ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label ప్రత్యూష 'అక్షర' కిరణాలు ...సుప్రభాత సు "స్వగతాలు". Show all posts
Showing posts with label ప్రత్యూష 'అక్షర' కిరణాలు ...సుప్రభాత సు "స్వగతాలు". Show all posts

Wednesday, 15 January 2014



1) ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండడమే మనసుగొప్ప వాళ్ళ లక్షణం. మంచి మనుషుల మనసులు వెన్నలా వుంటాయి.

2) తిమిరాన్ని అంతచేసే దీపపు వెలుగులా, అజ్ఞానాన్ని నిర్మూలించగలిగే ఏకైక ఆయుధం జ్ఞానదీపమే.


పి.యస్: (చిరు చిరు విజయాల సమూహమే ఘనవిజయ జేగంటను బలంగా మ్రోగించు)


1) సిద్దాంతాలు లేని వాళ్ళతో పద్దతులు గురించి మాటాడితే చెవిటివారికి సంగీతం వినిపించడమే. అప్రయోజన, నిష్ఫల క్రియే అగును.

2) తెలివైన వారితో తంపులు వస్తే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయి, అదే మూర్కులతో తంపులు వస్తే పర్యవసనాలు అనూహ్యంగా వుంటాయి.


పి.యస్: (వైరం ఎప్పుడూ ప్రమోదం కాదు, సదా ప్రమాదమే/హానీకరమే)


1) కోరికల గుర్రాన్ని అదుపులో వుంచగలిగితే అద్భుత ఫలితాలు అందడంలో అందెవేసిన చేయి అవ్వేవు.


2) జేబులో 'దుడ్డు' వుంటే అనామకుడూ రాజవ్వే. మనసులో 'గుడ్' వుంటే సామాన్యుడూ మహామనిషవ్వే.


పి.యస్: (గెలుపుని ఓటమిని ఒకేలా ఆస్వాదిస్తే మనిషే మహానీయుడవ్వే)


1) చేసే ప్రతి పని స్వీయ తృప్తితోనూ నిబద్దతతోనూ చేస్తే విజయోత్సవం మాట ఎలా వున్నా మానసిక ఉల్లాసం తప్పకుండా వుండు.

2) గాలికి రూపం లేదు, మనసుకి రూపం లేదు..రూపాలు లేకపోయినా వాటి అస్సలు స్వరూపం అనుభవించే మనిషి మానసిక స్థితిని (ఫీల్ ని)బట్టే వారు పొందే ఫీల్ వుంటుంది.


పి.యస్: హృదయంలో మలినాలు లేకపోతే మోము ఎర్రగులాబి మల్లే మెరుపులు చిందించు)
1) వినడంలో ఉత్సుకత చూపుతూ తిరిగి జవాబివ్వడంలో కాస్త ఆచి తూచి ముందడుగు వేసేవాళ్ళనే గెలుపు వరించే.

2) కట్టు కధలు చెప్పేవాడు వాటితోనే పబ్బం గడుపుకునేవాడు చివారాఖరకు చెప్పిన కధల్లోని ప్రతినాయకుడు పడే పాట్లన్నీ పడి నగుబాటవుతాడు.


పి.యస్:(నాణ్యత లేని చదువు, పరిణితి లేని మాట చెల్లుబాటు కావు)
1) పదివేల మందిలో వున్నా నీ ప్రత్యేకతని విసర్జించకు. నీ అస్తిత్వాన్ని సంరక్షించేది నీ నడవడికే. 

2) మదిలో మాటని సూటిగా చెప్పడం నేరిస్తే ఎదకు ఆదిలో నిష్టూరంగా అనిపించినా తుదకు ఆనందం, మనశ్శాంతి అందేవు. 


పి.యస్:(అందం కాదు శాశ్వతం నిర్మల మనసే నిశ్చలానందం)
1) అపోహాలు, భయాల. అనుమానాల నీడలో బ్రతికే వారు బ్రతుకును బరువుగా వెళ్ళదీస్తారు..తమతో బాటు చుట్టూ వున్న వారి బ్రతుకులను నరకం చేస్తారు.
2) బయటవాళ్ళను నమ్మేలోగా ముందుగా మీపై, మీ స్వశక్తిపై, మీ విజ్ఞ్యతపై నమ్మకం వుంచండి. 


పి.యస్:(వికసించిన బుద్ది కలిగుంటే విజయం తధ్యం)

Monday, 13 January 2014

1) కపటం లేని మాట, కల్మషం లేని నవ్వు..మత్సరం లేని మనసుని ప్రతిబింభించు. మనశ్శాంతిని సంపూర్ణంగా
 అందించు.

2) ఎంతటి ఘోర అంధకారంలోనైనా చిరు దివ్వెతో వెలుగును అందవచ్చు. కర్మల దీపంతో బ్రతుకు చీకటిని 
దూరం చెయ్యవచ్చు.


పి.యస్:(అజ్ఞాన అపార్ధాలే అనవసర అనర్ధాలకు దారి తీయు)

Tuesday, 31 December 2013



1) పరులను జయంచటం కంటే నీపైన నీవు విజయం సాధించు, యోగిస్తుంది.. నిజం చెప్పాలంటే నిన్ను నీవు గెలవడమే మరింత కష్టం.

2) సదా మనం ఉపకారం చెయ్యలేకపోవచ్చు, కానీ ఉపకరించే రీతిలో నిత్యం మాట్లాడవచ్చు అట్లా వ్యవహిరించవచ్చుగా.


పి.యస్:(మనిషికి నమ్మకమనేది లేకపోవడమే అజ్ఞానానికి ఆదితాళం)
1) మనసనే అద్దములో నిత్యం మనల్ని మనం సరిచూసుకుని ఋజుమార్గంలో పోతే బ్రతుకుకి మకిలి అంటదు

2) గెలుపుకి వావి వరసలు వుండవు, అందరూ తెగ కోరుకుంటారు. తమ స్వంతం కావాలని తహతహ లాడుతారు. ఓటమి వయసుడిగిన వృద్దలు వంటివారు, వారి నుంచి నేర్చవలసిన విషయాలు ఎన్నోవున్నా దగ్గర పోవ ఎవరూ ఇష్టపడరు.
............
పి.యస్:(మంచి మాట తొందరగా చెవికెక్కదు, మంచి మనసు తొందరగా అర్దమవ్వదు.)

Sunday, 29 December 2013

1) అక్షరాలు అక్షయాలు అందించినా, కదిలే బొమ్మలు సిత్రాలు చూపించినా, కదలని చిత్తరవులు కధలే చెప్పినా.. గ్రహించవలసిన మనసేగా విషయాన్ని గ్రహింపు చెయ్యాలి.. కల్లోల మనసు క్లియర్ గా చూడలేదు. మనసు ప్రశాంతంగా వుంచుకోండి, విజయాలు అందండి.

2) చెడుపు చెయ్యాలన్న తలంపే చెడ్డది..రోషాగ్నితో రెట్టింపవుతుంది..అసూయ దానికి బీజం వేస్తుంది, అభిజాత్యం దానికి ఎరువులు అందిస్తుంది. అహంకారం దానికి నీరు పోసి పెంచుతుంది.. వీటిని విసర్జిస్తేనే సదా మంచి జరుగుతుంది. 


పి.యస్:(తోడ్పాటు కోరుకునే త్రోవ వన్ వే ట్రాఫిక్ కాదని తెలియండి)
1) అర్హత లేని వారిని అలాగే అనుభవ హీనత కలవారిని అందలమెక్కించడం, ఉత్తుత్తినే ప్రశంసించడం గుడ్డివానికి చేతికి రాయి ఇవ్వడం లాంటిది, అలాగే గాడిదకు సిల్క్ జీను తొడగటం లాంటిది. 

2) చేసే వాగ్దానాలు ఎంత గొప్ప గొప్పవైన వాటికి నిజమైన విలువ చేసే మనిషి నైతికతతో, అతగాడి నిత్య ప్రవర్తన మరియు నడవడికతో ముడిపడి వుంటుంది. 
............
విసురజ

పి.యస్:(విన్నవాడు విమర్శిస్తాడు, చూచినవాడు వివరిస్తాడు..ఇది గుర్తించి మెలుగు

Thursday, 26 December 2013

1) నీడలకు క్రీనడలు బయపడకు, సరిగ్గా పరికిస్తే దగ్గరలోనే ఎక్కడో వెలుతురు వుందని సూచిస్తున్నాయని తెలుసుకో 

2) కొంత ప్రేమ, కొంత దాన గుణం, కొంత ధీర గుణం, కొంత ఆశ యిత్యాదుల్లోనే జీవితపు ఆనందానికి సంబంధించిన విజయ లక్షణాలు ఇమిడి వున్నాయని తెలుసుకో


పి.యస్:(నిజమైన స్నేహం కష్ట సమయంలో అక్కరకొచ్చే నిలవున్న సొమ్ము లాంటిది)
1) పనికి, సేవకి, సాయానికి మరియు ఆదేశం నిర్వహణల మధ్య చాలా వ్యత్యాసం వుంది. వీటి అర్దం మరియు తేడాలు తెలిసుండి అపై సరిగ్గా పాటిస్తే వియోగ ముక్తుడువి కాగలవు. 

2) అసహాయులు, వ్రుద్దులు, పిల్లలు, మహిళలను హేళన చేసెవారు, హీనంగా చూసేవారు లోకంలో చివరాఖరుకు గేలి చేయబడతారు, అవ్వారి పెంపకంపై విసుర్లతో తమ జన్మదాతలను అవహేళన చేసినవారగుదురు. 

పి.యస్:( మనసులో ప్రేమ భావనలు నిండి వుంటే పలుకు తేనేధారగు, మోము వింత శోభతో ప్రకాశించు)
1) బాధలలో సతమతమయ్యే శాపగ్రస్తులకు మాటల లేపనాలే ఊరట ఇచ్చేది, నెమ్మది పరచేది.. సాయం చేసినా చేయకున్నా అట్టివారిని మాటలతో గాయపర్చవద్దు 

2) సాయం తీసుకుంటే సాయం చేయాల్సివస్తుందని తెలుసుకో, మనషుల్లో మంచివాళ్ళు ఉంటారని రుజువు చేసుకో. 



పి.యస్:(జీవితంలో నిత్యం నవ్వుల రాగాలు ఆలపిస్తే బ్రతుకంతా ఆనంద సంగీతమే)
1) నిలకడ లేని మనసు కల్లోల వాతావరణంలో సాగు నావ లాంటిది. ఒడిదొడుకులతో స్థిరత్వం లేక సరియైన గమ్యం చేరే అవకాశాలు తక్కువ.


2) వాగ్ధాటితో అరిచేవారు వారు ధీరులు, మౌనంగా కర్మను నిర్వర్తించేవారు భీరులు అనుకోవడం అవివేకం. ప్రజ్ఞాశాలి తమ చేవను చేతల ద్వారానే బయల్పరచు. 



పి.యస్: (గతుకుల దారిలో ప్రయాణం కఠినం...తెలియని వారితో నెయ్యం ప్రమాదం)
1) పగటి వేళ పటిష్టంగా, నిశిలోను నిశితంగా తమ లక్ష్యాన్ని గురి చూసే నేర్పు కలవాడే ప్రజ్ఞతో ఓటమిని కూడా గెలుపుగా మలుచుకుంటాడు 

2) ఎవ్వరి మధ్యనైనా సంఘర్షణ అంటూ జరిగితే అప్పుడు జయం ఎవరిదైనా నష్టం ఇరు వర్గాలకి ఏర్పడు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ అంతే. 


పి.యస్: (పెదవి దాటని మనసు మాట నిన్ను పలుచన చెయ్యకపోవచ్చు కానీ విజయుడ్ని మాత్రం చెయ్యదు)
1) మనసైన నేస్తాలు తమ స్నేహితాన్ని నిలుపుటకై, విశ్వాసాన్ని రక్షించుటకై, వ్యక్తిత్వ నిరూపుణకై తమ జీవితాన్ని సైతం పణం పెట్టేస్తారు, కానీ, తమ స్నేహం పై అలాగే తమ స్నేహితురాలు/స్నేహితుడుపై ఏ మచ్చా పడనివ్వరు. 

2) వ్యధల బాటలో సాగుతూ ఇదే నాకు రాసి పెట్టిన జీవనం అనుకుంటే పొరపాటే. రాలే ఆకు యామినిలో తిరిగి చిగురించదా, ప్రతి రాత్రి తరువాత ఉషోదయం అగుపించదా. నమ్మికతో నడుచుకుంటే నవలోకం నీ సొంతం కాదా. 


పి.యస్: (ఏమీ బాలేకపొయినా అంతా సవ్యంగా వుందిలే అని జీవితంలో ఆత్మవంచన చేసుకోవడం దుర్భలుని దివ్యలక్షణం. దాన్నే ఎదిరించి తిరిగి రాయడమే విజయుడి తక్షణ కర్తవ్యం)
1) మన పెద్దలను గౌరవించకపోయిన పర్లేదు కానీ వారిని అవహేళనకు మటుకు గురిచేయకండి..వీలైతే వారిని అర్దం చేసుకోండి. పెద్దవి ఇవ్వలేకపోయిన కనీసం చిన్ని చిన్ని అనందాలు పంచండి.

2) నిజాల నీడలో బ్రతుకుతువుంటే అనవసరపు చీకు చింతలు కోరి రమ్మన్నా నీ దరికి రావు.

పి.యస్: (కబుర్లతో కాలాక్షేపం చేసేస్తుంటే కోరుకున్న లక్ష్యాలు చేరరావు)

Tuesday, 24 December 2013

1) ఎట్టి పరిస్థితులోనైనా, నిదానంగానైనా ముందుకు సాగేందుకు ప్రయత్నించండి అందుకు భయపడకండి, కదలకుండా సాగకుండా వున్నచోటే నిలుచునేందుకు భయపడండి. 

2) జీవితానికి వయస్సును జత చేయడం మాని వయస్సుకు జీవితాన్ని, తగిన అనుభవాన్ని, జత చేయండి, గర్వంగా తలెత్తుకు తిరగండి 

పి.యస్: (అధ్యయనం ప్రారంభించిన తరువాత గానీ అజ్ఞానం తెలిసి రాదు)