ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label జై షిర్డీసాయినాథా. Show all posts
Showing posts with label జై షిర్డీసాయినాథా. Show all posts

Tuesday, 10 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవయిదవ అంకం
.........................
ధైవానికి వివిధ లక్షణాలున్నా ముఖ్యంగా వుండతగినవి (1) కీర్తి, (2) ధనం (3) అభిమాన రహితం (4) జ్ఞానం (5) మహిమ (6) ఔదార్యం.
పైలక్షణాలన్నీ సాయిబాబాలో వుండివుండే.. తన భక్తుల కొరకు ధైవమే సాయిబాబాగా శరీరరూపంగా అవతారమెత్త్తే.
సాయిబాబా దయాదాక్షిణ్యములు, భక్తులను తనవద్దకు రప్పించే వైఖరి వింతైనవి. సాయిబాబా ఒకనాడు యిట్లనే "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణపడివున్నాను. మీ దర్శనంచే నేను తృప్తి చెందితి. మీ పాదాలను దర్శించుట నా భాగ్యము. మీ అశుద్దంలో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను."
ఏమి వారి అణకువ! దీనిని ప్రచురించి సాయిబాబాను కించపరిచితినని ఎవరైన అంటే వారిని క్షమాపణ కోరుచుంటి. అందుకు పరిహారముగా సాయిబాబా నామ జపం చేసేద.

సాయిబాబా మాటలు క్లుప్తముగా, భావగర్భితముగా, శక్తివంతంగా సమతూకంతోను నుండే. సాయిబాబా ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా వుండే. సాయిబాబా యిట్లనే "నేను ఫకీరయినప్పటికి, ఇల్లుగాని, భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి, ఒకేచోట నివసించుటచే తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరు సంగతి ఎంతా? ఎవరయితే భగవంతుని ఆశ్రయించుదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి బారినుండి తప్పించుకొందురు. సాయిబాబా తన భక్తుల మేలుకొరకు యిట్లనే "ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపాలు క్షీణించునో, వారు నా పూజ చేస్తారు. ఎల్లప్పుడు సాయి సాయని జపించినచో వారిని సప్తసముద్రాలు దాటిస్తా. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందగలవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారాలు గాని, అష్టాంగయోగాలు గాని నాకు అవసరం లేదు.
భక్తి యున్నచోటనే నా నివాసము." సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి.

జ్ఞానములో సుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించువారు అందరిని సమానంగా ప్రేమించువారు. అటువంటివారు అభిమాన రహితులు, శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు వీరికి అందరు సమానమే. భక్తుల కొరకు తమ పుణ్యాన్ని వ్యయపరచి వారికి సహాయము చేయుటకు సిద్ధముగా వుంటారు. వారు ఇష్టపడనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు సాయిబాబాను స్మరించ లేరు అలాగే వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి సాయిబాబాను చూడాలి, తెలవాలి అనుకున్నా సమయం రాక జరగదు. చాలామందికి సాయిబాబాను మహాసమాధి లోపల చూసే అవకాశము కలుగలేదు. సాయిబాబాను దర్శించవలెనన్న కోరిక వున్నా కొంతమందికి ఆ కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో సాయిబాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగే సంతుష్టి పొందురు. కొందరు అదృష్టవశాన వారి దర్శనం చేసుకున్నా, సాయిబాబా సన్నిధిలో ఉండవలెనన్న కోరికున్న అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారం షిర్డీ పోలేకుండిరి. సాయిబాబా అజ్ఞ మేరకే షిర్డీలో వారు వుండగలిగిరి. సాయిబాబా చెప్పిన వెంటనే షిర్డీ విడువవలసిందే. కాబట్టి సర్వము సాయిబాబా ఇష్టముపై ఆధారపడివుండే.

షిర్డీలో విచిత్రపురుషుడు...నానావల్లి. అతడు సాయిబాబా విషయాలను, పనులను చక్కపెట్టుచుండే. ఒకనాడతడు సాయిబాబా వద్దకు పోయి, గద్దెపై నుంచి సాయిబాబాను దిగమని కోరే. వెంటనే సాయిబాబా లేచి గద్దెను ఖాళీచేసే. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి, లేచి, సాయిబాబాను తిరిగి కూర్చొనుమనే. సాయిబాబా తన గద్దెపై తిరిగి కూర్చొనే. నానావల్లి సాయిబాబా పాదాలకు సాష్టాంగనమస్కారం చేసి మరలిపోయే. తనను గద్దె మీద నుంచి దిగి పొమ్మన్నా దానిపై నింకొకరు కూర్చున్నా, సాయిబాబా ఏమి అసంతృప్తి వెలిబుచ్చలేదు. నానావల్లి యెంత పుణ్యాత్ముడో, భక్తుడో కదా... ఆతను సాయిబాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగం చేసెను.
ఇక్కడ సాయిబాబా అణుకువ, అభిమానరహిత మానసం చూడవచ్చు.
............................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైనాలుగవ అంకం
.........................
శ్రీకృష్ణుడు భగవద్గీతలో (9అ. 26శ్లో) చెప్పినదేమిటంటే ఎవరైనా శ్రద్ధాభక్తులతో పత్రం గాని పుష్పం గాని ఫలం గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను. సరిగ్గా అలాగే తన భక్తుడేదైన సమర్పించాలి అనుకుని మరచినచో అట్టివానికి సాయిబాబా జ్ఞాపకం చేసి, అడిగి మరీ దానిని గ్రహించి ఆశీర్వదించేవారు.
అట్లాంటివే, ఈ క్రింద ఉదాహరణలు చూడండి.
1) తర్ ఖడ్ కుటుంబం (తండ్రి, కొడుకు)
ముంబైలోని బాంద్రాలో నివాసం వుండే రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ మొదట్లో ప్రార్థన సమాజస్థుడైనను సాయిబాబాకు ప్రియ భక్తుడు. వాని భార్యాపుత్రులు కూడ సాయిబాబాను పూజించే. ఒకమారు తల్లికొడుకులు షిర్డీకి పోయి వేసవి సెలవులు అక్కడే సాయిబాబా సన్నిధిలో గడుపవలెనని నిర్ణయించే. రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ ప్రార్థన సమాజంకు చెందడంచే ఊరు వదిలి షిర్డీ వెళితే తమ ఇంటివద్ద సాయిబాబాకి పూజ సరిగా జరగకపోవచ్చునని సంశయంతో కొడుకు షిర్డీకి రాననే. అది తెలిసిన వాని తండ్రి రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ తను సాయిబాబా పూజను ఇంట్లో సక్రమంగా చేసెదనని మాట యిస్తే ఆ తల్లికోడుకులు యిరువురు శుక్రవారము రాత్రి బయలుదేరి షిర్డీకి చేరిరి. తల్లికోడుకులు బయలుదేరిన మరునాడు అనగా శనివారమునాడు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ త్వరగా లేచి స్నానం చేసి, పూజను ప్రారంభించుటకు పూర్వం సాయిబాబా పటమునకు సాష్టాంగనమస్కారం చేసి లాంఛనంగా కాక కొడుకు చేయునట్లు ఇంట్లో పూజను సక్రమంగా చేసి నైవేద్యం నిమిత్తం కలకండను అర్పించే. తదుపరి దానిని అందరికి పంచిపెట్టే. అలాగా ఆనాటి సాయంత్రం, మరుసటిదినం, ఆదివారం, సోమవారం నాడు వరుకు తమ ఇంట్లో సాయిబాబా పూజను క్రమం తప్పక రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ సవ్యంగా చేసే. అతడేప్పుడు యిట్లా సాయిబాబా పూజలను చేసియుండలేదు. రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ పూజలను తన కొడుకిచ్చిన మాట ప్రకారం చేస్తున్నానని సంతసించే.
మంగళవారం నాడు పూజను చేసి ఉద్యోగానికి వెళ్ళే. బాంద్రాలో మంగళవారము 12 గంటలకు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ తన ఇంటికి మధ్యాహ్నభోజనంకి వచ్చినప్పుడు పూజామందిరంలో తినుటకు ప్రసాదం లేకుండే. తమ నౌకరును ఆ విషయం అడుగా, ఆనాడు రామచంద్ర ఆత్మారామ్ అనబడే బాబాసాహెబ్ తర్ ఖడ్ ప్రసాదం అర్పించలేదని అందుకే అక్కడ ప్రసాదం లేదని బదులు చెప్పే. ఆ సంగతి తెలిసిరాగానే అపరాధ సాష్టాంగ నమస్కారం చేసి, సాయిబాబాను క్షమాపణ వేడే. పైగా సాయిబాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు చింతించి సాయిబాబాను నిందించే. తన పొరపాటును చెబుతూ ఈ సంగతులన్నిటిని షిర్డీలోనున్న తన కొడుకునకు ఉత్తరం వ్రాసి సాయిబాబాను క్షమాపణ వాళ్ళని తన తరుపున వేడమనే.
అదే సమయమందు షిర్డీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు, సాయిబాబా అక్కడ వున్న ఆత్మారాముని భార్యతో "తల్లీ! బాంద్రాలో మీ యింటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోతిని. తలుపు తాళము వేసి వున్నా ఎలాగోలా లోపల ప్రవేశించా. కాని అక్కడ తినుటకు ఏమి లేక తిరిగి వచ్చితిని" అని పలికెను.
అమెకు సాయిబాబా మాటలు బోధపడలేదు. కాని ఆమె కుమారుడుకు ఇంటి వద్ద పూజలో ఏదో లోటు జరిగిందని గ్రహించే. వెంటనే యింటికి పోవుటకు అనుమతి సాయిబాబాను వేడే. దానిని సాయిబాబా నిరాకరించి చేసే పూజను షిర్డీలోనే చేయమనే. షిర్డీలో జరిగిన విషయం వెంటనే ఆ పిల్లవాడు తండ్రికి వుత్తరం వ్రాసి ఇంట్లో పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనే.
ఈ రెండు ఉత్తరములు ఒకదానికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానాలు చేరే. ఈ వింత ఆశ్చర్యకరం, సాయిబాబా సర్వజ్ఞతకు నిదర్శనం కదా!

2) ఆత్మారాముని భార్య భక్తిశ్రద్దలు...
పై కధలో చెప్పుకున్న అత్మారాముని భార్య మూడు వస్తువులను సాయిబాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించే.
1. వంకాయ పెరుగు పచ్చడి
2. వంకాయ వేపుడుకూర
3. పేడా.
బాంద్రా నివాసైన రఘువీర భాస్కర పురందరే సాయిబాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు అతను భార్యతో షిర్డీకి బయలుదేరుచుండే. అప్పుడు ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని తెచ్చి మిగుల ప్రేమతో పురంధరుని భార్య చేతికిచ్చి వొక వంకాయతో పెరుగుపచ్చడిని మరి రెండవదానితో వేపుడును చేసి సాయిబాబాకు వడ్డించమని వేడే. షిర్డీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి సాయిబాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసికొనిపోయే. సాయిబాబాకా పచ్చడి చాల రుచించే. కొంచెం తిని మిగతాది అందరికి పంచిపెట్ట్టే. సాయిబాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలననే. అక్కడున్న భక్తులు ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలిపిరి. అది వంకాయల కాలం కాదు గనుక తనకేమి తోచకుండే. వివరాలు ఆడుగా అసలు వంకాయపచ్చడిపురందరుని భార్య కావున వంకాయ వేపుడు గూడ తనే చేసి పెట్టవలెనని తెలిపిరి. అప్పుడు గానీ అందరికీ సాయిబాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలియలేదు. సాయిబాబా సర్వజ్ఞుడని, సర్వ సమర్ధుడని గ్రహించా, అందరాశ్చర్యపడిరి.
1915 డిసెంబరులో గోవింద బలరామ్ మంకడ్ యనువాడు షిర్డీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెననుకొనే. ప్రయాణంకు ముందు ఆత్మారాముని వద్దకు వచ్చే. అప్పుడు ఆత్మారాం భార్య సాయిబాబాకి ఏమైనా పంపాలాననుకొనే. ఇల్లంతయు వెదక వొక పేడా తప్ప మరేమీ కన్పించలేదు. ఈ పేడా అప్పటికే సాయిబాబాకు నైవేద్యం పెట్టబడే. కాని ఆత్మారాముని భార్యకు సాయిబాబా అందున్న భక్తి ప్రేమలచే ఆ పేడాను అతని ద్వారా సాయిబాబాకు అర్పించే. సాయిబాబా దానిని పుచ్చుకొని తప్పక తినునని నమ్మియుండే. గోవిందుడు షిర్డీ చేరే. సాయిబాబాను దర్శించే. తనతో విశ్రాంతి గది నుండి పేడాను తీసికొని వెళ్ళుట మరచే. సాయబాబా ఊరకుండెను. సాయంత్రం సాయిబాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడా తీసికొని పోవుట మరచే. అప్పుడు గోవిందుడుని సాయిబాబా తన కొరకేమి తెచ్చావని ఆడగ అతగాడు ఏమి తేలేదని జవాబిచ్చే. వెంటనే సాయిబాబా, "నీవు యింటి దగ్గర బయలుదేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?"అని ప్రశ్నించే. అప్పుడు గోవిందుడు ఆసలు సంగతి జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గుపడే. వెంటనే గోవిందుడు సాయిబాబాను చేరి క్షమాపణ వేడే. అనుజ్ఞ దొరికిన వెంటనే బసకు పరుగెత్తి పేడాను తెచ్చి సాయిబాబా చేతికిచ్చే. చేతిలో పెట్టిన పేడాను వెంటనే సాయిబాబా గుటుక్కున మ్రింగివేసే. అట్లా ఆత్మారాముని భార్య భక్తిని సాయిబాబా మెచ్చే". శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన "నా భక్తులు నన్ను త్రికరణశుద్దితో నమ్మితే నేను వారిని చేరదీస్తా" అను గీతావాక్యము దృష్టాంతరంగా సాయిబాబాచే నిరూపించబడే.
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైనాలుగవ అంకం
 

 షిర్డీ సాయిబాబా ఆజ్ఞ మీరి షిర్డీ వదలలేరు. సాయిబాబా ఆజ్ఞను మీరితే అనుకోని, చెప్పలేని కష్టాలు అనుభూతయ్యే. షిర్డీ విడిచి వెనక్కి వెళ్ళడం కోసమైనా, లేక వేరే పని కోసమైనా, సాయిబాబా ఆజ్ఞను పొందుటకు వెళితే సాయిబాబా కొన్ని సలహాలు నర్మగర్భంగా లేక ఒకో మారు సూటిగా యిచ్చుచుండే. సాయిబాబా సలహా ప్రకారం నడచినచో లాభాము, సుఖము భక్తులు పొండుచుండే. వారి మాటను గౌరవించకపోతే, ప్రమాదాలేవో తప్పక వచ్చుచుండే. అటువంటి అనేకమైనవి వున్నా వాటిలో రెండు తార్కాణాలు క్రింద విధంగా వుండే.

1)
తాత్యాకోతే పాటీల్ టాంగాలో ఒకమారు కోపర్ గాం సంతకు వెళ్ళదలచే. మసీదుకు వచ్చి సాయిబాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు వెళ్ళుచున్నానని, తొందరలో వున్నానని చెప్పే. అంత సాయిబాబా "తొందరపడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి మాట అటుంచు. పల్లె విడిచి బయటకు పోవద్దు." మాట వినక కంగారు పడుతున్న తాత్య కోటే పాటిల్ ని చూచి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని వెళ్ళమని" సాయిబాబా ఆజ్ఞాపించే. అది లెక్కచేయక తాత్యా వెంటనే టాంగాను బయలుదేరదీసే.. ఆ టాంగాకున్న రెండు గుర్రాలలో ఒకటి కొత్తది పైగా మిక్కిలి చురుకైనది. షిర్డీ ఊరవతల వున్నా సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తి, ఆపై దాని కాలు బెణికి మూలబడే. క్రిందపడ్డ తాత్యాకు పెద్దదెబ్బలు తగలలేదు. అప్పుడు గాని సాయిబాబా ఆజ్ఞను దాని విలువను
తాత్య కోటే పాటిల్ గుర్తించలేదు.

2)
ఒకసారి బొంబాయనుండి యూరప్ దేశస్థుడు షిర్డీ వచ్చే. నానా సాహెబ్ చాందోర్కరు వద్ద నుంచి ఒక సిఫార్సు లేఖతో సాయిబాబాకై వచ్చే. అతనికి ఒక మంచి బస నేర్పాటు చేసిరి. అతడు సాయిబాబా పాదాలకు నమస్కరించి వారి చేతిని ముద్దాడాలని మూడుసార్లు మసీదులో ప్రవేశించ కోరే. కాని సాయిబాబా అతనిని రాకను నిషేధించెను. అందరిలా క్రింద బహిరంగ ఆవరణములో కూర్చుండియే దర్శించమనిరి. అతడు తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిర్డీ విడవాలని నిశ్చయించే. సాయిబాబా సెలవు కోరే. అతనిని తొందరపడక మరుసటిదినం వెళ్ళమని సాయిబాబా తెలిపే. వారి సలహాకు వ్యతిరేకంగా అతడు టాంగాలో షిర్డీ నుండి బయలుదేరే. మొదట్లో గుర్రాలు బాగానే వున్నా షిర్డీ ఊరవతల వున్నా సావుల్ బావి దాటిన వంటనే ఆ టాంగాకు మరో త్రొక్కుడుబండి ఎదురోచ్చే. దానిని జూచిన గుర్రాలు బెదిరి త్వరగా పరుగు పెట్టండంతో టాంగా తలక్రిందులయ్యే. యూరప్ పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము యీడ్వబడే. తత్ఫలితంగా అతగాడు కోపర్ గాం ఆసుపత్రిలో గాయాల మానువరుకు ఉండవలసివచ్చే.
ఇటువంటి అనేక సంఘటనల మూలాన సాయిబాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదాల పాలగుదరని సాయిబాబా ఆజ్ఞానుసారం నడిచేవారు సురక్షితంగా ఉంటారని భక్తజనులు గ్రహించే.
.................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Monday, 9 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైరెండవ అంకం
 

.............................
సాయిబాబా... యోగాభ్యాసము
....................................
సాయిబాబాకు యోగాభ్యాస విద్యలన్నీ తెలుసు. ఈషణ్మార్గములందును సాయిబాబా ఆరితేరినవారు. అందులోనివే.. ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. అందులో 1) ధౌతి యనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపలనుంచి శుభ్రపరచుట. అలాగే 2) ఖండయోగమనగా శరీరావయములన్ని విడదీసి తిరిగి కలుపుట.
................................
1. ధౌతి లేక శుభ్రపరచు విధానం..
ద్వారకమాయీ 'మసీదు' కు దూరంగా ఒక మఱ్ఱిచెట్టు దగ్గర దిగుడు బావి కలదు. సాయిబాబా ప్రతి మూడవరోజు అక్కడకు పోయి ముఖప్రక్షాళనం, స్నానం చేస్తుండేవారు. ఒకనాడు సాయిబాబా తన ఊపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని బావి నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట అక్కడే వున్న కొందరు గమనించిరి. షిర్డీలోని కొందరు దీనిని కండ్లార చూసితిరి. సాధారణంగా ధౌతియనగా 03 అంగుళాల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు వుండనిచ్చిన పిమ్మట బయటకు తీస్తారు. కాని సాయిబాబా అనుసరించే ధౌతి యోగం చాల విశిష్టము, అసాధారణం. అది వారికే సాధ్యమైనది.

2. ఖండయోగము
సాయిబాబా ఖండయోగ ప్రక్రియలో తన శరీరావయాలన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు చోట్ల పెట్టేవారు. ఒకసారి ఒక పెద్దమనిషి మసీదుకు పోయి సాయిబాబా అవయయాలు వేర్వేరు స్థలాలలో పడియుండుట జూచి భయకంపితుడై సాయిబాబాను ఎవరో ఖూనీ చేసేరేమో అనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేద్దామనుకునే. మరలా ఆలోచించిన పిదప మొట్టమొదట తానే ఫిర్యాదు చేస్తే ఆ విషయం పైన తనకు కొంచమైన తెలుసు అనుకుని తననే అనుమానిస్తారని మానివేసే. మరుసటి రోజు మసీదుకు బోవ సాయిబాబా యెప్పటివలే హాయిగా కూర్చుండుట చూసి ఆశ్చర్యపడే. ముందురోజు తాను చూసినదంతా కలే అనుకున్నాడు. అప్పుడు సాయిబాబా అతనిని పిలచి రాత్రి ఏమిటి బయపడ్డావా అని అడిగినాక కానీ అతనికి సాయిబాబా సర్వాంతర్యామని బోధపడలేదు.

షిర్దిలోని మూడు వాడలు
............................
సాఠె వాడ
పాదుకలు ప్రతిష్టించిన వేపచెట్టును, దానిచుట్టునున్న స్థలాన్నీ హరివినాయకసాఠే కొని సాఠెవాడని పెద్ద వసతిని వచ్చి పోయే భక్తుల అవసరార్ధమై కట్టించే. అప్పట్లో షిర్డీ పోయిన భక్తులకిదే నివాస స్థలము. వేపచెట్టు చుట్టు అరుగు ఎత్తుగా కట్టి మెట్లు పెట్టిరి. మెట్ల క్రింద ఒక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపై ఉత్తరముఖంగా కూర్చుండేవారు. గురువారం, శుక్రవారం ఎవరైతే అక్కడ ధూపం వేస్తారో సాయిబాబా కృపవల్ల వారు సంతోషముతో వుండేవారని, వుంటారని ప్రతీతి. ఈ సాఠెవాడ చాల పురాతనమైనది కావున తదుపరి మరామత్తు అవసరమైననాడు తగిన మార్పులు, మరామత్తులు షిర్డీ సంస్థానం వారు చేసిరి. సాఠెవాడని ఏర్పడిన కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను మరొకటి కట్టిరి.

దీక్షిత్ వాడ
న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు వెళితే అచ్చట రైలు ప్రమాదంలో కాలుకి దెబ్బ తగిలి కాలుకుంటుపడే. అది యెంత ప్రయత్నించినను కాలు కుంటుతనం బాగు కాలేదు. స్నేహితుడైన నానా సాహెబ్ చాందోర్కరు ఈతనిని షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా యిచ్చెను. 1909వ సంవత్సరమున
కాకా సాహెబ్ దీక్షిత్ సాయిబాబా వద్దకు పోయే. అక్కడ పరివర్తనుడై తన కాలు కుంటితనం కన్న తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయుమని సాయిబాబాను ప్రార్థించే. సాయిబాబా దర్శనంతోనే అమితానందభరితుడై షిర్దిలోనే నివసించుటకు నిశ్చయించుకొనే. తనకొరకు, ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించే. దినం 10-12-1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసే.
ఆనాడు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగే.
(1) సాయిబాబా సమ్మతి లేక అక్కడే వుంటున్న దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను.
(2) చావడిలో రాత్రిపూట హారతి ప్రారంభమయ్యే.
కాక సాహెబ్ దీక్షిత్ పేరుతొ కట్టిన ఈ దీక్షిత్ వాడ పూర్తి కాగానే, 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం చేసే.

సమాధి మందిరం
నాగపూరు నివాసైన కోటీశ్వరుడైన బూటీ తరువాత మరో పెద్ద రాతిమేడను నిర్మింపచేసే. చాల ధనం దీనికొరకు వెచ్చించే. సాయిబాబాగారి భౌతికశరీరం దానిలో సమాధి చేయబడే అందుచే బూటీ ఖర్చు పెట్టిన ధనమంతా సద్వినియోగం అయ్యిందని చెప్పవచ్చు. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో ముందర సాయిబాబా స్వహస్తాలతో పెంచిన పూలతోట వుండే. ఆ పూలతోటలో సాయిబాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట, గొప్పులు తవ్వుట మొదలైనవి చేసేవారు.
ఈ విధంగా మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడే. అంతకుముందు షిర్డీ కుగ్రామంలో అక్కడ ఒక్క వసతిగృహం కూడ లేకుండే. .
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Wednesday, 4 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైరెండవ అంకం

సాయి పాదుకల వృత్తాంతం
అక్కల్ కోటకర్ స్వామి మహారాజ్ గారి భక్తుడైన భాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ స్వామి మహారాజ్ గారి ఫోటోను పూజిస్తుండే. షోలాపూరు జిల్లాలోనున్న అక్కల్ కోట గ్రామానికి పోయి స్వామి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించాలని తలచే. అప్పుడు అతడికి స్వప్నంలో అక్కల కోటకర్ స్వామి మహారాజ్ దర్శనమిచ్చి "ప్రస్తుతం షిర్డీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ నెరవేర్చు" అని తెలిపే. అలా 1912వ సంవత్సరం బొంబాయి నుండి రామారావు కొఠారి అనే డాక్టర్ వారి మిత్రుడుతో పాటు డాక్టర్ గారి కాంపౌండరైన భాయి కృష్ణజీ షిర్డీ వచ్చే. భాయి కృష్ణజీ షిర్డీ చేరి సాయిబాబాను పూజించే. అచ్చటనే ఆరునెలలు ఆనందముతో ఉండిపోయే. ఒకనాడు సాయిబాబా దర్శనం చేసిన తరువాత అక్కల్ కోట గ్రామానికి పోదలచి సాయిబాబా వద్దకు వెళ్లి అనుమతి కోరే. సాయిబాబా యిట్లనే "అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడకు ఎందుకు వెళ్ళడం? అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం యిక్కడే వున్నారు, అది నేనే". ఆ విషయం మనసున గట్టిగా నమ్మిన భాయి కృష్ణజీ అక్కల్ కోటకు ఆపై వెళ్లుట మానుకొనే. డాక్టర్ కొఠారి, అతని మిత్రుడు మరియు కాంపౌండర్ భై కృష్ణజీ షిర్డీలో భక్త సగుణుతోను, శ్రీ జి. కె. దీక్షిత్ తోను మిక్కిలి స్నేహం చేసిరి. వారి వారి ధర్మపూరిత చర్చల్లో సాయిబాబా మొట్టమొదటగా షిర్డీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్ధం సాయిబాబా వారి పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించాలని తలచే. వారు ముందు పాదుకలను రాతితో చెక్కించ నిశ్చయించబోవ కాంపౌండరైన భాయి కృష్ణజీ తమ డాక్టరైన రామారావు కొఠారికి కలిసి విషయం చెప్పినచో వారి వంతు సహకారం అందించి చక్కని పాదుకలు చెక్కిస్తారని చెప్పే. అందరు ఈ సలహాకు సమ్మతించి డాక్టరుగారిని కలిసి ఈ పాదుకల స్థాపించే విషయం తెలియపరచిరి. దానికి ఒప్పిన డాక్టర్ గారు పాదుకల నమూనా వ్రాయించి 'ఖండోబా' మందిరంలో ఉంటున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి ఆ నమూనాను చూపే. దాన్ని చూసిన
ఉపాసనీ మహారాజ్ గారు ఆ నామూనాలో కొన్ని మార్పులను జేసి, పద్మం, శంఖం, చక్రం మొదలగునవి చేర్చి సాయిబాబా యోగశక్తిని మరియు వేపచెట్టు గొప్పతనాన్ని తెలిపే యీ క్రింది శ్లోకాన్ని పాదుకలపై చెక్కమనే.
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం|
ఉపాసని మహారాజ్ సలహాను ఆమోదించి పాదుకలను బొంబాయిలో చేయించి డాక్టర్ కొఠారి తన కాంపౌండరైన భై కృష్ణజీ ద్వారా షిర్దికి పంపిరి. వాటిని స్థాపన కొరకు మంచి రోజుకై సాయిబాబాను సంప్రదించ శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని సాయిబాబా ఆజ్ఞాపించే. నాటి శ్రావణ పౌర్ణమి నాడు వుదయం 11 గంటలకు తన శిరస్సుపై ఈ పాదుకలు పెట్టుకొని శ్రీ జి. కె. దీక్షిత్ ఖండోబా మందిరం నుండి షిర్డీ సాయిబాబా వుండే ద్వారకామాయికి ఊరేగింపుగా ఉత్సవంగా తరలి వచ్చే. ఆ పాదుకలను తాకి సాయిబాబా
అవి భగవంతుని శ్రీ పాదుకలని వాటిని వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించమని ఆదేశించే. దాదా కేల్కర్, ఉపాసనీబాబా ఆ ప్రతిష్ట పూజను శాస్త్రోక్తముగా జరిపే. ఆ శ్రావణ పౌర్ణమికి ముందురోజు షిర్డీ సాయిబాబా భక్తుడు పార్సీ మతస్థుడైన పాస్తాసేట్ బొంబాయి నుంచి మనియార్డర్ ద్వారా రూ.25 పంపా ఆ పైకం మొత్తం సాయిబాబా పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తమిచ్చే. నాటి దినం ఆ పాదుకల స్థాపనకై మొత్తంగా రూ.100 ఖర్చవ్వే మిగిలిన రూ.75 వరకు చందాల ద్వారా పోగు చేసిరి. ఆ వేపచెట్టు క్రింద పాదుకలను మొదటి 05 సంవత్సరాలు శ్రీ జి.కె.దీక్షిత్ అనే భక్త బ్రాహ్మణుడు పూజ చేసే. ఆ తరువాత లక్షణ్ కచేశ్వర్ జఖాడనే మరో భక్త బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేసే. అలాగే పాదుకల నిత్యపూజ సరిగ్గా జరుగుతున్నదో లేదోనన్న విషయం పర్యవేక్షించు అధికారం
భక్త సగుణుకు లభించే. ఆ పూజ నిమిత్తం మొదటి 5సంవత్సరాలు డాక్టర్ కొఠారి నెలకు రూ.2 చొప్పున పాదుకల దీపపు ఖర్చుకై పంపుచుండే. పాదుకల చుట్టు కంచే కూడ డాక్టర్ కొఠారి బొంబాయి నుంచి రైలులో పంపే. ఈ కంచెను, పాదుకల పైకప్పును కోపర్ గాం రైలుస్టేషన్ నుండి షిర్డీ గ్రామంకి తెచ్చుటకైన రూ.7-8-0 ఖర్చును భక్త సగుణు సరిపుచ్చే.
............................
శాంతిః శాంతిః శాంతిః।
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।।
శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైవోకటివ అంకం
FRIDAY...12th July, 2013

................................సద్గురువు లక్షణాలు...
లోకాన ఎందఱో గురువులమని చెప్పుకుని తిరుగుతుంటారు. అందులో కొందరు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. మెచ్చిన శిష్యుల చెవులలో మంత్రాలూది, వారి వద్ద నుంచి ధనం పట్టెదరు. పవిత్రమార్గం, మతం భోదిస్తామని చెపుతారు. అసలు మతమంటే ఏమిటో కూడా చాల మందికి తెలియదు పైగా స్వయంగా వీరిలో చాల మంది పవిత్రులు కారు.
షిర్డీ సాయిబాబా తన గొప్పతనం ఎప్పుడను చూపదలచలేదు. సాయిబాబాకి దేహాభిమానము లేసమాత్రమైన లేదు. కాని భక్తులంటే మిక్కిలి ప్రేమ వుండే. గురువులలో నియత గురువులని అనియత గురువులని చెప్పుదురు. నియత గురువులనగా నియమింపబడినవారు, అనియత గురువులనగా సమయానికి వచ్చి మంచి సలహాలనిచ్చి భక్తుల అంతరంగంలోనున్న సుగుణాన్ని వృద్ధిచేసి మోక్షమార్గం పట్టిస్తారు. నియత గురువుల సహవాసం నీవు నేను వేరు అనే ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగాన్ని ప్రతిష్ఠించి "తత్వమసి" అగునట్లు చేయు. లోకంలో అనేక విధములైన ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు చాల మంది వున్నారు. కాని మనకి ఎవరైతే సహజస్థితిలో నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపు వునికికి అతీతంగా తీసికొని పోయెదరో వారే సద్గురువులు. షిర్డీ సాయిబాబా అటువంటి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, వారి యొక్క భూతభవిష్యత్ వర్తమానములన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానం సమతత్వం వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల అవసరాలు గూడ తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవ శరీరంతో వున్నప్పటికి, వారికి శరీరమందు గాని, గృహమందుగాని అభిమానం లేకుండే. వారు శరీరధారులవలే కనిపించినా నిజానికి నిశ్శరీరులు, జీవన్ముక్తులు.

బాబాను భగవానునివలే పూజించిన షిర్డీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు, త్రాగుచు, తమ దొడ్లలోను పొలాలలోను పని చేసికొనుచు, వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తికి ఉంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప యింకొక దైవమును వారికి తెలియదు. షిర్దిలోని స్త్రీల ప్రేమను, భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులయినప్పటికి ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానం శూన్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వం భావం వుండే. యథార్థమైన కవిత్వం తెలివివలన రాదు. కానది అసలైన ప్రేమ వలన పొంగు. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నియు వినదగ్గవి, సేకరింపదగినవి.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Tuesday, 3 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైవ అంకం... 


(అక్షరాన్ని నిత్యం తన మస్తిష్కపు కోవెల లో దైవంగా భావించే 'విసురజ', రాసే ప్రతీ అంశాన్ని, రచనను తపస్సులా కొనసాగించే వీక్షకాభిమాన రచయిత... శ్రీ షిర్డీసాయినాథుడు సత్చరిత్రను భక్తి భావంతో సాయి భక్తులకోసం, మేన్ రోబో వీక్షకాభిమనుల కోసం, ధారావాహికగా అందిస్తున్నారు. చదివి తరించండి. మీ భక్తిభావాలను, అనుభవాలను మాతో పంచుకోండి. మీ స్పందన తెలియజేయండి.
చీఫ్ ఎడిటర్..విజయార్కె)..
................................
ప్రయాగలో దాసగణు స్నానేచ్చ.. పరిపూర్తి..
గంగానది యమునానది కలిసేచోటుకి ప్రయాగని పేరు. ఇందులో స్నానం చేస్తే ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల అపూర్వ నమ్మకం. అందుచేతనే నిత్యం వేలాది భక్తులు అచటికి పోయి స్నానమాడే. అచ్చటికిపోయి స్నానం చేయాలని దాసగణు మనస్సున దలచెను. సాయిబాబా వద్దకు పోయి అనుమతి కోరెను. అందుకు సాయిబాబా యిట్లు జవాబిచ్చె. "అంతదూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు." అట్లనునంతలోనే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణు మహారాజు సాయిబాబా పాదాలపై శిరస్సు పెట్టిన వెంటనే సాయిబాబా రెండు పాదాల బొటనవ్రేళ్ళ నుండి గంగా యమునా నదీ జలాలు కాలువలుగా పారెను. ఈ చమత్కారంను దాసుగణు చూచి అచ్చెరవు చెందే.. భక్తి ప్రేమలతో మైమరచి కంట తడిపెట్టుకొనే. దాసగణు తన అంతరంగ ప్రేరణతో సాయిబాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పాడే ,
..........................
విఠలుని దర్శన దృశ్యకధ
సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. సాయిబాబా అల్లామాలిక్ అనేవారు అనగా అల్లాయే యజమాని. సాయిబాబా సప్తాహంగా ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయించు చుండే. దీనినే నామసప్తాహం అని కూడా అంటారు. ఒకసారి దాసుగణుని నామసప్తాహం చేయమనిరి. సప్తాహం ముగిసే నాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధానమిచ్చినచో నామసప్తాహంను చేస్తానని దాసుగణు జవాబిచ్చెను. షిర్డీసాయిబాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చు..భగవంతుడు...డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే షిర్డీలోనే వున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తిస్తే విఠలుడిక్కడనే అవతరించునని" కాకపోతే భక్తుడు భక్తి ప్రేమలతో వుండాలి అని పలికే.. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడీ ఈ క్రిందివిధముగా అందరికి దర్శనమిచ్చే. స్నానాంతరం కాకాసాహెబు దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కన్పించే. కాకా దీక్షిత్ మధ్యాహ్నహారతి కొరకు సాయిబాబా వద్దకు పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగే.. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా వున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయాన జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు.. 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చే. ఆ పటం సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండే. దీనిని జూచి సాయిబాబా మాటలు జ్ఞాపకానికి దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగే. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో పెట్టే.
....................................
భగవంతరావు క్షీరసాగరుని కథ
విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో చెప్పబడే. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిర్డీ వచ్చినప్పుడు, సాయిబాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీడి తండ్రి నా స్నేహితుడు గావున వీనిని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీనిని నిక్కడకు తెచ్చితిని. వీడు చేస్తున్నది తప్పని బోధించి, చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.
...................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Wednesday, 31 July 2013

 జై షిర్డీ సాయినాధ by విసురజ
పద్దెనిమిది మరియు పంతొమ్మిది అంకాలు.


సాయిబాబా అనుజ్ఞ/ఆదేశం
సాయిబాబా సాయిసత్చరిత్ర వ్రాయు విషయంలో హేమాద్ పంత్ కు అనుజ్ఞ ఇస్తూ యిట్లనిరి "నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా వుంచు, నా మాటయందు విశ్వాసముంచు. నా లీలలు వ్రాయంగా అజ్ఞానం, అవిద్య అంతరించి పోవు. అలాగే శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ఈ లోకం పట్ల మమత తగ్గి విముఖత పెరుగు. నీ మనసులో బలమైన భక్తి ప్రేమ కెరటాలు లేచు. ఎవరయితే నా లీలలలో మునిగితేలుతారో వారికి జ్ఞానరత్నాలు లభించు."
సాయి భక్తుడు, హేమాద్ పంత్ స్నేహితుడైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి సాయిబాబా యిట్లనే....
"ప్రేమతో వుచ్చరించిన నా నామాన్ని ఆ భక్తుల కోరికలన్నియు నెరవేర్చెదా. వారి మనసులో భక్తిని పెంచెదను. అన్ని వైపులా నుంచి కాపు కాసి నా భక్తులని కాపాడెదను. ఏ ఏ భక్తులయితే మనఃపూర్వకంగా నాపై ఆధారపడివుంటారో నా కథలు వారు వినునప్పుడు మిక్కిలి సంతోషిస్తారు. నా లీలలు పాడు వారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని యిచ్చెదనని నమ్ము. ఎవరయితే నన్ను శరణాగతని వేడుతారో, నన్ను భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, నన్నే నిత్యం స్మరిస్తారో, నా ఆకారాన్ని మనస్సున నిలుపుతారో సదరు భక్తులని జీవన బంధనాల నుండి తప్పించుటే నా ముఖ్య లక్షణము. అన్నిటిని మరిచి లోకాన నా నామాన్నే జపించి, నా పూజనే చేస్తూ, నా లీలల కథలను తలుస్తూ సదా నన్ను మరువనివారు ప్రాపించిక విషయాలను ఎట్లా తగులుకొందురు? వారిని మరణం నుండి కూడా బయటకు లాగెద. నా కథలే వినడంతోనే సకల రోగముల నివారణ జరుగు. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినండి. వాటిని మనసులో నిలపుకోండి. పరమానందంకి తృప్తికిదే సిసలైన మార్గం. ఈ రీతిగా నా భక్తుల యొక్క గర్వాహంకారాలు నిష్క్రమించు. మనస్ఫూర్తిగా నమ్మేవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగు. సాయి, సాయి అన్న నామాన్ని జ్ఞప్తి వుంచుకుంటే చెడు పలుకుట వినుట వలన కలుగు పాపాలు తొలగిపోవు'' అని తెలిపే..

సాయిబాబా లీల
సాయిబాబా విచిత్ర లీలలలో మరొకటి.... అమరావతి నివాసైన దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిర్డీలో మకాం చేసే. ఆ పిల్లవాడికి జ్వరం వచ్చే అది ప్లేగు జ్వరం క్రింద మార్పు చెందే. ఆ పిల్లవాడి తల్లి మిక్కిలి భయపడే..షిర్డీ విడచి అమరావతి
పోవాలనుకుని, సాయంకాలం సాయిబాబా బూటీవాడా వద్దకు చేరినప్పుడు వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగు జ్వరంతో పడియున్నాడని సాయిబాబాకు చెప్పి వారి సెలవు కోరెను. ఆమెపై దయతో సాయిబాబా యిట్లనే "ఇప్పుడు ఆకాశాన్ని మేఘాలు కప్పినా తొందోర్లోనే అవన్నీ చెదిరిపోయి కొద్ది సేపట్లో నింగంతా మామూలుగా మారుననే". అలా అంటూ సాయిబాబా తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గుడ్లంతా నాలుగు పెద్ద ప్లేగు పొక్కులును అచటవారికి చూపే. "చూస్తున్నారా! నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడుతున్నానో! భక్తుల కష్టములన్ని నావిగనే భావించెద." ఈ మహాద్భుత లీలను జూచి సాయి యోగీశ్వరులు తమ భక్తులకొరకెట్లు బాధలను అనుభవిస్తారో జనులకు విశ్వాసం కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనంకన్నా మెత్తనిది, వెన్నెలలా మృదువైనది. యోగీశ్వరులు తమ భక్తులను ప్రత్యుపకారం అడగకనే ప్రేమించెదరు, భక్తులను తమ బంధువులవలే జూచెదరు.

సాయిబాబా లీల... పండరీపురేశ్వర పోవుట...భజన..
సాయిబాబా తన భక్తుల కోరికలను, అవసరాలనెట్లు గ్రహించునో ఈ కధ వివరించు.
నానాసాహెబు చాందోర్కరు సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని మామలత్ దారు. అతనికి పండరీపురానికి బదిలీ జరిగెను, పండరీపురాన్ని భూలోక వైకుంఠమంటారు. అట్టి స్థలమునకు బదిలీ అవ్వటంతో ధన్యుడై వెంటనే పండరీపురం పోయి ఉద్యోగంలో చేరవలే. అందుచే వుత్తరమైనా రాయక వెంటనే షిర్డీకి మీదుగా పండరీపురం పోవలెనని బయలుదేరే. తన విఠోబాయగు షిర్డీసాయిని దర్శించి ఆపై పండరీ పోదామని బయలుదేరే. నానాసాహెబు షిర్డీ రావచ్చునన్న సంగతి యెవరికి తెలియదు కాని సాయిబాబా సర్వజ్ఞుడగుటచే విషయం గ్రహించెను. నానాసాహెబు నీమగాం గ్రామం చేరే సమయానికి సాయిబాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పా షిందే, కాశీరామ్ లతో మాట్లాడుచుండెను. అకస్మాత్తుగా సాయిబాబా వారితో యిట్లనియే "మన నలుగురం కలసి భజన చేసెదము. పండరీద్వారాలూ తెరచినారు, కనుక ఆనందంగా పాడుదాం" అంటూ మసీదులో వున్న వారందరితో కలసి పాట పాడసాగే.. ఆ పాట భావం ఏమిటంటే "నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."
కొద్దిసేపటికి నానా చాందోర్కర్ తన కుటుంబంతో వచ్చి సాయిబాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తన విఠోబా అయిన సాయిబాబాను పండరీపురం వచ్చి తమతో కలసి అక్కడుండుమని వేడుకొనే. అంత మసీదులోని భక్తులు షిర్డీ సాయిబాబా అప్పటికే పండరీపురం పోవలె; అచ్చట వుండవలెనన్న భావమును వెలిబుచ్చుచుండెనని నానాతో చెప్పిరి. అది విన్న నానా మనస్సు కరిగి సాయిబాబా పాదాలపై వ్రాలే. అనంతరం సాయిబాబా ఆజ్ఞను పొంది, ఊదీ ప్రసాదంను గ్రహించి, సాయిబాబా ఆశీర్వాదం పొందిన పిదపే నానాసాహెబు చాందోర్కర్ పండరీకి ఉద్యోగమందు ప్రవేశించుటకు పోయెను. ఇట్టి సాయిబాబా లీలల కంతులేదు.
.......................................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
 జై షిర్డీ సాయినాధ by విసురజ
పదిహేడవ అంకం..


షిర్డీ ప్రయాణ లీల /ధూళిదర్శన మహత్తు....
సాయిబాబా దర్శనానికి షిర్డీ వెళ్ళి రమ్మని మిత్రులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ చాల సార్లు చెప్పినా,, వెళ్లాలని అనుకున్న, అన్నాసాహెబ్ కు వీలవ్వక పోలేదు. ఈ లోగా లోనావోలాలో వుంటున్నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడని వాడిన మందులు, వేయించిన మంత్రాలన్నీనిష్ఫలమయ్యేని తెలిసే. తరువాత తమ గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టినా ప్రయోజనం లేకుండే. అప్పుడు నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుల ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు, వారిన్ నమ్మనేలా నేను షిర్డీ పోనేల?" అని భావించి తన షిర్డీ ప్రయాణం విడనాడే. మిత్రుడైన నానాసాహెబ్ చందోర్కర్ నేను షిర్డీ ప్రయాణం వాయిదా వేయుటపై కోపించే. అందుచే ఆ రాత్రికే షిర్డీ పోవ నిశ్చయించితిని. దాదర్ వెళ్ళి మన్నాడ్ పోయే మెయిల్ (రైలుబండి) సరిగ్గా బయలుదేరేటప్పుడు నేనున్న కంపార్ట్మెంట్లోకి సాయిబోకడు వచ్చి నా వస్తువులను జూచి ప్రయాణ వివరాలడగి వివరాలు తెలిసి, మన్మాడ్ పోవు రైలుబండి దాదర్ లో ఆగదనే విషయం చెప్పి వెంటనే బోరుబందర్ స్టేషనుకు పోమ్మని నాకు సలహా చెప్పే. ఈ చిన్న సాయిలీల వల్ల అదృష్టవశాత్తు సమయానికి షిర్డీ చేరా. అక్కడ సాఠేవాడలో కాకాసాహెబు దీక్షిత్ వేచి వుండే. టాంగా దిగిన వెంటనే నాకు సాయిబాబాను దర్శించుటకు ఆత్రం కలిగే.అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ సాయిబాబా సాఠేవాడా చివరన ఉన్నారని చెప్పి ముందు ధూళి దర్శనం చేసి రమ్మని సలహా యిచ్చే. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చుననే. వెంటనే వెళ్లి ధూళి దర్శనం చేసుకొని సాయిబాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయంగా ఆనందం పొంగిపోయే. మిత్రుడు నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికన్నా ఎన్నో రెట్లు ఆనందం అనుభవమైనది. నా సర్వేంద్రయాలు తృప్తి చెంది ఆకలిదప్పికలు మరచితి. సాయిబాబా పాదాలు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నన్ను షిర్డీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితునిగా భావించితిని. వారి ఋణాన్ని నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల మనలో కలుగు చిత్రమైన ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలం తగ్గును. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటి. సాయిబాబాను చూచినంత మాత్రానే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను.

వాదం/వివాదం అలాగే అన్నాసాహెబ్ కి హేమద్ పంత్ నామకరణం....
షిర్డీ చేరిన మొదటిరోజున అన్నాసాహెబ్ కు బాలాసాహెబ్ భాటేకు గురువు యొక్క అవశ్యకతను గూర్చి గొప్ప వాదం/ వివాదం జరిగెను. మన స్వీయ స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నఅన్నాసాహెబ్ వాదించే. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క అవశ్యకత ఏమిటి? తమంతట తామే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెనని ఏమీ చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడంటూ నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. బాలసాహెబ్ భాటే మరోమార్గంలో వాదించుచు "కానున్నది కాకమానదు, ప్రారబ్ధం విషయంలో మహనీయులు కూడ ఓడే. మనిషి ఒకటే తలస్తే భగవంతుడు వేరొకటి తలంచు. తెలివితేటలను మాటటుంచు, గర్వం కాని అహంకారము కాని నీకు తోడ్పడవు" ఇట్లా గంట పాటు వాదన జరిగెను. ఈ వాదన వల్ల మా మనశ్శాంతి తప్పినది. చివరకు అందరం శరీర స్పృహ, అహంకారం లేకున్నచో వాదాలకు, వివాదానికి తావులేదని నిశ్చయించితిమి. చివరగా తెలిసిందేమిటంటే అన్నీ వివాదాలకు మూలకారణం అహంకారం. తరువాత అందరం మసీదుకు పోగా, సాయిబాబా కాకాసాహెబ్ ను పిలిచి "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదం? అది దేనిని గురించి? అన్నాసాహెబ్ ను చూపుతూ ఈ హేమద్ పంత్ ఏమని పలికెను?" అని అడిగే.. ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరంగా వున్నది. మరి మా వివాదం గూర్చి సాయిబాబా ఎట్లా తెలిసే? సాయిబాబా సర్వజ్ఞూడై వుండాలి లేనిచో మా వాదన ఎలా తెలిసింది? సాయిబాబా మన అంతరాత్మకి పైఅధికారియై వుండవచ్చును. అలాగే నన్నెందుకు హేమద్ పంత్ అను బిరుదుతో పిలిచెను? అసలు ఈ హేమాద్రిపంతు ఎవరని యోచించే.

హేమాద్రిపంతు నామ విశేష మహిమ..పోలిక, సాయిబాబా ముందుచూపు.....
హేమాద్ పంత్ హేమాద్రిపంతు అను నామానికి మారుపేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్ప గ్రంధములను రచించినవాడు; మోడి భాషను కనిపెట్టినవాడు. క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. మరి అన్నాసాహెబ్ ధబోల్కర్ వానికి వ్యతిరేక బుద్ధి గలవాడు. మేధాశక్తి పెద్ద లేనివాడను. మరి నన్ను ఎందుకు అలా అన్నారో తెలియకుండే. ఆలోచన చేయగా నన్ను అహంకారంను చంపుకొమ్మని, అణకువ, నమ్రతలు కలిగి వుండవలెనని సాయిబాబా కోరికకై వుండవచ్చునని గ్రహించితిని. సాఠేవాడలో జరిగిన వివాదములో గెలిచినందులకు సాయిబాబా యీ రీతిగా తెలివికి అభినందనగా అన్నారని అనుకొంటిని. భవిష్యచ్చరితను బట్టి చూడగా బాబా పలుకులకు (దభోల్కరును హేమడ్ పంతు అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసి అలా అన్నారని భావించవచ్చును. ఎందుకనగా హేమద్ పంత్ శ్రీ సాయి సంస్థానంను చక్కని తెలివితేటలతో నడిపించే. లెక్కలను చాల బాగుగనుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయాలతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించేను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
 జై షిర్డీ సాయినాధ by విసురజ
పదహారవ అంకం..


షిర్డీ సాయి ఆశీర్వాదం..
...ముందు అంకంలో చెప్పుకున్న గోధుములను విసిరి మరియు విసిరించి ఆపై ఆ విసిరిన పిండిని ఊరిబయట చల్లించి కలరా అనే భయంకర జాడ్యమును తరిమివేసిన సాయిబాబా వారి పవిత్ర జీవితం, వారి బోధలు.. సత్యము, ఆధ్యాత్మిక మార్గాలను చూపే.. అటువంటి మహనీయుడైన షిర్డీ సాయిబాబా వారి సత్చరిత్ర వ్రాయ సంకల్పిస్తే అది ఒక మహాయజ్ఞమే కదా! చూడబోతే "నాకు ఇష్టుడైన సన్నిహితుని జీవితచరిత్రే నాకు తెలియదు. నాలోని నాదు మనస్సే నాకు గోచరం కాకున్నది మరి షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరునెట్లు తెలియగలం? వేదాలే వారిని పొగడలేకుండే, స్వయంగా యోగైతే గాని యోగి జీవితాన్ని గ్రహించలేడు. అలాంటప్పుడు మరి వారి మహిమలను సామాన్యుడిని నేను కీర్తించగలనా? సప్తసముద్రాల లోతును కొలవొచ్చు, ఆకాశాన్ని గుడ్డలో చుట్టివేసి మూయవచ్చు కాని సద్గురువు షిర్డీ సాయిబాబా వంటి యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట చాలా కష్టము మరియు యిది గొప్ప సాహస కార్యమని తెలుసు కాబట్టి షిర్డీనాధుని శ్రీ సాయీశ్వరుని అనుగ్రహంకై ప్రార్థించితి..
జ్ఞాన బోధలు, జ్ఞాన రచనలు
మహారాష్ట్రలోని మొట్టమొదటి కవి, యోగీశ్వరుడగు 'జ్ఞానేశ్వర' మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునన్నారు. ఏ భక్తులైతే యోగుల చరిత్రలను వ్రాయలనుకుంటారో వారి కోరికలు నెరవేరునట్లు వారి రచనలు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గాలు చూపెదరు. సిద్దయోగులే తమ మనిషిని ఎంచుకుని ప్రేరేపించి, వారి కధలను వారే స్వయంగా రచింపించుకుంటారు..దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి, వారి వారి కార్యాలను వారే కొనసాగించుకొనే. 1700 వ సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు తలచే. యోగులే అతనిని ప్రోత్సాహించి, కార్యాన్ని పూర్తిచేసిరి. మహీపతి పండితులు నాలుగు గ్రంథములను వ్రాసే. అవి భక్తవిజయము, సంత్ విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతములు.
అట్లే 1800 వ సంవత్సరంలో దాసగణు యొక్క సేవను యోగులు ఆమోదించిరి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతము సంత్ కథామృతములు. అలాగే భక్తలీలామృతములోని 31, 32, 33 అధ్యాయలందును, సంత్ కథామృతములోని 57వ అధ్యాయమందును షిర్డీ సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలను చక్కగా చెప్పబడినవి. ఈ అధ్యాయాలు కూడ అందరు చదివితే చాల మంచిది. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంధ్రా నివాసియగు సావిత్రిభాయి రఘునాథ్ టెండుల్కర్ చక్కని చిన్న పుస్తకములో వర్ణించారు. దాసగణు మహారాజు కూడ శ్రీ సాయి పాటలను మధురంగా వ్రాసిరి. అలాగే గుజరాత్ భాషలో శ్రీ సాయి కథలను కొంతమంది వ్రాసి వున్నారు, తెలుగులోను, మరాఠీలోను షిర్డీ సాయిబాబా లీలల గ్రంధాలను చాల వచ్చి వున్నాయి. ఇన్ని గ్రంధాలుండగా ప్రస్తుత జై షిర్డీ సాయినాధ వ్రాయుట ఎందుకనగా దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రంవలే విశాలమైనది; లోతైనది. దీనియందు మునిగి అందరు భక్తి జ్ఞానమణులను తీసుకుని కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిని బోధించే కథలు, లీలలు అందరికి మిక్కిలి ఆశ్చర్యం కలుగించు. మనస్సు బాగాలేని వారికి మనశ్శాంతి కలుగచేయు. మోక్షానికి కావలసిన జ్ఞానం, బుద్ధిని యిచ్చును. వేదాలవలే రంజకమైన సాయిబాబా ప్రబోధలు, ఉపదేశాలన్నీ విని, వాటిని పాటించినచో భక్తులు కోరేవి పొందదెరు. సాయిబాబాను గురించి తెలియని వారికి, సమాధికి ముందు జరిగిన విషయాలు తెలియని భక్తులకు ఈ జై షిర్డీ సాయినాధ లోని సాయిలీలలు చాలా ఆనందం కలుగజేయు. అందుచే షిర్డీ సాయిబాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధనలు తెలియపరచుటకు నడుం బిగించితి. నా ఇష్టధైవమగు సాయిబాబాయే యీ కార్యానికి నన్ను ప్రోత్సహించే. నా అహంకారాన్ని వారి పాదములపై నుంచి శరణంటి. కనుక నా మార్గం సవ్యమైనదని, సాయిబాబా యిహపరసౌఖ్యాలు తప్పక ప్రసాదించునని నమ్మితి.
సాయిబాబా లీలల పుస్తకరచనకు ఆశీర్వాదం అందించుట
సాయిబాబాతో ఆయన ముఖ్యభక్తుడైన మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా ద్వారా హేమద్ పంత్ అనబడే అన్నాసాహెబ్ దభోల్కర్ సాయి జీవిత చరిత్రను (శ్రీ సాయి సత్చరిత్ర రాసిన మహానుభావుడు) వ్రాయ తలచాడని యిట్లా అడిగించే.. "భిక్షాటానపై జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరం లేదనవద్దు, మీరు సమ్మతించి సహాయపడినచో ఆ అన్నాసాహెబ్/హేమద్ పంత్ వ్రాయగలడు లేదా మీ చల్లని కృపే దానిని సిద్ధింపచేయు. మీ అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏమి ఎవరూ ఏమీ జయప్రదంగా చేయలేరు." దీనిని వినినంతనే సాయిబాబా మనస్సు కరిగి హేమద్ పంత్ కు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించే. ఆపైన షిర్డీ సాయిబాబా ఇట్లా సెలవిచ్చే "కథను, అనుభవాలను, ప్రోగుచేసి అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేస్తాను. రాసేవాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసుకుని నా భక్తుల కోరికలు నెరవేర్చద. రాసేవాడు తన అహంకారంను విడిచి దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో యిలా చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేద. వారి జీవిత చర్యలలోనే కాదు, సాధ్యమైనంతవరకు వారి గృహకార్యలందును తప్పక తోడ్పడేను. వాని అహంకారం పూర్తిగా పోయిన పిమ్మట నేను వ్రాసే వాని మనస్సులో ప్రవేశించి నా సత్ చరిత్రను నేనే వ్రాసుకొంటా. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు తప్పక కుదిరి, ఆత్మసాక్షాత్కారం బ్రహ్మానందాన్ని పొందెదరు. నీకు తోచినదే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకు, యితరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయ మందైన కీడు, మేలు యెంచు, వివాదం కూడదు." హేమద్ పంత్ కు సాయిలీలలు వ్రాయుట సమయంలో సాయిబాబా తెలిపిన ఈ ఆణిముత్యాల సరాలను, జీవన సారాన్ని గ్రహించి, దాని అన్వయించుకుని ఈ 'జై షిర్డీ సాయినాధ' పుస్తక వ్రాయుట ముందు నేను శ్రీ షిర్డీ సాయినాధుని ముందు మ్రోకరిల్లి వారి శరణు వేడి, శ్రీ షిర్డీ సాయి అనుమతి, ఆశీర్వాదం పొందితి.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Monday, 29 July 2013

 జై షిర్డీ సాయినాధ by విసురజ
పద్నాలుగు మరియు పదిహేనవ అంకాలు..


షిర్డీ సాయి విచిత్ర చర్యలు.. అపూర్వ లీలలు
.......
1910వ సంవత్సర దీపావళి పండుగరోజు సాయిబాబా ధునివద్ద కూర్చుండి చలి కాచుకోనుచుండే. సాయిబాబా బాగా మండుటకై ధునిలో కట్టెలు వేయుచుండే. ధునిలో మంట బాగుగా మండుచుండే. అకస్మాత్తుగా, అంతలో సాయిబాబా ధునిలో కట్టెలను వేయుట మాని తనచేతిని పెట్టే. వేడిమికి వెంటనే చేయి కాలిపోయే. అది చూచిన, మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండే వెంటనే పరుగెత్తి సాయిబాబాను గట్టిగా పట్టి వెనుకకు లాగిరి. పిదపా సాయిబాబని "దేవా! ఇట్లేల చేసితిరి" అని అడిగిరి. సాయిబాబా యిట్లు జవాబిచ్చే "దూరదేశాన ఒక కమ్మరి భార్య, కొలిమి తిత్తులను ఊదుచుండ తన భర్త పిలివ తన వొడిలో బిడ్డ వున్నాడన్నా సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడబోవ వొడిలో వున్న బిడ్డ మండుచున్న కొలిమిలో పడే. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ అభం శుభం తెలియని పసిబిడ్డను రక్షించితిని, నా చేయి కాలుట అంత బాధాకరం కాదు, కాని ఆ పసివాడు రక్షింపబడెనన్న విషయం నాకు అమితానందం కలుగచేసే" నని సాయిబాబా తెలిపే. సాయిబాబా వారి కారుణ్యతత్వం, వారి భక్తపరయాణతత్వం యిదొక మచ్చుతునక.
1910 సంవత్సరంలో ఒకనాటి ఉదయాన షిర్డీ మసీదులో నున్న శ్రీసాయిబాబా పళ్ళు తోముకుని మొహం కడుక్కుని బాబా గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యే. నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచి చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు తిరగలిలో వేయుచు విసరసాగిరి. అది చూచిన హేమాద్ పంత్ “ఈ గోధుమపిండిని బాబా యేమి చేయును? ఆయన గోధుమలు ఎందుకు విసరుచుండే? అయినా భిక్షాటనంచే జీవించువారే! వారికి గోధుమపిండితో పనేమి? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” అనుకొనే. మసీదుకు వచ్చినా బాబాను ప్రశ్నించుటకు ధైర్యంగ అడుగుటకు ఎవరు సాహసింపలేదు. విషయం తెలిసి గ్రామంలోని ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై అక్కడకు చేరిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి సాయిబాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని, సాయిబాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఆ చర్యలకు బాబాకు కోపము వచ్చినా వారి ప్రేమకు భక్తికి చాల సంతోషించి చిరునవ్వు చిందించిరి. తిరగలి విసురుతు స్త్రీలు లోలోన యిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లు పిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, వారు పోషించవలసిన వారెవరును లేరు. భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. ఈ పరిస్థితులలో సాయిబాబాకు గోధుమపిండితో పనేమి? సాయిబాబా మిగుల దయమయుడవుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు” అనుకోని ఆడిన పిండిని నలుగురు స్త్రీలు నాలుగు భాగాలు చేసి తలో భాగం తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగున్న సాయిబాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనే..
“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టిందా? ఎవరబ్బ సొమ్మనుకొని పిండిని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని తీసుకుపోవ చూచుచున్నారు? అయితే సరే, నే చెప్పినట్లు చేయుడు. ఆడిన పిండిని తీసికొనివెళ్లి గ్రామపు సరిహద్దులపైన చల్లండి”
యిదంతా వినిన వనితలు ఆశ్చర్యం కలిగి తమ ఆలోచనలకు సిగ్గుపడి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి సాయిబాబా అజ్ఞానుసారము ఆ పిండిని నాలుగు వైపులా చల్లిరి.
హేమాద్ పంత్ ఇదంతా చూసి షిర్డీ ప్రజలను సాయిబాబా చర్యను గూర్చి ప్రశ్నించ వారందరు ఊరిలో కలరా జాడ్యము గలదని దానిని శాంతింపచేయుటకై ఇదొక బాబా తీరు, సాధనమని చెప్పిరి. అక్కడ సాయిబాబా విసరినవి గోధుమలు కావని, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలారనియు చెప్పిరి. అప్పటి నుండి షిర్డీ గ్రామంలో కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన చూసిన హేమాద్ పంత్ కు మిక్కిలి సంతసము కలిగే. ఆ చర్యలోని గూడార్ధమును తెలియ కుతూహలం కలిగే. గోధుమపిండికి కలరా జాడ్యమునకు అసలు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేయు? ఇదంతయు అగోచరముగా తోచే.
తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము
తిరుగలి విసరుటను గూర్చి షిర్డీ ప్రజలు అనుకొన్న రీతియే కాక చూడ దానిలో వేదాంత భావం కూడ కలదు. సాయిబాబా షిర్డీ యందు సుమారు 60 ఏండ్లు నివసించే. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; పైరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపాలను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవచ్చు. అహంకారమును చంపుకొనవలయును.
ఇక్కడ భక్త కభీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతి తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగే . నిపతి నిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగా కభీరు ఇట్లు జవాబిచ్చే “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:
“భయములేదు! తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
 జై షిర్డీ సాయినాధ by విసురజ
పెన్నెండు మరియు పదమూడవ అంకాలు..



భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును. (1)నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణస్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటిదానిని కొందురు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. శ్రీ కృష్ణ పరమాత్మ "భగవద్గీత" 12వ అధ్యాయములో తెలిపినట్లు సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మానవుడు ఆకారముతో వున్నందున భగవంతుని గూడ సగుణ ఆకారముతో నున్నట్లుగానే భావించి, పూజించుట సులభము; సహజము.
మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళవరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధిచెందవు. పోను పోను ఆ భక్తి అధికమై నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడు నిత్యం పూజింపదగినవి. సద్గురవు వీని యన్నిటికంటె వున్నతుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించి వారి నిర్మోహమున కవతారము; పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులపై భక్తియే ఆసనము. మనఃకోరికలన్నియు నిరసించుటయే సంకల్పము (పూజ ప్రారంభించి పూర్తిచేసెదమను మనో నిశ్చయము). కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతుడందురు. అందరికి బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసినవారిని క్షమించువారు. ఎన్నడు కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పుకలిగి, సంతుష్టిగానుండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతోనున్నప్పటికి నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడు ఉద్రేకము, అభిమానము లేకుండ నిత్యముక్తులుగా ఉండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు అనేకుల దాహమును తీర్చుచున్నది అట్లనే సాయివంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కినవారందరికి సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు, జీవత్ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు చెప్పినాడు. వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిర్డీలో సాయిరూపముగా అవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తరీయ ఉపనిషత్తు). ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిర్డీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా యెవరిని యాశ్రయించి యుండలేదు. వారి అసనము కొరకు గోనెసంచి నుపయోగించిరి. భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల యభిప్రాయము నెరవేర్చును. వారి యిష్టానుసారము తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరముల తోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిర్డీలో నివసించునట్లు కన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి తత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు సాష్టాంగనమస్కా చెప్పుకుంటూ ఈ క్రింద విషయాన్నీ చూద్దాం.
బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలిపే రెండు విషయాలు.. వివరణ
(1) ఒకనాడు సాయంకాలం షిర్డీలో గొప్ప తుఫాను సంభవించెను. దట్టమైన నల్లని మేఘముల ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నియు పక్షులు, జంతువులు, మనుష్యులు, మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేకస్థానిక దేవత లున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరు తుఫానును ఆపి వేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి, బిగ్గరగా నిట్లు గర్జించిరి. "ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు." కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.

(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంట యపరిమితముగా లేచెను; మసీదు వెన్ను పట్టీలవరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను (పొట్టి కఱ్ఱ) దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు 'దిగు, దిగు, శాంతించుము' అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు, వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల రక్షించును. ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టము లన్నిటినుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి, కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై, మోక్షాన్ని సంపాదించెదరు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
 జై షిర్డీ సాయినాధ by విసురజ
పదకొండవ అంకం..

బాబా అనూహ్య లీల..నీళ్ళను నూనేగా మార్చుట
..........................................................
షిర్డీ సాయిబాబాకు దీపాలన్న చాల యిష్టం. ప్రతిరోజు ఊరులోనున్న షావుకార్లను నూనే యాచించి తనుండే మసీదులో రాత్రిపూట దీపాలు వెలిగించుచుండే. షావుకార్లు కొన్నాళ్ళు నూనే యిచ్చిన పిమ్మట ఆ షావుకార్లు అందరూ కూడబలుక్కుని రోజూ నిత్యం ఖరీదుకు కాక వుత్తినే నూనే యివ్వడం దండుగని తలచి బాబాకు నూనే ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. ఎప్పటివలే సాయిబాబా వారి వారి దుకాణాలకు పోగా వారంతా నూనే లేదనిరి. మారు మాటాడక, కలత చెందక, సాయిబాబా మసీదుకు చేరి ప్రమిదలలో వట్టి వత్తులు మాత్రమే పెట్టి, రెండు మూడు మిగులు నూనే చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్ళు పోసి, వాటిని త్రాగి పావనం చేసి, తిరిగి ఆ నీటిని ఆ డోక్కులోకే వుమ్మివేసి ఆ నీటినే సాయిబాబా ప్రమిదలలో పోసేను. వెనకగా నక్కి, సాయిబాబా ఏమి చేస్తారోనని, షావుకార్లు ఆతురుతతో చూస్తుండిరి. దూరంగా వుండి పరీక్షించుచున్న షావుకార్లు ఆశ్చర్యపోయేటట్టు ప్రమిదలన్నీ వెలగడమే కాక తెల్లవార్లు చక్కగ వెలుగే. అంతా చూచినా షావుకార్లు పశ్చాత్తాపపడి, కాళ్ళపై పడి క్షమాపణ కోరిరి. సాయిబాబా వారిని క్షమించి యిహ మీదట మంచిగా నడుచుకొమ్మని హితవు పలికే.

కపట గురువు... జౌహర్ ఆలీ ..కధ
........................................
అహమద్ నగర్ నుంచి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో షిర్డీకి దగ్గరలోనే వున్నా రహాతా అనే వూరు వచ్చేను. ఆటను తన శిష్యులతో వీరభధ్ర మందిరం సమీపాన నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు; ఖురానంతయు చక్కగా వల్లించగలడు, మధుర భాషణ చతురుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. అట్లా వచ్చిన వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ముస్లిమల పండుగైన ఈదుల్ ఫితర్ నాడు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించు గోడయే "ఈద్ గా". ఆ విషయములో గ్రామస్తుల మధ్యలో కొట్లాట జరిగిన పిమ్మట ఆ మాట గురువు జౌహర్ అలీ రహతా విడిచిపెట్టవలసిన అవసరం ఏర్పడడంతో ఆ మత గురువు జవహర్ అలీ షిర్డీ గ్రామానికి వచ్చి సాయిబాబాతో మసీదులో వుండసాగే. షిర్డీ గ్రామ అమాయకపు ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. జవహర్ ఆలీ షిర్డీ సాయిబాబాను తన శిష్యుడని అందరితో చెప్పువాడు. సాయిబాబా దేనికి అడ్డుచెప్పక ఆయన శిష్యునిలానే సేవలు చేయసాగే. కొంతకాలం పిదప జవహర్ ఆలీ, షిర్డీసాయిబాబా (గురువును శిష్యుడును) రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించే. గురువునకు శిష్యుని శక్తి ఏమి తెలియకపోయినా కాని శిష్యునికి గురువు యొక్క లోపాలు బాగా తెలుసు. ఆన్నీ తెలిసినప్పటికి స్వయం ప్రకటిత గురువు గారిని నెప్పుడు అగౌరవించలేదు. సదరు గురువు గారి పనులన్నియు శిష్యుడిగా మారి షిర్డీసాయి చక్కగా నెరవేర్చుచుండే. వారిరువురు అప్పుడప్పుడు రహతా ఊరునుంచి షిర్డీకి వచ్చి పోవుచుండే. షిర్దీ ప్రజలకు సాయిబాబా అధికంగా రహాతా ఊరులో నుండుట ఎంతమాత్రం యిష్టము లేకుండే. అందుచే వారందరు కలసి రహాతా నుంచి సాయిబాబాను షిర్డీకి తెచ్చుటకు పోయిరి. వాళ్ళకి రహాతా ఊరులో బాబాను "ఈద్ గా" వద్ద కనబడే. వారందరు సాయిబాబాతో మిమ్మల్ని తిరిగి షిర్డీ తీసికొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. అంత, షిర్డీ సాయిబాబా ఇట్లనే "ఫకీరు ముక్కోపి; చెడ్డవాడు, తనను విడిచిపెట్టడు" కనుక ఆ ఫకీరు వచ్చు లోపల వాళ్ళని, తనని తిరిగి తీసుకెళ్ళుటపై ఆశ విడిచి, తిరిగి షిరిడీ వెళ్లిపోవుట మంచిదని సాయిబాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా, సదరు ఫకీరు వచ్చి బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలను మందలించెను. కొంత వివాదం జరిగిన పిమ్మట గురువు గారు, శిష్యుడును తిరిగి షిర్డీ పోవుటకు నిర్ణయం జరిగే.
ప్రజల కోరికపై వారిరువురు షిర్డీ చేరి అచ్చట నివసించుచుండే. సాయిబాబా షిర్డీ ప్రవేశించుటకు 12 సంవత్సరాలు ముందే, దేవీదాసు అనే సాధువు, 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా షిర్డీ చేరి మారుతి దేవాలయంలో వుండే. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రాలు కలిగి నిర్వ్యామోహిత అవతారమువలే, జ్ఞానిలా కనపడుచుండే. కొంత సమయమైన పిమ్మట దేవీదాసు కపటగురువైన జవహర్ ఆలీని పరీక్షించి అతనిలో అనేక లోపాలున్నాయని కనిపెట్టే. షిర్డీ గ్రామంలో తాత్యా పాటిల్, కాశీనాథు మొదలుగు వారు అనేక మంది దేవీదాసును తమ గురువుగా మన్నించుచుండిరి. వారందరు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తెచ్చిన పిదప జరిగిన ధర్మ మత వాదములలో తగిన సమాధానమివ్వలేక, జవహర్ ఆలీ దేవీదాసు చేతిలో ఓడిపోయి షిర్డీ విడిచి బీజాపూర్ కు పారిపోయే. చాల ఏండ్ల తరువాత పరివర్తన చెందినా పిమ్మట షిర్డీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడే. తాను గురువు, సాయిబాబా శిష్యుడనే అభిప్రాయం వాని మనస్సునుండి తొలగేను. జవహర్ ఆలీ పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వానిని గౌరవంగానే చూచే. ఈ విధముగా బాబా, శిష్యుడు గురువును ఎట్లా కొలువవలెనో ఏ విధంగా అహంకారంను విడిచి గురువుకి శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారంను పొందవలెనో నిరూపించే.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Saturday, 29 June 2013

జై షిర్డీ సాయినాధ 
 దశవ/పదవ అంకం..

బాబా భిక్షాటన.. సందేశం
.........................
షిర్డీలో నివసించినంత కాలం సాయిబాబా నిత్యం భిక్ష చేసేవారు.. నిత్యభిక్షమెత్తే లయకారుడైన పరమయోగి పరమశివుని అవతారమై నిత్యం షిర్దిలోని ఇవ్వగల శక్తి, ఇచ్చే ఆశక్తి వున్న మువ్వురు సంపన్న కుటుంబాల ఇండ్లకు పోయే బిక్షమడిగెడివారు..అందరికి అన్నీ క్షణంలోనే అందించగల సర్వశక్తిమయి సాయి మరి అడుక్కోవడేమేమిటన్న మీమాంశ సంశయ జనులకు ఆనాడు కలిగింది, ఈనాడు కలుగుతూనే వుంటుంది.. ఎందుకంటే బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటన చేసి జీవితాంతం గడుపనేలనే ప్రశ్నకు రెండు వివరణలు తెలియవచ్చే (1) భిక్షాటన చేసి జీవించుటకై హక్కు ఎవరికీ వుంటుంది (2) పంచసూనములు అనే పాపాలను పోగొట్టుకొనుడెట్ల?
పైన వేసుకున్న మొదటి ప్రశ్నకు ప్రతిగా ఇట్లా తెలుసుకోవచ్చు...సంతానం, ధనము, కీర్తి సంపాదించుటపై మొహం వదిలి సన్యసించువారే భిక్షాటనచే జీవింపవచ్చునని మన శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. అటువంటివారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికుని, తినలేరు. వారికి భోజనం అందించే బాధ్యత గృహస్థులపైనే కలదు. మరి చూడంగా సాయిబాబా గృహస్థుడు కాడు; వానప్రస్థుడు కూడ కాడు. షిర్డీ సాయి అస్ఖలిత బ్రహ్మచారి. బాల్యం నుంచే బ్రహ్మచర్యము అవలంబించిన ధీరుడు. ఈ సర్వ జగత్తు వారి వాసమని, గృహమని వారి ఉవాచ. ఈ మిధ్యా జగత్తునకు వారే కారణభూతులు. ఈ జగత్తు సమస్తం సదా ఆధారపడి వున్నది. షిర్డీ సాయి పరమానంద కారకులు, పరబ్రహ్మ స్వరూపులు. కనుక వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.
పైన అనుకున్న రెండో ప్రశ్నకు సమాధానంగా ఇట్లా చెప్పుకోవచ్చు... పంచసూనములనే పాపాలనుండి తప్పించుకొను మార్గాన్ని యోచిస్తే ముందుగా మరి ఆ పంచసూనలేమిటి అన్నది తెలియరావాలిగా...భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. 1. దంచుట, రుబ్బుట 2. విసరుట 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5. పొయ్య మంటించుట. ఈ అయిదు పనులు సలిపేటప్పుడు కనబడని అనేక క్రిమికీటకాదులు మరణించుట జరుగును. ప్రతిగా ఆ పనులను నిర్వహించిన గృహస్థులు ఆ పాపాన్ని అనుభవించవలే. ఈ పాప పరిహారానికి శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచే
1. బ్రహ్మ యజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృ యజ్ఞము, 4. దేవ యజ్ఞము, 5. భూత యజ్ఞము, 6. అతిథి యజ్ఞము. శాస్త్రాలు చెప్పిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల కర్మలు మనస్సులు పాపరహితములగును. ముక్తికి, మోక్షసాధనకు ఆత్మసాక్షాత్కారమునకు యివి తోడ్పడు. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష అడుగుటచే, ఆ యింటిలోనివారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను, భిక్ష వారిస్తే గైకొని వారి పంచాసూనాల పాపాల్ని నుంచి కాచే. దైవమైన సాయిబాబానే స్వయముగా యేతెంచి, ఒకరి వద్దకు పోకనే, గృహస్తులకు తమ తమ ఇంటిగుమ్మం ముంగటే, ఇంత గొప్ప సంగతి సాయిబాబా బోధించుట, వారి పంచసూన పాపాలను హరించుట వలన షిర్డీ ప్రజలెంతటి ధన్యులు, ఎంతటి పూర్వ పుణ్య లబ్ధిదారులో కదా..

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?
ఒకప్పుడు ఆత్మారాముడనే భక్తుని భార్య షిర్డీకి వచ్చే. ఒకనాడు మధ్యాహ్నభోజనము తయారయ్యిన పిమ్మట అందరికి వడ్డించిరి. అంతలో ఎక్కడనుంచో ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొఱుగుట ప్రారంబించే. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసరే. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినే. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా, ఆమెను చూసి బాబా యిట్లనే "తల్లీ! నాకు కడుపు నిండా గొంతువరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందే. ఎల్లప్పుడు ఇట్లనే చేయి తల్లి. ఇది నీకు సద్గతి కలుగజేయు. ఈ మసీదులో నుంచి అబద్దం చెప్పను. నా యందు ఆ దయ అట్లనే ఉంచు. మొదట యాకలితో నున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపు. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తికి ఉంచుకో" అని పలికే. అంటా విన్నా ఆమెకి ఏమి అర్ధం కాలేదు. అంత ఆ తల్లి యిట్లనే.. 'బాబా! నేను నీ కెట్లు భోజనం పెట్టగలను? నేనే నా భోజనంకై మరొకరిపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను.' అందులకు బాబా యిట్లు జవాబిచ్చే " తల్లి నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు నీవు ఏ కుక్కను జూచి రొట్టె పెట్టితివో అది నేను ఒక్కటే, వేరు కాదు. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగగలవన్నియు నా యంశములే, నేనే వాని ఆకారాలలో తిరుగుచున్నాను. ఎవరయితే సర్వ జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటనే ద్వంద్వ భావమును విడనాడి నన్ను సేవింపుము". ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు సంతోషంచెందే. ఆమె కన్నులు కన్నీటితో నిండే. డగ్గుత్తితో గొంతు ఆర్చుకొనిపోయే. ఆమె అనందమునకు అంతులేకుండే.

నీతిసారాంశం
జీవులన్నిటిలోను భగవంతుని చూడాలన్నదే యీ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుడిని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన విషయాన్ని సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకంగా నిర్థారణ చేసి వున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతాలను భోధించు చక్కని మానుష రూపేణ వున్నా గురువని, దైవమని తెలియవలే..
.....
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ 
 తొమ్మిదవ అంకం..

బాబా ఆహార్య, ఆచార వ్యవహారాలు.
............................................
షిర్డీ వచ్చిన మొదట్లో సాయిబాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించే. మరి ఆ గ్రామములో కుస్తీలాడటం ఒక రివాజుగా వుండే. ఆ గ్రామంలో మొహియుద్దీన్ తంబోలి అనే వస్తాదు తరచుగా కుస్తీలు పట్టుచుండే. ఒక విషయములో భేదాభిప్రాయం వచ్చి సాయిబాబా అతనితో కుస్తీపట్టి వోడిపోయే. నాటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు తీరును మార్చుకొనే. మొలకు లంగోటి బిగించుకొని, పొడవు చొక్కాను తొడిగి నెత్తిపైనొక గుడ్డ కట్టుకొనేవారు. ఎల్లప్పుడూ ఒక గోనె ముక్కపై కూర్చునే. గుడ్డలు పాతవైనా, మాసిన, చిరిగినా అస్సలు దిగులు చెందక సంతుష్టిగా వుండేవారు. రాజ్య భోగాలు కంటే దారిద్ర్యమే మేలని పలికే. దరిద్రుని స్నేహితుడు భగవంతుడని నిత్యం తెలిపే. మరో యోగైన గంగాఘీరుకు కూడ కుస్తీలపై ప్రేమ. అతనికి కూడా కుస్తీ పట్టుచుండగానే ఒకనాడు వైరాగ్యము కలిగే. అప్పుడే శరీరాన్ని మాడ్చి దేవుని సహవాసం చేయమని ఆకాశవాణి పలికే. అప్పటినుండే గంగాఘీరు సంసారమును విడిచే. ఆత్మసాక్షాత్కారంకై పాటుపడే. పుణతాంబే దగ్గర నది ఒడ్డునొక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండే.
సాయిబాబా జనాలతో కలసి మెలసి తిరుగేవారు కారు. అడిగితేనే జవాబిచ్చే. రోజంతా వేపచెట్టు నీడలో, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునున్న తుమ్మ చెట్టు నీడనా కూర్చునుచుండే. సాయంకాలంనందు పచార్లు పోయే లేదా పక్క ఊరైన నీమగాం పోవుచుండే. త్రయంబక్ జీ డేంగ్లే యింటికి తరచుగా పోయేవారు. డేంగ్లేపై సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అలాగే అతని తమ్ముడైన నానాసాహెబ్ పట్ల కూడా.. నానాసాహెబ్ ద్వీతీయ వివాహం చేసుకున్న సంతానం కలుగలే. నానాసాహెబ్ ను బాబాసాహెబు డేంగ్లే బిడ్డ కలగాలని కోరామని, అర్ధించమని ఫకీర్ సాయిబాబా వద్దకు పంపే. దయతలచే సాయిబాబా, వారి కరుణతో పుత్ర సంతానం కలిగే. ఆ విషయం బయటకు పొక్కిన పిదప బాబాను దర్శనానికై ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండే. వారి ఘన కీర్తి సర్వత్ర వెల్లడయ్యే. దూరంగా వున్న అహమద్ నగరు వరకు వ్యాపించే. అక్కడనుంచి నానాసాహెబు చందోర్కర్, కేశవ చిదంబర్ మొదలగు చాల మంది షిరిడీకి రాసాగిరి. దినమంతా బాబాను భక్తులు చుట్టిముట్టెడివారు. సాయిబాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదులో శయనించే. నాడు సాయిబాబా సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తాంబ గ్లాసు, పొడుగుచొక్కా, తలపైనిగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరుండే సటకా మాత్రమే. తలపై గుడ్డను జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడదీసేవారు. ఆ బట్టలను వారాలా పాటు ఉతుకకుండే. చెప్పులను తొడిగే వారు కారు. దినమంతా గోనేగుడ్డపైనే కూర్చొనే. కౌపీనము ధరించి చలిని వారించుటకన్నట్లు ధుని కెదురుగా ఎడమచేయి కట్టడంపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారంను, కోరికలను, ఆలోచనలను ఆహుతి అల్లాయే యజమాని అని అనునిత్యం పలికే. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండే. భక్తులు అక్కడకు పోయి సాయిబాబాను దర్శించుచుండే. 1912 సంవత్సరం తరువాత దానిలో మార్పు కలిగే. పాతమసీదును మరామతు చేసి ఆ నేలపైన నగిషీ రాళ్ళు తాపనచేసిరి. సాయిబాబా ఆ మసీదుకు రాకపూర్వం 'తకియా' (రచ్చ)లో చాలాకాలం నివసించే. అప్పుడప్పుడు బాబా కాళ్ళకు చిన్న చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు, భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.
........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ 
 అష్టమ అంకం..


