ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 22 October 2012

ఉదయాన ప్రభాతకిరణాలు నింగినుండి తొంగిచూస్తూ

మెలమెల్లగా పల్లవించి ఊర్విని తాకి పలకరించేవేళ

ఉదయరాగ భాగ్యరాధోదయం మేళవించి

సుహాసిని పలకరించిన సూర్యోదయ వేళ

మనసు మురియగా, ఎదలో కురవలేదా తంగేడి పూలవాన

ఎదలోని ఆర్తికి ఎదుటపడని దేవుడే ఔనన్నవేళ

నింగిలోని వేల్పులే నా మనవిని మన్నించి చూపారా

నా తలపుల సుస్మిత సుజాతే నా ఎదుటకు అంపారా

చెలి రాధామనోహరి ఈ పసిడి కిరణాల వెలుగు నీదేనా

సఖీ చారుశీలి నా వలపు నెగడుకు ఇందనం నీవేనా

No comments: