ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

Monday, 19 January 2015

కవిత: ఆపగలనా/ఓపగలనా

ఏమని చెప్పి ఆపను
నీకై ఎగిరే పయటమ్మ వయ్యారాలను
ఎంతసేపు అట్లా ఓపను 
ఎదలో ఎగిసే కోలాహల ధ్వనులను
ఏమని చెప్పి ఊరడించను
నీకై రవళించే గుండె స్పందనలను
ఎంతసేపు అట్లా దాచను
మదిలో నర్తించే మధుర ఊహలను
ఎట్టా పగ్గాల్లాగి ఆపను
నీకై ఉరకే ప్రాయపు అశ్వాన్ని 

ఏమని చెప్పి మభ్యపెట్టను 
హృదిలో మెరిసే ప్రత్యూషపు వెలుగుల్ను
ఎంతకాలం యిట్టా భరించను
నీకై మ్రోగే పాంజీరాల సవ్వడులను
ఏ పాత్రలో దాచిపెట్టను
మురిపాలు వర్షించే ప్రణయ జల్లులను
ఎంతని ఎక్కడని దాచను
నీకై విరబూసే యవ్వన లావణ్యాన్ని
ఎంతసేపని గానం చేయను
మనసులో అనురాగ సంగమ కృతులను
ఏమని హృదితడిని ఏమార్చను
నీకై వెదికే తలపుల వాకిళ్ళలలో
మదిగదిలో ఎక్కడ పెట్టను
అంటుకట్టిన వలపు విత్తుల గుత్తులును
త్వరగా వచ్చి బ్రతికించు
కురచవుతున్న వలపుపై నమ్మకాన్ని
నీ ప్రేమని నిరూపించు
పలచనవుతున్న ప్రేమగౌరవాన్ని కాపాడి 

కవిత: ఎవరు నీవు

ఎవరు నీవు
కలలా సాగిన బ్రతుకుకవితగా
నన్ను 
జీవితనావకు చుక్కాన్ని చేసేవు
ఎవరు నీవు
సంద్రపుకెరటంలా దూకి పరుగిడే
నన్ను
చేపట్టి చెయ్యిపట్టి నిలువరించేవు
ఎవరు నీవు
అందాల నెమలికన్నుల సొగసులతో
నన్ను
కలవరించే కన్నుల్లో దాచేసావు
ఎవరు నీవు
ఉదయపు వెలుగునవ్వుల పువ్వంటి '

నన్ను 
నల్లని కంటికాటుకగా మార్చేసావు
ఎవరు నీవు
పరవశంతో తాండవమాడే గంగమల్లే
నన్ను
జాగ్రత్తగా చుట్టి నెత్తిని పెట్టేసావు
ఎవరు నీవు
సరాగ పరాగ సంపర్కాలతో
నన్ను
కుసుమరాజ్ఞివై ఢీకొట్టి పరిమళించేవు
ఎవరు నీవు
విరులరేరాణికి వలువలు అందించే
నన్ను
వెన్నెలప్రభలతో వలపురాజుగా తెలిపేవు
ఎవరు నీవు
చల్లగా విరిసిన స్నేహబంధములో
నన్ను
నమ్మకపు నాదస్వరమని రుజువుచేశావు
ఎవరు నీవు
మరుల మమతలతో పరాచికాలాడి
నన్ను
అనుభంధాలు నేర్పి అత్మీయుడినిచేసేవు
ఇలా అందరికీ పూర్తిగా తెలిసినా
నన్ను నేను తెలియకున్నాను
నీవు
చెపితే తప్పక తెలుసుకుంటాను
.......... 

కవిత: ప్రేమే ఇష్టం

చెలివి మదిదోచిన కోమలివి
నీవే నెచ్చలివి నవ్వుల నెమలివి
విన్నాను హృదయ సంగీతాలను
మనసే ఎద తంత్రులను మీట
కన్నాను మధురమైన పసిడికలను
తలపే మరులై మదిలో స్థిరపడ
నేర్చాను మమతల పూజలను
వలపే ఆత్మీయత గంటలను మ్రోగించ
పాడాను స్నేహాగీతాలనే అనునిత్యం
పలుకే బంగారంలా మెరిసి మురుస్తూ
మనసుల్ని పెనవేసుకుని ఊసులూయలలో
ఊగుతూ వలపారటపు సౌఖ్యన్ని తెలుద్దాం/తేలుద్దాం
తోడుకావ బాణీలు కట్టడంలో
ప్రేమపాటల
కు వలపాటలకు నెయ్యమై నిలయమై 

Sunday, 18 January 2015

కవిత: కలే కవితైతే

కలత నిద్రలోనూ ఆతృతగానే
నిన్నే కలవరిస్తూ వుంటాను కవితా దేవి 
వద్దన్నా వీడక కలలోకి
మెల్లగావచ్చి అందిస్తావు నీ కవితల తావి .
అర్ధవంతమైన ఆ కవితలో
దాగున్న నువ్వు నీ నవ్వు
కళ్ళు తెరిచి నిను వెతక
నెమ్మదిగా నా నిదుర చెదిరేగా
కవితవై వచ్చి మమేకమై
నాతో ఏకమైన కవితే అయ్యింది 

కవితా శిల్పమైన "ఆమె" 
ఏ మత్తు ఇవ్వకనే గుండె కోస్తుంది
గుండెలో చేరి మెల్లమెల్లగా
రుధిర ప్రసరణతో అంతా తానై నిండుతుంది
నీతో నన్ను విహరింపచేస్తావు
ఎత్తైన శిఖరాలపై లోతైన లోయలలో
నన్నే అల్లరిగా ప్రవహింపచేస్తావు
గలగలాపారే నదిలా మార్చి ఏమార్చి
గాలిపటమై నను త్రిప్పితీసుకువస్తావు
అందని అంబరాన అల నీలిగగనాన
బ్రహ్మాండాన్ని నిమిషంలో చుట్టింపచేస్తావు
అనురాగ సమీరపు నావలో అలవోకగా
హిమశిఖరాలనీ చిటికెలో అధిరోహింపచేస్తావు
ఇష్టమైన వలపుపధంలో కష్టమైన ఓర్చుకుంటూ
పూలతోటల్లో ఓలలాడిస్తూ ఆటలాడింపచేస్తావు
విరులతేనెలత్రాగు భ్రమరాలతో నను చేర్చి
పరవశంతో చల్లనివెన్నెల్లో విహరింపచేస్తావు
మరులతో ప్రేమగీతాలు వినిపిస్తూ పాడపిస్తూ
చల్లనివేళ వేడిమిని అందిస్తావు ..
వెచ్చని ప్రేమరజాయిని పొగమంచులో కప్పి
ఒకే విషయం నీకు చెప్పాలని ఉంది
నేస్తమా నీతో మనసు పంచుకోవాలని వుంది .
జీవితాంతం నీతోనే ఉండనీ నన్ను
కవితై జనిస్తూ నీ పదాలతో రమిస్తూ ..
ఆత్మీయమైన మదీయకలవి నువ్వు
కలైన కవితే జీవితవరముగా అందివ్వు 

Thursday, 18 December 2014

కవిత: "హృది" పలుకు

నవ్వులు నజరానాలు రువ్వుతావని
ముత్యాల పలువరుస చూపుతావని
కన్నుల వెల్గుపూలతో స్వాగతిస్తావని 
హృదయ సడిచప్పుళ్ళు వినిపిస్తావని
దరిచేరా
నవ్వక పలకక హృదినివిప్పక కంటినీటితో
ఇలా అభిషేకిస్తావేమి హలా ఏమయ్యేనీవేళ
కళ్ళల్లో మదిపాశాల చిహ్నాలుంటాయని
మాటలో కోటిరతనాల వెల్గులుంటాయని
వంటిలో సొబగుసోకుల పరిమళాలుంటాయని
పాటలో తీపికోకిలమ్మల మధురిమలుంటాయని
దరిచేరా
చూడక మాటాడక శోభించక పాడకుండా
ఇలా మూగనోము పడితివేమి హలా ఏమయ్యేనీవేళ
బెడద లేదు బెంగ వలదు
సమాజపు ఆరళ్ళపై అస్సలు భయం కూడదు
లొంగితే దంచేను వంచేను వంచించేను ఈ సమాజం
కంగారు వలదు కన్నీరు కార్చరాదు
మనసైన సరిజోడు నీ తోడుండంగా
వంచిదంచితే లొంగి వంగి సలాంచేసేను ఈ జగం
చెలి
మతాబుల వెలిగే నీ మోమే
నా లోకానికిచ్చు కాంతులు
కిలకిలా సాగే నీ నవ్వులే
నా జీవితానికిచ్చు సంబరాలు
కన్నులతో మాటాడు నీ వైనమే
నా జీవననావకు చుక్కాని
హృదయంలో తారాడు నీ భావాలే
నా భవితకిచూపే మార్గదర్సకాలు
ఆడిపాడి నడయాడే నీ సోకులే
నా ప్రేమజగత్తుకు ఆలంబనలు
ఆటైన పాటైన మాటైన
మోమాటమైన అన్నీ నీతోనే
ఒప్పినా ఒప్పకున్నాఏమన్నా
నా జగములో సగము నీదేనే
................. 

కవిత:తలపుల తర్జనభర్జనలు

పరువాల పల్లకీలో
మల్లెలు మరువాలు పరచాను
తలపుల బోయలతో 
మోస్తుండ ఊహలలో ఊరేగాను
కన్నులలో కాపురముండే
కమ్మని కలలకు రెక్కలిచ్చాను
కలలకు బ్రతుకువర్ణాలకు
నప్పక కన్నీళ్ళలో కరిగిపోయాను
ఎదలోని మాయనిగాయానికి 
హృదినే ఇంకుపెన్నుగా మార్చేసాను 
మదిలోని భావాలెన్నిటికో 
కవితా రూపమిచ్చి మురిశాను
మానుతున్న ఎదగాయాన్నే చల్లనైన శీతగాలి రేపిపోయినాయే
మారుతున్న ఋతుకాలాలే
మానసిక సంఘర్షణ పెంచిమురినాయే

తలపుల మలపులవంకల్లో
మాటువేసి నిలుచుండి నలిపేస్తున్నావే
కుదరని ప్రేమరహదారులలో
కొలువుండి ఎదకొంప కొల్లేరుచేస్తున్నావే
విడువమ్మ కుదరనిబంధాలను
కుత్సితాల ప్రణయప్రలోభాల రాపిళ్ళను
తడువమ్మ నిజనిర్మలప్రేమవర్షంలో
వలపుల దాహాలడగుత్తి పూర్తవ్వనూ 

Wednesday, 17 December 2014

కవిత: నువ్వే నువ్వే

నువ్వే నువ్వే
నవ్వుకు రూపం నువ్వే
తారకల మెరుపుల్లో నెలరాజు నవ్వుల్లో 
వెల్లివెరిసే అందాలన్నీ నీవే
నువ్వే నువ్వే
ప్రేమకొమ్మకు పూసిన పువ్వువే
హరివిల్లు రంగుల్లో రాయంచ అందాల్లో
తళుకుమనే సోభలన్నీ నీవే
నువ్వే నువ్వే
సరిగమలకు స్వరూపం నువ్వే 

రాగముల గమకాల్లో సంగీతాల సుస్వరాల్లో 
వినవచ్చే ఆద్భుతగానామృతం నీవే
నువ్వే నువ్వే
మనసుకోట తొలిటుకవి నీవే
తొలివలపు మౌజుల్లో తమకపు మైకాల్లో
తెలిసొచ్చే అలౌకిక ఆనందం నీవే
నువ్వే నువ్వే
తలపులకు కావిళ్ళూతం నీవే
అజరామర స్నేహానికి ఆత్మీయ మెప్పుకు
ఆలవాలమైన స్నేహితమూర్తివి నీవే
నువ్వే నువ్వే
నా వలపుకు భాష్యం నీవే
మనసు లోగిలిలో మమత సన్నిదిలో
వెలుగొందు ప్రేమదీప్తివి నీవే 

Monday, 17 November 2014

కవిత: ఎద కైత

తొలిచూపు మెత్తగా గుచ్చి తాకింది
ఎదగూటిని పక్కగా వచ్చి చేరింది
తలపుల మల్లెలు ఎదలో విరబూస్తే
మనసు పరిమళాలు మోముని తాకవా
మనసు లోగిలిలో తలపులు ముగ్గులేస్తే
విరుల గొబ్బెమ్మలెట్టి వలపు మురవదా
పలకరించే మనసుచిలక పాడంగా గీతాలెన్నో పరవశించే హృదయానికి నర్తనలే మొత్తంగా

కవిత: ఇదీ ప్రేమేగా

సొగసుగత్తె మేనితావి ముంగురుల శోభ వర్దిల్లంగా
విరిపరిమాళాలే శరణాగతంటూ నీ ముందు సాగిలపడేగా
వివరమడగ ప్రేమదేశం పేరుచెప్పి ఊరి వివరమీయకుండా తరలింది
కిసుక్కున చెలి నీవు నవ్వి కసుక్కున్న గుండెను కోసింది
మబ్బుల దుప్పటి కప్పుకుని చంద్రుడు మొద్దుగానిద్రోయే
రాని వెన్నెలకై జరగని ప్రేమవిహారాలపై విరహదాసులు వాపోయే
కళ్ళుకలిపి గుండెలోకి చూసి బహుప్రీతిగా చూపులవిందు ఆరగించావు 
చెలిపై మక్కువ మనసిష్టాన్నిముఖప్రీతికైనా గిఫ్టులతో కొలుస్తావనవేమి
కుదిరిన వలపు తీయని తలపులు ఎదనిండా తహతహలు పెంచే
చెలి పలుకు గోముగా పిలుపు కుదురుకానీ నన్ను అనుక్షణం నిలువరించే
సురచిరస్మరణీయ సుకవనానికి గీర్వాణి చల్లనిచూపు అత్యవసరం
చెలువము ప్రేమా అనురాగసంగామానికి అలరించే అమ్మణ్ణి అండ అవసరం

Sunday, 16 November 2014

కవిత: ప్రణయలేఖ

ఓ ప్రియరాగమా హృదయగీతి పాడుమా
ఓ వయ్యారమా నయగారాలు పోకుమా
ఓ రాగదీపమా అనురాగాన్ని పంచుమా 
ఓ జీవనాదమా మమతావేసాన్ని పెంచుమా
నీవే
ప్రణయపు దారులలో కరదీపికవై నిలిచేవు
వలపుల నెలవులకై కడదాక నడిచేవు
మనసున నెత్తావులు పసందుగా చిలికేవు
తలపుల తలపులను తట్టినెట్టి తెరిచేవు
చెలియా
సన్నని నీ గొంతుకు ఏవి సరితూగవు
పక్షుల కువకువలైనా చిలకల పలుకులైనా
మిసిమి నీ సొబగుకు ఏమి సరికావు
కన్నెల పకపకలైనా జాజుల ఘుమఘుమలైనా
నేస్తమా
అల నీలిగగనాన చుప్పనాతి చంద్రుడు
నీ పసిడి మేని కాంతులను చూసి ఈర్ష్యపడేను
అక్కసుతో మేఘాలచాటుకు పోయి దాగున్నాడు
నీ మోమ మెరుపుల్ను చీకట్లలోను చూసి సిగ్గుపడేను
ప్రాణమా
తాకి నిను చిరుగాలి సిసలైన తన ఉనికిని తెలిసేను
తావి కూడ నీ స్మరణతో జగాన సుగంధమై విరిసేను
చేరి నిను గులాబి తన లాలిత్యపు గర్వాన్నివిడిచేను
దారి నిను చూసి తన వంపుల (మలుపుల) వివరాలను మరిచేను
దేవేరి
వేగారావా వేచిన విభుని వినతి ఆలకించి కరుణించ త్వరితముగా
కావగరావా చెరుకువింటివాని విరిశరముల ముప్పేటదాడినుండి ప్రేమగా నీ వాణికై నీ రాకకై నీ దర్శనపు వేళకై మది వేగిరపడేను
నీ చూపుకై నీ ప్రీతికై నీ వలపులహారతికై ఎద ఎదురుచూసేను

స్నేహమా
ప్రియతమా ఎదలోని తీయని గాయమా తీరని దాహమా
వేచేను నీకై వానరాకకై వేచే చకోరానినై తెలియుమా
ఆర్తిగా ఆత్మతృప్తిగా కడదాక తోడుగా అత్మీయమా నిలిచుండుమా
ఓపికతో మనసు బాధ తెలుసుకుని మమతలలోగిలి అందించుమా 

కవిత: ప్రేమాట

వెలుగులేని కీకారాణ్యంలోనూ రవికిరణం వెలుగిచ్చు
స్పష్టతలేని మనసువనంలో ప్రేమదీపం స్పష్టతిచ్చు
మనసాక్రుతివేసి మాటరానిమూగకు తెలపవచ్చు ప్రేమను
మనసుపూర్తిగాతెలిసి మూగైనసఖునికి చెప్పేదెలా వలపును
హరితవనంలో తిరుగాట మేనుకు హాయినిచ్చు
మనసుబాటలో వెనుకాడుట చిత్తానికి చింతలిచ్చు

Wednesday, 12 November 2014

కవిత: మనసే పలికే

కురులలో విరులు
సోయగాల ఝరులు
పిల్లగాలుల పరిమళాలు
ఎదను మురిపించదా మనసా
పసిపాపల కేరింతలు
వయసుభామినుల పకపకలు
ప్రౌఢమ్మల కబుర్లుకాకరకాయలు
ప్రాయపుపరిణితి మిసమిసలే మనసా
పదకవితల మాధుర్యాలు
ఆత్మీయతల అభివాదాలు
సుఖభొగాల లాలసలు
మధుర భావనలేగా మనసా
సంధ్యాకాంతుల జిలుగువెలుగులు వానరాకపోకల మట్టివాసనామ్రుతాలు
ప్రక్రుతికాంతలిష్టపడే వాసంతసమీరాలు
ప్రణయరాగాలకు మేలుకొలుపులే మనసా 

Wednesday, 5 November 2014

కవిత: ప్రేమ గీతిక

చల్లగాలి వీచి
మనసును తట్టిలేపే
మధురూహాల మమతల లోగిలిలో
చెలి నీదు మానసం విరితావియేగా
సన్నజాజి విచ్చి
వాసంత సమీరమే గుచ్చి గుచ్చి
కుసుమహాసాల లాలిత్యాల వాకిళ్ళలో
సఖీ నీదు హృదయం ప్రేమమయమేగా
వానజల్లు తాకి
గ్రీష్మతాపాలే తగ్గంగా
మనసుమేఘాలే వలపువర్షాలే కురియంగా
ప్రియా నీదు పరువం ప్రణయదీపమేగా
విరిబాల అందం
వింజామరలు వీయంగా
చెరుకువింటినెక్కుపెట్టి సుమశరాలే సంధింప
బేల నీదు సౌందర్యం నీరాజనాలిచ్చేగా
కల్పనలో కైతలపర్వంలో
మధురభావనల మురిపెములో
మనోహరి మధురహాసిని
ప్రియదర్శనాల ప్రమోదాలలో
వలపు ప్రమిదనై అందు మనసు దీపమై
కలకాలం నీకై ఆర్ద్రతతో వెలుగులే
కడవరకు నీకై ఆత్రుతతో వేచేనులే
..........
మిత్రులారా..శుభోదయం
.................
1) పెదాలపై తారాడే చిరునవ్వు యూనివర్సల్ క్రెడిట్ కార్డ్ లాంటిది..అన్నీ చోట్ల స్వీకరించబడుతుంది..చాలా సార్లు తిరిగీయబడుతుంది కూడా. లిమిట్ లేని ఘనసంపదిచ్చే ఆనందాల గని ఈ చిరునవ్వు.. అది దాచక విరివిగా వాడితే మనసున ముదము, కలిసేవాళ్లకు హాయి కలుగుతుంది.
2) సక్సెస్ కంటే మెరుగైనవి..స్వీయానుభూతి,ఆత్మతృప్తి.. సక్సెస్ కి కొలమానం మన క్రియల పట్ల బయటవాళ్ళ మెప్పు..స్వీయానుభూతి, ఆత్మతృప్తికి కొలమానం మన క్రియల పట్ల వ్యక్తిగత మానసోల్లాసం..బయటవాళ్ళు పొరబడచ్చు, తప్పు చెప్పొచ్చు కానీ ఆత్మారాముడు నిజం చెప్పక వుండడు.
3) నమ్మకం దేన్నైనా సాధించగలనన్న ధైర్యాన్నిస్తుంది, ఆశ ఆ ధైర్యానికి ఇంధనం అందిస్తుంది, ప్రేమ సర్వాన్ని సుందరమయం చేస్తుంది. ఈ మూడింటిని అందిన మానవుడు...విజేతగా, మనుషుల్ని ప్రేమించే మహామనీషిగా నిలుస్తాడు 

నువ్వేనా...నువ్వేనా

నువ్వేనా...నువ్వేనా
నిశి ఆవరించిన హృది ముంగిట్లో
నా ఎదకనుమలలో చీకటిని పారద్రోల 
మమతవొత్తితో మనసుదీపం వెలిగించింది నువ్వేనా ...
నువ్వేనా...నువ్వేనా
బంజరైన నా మది బేజారైన వేళ
తీపిమాటల నీటివూటను పూటపూట పోసి
బంజరుమదిని విరితోట చేసింది నువ్వేనా ..
నువ్వేనా...నువ్వేనా
నిశీధి రాత్రులలో ఒంటరైన మనసుకు
మధురస్మృతుల స్నేహకాంతులు నింపి
ఏకాంతాన్ని దూరం చేసింది నువ్వేనా ..
నువ్వేనా...నువ్వేనా
దీపం పెట్టని ఎదగదిలో
మరుల ప్రమిదలో తలపుల నూనే పోసి
అఖండ ప్రణయజ్యోతిని వెలిగించింది నువ్వేనా ...
నువ్వేనా....నువ్వేనా
ఎటు చూస్తే అటు నువ్వేనా...నీవేనా
నువ్వేనా...సర్వం నువ్వేనా నా సర్వస్వం...నీవేనా
నువ్వేనా...సర్వత్రా నువ్వేనా...మహిమోత్తం నీవేనా
నేనంటూ అస్సలు మిగిలేనా లేక అది నువ్వేనా
నువ్వేనా నువ్వేనా మొత్తంగా నేనే నువ్వయ్యానా..
........

కవిత: ప్రేమ మనస్థాపం

పువ్వుల్లో విరిసే నవ్వులలో మెరిసేది నీవేగా
నిను చూసి మురిసి చేర రావచ్చే ఉదయసంధ్య
అయినా అందలేక నిను పొందలేక నిత్యం మనస్తాపం కలిగేలే 
లెక్కలేని ప్రేమకు తరించే సౌఖ్యమునకు దూరమైతిలే
తలపుల్లో తారాడే కైతలలో తొణికేది నీవేగా
నిను తలచి పలకరించి మురిసింది కావ్యకన్నియ
అయినా అందలేక నిను పొందలేక నిత్యం మనస్తాపం కలిగేలే
లెక్కలేని ప్రేమకు తరించే సౌఖ్యమునకు దూరమైతిలే
మధుమాసవేళ మనసైన నెలరాజు వెన్నెలమ్మ నీవేగా
విరిపాన్పుపై సుగంధ పరిమళాలు వెదజల్లింది నీవేగా
అయినా అందలేక నిను పొందలేక నిత్యం మనస్తాపం కలిగేలే
లెక్కలేని ప్రేమకు తరించే సౌఖ్యమునకు దూరమైతిలే
మాటలతోనే మనసుకి గాయమయ్యేనన్నది ఉత్తిమాటే
మౌనంతోనూ చెరపలేని మాయని గాయమయ్యేగా
చెమర్చిన కళ్ళతో తడిసిన చెంపలతో ప్రేమసంద్రానయ్యా
అయినా అందలేక నిను పొందలేక నిత్యం మనస్తాపం కలిగేలే
లెక్కలేని ప్రేమకు తరించే సౌఖ్యమునకు దూరమైతిలే
విధి చేయు వింతలన్నీ విడ్డూరాలే విపరీతాలే
వలపనందింపక నిను నను విడదీసిన సమయాన్ని దెప్పనా
మనకై మన మనుగడకై ఆగని కాలాన్ని అననా
ఎంత యోచించినా ఎంత వగచినా ఎంత వేచినా
ఈ హృదయమందిరానా నీవే వలపు దేవతవై నిలిచేవు
ప్రేమరాహిత్యగరళాన్ని మ్రింగి నీకై నీరకంఠుడవుతా

కవిత:ప్రేమవెలుగు పంచవా

కన్నుగన్నులో చూపుబుల్లెట్ నింపి
ప్రేమగుండెకే గురిపెట్టావే
పెన్నుదన్నుతో కైతబుల్లెట్ వదలి
మమతమత్తు ఎక్కించావే
తర్కపుతెర మెల్లంగా తీసి
ముందుకు విరితోవన అడుగేయవా
మనసుముసుగు మనసార తీసి
చెంతకు చేరరావా చేరదీయవా
మదిలోని రేగే మస్తిష్కపు వేదనకు
మౌనంగా సాగే మూగ ఆరాటాలకు
వలపు మందు హృదయానికి
సమయానికి వేయ వేగరావా
తలపు తడిమి హృద్యముగా
ప్రణయ వెలుగుల్ పంచిపోవా 

Friday, 31 October 2014

పాలగ్లాసుతో గదిలో అడుగిడిన సుకుమారి వయ్యారిని 
అత్మీయ అనురాగలతో తళుకులీను తనువున్న ప్రియమణిని 
స్నేహ సరాగాల కొండమల్లెలను కొప్పులోచుట్టిన వలపురాణిని 
మల్లె బరువున్న మారాణిని ముద్దబంతులతో మురిపించి 
పట్టెమంచం పైన సువాసనిచ్చే మల్లెలను పరచి
ప్రియుడే మనసారా పలుకరించి ప్రేమగా దగ్గరకు తీయంగ
కుసుమించిన ముదిత మోము సిగ్గుప్రభల వెలుగులు విరజిమ్మదా
......

కవిత: నిజమేగా

అక్షరాలేల మదిమాట తెలపా
ఆత్రంగా చెప్పే అక్షువులుండా
పదాలేల మమతలూసు చెప్పా
ప్రియమారా చెప్పే సైగలుండా
తలపులేల మనసుతాత్పర్యాలు తెలపా
అత్మీయంగా చెప్పే హ్రుదయమరులుండా
వరాలేల వలపువివరాలు చెప్పా
పలకరించి చెప్పే విరిసౌరభాలుండా
కవితాచెలి ప్రేమను ప్రేమమీర
ప్రేమగా ప్రేమించా
కవితాచెలికి మనసును మనసార
మనస్ఫూర్తిగా అర్పించా 

కవిత: వలపుపిలుపు

మల్లెలువిరిసిన వెన్నెలవేళ
సౌరభాల తిమ్మెరవై చేరరావా ప్రియా
వేలతారలు మెచ్చే జాబిలివై
వేకువవేళ వేగ తరలిరావా ప్రియా
ఎడద పరచిన వలపుపూలతివాచీపై 
మనసుపడ్డ మనసుకై ప్రేమగా నడచిరా సఖా
పున్నమికాంతి కిరణాల పరావర్తనంతో
పసిడిరూపు దాల్చేగా హరితవనం సంపూర్తిగా
ఆనందాలవెల్లువ ఒరవడిలో మోహం ఉప్పొంగే
సుఖసంతోషాల పలకరింపుతో మొహంలో వెలుగొచ్చే
.........