ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013


1) భగవంతుడిపై నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని జయంచడం దుర్లభం. ఎప్పుడు అనుమానపడేవాడు చెడిపోయి అవమానపడతాడు.

2) అలవాట్లేవైన ఒక్కమారుగా తగ్గించుకోవటం కష్టమే. మెల్ల మెల్లగా ఒక్కో మెట్టు దిగుతూ అలవాట్లను తగ్గించుకుంటూ రావాలి. చీకటిని తిడుతూ కూర్చోడంకంటే కొవ్వొత్తి వెలిగించు.

3) సోమరితనం అనేది ఒక రాచ వ్యాధి. ఒకసారి అది సోకిందంటే, ఇంకా ఆ రోగి ఎన్నటికి బాగుపడడు. లోకంలో రోగంతో సమానమైన అనర్ధం మరోటి లేదు.

No comments: