోబుట్టువులందరిని వదిలేసి వెళ్ళాలంటే

అమ్మా..మనసు రావట్లేదే కంట నీరు ఆగట్లేదే
నాన్నా...నీ సం రక్షణ చక్రం వీడి అత్తారింటికి వెడుతున్న

చిన్ననాడు మారాం చేసి నీ మనసు కష్టపెట్టుంటే మన్నించమ్మ
ఎదిగేటప్పుడు మాట వినకుండా అల్లరి చేసుంటే మన్నించు నాన్నా

మరువను ఏనాడు మీరు చూపిన అనురాగ అభిమాన త్యాగాలను
విడవను ఏనాడు మీరు నేర్పిన విలువల నడతల నడవడికను

వెళ్ళి మళ్ళి వస్తానమ్మ కన్నీరు తుడుచోకోమ్మ
చల్లగా అశీర్వదించమ్మ అమ్మనాన్నల పేర్లు నిలబెట్టమని
........
విసురజ

Tuesday, 10 September 2013

కృష్ణతరంగాల సారధి
సాద్గీ/నెమ్మదితో (అందరి) నా హృదిదోచే పార్ధసారధి

రాసే కవితలే తేనేలూరు
వాగ్దేవి వరపుత్రుండే మారాజు ఊటుకూరు

తెలుగు ముఖపుస్తకం వెలుగు
పదుగురి మంచికి పాటుపడే పిడుగు

మనసేమో పటికబెల్లం
సోదరుడు పార్ధసారధికి సర్వం జగన్నాధం
Photo: కళ్లుంటే చూడండి 
కుళ్ళకుండా వుండండి 

ఈ మేలిమి చిరునవ్వు
పూర్తిగా విచ్చిన సింధూరపువ్వు 

ఈ మధుర హాసం 
వనకోయిల కూసిన కాఫీ రాగం

ఈ మెరిసే వదనం  
నింగిలోని నెలజాబిలి చందం 

ఈ ఇంతి మానసం
కరుణారస పూరిత స్నేహచందనం 

చదివింది నచ్చితే మెచ్చండి 
చదవకున్నా అర్రే ఫోటోని చూసి లైకు కొట్టి ముందుకు వెళ్ళండి 
... 
విసురజ 
(Photo courtesy by Malathi Dechiraju/Malathi Sourabhaalu)

కళ్లుంటే చూడండి
కుళ్ళకుండా వుండండి

ఈ మేలిమి చిరునవ్వు
పూర్తిగా విచ్చిన సింధూరపువ్వు

ఈ మధుర హాసం
వనకోయిల కూసిన కాఫీ రాగం

ఈ మెరిసే వదనం
నింగిలోని నెలజాబిలి చందం

ఈ ఇంతి మానసం
కరుణారస పూరిత స్నేహచందనం

చదివింది నచ్చితే మెచ్చండి
చదవకున్నా అర్రే ఫోటోని చూసి లైకు కొట్టి ముందుకు వెళ్ళండి 

Tuesday, 18 September 2012

darpaNam

Tuesday, June 14, 2011 at 10:40pm ·

మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
నీవు నన్ను కడుపున దాల్చి పలు వెతలు కొర్చినావు
నా ఈ జీవన యాత్రకు సుమార్గము ఎర్పరచినావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
ఆలయాలలో భగవంతుడు ఉంటాడంటారు అది నిక్కమో కాదో నాకు తెలియదు కాని
నా హౄదయాలయములో మాత్రము నీవే నిండి వున్నావు నిండుగా వున్నావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
నేను బాగ చదవాలని నీవు మొక్కులు మొక్కినావు ఉపవాసాలు వుండినావు
నే జీవితములో ఎదగాలని నీవు మనసార కోరినావు మమతలు పంచినావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
చదువుకుని చదువుకొని నేను పెద్ద ఎత్తుకు ఎదిగితే ఎగిరితే అనందం చెందావు
ఉద్యోగపు ఆరళ్ళలో నే పడి నలిగితే నాకు ఆత్మస్థర్యన్నిచ్చావు నన్ను ముందుకు నడిపావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి యెవరమ్మ
నేను కొత్త కోడలుతొ ఇంటికి వచ్చినప్పుడు నన్ను పల్లెత్తు మాట అనలేదు
నీ కోడలి కోరికపై నిన్ను వోల్డేజ్ హోంలో జేర్పినపుడు కూడా
నువ్వు నన్ను ఏమి అనలేదు నన్ను కసురుకోలేదు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి యెవరమ్మ
కాని చివరాకరున నీవు చూసిన చూపుకి అర్దం భావం
ఇపుడు నన్ను వోల్డేజ్ హోంలో నీ మనవడు జేర్పినపుడు తెలిసింది
నా తప్పు తెలిసినాక నిన్ను క్షమాపణ అడగడనికి నీవు లేవు
నా తప్పుకు పరిహారం లేదు నా పాపమునకు నిష్క్రుతి లేదు
నేను నీ బాటలోనే నడుస్తున్నామ్మ నా కోడలిని నేను
నీలాగే ఎమన్లేదమ్మ అనడానికి ఎముందమ్మ
దేనికైన మన బంగారం మంచిదైతే కదమ్మ

విసురజ (వెళిదిమళ్ళ సుందర రంగ జగన్నధ్)

praardhana


 Wednesday, June 29, 2011 at 1:07am ·



కోవెలలో నెలకొన్న కోనేటిరాయుడు కరుణించడా యేమి
కొండల పైనే కూకున్న కమలనాభుదు దయజూపడా యేమి
లక్ష్మిపతికి నా మనుమున దాగివున్న తలంపు తెలియదా యేమి
సర్వగతునికి సర్వమునెరింగిన వేణుధరునుడికి విషయము పట్టదా యేమి
మూగబోయన మాట నా వుల్లమునందలి భావము
కన్నుల్లందు తారాడు నీటివిచికలు నా మదినందలి బాధ
తెలియని వారండ్లకు తెలియచెప్ప నా చేతనవును
అన్ని తెలిసిన రుక్మిణిమనోహరనుకు నేనేమి తెలుపగలనే
నా తండ్రి అరోగ్యహితము యెవరు చూసేను, ఆ దామోదరుడు చూచునా
నాకు దారి తెన్ను తెలియకున్నది మనసు బేంబేలు పడుచున్నది
ఇట్లున్న నాకు చిత్తశాంతి యాడ దొరికేను, ఆ రమావరుడు యిచ్చునా
పాండురంగడు యైననేమి శ్రీనివాసుడు యైతేనేమి అల్లహ్ ఈశూ నైతేనేమి
అందరిని నే దోసలి పట్టి వేడెద నా తండ్రి అరోగ్యహితము చేకూర్చమని
నా తండ్రి అనారోగ్యం లేసమాత్రము కూడ లేకుండ నయం చేయమని
విహారి/జగద్రక్షక/శ్రీహరి దయగని నాపై కరుణ చూపుము
అల్లహ్/ఈశూ దయతో నా తండ్రి ఆరోగ్యహితము చేకూర్చుము
అందరి దేముళ్ళకు యిదియే నా సహస్రకోటి గొంతుకల మూగ కేక
దేముడా నీ సర్వసర్వే శక్తికి యిదియే కావాలి మచ్చుతునక
ఇక నీ పేరు దయకలవానిగ మారుమ్రోగాలిక
విసురజ

శ్రావణమాసం వచ్చింది/యిబ్బంది తెచ్చింది

 Wednesday, August 10, 2011 at 7:26pm ·

శ్రావణమాసం వచ్చింది
పూజల సీజను తెచ్చింది
మంగళవారపు నోములంట
శుక్రవారపు పూజలంట
అమ్మలక్కల కొత్త చీరల ప్రదర్శనలు
ఆ చీరకొంగుల రెపరెపలు వారి పకవికలు
అహో దర్శించ కడు రమణీయ దృశ్యము


ఇంటికి రంగులంట
ఇంట్లో రంగవల్లులంట
ఇంటిగుమ్మాలకి మామిడితోరణాలంట
ఇంటిద్వారాలకి పూలదండలంట
ఇంటిముందర ముగ్గులంట వీలైతే గొబ్బెమ్మల్లంట


పూజల్లోన సాంప్రదాయాలు పాటిస్తారు
సామూహిక ఆరాధనలో మునిగి తేలుతారు
ఇనపెట్టెల్లోంచి బీరువాల్లోంచి బంగారునగలు బయటకు వస్తాయి
నవ్వుతూ కోమలి అలంకరణలో భాగమవుతాయి


పూజలన్ని కుటుంబము కొరకేనంటారు
నోములన్ని మగని కోసమేంటారు
పూజవేళలోపే యింటిగడప దాటలంటారు
లేకపోతే యింట్లోనే గదిలో వుండమంటారు
పిలవక బయటకు రావలదంటారు


పూజ పూర్తిగాక యేదియూ దొరకదు
ప్రసాదం భక్తులకు యిబ్బంది తప్పదు
మెచ్చిన శ్రీమతి గంట కొట్టినాక
ఇంటి యిల్లాలు హారతి యిచ్చినాక
ఇంటికి వచ్చినవారి షడ్రుచుల భోజనమైనాక
నీ వంతు వచ్చును నీ ఆకలి తీరును
అప్పుడే పుణ్యము దొరుకును మోక్షము దరిచేరును


శ్రావణమాసం వచ్చింది
పూజల సీజను తెచ్చింది
మంగళవారపు నోములంట
శుక్రవారపు పూజలంట
ఆకలికేకలు తప్పవంట
ఏమన్న వినరంట వినబడంట
గట్టిగా అనడానికి వీల్లేదంట
శిరస్త్రాణం వేసుకుని యింట్లో వుండలేమంట

శ్రావణ శుక్రవారపు విందు

 Friday, August 12, 2011 at 1:13pm ·

ఇంట్లో శ్రీమతి శ్రావణ శుక్రవారపు పొద్దున
శ్రీదేవి పూజ చక్కగా పూర్తి చేసింది.
పిలిచిన వారందరు వచ్చారని తెలిసింది.
అమ్మవారికి ప్రసాదం పెట్టినాక
వచ్చినవారి భోజనాలైనాక నా వంతు వచ్చింది.
పళ్ళెంలో వేసిన పదార్ధాలు చూడంగ
శ్రీమతి యెందుకు తెల్లారగట్ల 3.30కే లేచిందో అర్దమయ్యింది.
చేసిన వంటకాలు చెప్పినచో నోరు వూరేనేమో----
అన్నము, టమోట పప్పు, బెండకాయ వేపుడు, దోసకాయ పచ్చడి, కరివేపాకు పొడి, ములక్కాడల ముక్కల పులుసు మరియు గడ్డ పెరుగు
స్పెషల్స్-----పులిహోర, బెల్లంపరవన్నం, ఆనపకాయ బజ్జీలు, కట్టెపొంగలి మరియు బూరేలు
విందు భోజనము చేయంగ భుక్తాయసముతో నిద్దుర వచ్చేనే,
ఆఫీసు యెట్ల పోవలనే రామ రామ ఈ బాధ యెవరికి రావద్దునే.
(అందరు నాలగే శ్రీమతిని తబ్బిబ్బు చేయడానికి డప్పాలు కొడుతుంటారని భావిస్తు)
మీ విసురజ

అన్నయ్య ఉద్యోగ విరమణ సందర్భముగ

Sunday, September 11, 2011
వెళిదిమళ్ళ సువంశాంకుర సన్మంగళదాయి
వల్లిసూర్యనారయణలపౌత్ర
అచ్యుతరంగ సుందరరావుల సుపుత్ర
కొమరేశ్వర సూర్య వరప్రసాద నామధేయి
మువ్వురేసి చెళ్ళెళ్ళ తమ్ముళ్ళ కు అగ్రజుడువోయి
గాన నీకివియే మా అభివాదాలసుగంధాలు
గాన నీకిదియే మా అభినందనల సుమమాలలు
ధవళ వర్ణరూపా నీ వదనారవిందం కనిన
దృక్కులు మరల్పుట సాధ్యమేనా?
నల్లని నొక్కుల జుత్తుల ఱేడా నీ కంజాతాక్షములు గనిన
తనుల్లతలందరి వుల్లము ఝల్లునననే
నీ మదినెరింగిడి సఖియే
నిను మానసమున దాల్చిన యిందుమతియే
కోటి ప్రభలు కలిగిన ప్రభావతియే
కోరి యయ్యేనుగా నీకు సతియే
మీ సుఖసంసార సాగరమున
సంతసోమామృతము పంచు మోహినిగ
కోటి పూజల ఫలముగ
జనియించే శశిబింధు (మాధవి) పుత్రికగ
మంచి పంచువాళ్ళకు మంచి జరుగునట్టుగ
మనసైనవాడు హేమ ఫణికుమారుడు దొరికేను అల్లుడిగా
తల్లితండ్రులకు సహోదర సహోదరిమణులకు అనుభంధాలు పంచేను
పుత్రిక జామాతతో మనవలతో ఆనందాలు అనుభవాలు పంచుకొనెను
ఊర్విలో పెద్దలకు పిన్నలకు తన కర్తవ్యతపస్సుతో దిక్సూచిగా నిలిచేను
వజ్రసంకల్ప ధ్రుఢదీక్ష దక్ష యసోసోభితగ పేరు గాంచేను
సుమధురభాషా చెష్టగ యిష్టాగొస్టి నెరపగ
మందహాస మనోహర నాయక మృధు బాషా పంకజ
నీవు పలికెదవేని తేనె ధారలు జారాడునే
నీవు పలుకగనేని పదరవములు యతిప్రాసలు జాలువారునే
మనము దాచని మడమ తిప్పని మాట తప్పని
నీవు స్పస్టత గల ధీరుడివే
నీ ప్రగ్న్య తెలియని సుమతులు గలరే
పోర్టు వుద్యోగ విజయాలలో 42 వర్షములు నిండుగ వెలిగితివే
ఇంటి జీవన సమరములో సదా మెండుగ మెరిసితివే
రచన వ్యాసంగంలో మన్నిక గల పేరుగా
ఎన్నో ఆవార్డులు పొందేను
నాటక కళరంగ పరిపొషణలో పేరిన్నికగల నటుడిగా
ఎన్నో రివార్డులు గైకొనెను
త్రొఫీలతో బీరువాలు నిండేను యింట్లొ వల్లకి పూర్తిగ పనిపెట్టేను
ఈ వుద్యోగ విరమణ సంస్మరణ పర్వదినమున
నలుగురితో ఆనందము పంచుకొను సమయమున
మా అందరి హృదినుంచి వుద్భవించిన యొకేనొక కోరిక
నీవు సదా సపరివారముగ ఆనందసాగరములో తేలియాడుగాక
నీవు మాకందరికి గర్వకారణమై నిలుచువుండెదువుగా
విసురజ (వెలిదిమళ్ళ సుందర రంగ జగన్నాధ్)
11/09/11