ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 September 2012

darpaNam

Tuesday, June 14, 2011 at 10:40pm ·

మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
నీవు నన్ను కడుపున దాల్చి పలు వెతలు కొర్చినావు
నా ఈ జీవన యాత్రకు సుమార్గము ఎర్పరచినావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
ఆలయాలలో భగవంతుడు ఉంటాడంటారు అది నిక్కమో కాదో నాకు తెలియదు కాని
నా హౄదయాలయములో మాత్రము నీవే నిండి వున్నావు నిండుగా వున్నావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
నేను బాగ చదవాలని నీవు మొక్కులు మొక్కినావు ఉపవాసాలు వుండినావు
నే జీవితములో ఎదగాలని నీవు మనసార కోరినావు మమతలు పంచినావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి ఎవరమ్మ
చదువుకుని చదువుకొని నేను పెద్ద ఎత్తుకు ఎదిగితే ఎగిరితే అనందం చెందావు
ఉద్యోగపు ఆరళ్ళలో నే పడి నలిగితే నాకు ఆత్మస్థర్యన్నిచ్చావు నన్ను ముందుకు నడిపావు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి యెవరమ్మ
నేను కొత్త కోడలుతొ ఇంటికి వచ్చినప్పుడు నన్ను పల్లెత్తు మాట అనలేదు
నీ కోడలి కోరికపై నిన్ను వోల్డేజ్ హోంలో జేర్పినపుడు కూడా
నువ్వు నన్ను ఏమి అనలేదు నన్ను కసురుకోలేదు
మరువనమ్మ నువ్వు చూపిన ఆదరణ మహిలో నీ సాటి యెవరమ్మ
కాని చివరాకరున నీవు చూసిన చూపుకి అర్దం భావం
ఇపుడు నన్ను వోల్డేజ్ హోంలో నీ మనవడు జేర్పినపుడు తెలిసింది
నా తప్పు తెలిసినాక నిన్ను క్షమాపణ అడగడనికి నీవు లేవు
నా తప్పుకు పరిహారం లేదు నా పాపమునకు నిష్క్రుతి లేదు
నేను నీ బాటలోనే నడుస్తున్నామ్మ నా కోడలిని నేను
నీలాగే ఎమన్లేదమ్మ అనడానికి ఎముందమ్మ
దేనికైన మన బంగారం మంచిదైతే కదమ్మ

విసురజ (వెళిదిమళ్ళ సుందర రంగ జగన్నధ్)

No comments: