ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 21 February 2013

1) అత్యాశ కోసం అంతారాత్మను త్యాగం చేసే వ్యక్తి, బూడిద కోసం చిత్రపటాన్ని కాల్చిన వ్యక్తి లాంటివాడు.
సాధించడంలో కన్న నిజమైన తృప్తి నీ మనఃపూర్వక ప్రయత్నాలలో వుంటుంది.
2) ఆశకు మించిన ఔషధం లేదు. రేపు మరింత మంచి జరుగుతుందన్న భావనకు మించిన ఉత్సాహం లేదు.
విజయానికి అందరూ నేస్తులే. సృజనతో కూడిన ఊహాశక్తే ప్రపంచం.
3) అన్ని వేళలలోను అన్ని విధముల సంతోషంగా వుండు మనిషి ఈ ప్రపంచంలో అందరికన్న సిసలైన ధనవంతుడు.
ఎందుకంటే రోజూ తను చేస్తున్న పనితో సంతృప్తి పొందేవాడే గొప్ప ధనవంతుడు.

No comments: