ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Wednesday, 17 December 2014

శివ స్తుతి "శివోహం"..

తిరిపెముతో వర్ధిల్లు త్రిశూలధారి 
త్రినేత్రునికి వందనాలు
సర్పాభారణలతో తిరుగాడు సుందర
సుందరేసునికి వందనాలు
కాలకూటవిషాన్నే కంఠ ధరించిన
మహాకాలునికి వందనాలు
అడగంగా అత్మజ్యోతినే బహుమతిచ్చిన
అరుణాచలేసునికి వందనాలు
ప్రణమిల్లి మొక్కి ప్రార్ధిస్తే
సులభంగా వరాలిచ్చే పరమేశ్వరునికి వందనాలు
మోకరిల్లి త్వమేవ శరణంటూ
సాగిలపడితే మురిసే మహేశ్వరునికి వందనాలు
అమృతం పంచ వచ్చిన 

మాయామోహిని వెంటబడ్డ ఆనందమూర్తికి వందనాలు
రుద్రాక్షలతో నమకచమక రుద్రజపాలతో 
మెత్తబడి వరాలిచ్చే రౌద్రరూపసికి వందనాలు
తిమిర సంహారం నిత్యయజ్ఞంలా నిర్వహించే
త్రిలోకపతికి వందనాలు
భక్తులను బ్రోచి భవభందాలను తొలిగించే భక్తనృపాలునికి వందనాలు
నర్తనవేళ ఝణకంకణశబ్దాలతో అలరించే
నటరాజమూర్తికి వందనాలు
అత్మజకు అనురక్తితో (తన) శరీరంలో సగమిచ్చే
అర్దనారీశ్వరునికి వందనాలు

లోకంలో సర్వులను కనురెప్పలా కాచే
లోకభందుకు వందనాలు
పుడమిలో ఎల్లరకు పురాషార్దం తెలియచెప్పే
ప్రేమసింధుకు వందనాలు
కలిమిలేముల తేడాలు చూపక కరుణించే
కల్మషరహితునకు వందనాలు
దీనజనులను కృపతో ఆదరించి పరిరక్షించే
ధవళాచలేసునికి వందనాలు 

Tuesday, 16 December 2014

కవిత: సకలం నేనే..నేనే...నేనే

జగజ్జనినే ....జగాన్ని జనాన్ని సృజించేటప్పుడు
జాహ్నవినే....జనులకు జయాపజయాలను పంచేటప్పుడు
దుర్గమ్మనే.....దుర్మతాంధుల పీకను దునిమేటప్పుడు
భద్రకాళినే..... బడుగులపై బలవంతుల దాడినాపేటప్పుడు
కామాక్షినే... కామ్యములను ఒనర్చి పూర్తి చేసేటప్పుడు
పరమేష్టినే... ప్రజల పీడలక్రీనీడలను దూరంచేసేటప్పుడు
కాత్యాయనినే... కష్టాలఓడలను సుఖాలతీరం చేర్చేటప్పుడు
దాక్షాయిణినినే ...దుండుగుల దానవత్వాన్ని రూపుమాపేటప్పుడు
సింహరూడినినే .దుష్టుల దాష్టీకాలను ధ్వంసంచేసేటప్పుడు
ధూమావతినే.. .దూర్తుల దురాగాతాలపై దాడిచేసేటప్పుడు
జ్వాలాముఖినే...కర్మేష్టుల పాపాలను జ్వలించేటప్పుడు
త్రిపురాంబనే.. ...త్రిలోకాలను త్రికరణశుద్దిగా పాలించేటప్పుడు
లలితాంబనే.......లోకాన్ని లాభనష్టాలెక్కేయక ఏలేటప్పుడు 
భగ్లాముఖినే.... భవ్యభవితను నమ్మినోళ్ళకు పంచేటప్పుడు
అన్నపూర్ణనే... అన్నార్తులకు అత్మీయహస్తం అందించేటప్పుడు
శ్రీని నేనే స్త్రీని నేనే అబలను నేనే సబలైన సత్తాచూపేదీ నేనే
శూన్యం నేనే సర్వం నేనే సర్వజగత్తుకు ఆధారమైన అమ్మను నేనే 

Monday, 17 November 2014

కవిత: కృష్ణకృష్ణం వందేహం

దేవకీ వసుదేవుల అష్టమగర్భంగా కృష్ణా
చీకటి చెరసాలలో దుష్టులణచ వెలిసేవు
విష్ణుమాయతో భటులెల్ల మత్తుగా నిద్రబోవ
రాత్రివేళే కన్నతల్లి ఒడివీడి బయలుదేరావు
బంధాలూడిన తండ్రి తలపై శయనించి
యమునానది దారివ్వ నాగరాజు గొడుగవ్వ
నందునింట మరో తల్లి ఒడి పొందినావు
యోగమాయను గుట్టుగా నీ స్థానంలో చేర్చేవు
నంద యశోదల గారాల సుతుడివై రాజిల్లేవు
అనురాగ బృందావనంలో అందరిని అలరించేవు
పొరుగిళ్ళలో వెన్నమీగడలు దోచి దొంగవయ్యేవు
చంపవచ్చిన రాక్షసులను యుక్తిగా మట్టుపెట్టేవు
బాలరూపుతో దొడ్డకార్యాలెన్నో ఘనంగా చేసేవు
గోటితో గోవర్ధనపర్వతాన్ని చిటికెలో ఎత్తేసావు
ఎల్లరును ఇంద్ర ప్రకోపాన్నుండి సంరక్షించేవు
కాళిందిసర్పం తలపై నాట్యమాడి డంభమణిచేవు
తల్లి యశోదకు నోటిలోనే ముల్లోకాలు చూపించేవు
అలవిలేని లీలలెన్నో చేసి గోపికల మనసు దోచేవు
రాధారమణి ఆత్మీయప్రేమను నెగ్గిన జగన్నాధుడివీవు
ఆర్తిగా అడిగితే ఆత్మసమర్పణ చేసే కరుణరేడువీవు
దుష్ట కంసమామను ద్వందయుద్దంలో చంపినావు
బందీఖానలో మగ్గుతున్న వారందరికి స్వేచ్చనిచ్చావు
కంసునిచే చెరపట్టబడిన ముదితలను చేపట్టినావు
తాతాతండ్రుల చెరను విడిపించి రాజ్యమిప్పించినావు
గురుశిష్య పరంపర సుసంపన్నముకై నడుంకట్టేవు
సర్వజ్ఞానివై కూడా సాందీపుని గురువుగా అందేవు
శ్రద్దగా గురుముఖతా విద్యలన్నీ పూర్తిగా నేర్చినావు
చనిన గురుపుత్రుడిని గురుదక్షిణగా తెచ్చిచ్చినావు
బలపరాక్రమ వివరాలు నీ రూపలావణ్య వైనాలు శ్రీకృష్ణ
వినిన విదర్భరమణి రుక్మిణి నిను మోహించే చాలాచాలా
పురోహితుడిని పంపి ప్రేమవివరము తెలిపి చేపట్టమనే బేల
వల్లెయని ఒప్పి ప్రేమబాలను గ్రహించి ప్రేమను గెలిపించే
రాజసూయ సభలో శిశుపాల దూషణలు నూరవ్వ
దగ్గరివాడైన దండన తప్పదని చక్రంతో తలతెగించావు
పాండవమధ్యమునిపై సోదరి సుభద్రకు మనసవ్వ
నిర్మలమైన వారి అనురాగాన్ని ప్రేమను గెలిపించినావు
సత్యనిష్టులైన పాండవుల వెన్నంటి నిలిచి కాపాడేవు
గాంధారిపుత్రుల దాష్టికాలను యుక్తితో అడ్డుకున్నావు
ద్రుపదపుత్రికతో చిన్ననాటి చెలిమికి ఎంతో విలువిచ్చావు
కురుసభలో ద్రౌపది మాననహరణను నిలువరించావు
కురుపుత్రుల కుంతిపుత్రుల నడుమ రణమే తప్పదంటే
ఐదువూళ్ళయైన అడగదలచి రాయభారమేగే కురుసభకు
అవహేళనల అవమానాల నడుమ చెప్పదలచింది చెప్పే
తన మాటవిననినాడు కురువంశ నాశనమేనని తేల్చిచేప్పే
రణభూమిన చుట్టాలను చూచిన పార్ధుడు యుద్దమే వలదనే
తన వాళ్ళను చంపి పొందే రాజ్యసంపద తుచ్చమని పలికే
చంపేదెవరు చచ్చేదెవరంటూ కృష్ణుడే గీతారసామృతాన్నిఅందించే
కళ్ళు మిరిమిట్లు గొలిపే విరాటరూపును కిరీటికి చూపించే
అహంకార విక్రముడు దుర్యోధనుడు సంధికి తలనొగ్గలేదు
కురుపురుషోత్తముడు భీష్ముడు నేలకూలకనూ తప్పలేదు
అరవీరభయంకర పరాక్రముడు కర్ణుడుకి మరణం తప్పలేదు
చెప్పినట్టుగానే కురువంశ నాశనం సంపూర్తిగా తప్పలేదు
ధరణిలోన ప్రేమతత్వాన్ని లీలాకృష్ణ నీవు చూపావు
అవసరమైతే పరాక్రము చూపవలిసిందేనని తెలిపావు
దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మకార్యమని వక్కాణించేవు
సమదృష్టికి సత్యదృష్టికి సచ్చీలతనే ప్రమాణమన్నావు
ప్రేమకు అనురాగ ఆలంబనకు ఆత్మవికాశానికి నీవు ఆదివి
ఆత్మీయత నిరుపమాన వ్యక్తిత్వ పరాకాష్టకు నీవు ప్రతీకవి
సదా స్వార్దరహిత ప్రేమను కరుణతో గెలిపించిన నీవు దైవానివి
హే రాధాకృష్ణ కరుణాకృష్ణ కావ్యకృష్ణ కృష్ణకృష్ణం నీకు వందేహం

కవిత: శ్రీ హస్తిముఖుని స్తుతి

వక్రతుండా వరదాయకా ప్రణతు ప్రణతు 
ఏకదంతా భక్తహృదయా ప్రణతు ప్రణతు
కృష్ణపింగాక్షా కృపానాధా ప్రణతు ప్రణతు
గజవక్త్రా మందగమనా ప్రణతు ప్రణతు
లంభోదరా లోకపాలకా ప్రణతు ప్రణతు
వికటనాశాయ ఆర్తజనపాలకా ప్రణతు ప్రణతు
విఘ్నరాజ ప్రధమపూజార్హీ ప్రణతు ప్రణతు
ధూమ్రవర్ణా దూరాలోచనకారి ప్రణతు ప్రణతు
ఫలాలిచ్చే ఫాలచంద్ర ప్రణతు ప్రణతువరాలిచ్చే వినాయకా ప్రణతు ప్రణతు

గణాలకధినాయాకా గణపతిదేవా ప్రణతు ప్రణతు
బుద్దిసిద్దిప్రాణేశ్వరా గజాననా ప్రణతు ప్రణతు
చతుర్విధఫలదాయకా ఉచ్చిష్ఠమహాత్మా హస్తిముఖా
మూషిక వాహనా భక్తసులభా గౌరిపుత్రా కావవయ్యా
నిత్యమీ భజనను మూడుపూట్లా ఎవ్వరూ చదవునేని
వారి వెతలనూ పరిమార్చి సంతోషాలను అందించి
నిక్కముగా అవ్వారి కోరికలు తీరి కొంగు బంగారమావ్వాలి
సదా ఓ పార్వతీతనుయా నీ కృపాకటాక్షం లభించాలి
నీపై నమ్మికతో ప్రమధనాధా సర్వులకూ చెప్పుచుంటి
ఈ విసురజ మాట సంతోషాలొసుగు అక్షయపైడిమూట

Wednesday, 5 November 2014

కవిత:కృష్ణతత్వం

అల్లంతదూరాన నల్లనయ్య పిల్లనగ్రోవి
పిలుపు వినవచ్చింది
చెవులకింపైన సుస్వర నాదరవం 
రాధిక హృది తాకింది
ఒక్కుదుటన బిరబిరా శిఖిపింఛమౌళిని
చేరుటకై పరుగెత్తింది
లీలమనోహరుని కంటిచూపు కరస్పర్సకై
మనసారా వేచింది
తీరాచేరి తేరిపారచూడ తన్మయత్వముతోడ
రాధమ్మ మోము ఎర్రబడే
వసుధనాయకుడు విహారి గోపెమ్మలతో
గమ్మత్తుగా దోబూచులాడుచుండే
పరంధాముడు శ్రీహరి సిరికన్నియలతో
ప్రీతితో సరసల్లాపాలాడుచుండే
ప్రేయసి రాధను చూసిన కంసభంజనుడు
సర్వులును విడిచి తనవైపే వచ్చే
సవతి బాధను చవిచూసిన రాధహృదయము
మోహనవలపుని త్యజించి వైరాగ్యంపైకి మరలే
వెన్నముద్దలవాడు మెల్లంగా చెంతచేరి
సఖిరాధకు వేడిముద్దులివ్వ
కోపాలు సమసే ప్రణయాలు విరిసే
ప్రేమతత్వముతో జగత్కల్యాణమునకు
కృష్ణయ్య దశ/దిశ సూత్రములు తెలిపే
........

Friday, 31 October 2014

కవిత:కృష్ణం వందేహం

పుట్టకేమో చీకటి చెరసాలలో
శ్రీహరి చక్రి భక్తరక్షోపనిధి చిన్నికృష్ణ
దేవకి సుతుండై జనియించి
కంసమామ ప్రాణహరుండవైతివి లీలాకృష్ణ
తారాడింది అనురాగ బృందావనంలో
నందసుతడివి రాధసఖుడివై గోపికమానసచోరుడవైతివి
చిలిపిదొంగవి నీవు చిన్నికృష్ణ
ప్రభందకావ్యనాయకుడివి ప్రణయంలో నీవు లీలాక్రిష్ణ
ముసి ముసి నవ్వులతో
సర్వుల మనసు దోచేవు చిన్నికృష్ణ
కాలిఅందియలు చప్పుడవ్వకే అల్లన మెల్లన వెన్నను దొంగిలించేవు లీలాకృష్ణ

ముద్దు ముద్దు చేష్టలతో
గోపికలను ప్రీతిమేర అలరించేవు చిన్నికృష్ణ
మోహనరూపానివి నీవు మోక్షప్రదాయివి
యోగీశ్వరడవు యాదవోత్తమడవు నీవు లీలాకృష్ణ
బహుదొడ్డ ఘనకార్యాలు చేసేవు
బాలరూపుతో బంగారుబుగ్గల చిన్నికృష్ణ
కిరీటికి గీతాసారాన్ని త్రావించేవు
చూపి నీవు విరాటరూపు లీలాకృష్ణ
గోవర్ధన పర్వతాన్ని చిటికెనవేలితో
చిత్రంగా చిటికెలో చకచకా పైకేత్తేవు చక్రధారి చిన్నికృష్ణ
గోవిందా గోవిందాయని పిలువ
గబగబా తరలోచ్చి కరిని కృపతో బ్రోచేవు లీలాకృష్ణ
ఇంట్లోనే క్షణకాలంలో చెప్పకనే నోటిలో
తల్లి అశోదకు ముల్లోకాలు చూపించేవుగా చిన్నికృష్ణ
ఆర్తిగా డగుత్తితో చెయ్యేత్తి మ్రోక్కంగానే
కౌరవసభలో ద్రౌపది మానసంరక్షణ గావించేవుగా లీలాకృష్ణ
అనురాగ ఆలంబనకు నీవు ఆత్మవి ఆత్మజుడివి
ప్రేమకు పట్టుకొమ్మవి పెద్దదిక్కువి నీవేగా చిన్నికృష్ణ
రాధారమణి వలపును గెలిచిన శ్రీనాధుడివి ప్రేమదేముడివి
స్వార్దరహిత ప్రేమే సత్యం శివం సుందరమని నిరూపించింది నీవేగా లీలాకృష్ణ 

Wednesday, 29 October 2014

కవిత: సీతాస్వయంవరం

జనపాలుడు జనకునికి
ధరణిపుత్రి దత్తపుత్రికగా దొరికే
బాలాసుకుమారి దివ్యసుందరరూపం
నరపాలుని మదికిచ్చే అలవిలేనిసంతసం
జనకునిబాల ఎదిగినవేళ
అమ్మడిపెళ్లికై తండ్రి తహతహపడే
లోకసుందరికి జోడెవ్వరోనని
వైదేహితండ్రి సోచిస్తూ వ్యాకులపడే
శివధనుస్సును ఎక్కుపెట్టేవాడే
జానకిని చేపట్టే వరుడనిప్రకటించే
జనకపుత్రి స్వయంవరం
తరలివచ్చిరి ఎందరో ధరణీవల్లభులు
యాగరక్షణార్ధం కానలకేగినాడు
రాజర్షీ లక్ష్మణుడితోసహా దశరధప్రధముడు
విశ్వామిత్రుని యాగరక్షణచేసి
సీతాస్వయంవరానికి గురులక్ష్మణులతోడుగా విచ్చేసే దాశరధడు
ముక్కంటిప్రసీదమైన సదాశివునివిల్లుని
పుడమీపాలకులు ఎత్తలేక కుదేలుపడిరి
సిగ్గరిసీతకి పరిణయమవదా
జనకహృది కల్లోలపడే బెంబేలుచెందే
ప్రబలకారుల ప్రభలువెలవెలపోవ
గురువాజ్ఞతో రాఘవుడు సభామధ్యమునకేగే
కలికికులుకుతు ఓరకంటచూస్తుండ
విల్లునెత్తి కౌసలేంద్రుడు ఎక్కుపెట్టివిరిచేసే
ముదమున చిరునగవులుచిలుకుతు
వడివడిగా అడుగేసేసీత వరమాలతో
నవ్వులరేడు నీలమేఘశ్యాముడు
చిత్తహరిణి పున్నమిరూపిణి వరమలగ్రహించే
సీతాస్వయంవరమనే అంకంతో
రాముడు(వైకుంఠనాధుడు) సీత(చంద్రసోదరి..లక్ష్మి) ఒక్కటైరి 

కవిత : చిన్మయం

పద్మాసనంలో పద్మాకరుడు ప్రపంచహితంకై ధ్యానంలో మునిగితేలే
వేదభరతభూమిలో బుద్ధిజీవుల ఈతిబాధల విముక్తికీ ప్రార్ధించే
అర్ధనిమిలితకన్నుల్తో అద్యంతాలులేని జగాన్ని ఆత్మీయంగా ఏలే
మెడలో వైజయంతిమాలతో నీలాంబరుడు సమ్మోహనంగా అగుపించే
పడుచుభామల ప్రేమలందు ప్రణయదేవుడై పీతాంబరుడు రాజిల్లే
గోపికల కోకలెత్తుకెళ్ళిన వెన్నదొంగే బేలద్రౌపదికి వస్త్రాలిచ్చే
అత్మీయులతో జగడమైనవేళ ఫల్గుణిడికి గీతాసారానిచ్చింది చక్రినే
ముర్తీభవించిన చిన్మయముద్రతో ప్రేమరసం జగన్నాధుడు అందించే

Friday, 10 October 2014

కవిత: కూసింత తొందర

స్మశాన విహారిపై
విరాగిపై బూడీదీసునిపై
ప్రజాపతిపౌత్రి గౌరికి 
అంతులేని అనురాగం
జనకుడైన దక్షుని
మాటని జవదాటినాయే
సదాశివుని పెళ్ళాడి
కైలాసం తరలిపోయే
దక్షునిచే తలపెట్టిబడిన
క్రతువుకు మహాయజ్ఞానికి ఆహ్వానమే పంపబడని
తండ్రింటికి తయారయ్యే శివసతి

పుట్టింటికీ పిలవని పేరంటానికీ
దక్షయజ్ఞ క్రతువుకి
వెడిలే పార్వతి కూడదన్న
పరమేశు మాటను కాదని
ముక్కంటి పత్నికి
మునిజన సేవిత జాహ్నవికి
పుట్టింటిమీన మమకారం
మరదే తెచ్చేగా అనర్ధం
ఇది నాటి ఒకనాటి పురాణగాధ
యితిహాసపు సిరిమల్లి పార్వతి
నిత్య సత్యవ్రత పవిత్ర
ప్రభందనాయకీ సిరివల్లి ఈశ్వరి
................................ 
విసురజ

కవిత/స్తుతి: శివోహం

ప్రణయానికి ప్రతిరూపానివి నీవేగా శివా
పౌరుషానికి ఆలిఅబ్బనే దునిమేవు దేవా
కన్నప్ప పిచ్సిప్రేమకు పొంగేవు శివా
కిరాతార్జునీయంతో కిరీటికి శివధనశిచ్చేవు దేవా
చండాలుడివై ఆదిశంకరుని తృష్ణతీర్చేవు శివా
చిత్ స్వరూపమై అందరిలో జ్ఞానదీపమయ్యావు దేవా
త్రిపుండ్రాలతో తీరుగున్నావు లింగరూప శివా
త్రిలోకపూజ్యుడివి త్రిపురాంతకుడివి త్రినేత్రస్వరూపి దేవా
విరాగివై వైరాగ్యజ్ఞాన ప్రదాతవయ్యవు శివా
ఆలికి అర్దభాగమిచ్చి పతిశ్రేష్టుడివయ్యావు దేవా
హిమభూమి కైలాసం ఆవాసంగా శివా
రుద్రమైనా రౌద్రమైనా నీకేచెల్లేగా దేవా
ప్రళయానికి శిల్పివి నీవేగా శివ
ప్రకృతి విలయానికి సంతకానివి దేవా
ఆది అంతం నీవేగా శివా
కేరింతా కేకకు కారణం(నీ)మహిమేగా
వాసిలేదు రాసులతోనే రత్నాలంటామా శివా
సత్తులేదు స్తుతిసోత్కర్షయే సొత్తయ్యే దేవా
ముల్లోకాలను ముక్కంటితో పాలించే శివా
భూలోకంలో రెండుకళ్లుంటేనే విర్రవీగేము దేవా
.........
విసురజ

Tuesday, 10 December 2013

PhotoPhoto

భజన: సర్వం సాయిమయం 
.............................
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి 

పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి

రాధవి నీవే రమణుడివి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి

భాష నీవే భావానివి నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి

కవనం నీవే కవితాగానానివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి

ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి

జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి

ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి

గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి

వేదన నీవే వేడుకవి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి

గమ్యం నీవే గమనం నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి

సర్వం నీవే సకలం నీవే సాయి
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి

Sunday, 8 December 2013

Photo: కవిత: దుర్గమ్మ స్తుతి 
....................
ప్రప్రధమే ప్రసస్థ్యే ప్రజ్ఞాకారిణి పాహిమాం   
అంబా అంబాలికే ఆత్మదర్షిణి పాహిమాం 
శైలపుత్రి శివాత్మజే శక్తిరూపిణి పాహిమాం   
దుర్గే దురితభంజని దుష్టనిహారిణి పాహిమాం
చండి చాముండి చింతపూర్ణి పాహిమాం
కాత్యాయని కల్పవల్లి కష్టనివారిణి పాహిమాం  
జగన్నాయకి జగజ్జనని జైత్రకారిణి పాహిమాం 
త్రిలోకపూజితే త్రిపురాంతకే త్రైనేత్రిణి పాహిమాం 
సువర్చలే సునయని సూక్ష్మరూపిణి పాహిమాం 
లోకమాత్రే లోకరక్షితే లోభనివారిణి పాహిమాం
హరప్రియే హరిహరాత్మజే హోమరూపిణి పాహిమాం
..........
విసురజ

కవిత: దుర్గమ్మ స్తుతి .................... 
ప్రప్రధమే ప్రసస్థ్యే ప్రజ్ఞాకారిణి పాహిమాం 
అంబా అంబాలికే ఆత్మదర్షిణి పాహిమాం 
శైలపుత్రి శివాత్మకే శక్తిరూపిణి పాహిమాం 
దుర్గే దురితభంజని దుష్టనిహారిణి పాహిమాం 
చండి చాముండి చింతపూర్ణి పాహిమాం 
కాత్యాయని కల్పవల్లి కష్టనివారిణి పాహిమాం
జగన్నాయకి జగజ్జనని జైత్రకారిణి పాహిమాం
త్రిలోకపూజితే త్రిపురాంతకే త్రైనేత్రిణి పాహిమాం
సువర్చలే సునయని సూక్ష్మరూపిణి పాహిమాం
లోకమాత్రే లోకరక్షితే లోభనివారిణి పాహిమాం
హరప్రియే హరిహరాత్మకే హోమరూపిణి పాహిమాం
.......... 

Saturday, 7 December 2013

Photo: కీర్తన: కావవే అంబే జగదంబే
......
జన్మమెత్తి జగతిన తిరిగితి తల్లి జగద్ధాత్రి 
తెలియక కొన్ని తెలిసి కొన్ని తప్పులు చేసితి తల్లి
అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తప్పులు కోకొల్లలు చేసితి తల్లి
చేసిన తప్పులను కాయవమ్మా భవాని భాగ్యప్రదాయని 
...........
శైలపుత్రి శివాత్మకే శాంభవి ప్రణతు ప్రణతు
శుభంకరి సర్వార్ధకే సంభవి ప్రణతు ప్రణతు
సుగాయత్రి సత్యార్ధకే శాంకరి ప్రణతు ప్రణతు
సుమగాత్రి సిధ్యర్ధకే శ్రీకరి ప్రణతు ప్రణతు

సువాసిని శ్రీరంజని సద్భుద్దిదేహికే ప్రణతు ప్రణతు
సుహాసిని సౌధామిని శ్రీవిద్యాదేహికే ప్రణతు ప్రణతు
శివాత్మిని శ్రీధామిని సర్వశుభకర్ణికే ప్రణతు ప్రణతు
సునయని సౌభాగ్యని సౌమ్యస్వరూపే ప్రణతు ప్రణతు

సుచరితి సురమ్య శక్తిరూపికే ప్రణతు ప్రణతు
సులక్షణి సుస్మిత సత్పాలికే ప్రణతు ప్రణతు
సుభాషిణి శ్రీచరణి సూక్ష్మరూపికే ప్రణతు ప్రణతు
సరస్వతి శ్రీవాణి సాక్షీభూతికే ప్రణతు ప్రణతు

శుభదేహి సిద్దేస్వరి శూలాపాణి ప్రణతు ప్రణతు
శ్రుతరాజ్ఞి స్నిగ్దేస్వరి సుధారాణి ప్రణతు ప్రణతు
సిద్ధిబుద్ధి సర్వేశ్వరి శ్రితరక్షిణి ప్రణతు ప్రణతు
సత్యవతి శ్రియంకరి సన్నుతరక్షిణి ప్రణతు ప్రణతు
...........
నీ చల్లని చూపులు సోకితే జగదంబే
పాపములన్నీ పటపంచలయ్యేగా 
నీ కరుణ క్రుపలు కలిగితే జగదంబే 
పాతకములన్నీ నష్టమయ్యిపొయ్యేగా 

చేసెద నీ నామస్మరణ సతతం అమ్మా చాముండి
పాడేద నీ జయకీర్తనలే నిత్యం జనని జాహ్నవి



కీర్తన: కావవే అంబే జగదంబే
......
జన్మమెత్తి జగతిన తిరిగితి తల్లి జగద్ధాత్రి
తెలియక కొన్ని తెలిసి కొన్ని తప్పులు చేసితి తల్లి
అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తప్పులు కోకొల్లలు చేసితి తల్లి
చేసిన తప్పులను కాయవమ్మా భవాని భాగ్యప్రదాయని 
...........
శైలపుత్రి శివాత్మకే శాంభవి ప్రణతు ప్రణతు
శుభంకరి సర్వార్ధకే సంభవి ప్రణతు ప్రణతు
సుగాయత్రి సత్యార్ధకే శాంకరి ప్రణతు ప్రణతు
సుమగాత్రి సిధ్యర్ధకే శ్రీకరి ప్రణతు ప్రణతు

సువాసిని శ్రీరంజని సద్భుద్దిదేహికే ప్రణతు ప్రణతు
సుహాసిని సౌధామిని శ్రీవిద్యాదేహికే ప్రణతు ప్రణతు
శివాత్మిని శ్రీధామిని సర్వశుభకర్ణికే ప్రణతు ప్రణతు
సునయని సౌభాగ్యని సౌమ్యస్వరూపే ప్రణతు ప్రణతు

సుచరితి సురమ్య శక్తిరూపికే ప్రణతు ప్రణతు
సులక్షణి సుస్మిత సత్పాలికే ప్రణతు ప్రణతు
సుభాషిణి శ్రీచరణి సూక్ష్మరూపికే ప్రణతు ప్రణతు
సరస్వతి శ్రీవాణి సాక్షీభూతికే ప్రణతు ప్రణతు

శుభదేహి సిద్దేస్వరి శూలాపాణి ప్రణతు ప్రణతు
శ్రుతరాజ్ఞి స్నిగ్దేస్వరి సుధారాణి ప్రణతు ప్రణతు
సిద్ధిబుద్ధి సర్వేశ్వరి శ్రితరక్షిణి ప్రణతు ప్రణతు
సత్యవతి శ్రియంకరి సన్నుతరక్షిణి ప్రణతు ప్రణతు
...........
నీ చల్లని చూపులు సోకితే జగదంబే
పాపములన్నీ పటపంచలయ్యేగా
నీ కరుణ క్రుపలు కలిగితే జగదంబే
పాతకములన్నీ నష్టమయ్యిపొయ్యేగా

చేసెద నీ నామస్మరణ సతతం అమ్మా చాముండి
పాడేద నీ జయకీర్తనలే నిత్యం జనని జాహ్నవి

Saturday, 28 September 2013

Photo: నీలాపనిందలు కాసినవాడు 
ఆలుమందలను కాచినవాడు 
వెన్నదొంగిలించే నెమలీకధరుడు 
నింగినీలమంత విశాలహ్రుదయుడు 
కోకలెత్తుకెళ్ళిన కొంటెప్రియుడు 
వెదురుతోనే వుల్లమునలరించేవాడు 
దుస్తులిచ్చిన ద్రౌపదిమానరక్షకుడు  
గీత చెప్పి జీవితగీతల్ని మార్చినవాడు 
ప్రేమకు ప్రేమను నేర్పినవాడు 
దరిద్రుల దాతల ధర్మపక్షకుడు 
జగమేలువాడు జగానికొక్కడు  
కొండంతదేవుడు శ్రీక్రిష్ణుడు  
......
విసురజ

నీలాపనిందలు కాసినవాడు
ఆలుమందలను కాచినవాడు
వెన్నదొంగిలించే నెమలీకధరుడు
నింగినీలమంత విశాలహ్రుదయుడు
కోకలెత్తుకెళ్ళిన కొంటెప్రియుడు
వెదురుతోనే వుల్లమునలరించేవాడు
దుస్తులిచ్చిన ద్రౌపదిమానరక్షకుడు
గీత చెప్పి జీవితగీతల్ని మార్చినవాడు
ప్రేమకు ప్రేమను నేర్పినవాడు
దరిద్రుల దాతల ధర్మపక్షకుడు
జగమేలువాడు జగానికొక్కడు
కొండంతదేవుడు శ్రీక్రిష్ణుడు 

Friday, 27 September 2013

Photo: కవిత: వినాయకం నమోహం
......................................
పార్వతి తనయాం మహాకాయ మొహితాం నమోహం 
త్రిలోక పూజితాం అనింద్య సేవితాం నమోహం 
గజముఖ వదనాం సిద్దిబుద్ది ప్రియపతిం నమోహం
మోదక ప్రియాం మందగమన బిరుదాం నమోహం 

విఘ్నరాజం విఘ్నేశ్వరాం విశ్వేశ్వరపుత్రాం నమోహం
సమదర్శితాం సర్వారిష్టానాశానం సత్బుద్ధికాం నమోహం 
గణనాధం గణేశం గణపతిం గౌరిప్రియపుత్రాం నమోహం 
శంభుప్రియాం శివాని ఆశీర్వాదవరప్రసాదం నమోహం 

నిత్యం నిన్నే కొలిచే భక్తులందరూ గణపతిదేవాం  
వారాలడుగుతూ విన్నపాలు వినిపిస్తూ వేడుకుంటూ లంబోదరా
కోరింది తప్పక నెరవేరు నీ సన్నిధాన ధామంలో
వలసినంత కలింగించు వినాయాకచక్రవర్తి నామ సంస్మరణలో  

భక్తిమీర ఇష్టంతో చేయండి సర్వులు వినయకపూజను
భక్తులార పొందండి ఎల్లరు కోరినవరాల రత్నాలమూటలను 
.....
విసురజ   
(రేపు వినాయక చవితి శుభ సంధర్భముగా...ఆ ఏకదంతునికి ఈ చిన్న కవితా పుష్పం సమర్పిస్తున్నాను.. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు)

కవిత: వినాయకం నమోహం
......................................
పార్వతి తనయాం మహాకాయ మొహితాం నమోహం
త్రిలోక పూజితాం అనింద్య సేవితాం నమోహం
గజముఖ వదనాం సిద్దిబుద్ది ప్రియపతిం నమోహం
మోదక ప్రియాం మందగమన బిరుదాం నమోహం

విఘ్నరాజం విఘ్నేశ్వరాం విశ్వేశ్వరపుత్రాం నమోహం
సమదర్శితాం సర్వారిష్టానాశానం సత్బుద్ధికాం నమోహం
గణనాధం గణేశం గణపతిం గౌరిప్రియపుత్రాం నమోహం
శంభుప్రియాం శివాని ఆశీర్వాదవరప్రసాదం నమోహం

నిత్యం నిన్నే కొలిచే భక్తులందరూ గణపతిదేవాం
వారాలడుగుతూ విన్నపాలు వినిపిస్తూ వేడుకుంటూ లంబోదరా
కోరింది తప్పక నెరవేరు నీ సన్నిధాన ధామంలో
వలసినంత కలింగించు వినాయాకచక్రవర్తి నామ సంస్మరణలో

భక్తిమీర ఇష్టంతో చేయండి సర్వులు వినయకపూజను
భక్తులార పొందండి ఎల్లరు కోరినవరాల రత్నాలమూటలను
.....

Tuesday, 24 September 2013

Photo: కవిత: లీలాక్రిష్ణ భజేహం
...........................
పుట్టకేమో చీకటి చెరసాలలో, దేవకి సుతుండై
హరివి కంస ప్రాణహరుండవైతివి చిన్నిక్రిష్ణ  
పెరిగింది అనురాగ బ్రుందావనంలో, నంద సుతుండై
ప్రణయానివి గోపిక మానసహరుండవైతివి లీలాక్రిష్ణ 

ముసి ముసి నవ్వులతో వెన్నదోచే 
చిలిపిదొంగవి నీవు చిన్నిక్రిష్ణ
ముద్దు ముద్దు నడకలతో ప్రేమపంచే    
మోహనరూపానివి నీవు లీలాక్రిష్ణ

బాలరూపుతో దేవా చిన్నిక్రిష్ణ 
బహుదొడ్డ ఘనకార్యాలు చేసేవు  
విరాటరూపుతో దేవా లీలాక్రిష్ణ
కిరీటికి గీతాసారామ్రుతం త్రావించేవు  

గోటితో గోవర్ధన పర్వతం
చిటికెలో ఎత్తేవు చిన్నిక్రిష్ణ 
గోవిందా గోవిందాయని పిలువా 
గబగబా తరలోచ్చి కరిని బ్రోచేవు లీలాక్రిష్ణ 

ఇంట్లోనే క్షణకాలంలోనే నోటిలోనే  
తల్లి అశోదకు ముల్లోకాలు చూపించేవు, చిన్నిక్రిష్ణ  
కౌరవ సభలో ఆర్తిగా చెయ్యేత్తి మొక్కంగానే 
ద్రౌపది మాన సం రక్షణ గావించేవు, లీలాక్రిష్ణ

ప్రేమకు అనురాగ ఆలంబనకు ఆత్మవి   
పట్టుకొమ్మవి పెద్దదిక్కువి నీవు, చిన్నిక్రిష్ణ
రాధారమణి వలపును గెలిచిన శ్రీనాధుడివి 
స్వార్దరహిత ప్రేమను గెలిపించింది నీవే, లీలాక్రిష్ణ 
..........
విసురజ

కవిత: లీలాక్రిష్ణ భజేహం
...........................
పుట్టకేమో చీకటి చెరసాలలో, దేవకి సుతుండై
హరివి కంస ప్రాణహరుండవైతివి చిన్నిక్రిష్ణ
పెరిగింది అనురాగ బ్రుందావనంలో, నంద సుతుండై
ప్రణయానివి గోపిక మానసహరుండవైతివి లీలాక్రిష్ణ

ముసి ముసి నవ్వులతో వెన్నదోచే
చిలిపిదొంగవి నీవు చిన్నిక్రిష్ణ
ముద్దు ముద్దు నడకలతో ప్రేమపంచే
మోహనరూపానివి నీవు లీలాక్రిష్ణ

బాలరూపుతో దేవా చిన్నిక్రిష్ణ
బహుదొడ్డ ఘనకార్యాలు చేసేవు
విరాటరూపుతో దేవా లీలాక్రిష్ణ
కిరీటికి గీతాసారామ్రుతం త్రావించేవు

గోటితో గోవర్ధన పర్వతం
చిటికెలో ఎత్తేవు చిన్నిక్రిష్ణ
గోవిందా గోవిందాయని పిలువా
గబగబా తరలోచ్చి కరిని బ్రోచేవు లీలాక్రిష్ణ

ఇంట్లోనే క్షణకాలంలోనే నోటిలోనే
తల్లి అశోదకు ముల్లోకాలు చూపించేవు, చిన్నిక్రిష్ణ
కౌరవ సభలో ఆర్తిగా చెయ్యేత్తి మొక్కంగానే
ద్రౌపది మాన సం రక్షణ గావించేవు, లీలాక్రిష్ణ

ప్రేమకు అనురాగ ఆలంబనకు ఆత్మవి
పట్టుకొమ్మవి పెద్దదిక్కువి నీవు, చిన్నిక్రిష్ణ
రాధారమణి వలపును గెలిచిన శ్రీనాధుడివి
స్వార్దరహిత ప్రేమను గెలిపించింది నీవే, లీలాక్రిష్ణ
..........
విసురజ

Tuesday, 10 September 2013

 Photo: సాయి నిత్య భజన:
 1.
భజన చేయ రారండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి 
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి 

2
తిమిరహరుడే తకదిమిలాడుతూ తప్పిట లాడగ 
లయకారుడే నర్తనలాడుతూ లయగా పాడగ 
వాణినాధుడే పరిపరిమార్లు వల్లెవేయ రచనలు చేయగ 
శ్రీవిభుడే సాయిచరణాలకు సరిగమసంగతుల మాలను కూర్చగ 
ప్రేమతో భజన చేయ రండి 
సాయి భజన శ్రద్ధతో చేయ రండి 

3.  
గురుబోధలే గమ్యము చూపగా 
శ్రద్దా సబూరిలే ముక్తిమార్గము తెలపగా 
సాయిలీలలే నమ్మకము పెంచగా
సద్గురుసాయే సబ్ కా మాలిక్ యని సర్వులు తెలియగా 

ప్రేమతో భజన చేయ రండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 

4.  
చేసిన తప్పులే హారతులవ్వగా 
ఈశ అసూయలే దీపాలవ్వగా 
కోరిన కామితాలే ఫలవంతమవ్వగా 
సాయిప్రేమే సర్వదా అనుభూతవ్వగా 

భజన చేయ రారండి 
సాయిభజన శ్రద్ధతో చేయ రండి 
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి 
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి


సాయి నిత్య భజన:
1.
భజన చేయ రారండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి

2
తిమిరహరుడే తకదిమిలాడుతూ తప్పిట లాడగ
లయకారుడే నర్తనలాడుతూ లయగా పాడగ
వాణినాధుడే పరిపరిమార్లు వల్లెవేయ రచనలు చేయగ
శ్రీవిభుడే సాయిచరణాలకు సరిగమసంగతుల మాలను కూర్చగ
ప్రేమతో భజన చేయ రండి
సాయి భజన శ్రద్ధతో చేయ రండి

3.
గురుబోధలే గమ్యము చూపగా
శ్రద్దా సబూరిలే ముక్తిమార్గము తెలపగా
సాయిలీలలే నమ్మకము పెంచగా
సద్గురుసాయే సబ్ కా మాలిక్ యని సర్వులు తెలియగా

ప్రేమతో భజన చేయ రండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి

4.
చేసిన తప్పులే హారతులవ్వగా
ఈశ అసూయలే దీపాలవ్వగా
కోరిన కామితాలే ఫలవంతమవ్వగా
సాయిప్రేమే సర్వదా అనుభూతవ్వగా

భజన చేయ రారండి
సాయిభజన శ్రద్ధతో చేయ రండి
భక్తులారా సాయియే సర్వదేవతా రూపమండి
భక్తితో సాయి భజన చేసి ముక్తి పొందండి
Photo: సగుణరూపుడే భక్తులకై సాయిబాబా
నిర్గుణకారుడే ఆత్మజులకై సాయిబాబా..20JUL13
విసురజ

సగుణరూపుడే భక్తులకై సాయిబాబా
నిర్గుణకారుడే ఆత్మజులకై సాయిబాబా..

Sunday, 23 June 2013

 Photo: గాలిలో దూళిలో నీ రూపం
గోతిలో నూతిలో నీ రూపం
రాతిలో నాతిలో నీ రూపం 
నడకలో నడతలో నీ రూపం
భవ్యంగా దివ్యంగా నీ రూపం 
నేటిలో రేపటిలో నీ రూపం
రేణులో రేవటిలో నీ రూపం 
అణువులో పరమాణువులో నీ రూపం 
కలలో కల్పనలో నీ రూపం
కధలో కైతలలో నీ రూపం
కన్నులలో వెన్నెలలో నీ రూపం
పదాలలో పాటలలో నీ రూపం

సర్వం నీవే సర్వేశ్వరుడివి నీవే సాయి 
పదకొండు ముత్యాల పలుకులు నీవే సాయి 
సకల జగాలకు ఆదివి అద్భుతానివి నీవే సాయి 
సకల శుభాలకు నాడివి నాందివి నీవే సాయి

కరుణచూపి పాలించవా మము లాలించవా సాయిదేవా
మమతచూపి దయచూపవా  దారిచూపవా సాయిదేవా
వెతలన్నీ నీపై పడవేసి మేము నిశ్చింతగా వుంటిమి సాయిదేవా 
కష్టాలన్నీ నీవే వడబోసి మమ్ము నిశ్చయముగా కాపాడరా సాయిదేవా 
......................
విసురజ

గాలిలో దూళిలో నీ రూపం
గోతిలో నూతిలో నీ రూపం
రాతిలో నాతిలో నీ రూపం
నడకలో నడతలో నీ రూపం
భవ్యంగా దివ్యంగా నీ రూపం
నేటిలో రేపటిలో నీ రూపం
రేణులో రేవటిలో నీ రూపం
అణువులో పరమాణువులో నీ రూపం
కలలో కల్పనలో నీ రూపం
కధలో కైతలలో నీ రూపం
కన్నులలో వెన్నెలలో నీ రూపం
పదాలలో పాటలలో నీ రూపం

సర్వం నీవే సర్వేశ్వరుడివి నీవే సాయి
పదకొండు ముత్యాల పలుకులు నీవే సాయి
సకల జగాలకు ఆదివి అద్భుతానివి నీవే సాయి
సకల శుభాలకు నాడివి నాందివి నీవే సాయి

కరుణచూపి పాలించవా మము లాలించవా సాయిదేవా
మమతచూపి దయచూపవా దారిచూపవా సాయిదేవా
వెతలన్నీ నీపై పడవేసి మేము నిశ్చింతగా వుంటిమి సాయిదేవా
కష్టాలన్నీ నీవే వడబోసి మమ్ము నిశ్చయముగా కాపాడరా సాయిదేవా

Saturday, 20 April 2013

కవిత:రామగానం

Photo     Photo
మధురం రామగానం...రామనామ స్మరణం ...

(విసురజ విరచితం)
.................................................
దశరధ కౌసల్యల సుపుత్రుడే నీలమేఘశ్యాముడు రఘురాముడు
పిన్ని కైకేయి మానసపుత్రుడే శ్రీరాముడు రవికులశ్రేష్టుడు కులదీపకుడు

ముగ్గురు తమ్ముళ్ళ ముద్దుల అన్నయ్య శ్రీరాముడు నీరజాక్షుడు
ముగ్గురు అమ్మల ముద్దుల కన్నయ్య రాఘవుడు సత్యనిష్టుడు

సుందర రాముడు మహనీయుడు మర్యాదా పురుషోత్తముడు
సౌమిత్రికి సోదరుడు మానవోత్తముడు మైత్రికి చిరునామనతడు

కులగురువు వశిష్టుడే ముందుగా విద్యా వినయాలు నేర్పించే
జగద్గురువు విశ్వామిత్రుడే విలు విద్యలో నైపుణ్యం యిప్పించే

యాగ సంరక్షనార్ధం విశ్వామిత్రుని వెంట నడిచే రామ లక్ష్మణులు
రామపాదం తాకి రాయే అహల్యయై ఎదుటనిలిచే చేస్తూ వందనాలు

రక్కసులు మారీచి సుభాహులు యాగం ధ్వంసానికై వచ్చారు
రామలక్ష్మణుల చేతిలో చావుదెబ్బలు తిని చివరకు చచ్చారు

జనకుని పుత్రి సీతాస్వయంవరం చాటింపు జరిగే
మహిమాన్విత శివధనుస్సు ఎత్తిపెట్టితేనే జానకి దొరికే

సీతాస్వయంవరంకై ధరిణిలోని రాజులెందరో వచ్చిరి
శివధనుస్సు ఎత్తిపెట్టలేక నవ్వుల పాలైతిరి

అల్చిప్పలాంటి కళ్ళతో బేలగా చూసే సీత శివధనుస్సు ఎత్తే వీరునికై
అందాలరాముడిని అభ్యర్ధించే జానకి నయనాలు శివధనుస్సునెత్తి తనని చేపట్ట రమ్మని

గురువు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శివధనుస్సును చేరే సభకు నమస్కరించే
లలనసీతను చూస్తూ ఒంటిచేత్తో ఎత్తిపెట్టి విల్లుకు నారికట్ట శివధనుస్సు విరిగే

సిగ్గరి సీత బుగ్గల్లో రోజా మెగ్గలు ముగ్గులు వేయ
ఉరికే సీత వరమాల వేయ వరించిన శ్రీరాముని మెడలో

పెద్దలే ఆనందించ దీవతలే దీవించ జరిగే సీతారాముల పరిణయం
ఇరు రాజ్యాల ప్రజలే పలికే జయజయనాదాలు మురిసే జగం

రాఘవుడే సాకేతపుర సామ్రాట్టని చేయ ముహూర్తం పెట్టించే దశరధుడు
పావని సిగ్గరి సీతే పట్టమహిషని సంబరాల్ని అంబరానంటించే జనకుడు

మంధర వుద్బోధ కర్కసి కైకేయి వరబాధే దశరధునికి గ్రహబాధయ్యే
తండ్రి ఆనతే లక్ష్మణ సహిత రామ సీతల అడవులకేగుటకు కారణమయ్యే

నారచీరతో సీత నీరబట్టలతో రామలక్ష్మణులు కానలకేగే
అయోధ్య పురజనుల కన్నీళ్ళు హృదయఘోషకు అంతేలేకపోయే

రామసీతల నామస్మరణే మోహావేశం విషయవికారం తప్పించు
ఈ పరమపవిత్రుల నిత్యస్మరణే జీవన్ముక్తి కలిగించు
......
విసురజ