బాయిజాబాయి సేవా తత్వం

షిర్డీ సాయి బాలుడిగా మొట్టమొదటసారి షిర్డిలోవచ్చినప్పుడూ యోగిలా, విరాగిలా, భయరహితగా, ప్రాపంచిక విషయాలు పట్టని మౌనిలా, ఎప్పుడు ఎక్కడో అడవుల్లో/తుప్పల్లో ఒక చెట్టుక్రింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమై వుండేవారు..వారు అకలిని జయించనవారై ఎవరింటికి వెళ్లక దేహి అనకుండా వుండేవారు.. చలికి, వానకి, ఎండకి దేనికి వెరవక నిత్యం ధ్యాన ముద్రలో వుండేవారు..ఆ సమయంలో సాయిబాబాకి బాయిజాబాయి చేసిన సేవ అద్వీతీయమైనది. బాయిజాబాయి మరియు ఆమె కొడుకైన తాత్య కోటే పాటిల్ లిద్దరికీ ఫకీర్ సాయిబాబా సాక్షాత్ భగవంతుడేనని అపార నమ్మకం. ఆమె భక్తివిశ్వాసాలు చిత్రంగ అపారమైనవి. సాయిబాబా అప్పటికి ఏమి మహత్యాలు చూపక పోయినా వారిని నిత్యం సేవించే అమృతమయి. ఆమె ఒక వకుళ మాతలా, ఒక శబిరిలా షిర్డీ సాయిని అనునిత్యం సేవించేది. బాలుడిగా వెళ్ళిపోయి తరువాత పెండ్లి వారితో తిరిగి షిర్డీ వచ్చిన సాయిని, అంతకుముందు షిర్డీలో వుండే వెళ్ళిన బాల తపస్విగా గుర్తించిన ఆ సాధ్వి, మహాతల్లి, తన భవ్య సేవను ఎన్నడు వీడలేదు. ప్రతిరోజు తలపై గంపలో రొట్టె, కూర పెట్టుకొని అడవంతా తిరిగి సాయిబాబాను వెతికి ఆయన తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్లి, నిత్యం అడవిలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి చాలా సార్లు మైళ్ళకొలది ముండ్లపొదలను దాటి సాయిబాబాను వెదికి పట్టుకొని, సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి విస్తర్లో భోజన పదార్దాలు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి సాయిబాబా వద్దన్న వినక విసుక్కున్నా, కసురుకున్నా లెక్కచేయక బలవంతంగానైనా బాయిజాబాయి సాయికి నిత్యం తినిపించుచుండే. సాయిఫకీరు అవేమి పట్టనట్టు కదలక మెదలక ధ్యానంలో నిమగ్నమైవుండే. ఆ మమతామూర్తి, ఆ నారీమణి అద్వీతీయ సేవను సాయిబాబా తను మహాసమాధి వరకు మరువలేదు. బాయిజాబాయి నిశ్వార్ధ సేవకు ప్రతిఫలంగా బాయిజాబాయి కొడుకైన తాత్యాపాటిల్ కు సాయిబాబా ప్రతిరోజు ఆజన్మాంతం రూ.25/- కానుకగా ఇస్తుండే. చివరాఖరికి ఆ తల్లి బాయిజాబాయి చేసిన సేవకు ప్రతిఫలంగా తనను మావయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే తాత్య కోటే పాటిల్ ప్రాణ రక్షణకై తన ప్రాణాన్ని త్యజించిన మహానాత్మ, శ్రీ షిర్డీ సాయిబాబా. అట్టా బాయిజాబాయి తనకు చేసిన నిస్వార్ధ సేవకు బడలు తీర్చుకున్నారనేటట్టు అలాగే నిస్వార్ధ సేవకు తప్పక మంచి ఫలం వుంటుందని చెప్పకనే చెప్పిన మణిపూస శ్రీ షిర్డీసాయిబాబా. సాయిబాబా తనకు ఫకీరు పదవే పరమార్ధమని, షిర్దియే తన సామ్రాజ్యమని, భక్తుల హృదయాలే తను పాలించే రాజ్యమని భావించే. వారికి స్వలాభాపేక్ష, వంటి మీద, వస్తువుల మీద మమకారం, ప్రేమ లేకుండే. లోకులు తపనపడే ధనం వట్టి తుచ్చమని, బూటకమని, అంతరాత్మ ఆత్మ నడుమ యాత్రకు పనికిరాని ద్రవ్యమని చెప్పుచుండే. మహాతల్లి జాయిజాబాయి తనకై పుట్టలంట, తుప్పలంట, గుట్టలంట తిరుగాడు బాధలు చూడలేక కొంతకాలానికి సాయిబాబా అడవులకు వెళ్ళుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి తుప్పల వెంబడి తిరుగు కష్టము బాయజాబాయకి తీరింది. బాలుడిగా సాయిబాబా 16 యేండ్ల వయస్సులో షిర్డిలో ప్రకటమయ్యే. మూడు సంవత్సరాలు పాటు అక్కడ వుండి హఠాత్తుగా అక్కడ నుండి అదృశ్యమయ్యారు. తరువాత కొంతకాలానికి అప్పటి నైజాం ప్రాంతమైన ఔరంగాబాద్ కు సమీపాన తోటలో చెట్టు కింద చాంద్ పాటిల్ కు కనిపించే. గుర్రం పోయి బాధపడుతున్న చాంద్ పాటిల్ గుర్రం ఆచూకి తెలిపిన తరువాత గుర్రం దొరికిన మీదట చాంద్ పాటిల్ ఈ ఫకీర్ సామాన్యుడు కాదని సంబరంతోతనతో ఇంటికి రమ్మనే. అట్లా చాంద్ పాటిల్ గృహానికి వెళ్లి అక్కడనుండి 20 సంవత్సరముల వయస్సులో చాంద్ పాటీల్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పెండ్లి గుంపుతో బయలుదేరి పెళ్ళికూతురు వూరైన షిర్డీ చేరిరి. అప్పటినుంచి 60 సంపత్సరాలు షిర్డీ వీడక మహాసమాధి (1918వ సంవత్సరం) చెందేవరకు అక్కడనే మసీదులోనే వుండిరి.

........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
.జై షిర్డీ సాయినాధ 
 సప్తమ అంకం..


చేయతగ్గ కార్యాలు..మనష్యుల నియుక్తి, దేవదేవుని యుక్తి.

మందిరాలు, మఠాలు, తీర్ధాలకు వచ్చేవారికై నదివొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించేందకు భగవంతుడు వేర్వేరు పనులకు వేర్వేరు భక్తులకు అప్పజెప్పును. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు, ఆ షిర్డిసాయి దేవుడు నన్నిలా సత్చరిత్ర వ్రాయుమని ఆ భాగ్యాన్ని వరాన్ని నాకందించేరు. నేనేంటి, నేను రాయడమేమిటి అసలే అజ్ఞానిని, అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడిని ఈ మహత్తర దివ్యమైన పనికి నాకు అర్హత వుందాంటూ చాల సొచించా, సంకోచించా అయితే సాయిబాబాని ప్రార్ధించి వారిచ్చిన అభయంతో, తెగువతో శ్రీ షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రను వ్రాయ సంకల్పించా.. మరి ఆ దేవదేవుడు శ్రీ షిర్డీ సాయిబాబాని వర్ణించగల వారెవ్వరు, వారి జీవిత విశేషాలను సమగ్రంగా తెలుపగలవారెవ్వరు? షిర్డీసాయి కరుణయే అంత కఠినమైన పనిని చేసే శక్తిని యిచ్చింది. ఆ షిర్డిసాయి దయవల్ల నేను వ్రాయ మొదలెట్టాగానే సాయిబాబానే నా గర్వము, అభిజాత్యమును తుడిచేసి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవం ఆ షిర్డీ సాయినాధుడికే చెందేను. మనిషిగా పుట్టినప్పటికిని శ్రుతి, స్మృతి (జ్ఞానం, ప్రకాశం) అనే రెండు కనులు లేక ముందుగా సాయి సత్చరిత్రను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని దివ్యమైన అనుగ్రహం మూగవానిని మాట్లాడించు, కుంటివానిని పర్వతాలు దాటునట్లు చేయు. ఇచ్చికముతో పనులు చేయించుటలో, నెరవేర్చుకొనుటలో భగవంతుని చాతుర్యం లోక విదితమేగా. హార్మోనియంకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లా వచ్చిచేరునో మనకి తెలియదు. కాని ఆ వాద్యాలు వాయించువానికది తెలియును. చంద్రకాంతి ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట స్వయముగా తమవల్ల జరగవు, కానీ చంద్రోదయం వల్ల జరుగు.
మానవజన్మయొక్క ప్రాముఖ్యము
ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు వేల కోట్లాది జీవరాసులను సృష్టించాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృజించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రం, ఆకాశం నందు నివసించు జీవకోటిని సృష్టించెను. పుణ్యం చేసి స్వర్గంకు పోయి వారి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట క్రిందకు త్రోసివేయబడుదురు. పాపం చేస్తే నరకానికి పోతారని ప్రతీతీ. అచ్చట తమ పాపాలకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనంకై అవకాశం పొందెదరు. వారి పాపపుణ్యముల చక్రబంధనం నుండి నిష్క్రమిస్తే వారికి మోక్షం అందే.. మోక్షముగాని మరల మరల పుట్టుక గాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడి వుండునన్నది సత్యం.
మానవశరీరముయొక్క ప్రత్యేక విలువ
జీవకోటికి ఆకలి, నిద్ర, భయం, సంభోగం, ఆహారం లాంటివన్ని సామాన్యం. ఇవన్నీ కాకుండా నరులకు మరో శక్తి కూడా కలదు,అదే జ్ఞానము, విజ్ఞానం. దీని సహాయంతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారంను పొందగలడు. ఇంకే జన్మనందు ఈ భవ్య ఆవకాశము లేదు. ఈ కారణం చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచేదరు. వారు కూడ భూమిపై మానవజన్మనెత్తి మోక్షాన్ని సాధించవలెనని కోరేదరు.
మానవజన్మ చాల నీచమైనదని, చీము, రక్తము, మురికితో నిండియుండునని, తుదకు శిథిలమయి రోగమునకు మరణమునకు కారణమగునని కొంతమంది తలుస్తారు. కొంతవరకది నిజమే. ఇన్ని లోటుమాటులున్నప్పటికిని మానవునకు జ్ఞానాన్ని సంపాదించు శక్తి కలదు కాబట్టే మానవ శరీరం మానవ జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిధ్యయని, విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని, అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమును మానవుడు సాధించును. శరీరం మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షాన్ని సంపాదించు అవకాశాన్ని పోగొట్టుకొనెదము కదా. శరీరాన్ని ముద్దుగా పెంచి, విషయసుఖములకు మరిగినచో నరకమునకు వెళ్ళెదము. నడువవలసిన మంచి త్రోవ ఏమిటంటే శరీరమును నశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరువరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు లేక అత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదు ఎందుకనగా భగవంతుని శక్తినవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేకశక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, బుద్ధిని మెచ్చుకొనునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెందెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప అదృష్టము. అన్నిటికంటె గొప్పది శ్రీ షిర్డీ సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేసే ఆవకాశము లభించుట.
మానవుడు యత్నించవలసినది
మానవజన్మ విలువైనదని, తుదకు మరణము తప్పదని, గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రము అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరత్వరగా దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్యకొరకు కెంత ఆతురపడునో, తపిపోయిన పిల్లాడికి తల్లితండ్రులు ఎంతగా వెదక యత్నించునటులే అత్మసాక్షాత్కారం పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామం లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను విడిచి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనకు మరి పశువులకు తేడా ఏమి వుండదు.
నడువవలసిన మార్గము
మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గముకై వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువును చేరుట. మతసంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికి, మతగ్రంథములు చదివినను తెలియని ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చు. నక్షత్రములన్ని కలిసి యివ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అలాగే మతోపన్యాసములు, మతగ్రంధాలు ఇవ్వలేని జ్ఞానంను సద్గురువు విప్పిచెప్పగలడు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును - మనస్సును స్వాధీనపరచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను-వారిని అనుసరించునప్పుడు వారి పావన జీవితమునుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనస్సుకు ప్రబోధము జేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి యోగిపుంగవుడు; సద్గురువు.
........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
జై షిర్డీ సాయినాధ 
 ఆరో అంకం..

శ్రీ సాయిసత్చరిత్ర వ్రాయుటకై హేమాద్రిపంత్ కి సాయిబాబా ఒసిగిన అనుమతి మరియు వాగ్దానం

శ్రీ సాయిసత్చరిత్ర వ్రాయుటకై హేమాద్రిపంత్ సాయిబాబ అనుమతి కోరగా సాయిబాబా యిట్లంటిరి.. "సత్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిస్తా.. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచు. నా మాటపై విశ్వాసముంచు. నా లీలలు వ్రాసినచో చదువురానితనం నిష్క్రమించు. అలాగే సాయి సత్చరిత్ర భావ విషయాలను శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ప్రపంచమందు మొహం తగ్గు, మమత క్షీణించు. బలమైన భక్తితో కూడిన ప్రేమ కెరటాలు లేచే. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞాన రత్నములు లభించును."
ఇది విన్న రచయిత హేమాద్రి పంత్ మిక్కిలి ఆనందం చెంది వెంటనే ధైర్యస్తుడయ్యే. ఆ రచయత తలపెట్టిన వ్రాత కార్యము జయప్రదంగా సాగునని ధైర్యము కలిగే. ఆనాడు సాయిబాబా చెప్పిన మాటలు భావాలే ఆశీర్వాదాలుగా తలచి నేను కూడా ఈ సత్చరిత్ర తెలుగులో వాడుక బాషలో వ్రాయ సంకల్పించి, ముందుగా సాయిబాబా గుడికెళ్ళి వారిని ఈ నా సత్చరిత్ర జై షిర్డీ సాయినాధ పేరుతో వ్రాసే ప్రయత్నంలో పూర్తీ సహకారం, ధైర్యం, తెగువా ఓపిక ఇవ్వమని ప్రార్ధించా. వారినే నన్ను గమనించి ఆవహించి నాలోకి చేరి తమ కధను మరింత రమ్యంగా అలంకరించాలని విన్నపం సాయిబాబా..

మాధవరావు దేశపాండే అనే భక్తుడితో సాయిబాబా యిట్లనెను.
"నా నామము ప్రేమతో నుచ్చరిస్తే వారి కోరిక లన్నియు తీరుస్తా. వారి భక్తిని హెచ్చించెద. వారిని అన్ని దిశలందు, అవస్థలందు తప్పక కాపాడుతా. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై అధారపడియున్నారో వారీ కథలు వింటుంటే మిక్కిలి సంతోషం కలిగే. నా లీలలు పాడే వాళ్ళకి అంతులేని ఆనందం శాశ్వతమైన తృప్తిని ఇస్తుందని నమ్ము. ఎవరయితే శరణాగతంటూ వేడెదరో మరి నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనాల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచములోని వాటిన్నటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననం చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తికి వుంచుకునే వాళ్ళు ప్రపంచ విషయాలను ఎందుకు తగులుకొందురు? వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనస్సున నిలుపుము. ఆనందంనకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారులు తొలిగిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తికి వుంచుకున్న మాత్ర వుంటే, చెడు పలుకుట వలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును."

బాబా కథలు దీపస్తంభములు
సముద్ర మధ్య భాగమందు దీపస్తంభములుండు. నావలపై, పడవలపై వెళ్ళేవారు ఆ దీపపు వెలుతురు వల్ల సముద్రంలో వుండే రాళ్ళు రప్పల వల్ల కలుగు హానిని తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రంలో సాయిబాబా కధలు దీపాలై దారిచూపు. అవి అమృతం కంటే తియ్యగా వుండి ప్రపంచయాత్ర చేయు మార్గం సులభమవ్వే, అలాగే మంచి మార్గం చూపే. యోగీశ్వరుల కధలు పవిత్రాలు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహ, అహంకారం, ద్వంద్వభావాలు నిష్క్రమించు. అటువంటి సాయిబాబా కధలను మనం కూడా మన హృదయమందు నిల్వచేసినచో పలు సందేహాలు పటాపంచలవ్వు. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడు. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినిన గాని భక్తుని పాపాలు పటాపంచలవ్వవు. కాబట్టి సాయిబాబా కధలే మోక్షానికి సులభసాధనం. కృతయుగంలో శమదమములు (అనగా నిశ్చలమనస్సు, శరీరము), త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్నామ నామాలమాలను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనాన్ని అవలంబించవచ్చు. తక్కిన సాధనములు అనగా యోగం, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట అతిసులభము. మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలె. భగవత్ కధలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయు. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు సాయిబాబాను ధ్యానించు. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొ. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు నిజభక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సత్చరితామృతంను వ్రాయుట సాయి బాబాయొక్క కటాక్షముచే సిద్ధించే. నేను నిమిత్త మాత్రుడిని సాయిబాబా నేను నీ మిత్రుడిని కాదల్చా .

బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు
ఒకనాడు మధ్యాహ్నహారతైన తరువాత పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు సాయిబాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి.
“మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయాలను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి యున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే, జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.”
సాయిబాబా కధను చదివే వాళ్ళకు బద్ధకము, నిద్ర, చంచలమనస్సు, శరీరమందలభిమానము మొదలగునవి వుండవు, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలే. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురు గాక. ఇతర మార్గములవలంబించి నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపజేయును; మోక్షమును సంపాదించి పెట్టును. లోభియెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, సాయిబాబాను కూడ నెల్లూరు వాళ్ళు తమ హృదయమందు స్థాపించుకొందురుగాక.
(మరికొంత రేపు.. సశేషం)

శాంతి శాంతి శాంతి హిం.. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
ఓం నమో సాయినాథాయ నమః
శుభం భవతు

జై షిర్డీ సాయినాధ

(అయిదవ అంకం )
 
చిన్ననాడు వెళ్ళిపోయి బాబా పెండ్లివారితో తిరిగి షిరిడీ వచ్చుట......
మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ గ్రామంలో నివసించే చాంద్ పాటీలు, ధనికుడు, ఇస్లాం మతస్తుడు. ఒకనాడు గుర్రంపై ఔరంగాబాద్ పోవ అది తప్పిపోయే. రెండు నెలల పాటు వెతికినా దొరకక నిరాశతో భుజంపై గుర్రపు జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి తన గ్రామానికి పోచుండే. సుమారు 9 మైళ్ళు నడచిన పిమ్మట, ఒక మామిడిచెట్టు నీడలో నొక తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించి వింత పురుషుడు కూర్చొనియుండే. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండే. అట్టా పోతున్న చాంద్ పాటీళ్ ను జూచి చిలుం త్రాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని పిలిచి ఆ జీను గురించి ప్రశ్నించే. అది తాను పోగొట్టుకున్న గుర్రందని జవాబిచ్చే. అక్కడకు దగ్గరగా నున్న కాలువ వద్ద వెదకుమని, అ వింత పురుషుడు/ఫకీరు చెప్పే. అతడచటకు పోయి చూడ గడ్డి మేస్తున్న తన గుర్రాన్ని చూచి మిక్కిలి యాశ్చర్యపడే. ఈ వింత మనుషుడు/ఫకీరు సామాన్యుడు కాడనియు గొప్ప 'ఔలియా' (యోగిపుంగవుడు) అనుకుని గుర్రంతో ఆ ఫకీరు వద్దకు వచ్చెను. అంత చిలుం తయారైనా కాని నీరు, నిప్పంకా కావాలి ఎందుకంటే చిలుం వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండే. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చే. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చే. చప్పిని నీటితో తడిపి, నిప్పుతో చిలుంను వెలిగించెను. అన్నీ తయారవ్వ, ఫకీరు ముందుగా చిలుం పీల్చి చాంద్ పాటీల్ అందించే. అన్నీ చూస్తూన్న చాంద్ పాటీలు ఆశ్చర్యపోయి ఆ ఫకీరును తన గృహమునకు రమ్మని అతిథిగా ఉండమని చాంద్ పాటీలను వేడే. ఫకీరు ఆ మరుసటి దినమే పాటిల్ ఇంటికి పోయే. పాటీల్ ఆ గ్రామమునకు మునసబు. కుటుంబంలో పెళ్ళికి అందరు పెండ్లి కూతురు గ్రామమైన షిర్డీ గ్రామం వెడిలే, పెండ్లి వారితో ఫకీరు కూడా బయలుదేరేను.
పెండ్లి జరిగిన తరువాత పెండ్లి వారు ధూప్ గ్రామము వెళ్ళిపోయిరి గాని ఆ ఫకీరు షిర్డీలో పెర్మనెంట్ గా ఉండిపోయే.
ఫకీరుకు సాయి అన్న పేరు వచ్చిన తీరు
పెండ్లివారు షిర్డీ చేరగానే, ఖండోబా మందిరం ఆనుకుని నున్నమహాళ్సాపతిగారి పొలములోని మఱ్ఱిచెట్టు క్రింద బండి దిగేరు. అందిరితో పాటు ఫకీరు కూడ అక్కడే దిగేను. ఖండోబా మందిర పూజారైన మహాళ్సాపతి "దయచేయి సాయీ" యని ఫకీరును స్వాగతించేను. మిగిలిన వారు కూడ ఫకీరును 'సాయి' యని పిలువసాగిరి. అదిమొదలు ఆ ఫకీరు 'సాయిబాబా' గా పేరు చెందేరు.
............................ ..............
ఇతరయోగులతో సహవాసము
షిర్డీలో సాయిబాబా పాడుపడిన మసీదులో వుంటుండే. షిర్డీలో బాబా రాక పూర్వమే దేవిదాసనే యోగి ఎన్నోఏళ్ళ బట్టి నివసించసాగే. బాబా అతని సాంగత్యంను యిష్టపడే. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను అలాగే కొంతకాలం ఒంటిగాను ఉండెను. అంతలో జానకీదాసు అను మరో యోగి యచ్చటకు చేరే. బాబా ఎల్లప్పుడు ఈ యోగితోను మాట్లాడుచు కాలము గడుపుచుండుడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. గంగాఘీరనే ఒక వైశ్యయోగి పుణ తాంబే నుంచి వచ్చేవాడు. బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవలా గ్రామంలో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండే. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది అమూల్యమైన రత్నము. ఈతడు సామాన్య మానవునివలె కనిపించిన యిది మామూలు రాయికాదు యిది మేలిమి రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.
................ ..................................
బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు
బాబా తలవెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండే. పహిల్వానువలే దుస్తులు వేసికొనిడివారు. షిర్డీ మూడుమైళ్ళదూరములో నున్న రహాతా పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి, వాటిని నాటి నీళ్ళు పోసేవారు. . రోజు బావినుండి నీళ్ళు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోసి, నెలలు పోసిన తరువాత సాయంకాలము కుండలను వేపచెట్టు మొదట్లో బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగుచుండెడివి. ఆ మరుసటి దినము మరోక రెండు కుండలను పొందేవారు, రోజువారి కార్యక్రమం జరిగిన తరువాత అవి విచ్చిపోయేవి. ఇట్లు మూడు సంవత్సరములు గడచే. సాయిబాబా కృషివలన అచ్చట త్వరలోనే నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధిమందిర మందురు. ఆ బాబా సమాధిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
శుభం భవతు।

Thursday, 27 June 2013

జై షిర్డీ సాయినాధ


నాలుగో అంకం..
............................
గురువు గారి విశిష్టత
...........................
సంసారమనే సముద్రంలో జీవుడనే ఓడను సద్గురువు చేతులలో పెడితే, సద్గురువు నడిపితే సదరు ఓడ సులభంగా జాగ్రత్తగా గమ్యస్థానము చేరు. సద్గురువంటే సాయిబాబానే జ్ఞప్తికి వచ్చే. ఎటు చూస్తే ఆటే అక్కడే సాయిబాబా నిలిచినట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు తోస్తున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్లనుండి ప్రేమ పొంగే. సూక్ష్మశరీరం (కోరికలు, భావాలు) అగ్నిచే కూడ కాలనట్టిది, మరి గురువుగారి హస్తము తగిలితే కాలే. జన్మజన్మల పాపాలు పటాపంచలవ్వే. చింతలలో కూడా చిత్తశాంతి కలుగే. చూడ చక్కని సాయి రూపం చూడగనే సంతసము కలుగు. కండ్ల నిండ నీరు కారి నిండే మనస్సు ఊహలతో బాబా ఊసులతో ఊరేగు. స్వయముగా తనే పరబ్రహ్మము అయినా మనలోనే నిద్రాణమైనున్న చిత్తానికి ఆత్మసాక్షాత్కారానందం కలిగించే. నేను, నీవన్న భేద భావాలని తొలగించు. ఎవరితోనైన సంభాషించువేళ సాయిబాబా కథలలోని మంచి మాటలే జ్ఞప్తికి వచ్చు. అలాగే నేనేదైన వ్రాయ తలపెట్టితే వారి అనుగ్రహం లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. అదే వారి ఆశీర్వాదం లభించినచో వెంటనే అనంతంగా వ్రాయగలను. భక్తునిలో గర్వం విజృంభించగ సాయిబాబా దానిని యణచివేయు. తన శక్తితో భక్తుల కోరికలను నెరవేర్చి సంతుష్టుల్నిజేసి యాశీర్వదించు. సాయి పద్మపాదములకు సాష్టాంగ నమస్కారము జేసి సర్వస్యశరణాగతి చేస్తే ధర్మార్థకామమోక్షములు సిద్ధించు. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి యను నాలుగు మార్గములు కలవు. అన్నింటిలోకి భక్తిమార్గము కష్టమైనది. ఆ భక్తి దారిలో ముండ్లు, గోతులు ఎక్కువ. సద్గురుని సాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిస్తే గమ్యస్థానం అవలీలగా చేరవచ్చుని, దీన్ని గట్టిగా విశ్వసించండని సాయిబాబా చెప్పుచుండే.

తన భక్తుల శ్రేయస్సుకై తపన పడే బాబా తెలిపిన అభయప్రధాన వాక్యాలు.... .
"నా భక్తుని యింటిలో అన్నవస్త్రాలకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, నిత్యం భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే అరాధించువారి యోగక్షేమముల నేను జూచెద. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ఇట్లనే చెప్పే. కావున వస్త్రాహారముల కొరకు అధిక ప్రయాసపడవద్దు. నీకేమైన కావాలంటే భగవంతుని వేడుకో. ప్రపంచంలో పేరు, ధనం కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందాలన్న భ్రమను విడిచెయ్యి. మనస్సునందు ఇష్టదైవముయొక్క ఆకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధనకొరకే నియమింపుము. మిగతా వాటి వైపు మనస్సు పోనివ్వకు. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తికి పెట్టి మనస్సును నిలుపు. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యంలో వుందని గ్రహింపుము. మనస్సు చంచలంగా వుంటే ఏకాగ్రత లేనట్లే".
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
శుభం భవతు।