ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

1) కాలం మహిమ వర్ణనాతీతం. జననం, మరణం, పునరపి జననం అన్నిటికి సాక్షీభూతమీ కాలమే.
మనం నిద్రా స్థితిలో వున్నా, కాలం మేల్కొనే వుంటుంది. ఏ విధంగానైనా కాలాన్ని కాదని జరిగేదేది లేదు.

2) ఏ దేశంలో అయితే తగిన మర్యాద, ఆదరణ, సత్య పరిపాలనలుండవో..
మరి బంధు జనం, మంచి విద్య పొందగలిగే అవకాశాలుండవో అటువంటి దేశాన్ని విడవడమే శ్రేయస్కరం.

3) దుర్మార్గుల వలన ఇహలోకానికి గాని పరలోకాలకు గాని ఎటువంటి హితం చేకూరదు,
అటువంటి వారితో స్నేహం కూడక ఉత్తములతోనే స్నేహం సహవాశం చేయాలి.

No comments: