ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 September 2012

సాయిబాబా

Friday, September 16, 2011

శిరిడి అనే చిన్న వూరు నేడు పట్టణంగ మారేనే
సాయి వసించనంతనే శిరిడి ప్రాముఖ్యత హెచ్చేనే
నూనేదీపాలు నీటితో వెలిగించి జనుల అగ్యానమును తొలిగించే
అందుకే నవ్య భవ్య యసోసోభితుడు మన సాయిబాబానే

సాయి వంటి సాధువు దర్సనముతో నోక ఆటవికుడి జీవితము మారేనే
రామనామమును తిరగవల్లివేసి ఆ బోయవాడు మహర్షి అయ్యేనే
సుమధుర రసరమ్యామృత రామయణమును రచించినే
అందుకే నవ్య భవ్య యసోసోభితుడు మన సాయిబాబానే

సాయి వంటి సత్పురుషుల వాక్కులు కరచరణ స్పర్సలు కరుణామృత దృక్కులు
మూగవానిని పలికించే గుడ్డివానికి దృష్టి తెచ్చే కుంటివాడికి నడక తెప్పించే
డాంభికుల పటోటోపాలు అగ్ర/హీన జాతి భేధాలు కుల వైషమ్యాలు రూపుమాపేనే
అందుకే నవ్య భవ్య యసోసోభితుడు మన సాయిబాబానే

No comments: