ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

1) తలచినది జరిగితే సంతోషం చెందు. అలాగే తలచినది జరగకపోతే, అనుభవం అందిందని తలచి నెమ్మదించు. మనసు సమాధానపడితే మౌనం కూడా బాష్యం చెబుతుంది.

2) సాయంత్రపు చల్లగాలిలో వ్యాహాళి వంటికి మనసుకి మంచిది. నిద్రించే లోపులో ప్రతిరోజూ కొంత సమయం నీవు నాటి రోజు నిర్వర్తించిన పనులను సమీక్షించుకుంటుంటే తప్పక మేలు జరుగుతుంది.

3) జీవితంలో ఎదిగేవేళలలో పైకెదిగే తీరులలో స్పష్టత, రుజు ప్రవర్తన, సత్య సందర్శనం నిత్యం అలవర్చుకోవాలి. నీవు అట్లా మెలిగిన నాడు మరో పదుగురికి ఆదర్శం కాగలుగుతావు.

No comments: