ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 21 February 2013

కవిత: కోమలికై వగపు
...........................
కలికి యింపైన వదనం
విరిసిన సుమరాణి చందం
రమణి కోలకనుల కొసలు
వలపు దారి చూపు దిశలు
సోట్టలుపడే ఇంతి ఎర్రెర్రని బూరిబుగ్గలు
సహజసిగ్గును అందాలకద్దే పదింతలు
ముదిత మోమున మెరిసే సూటైన నాసికం
ఎదలో లాలసను ద్విగుణికృతం చేసే సాధనం
విడివడని కోమలి పెదవులపై చిరునగవు
పోయే ప్రాణంను సైతం అవలీలగాపు
చల్లగా చల్లగాలి వీచింది
సఖి లేనిలోటు తెలిపింది
వేచి మల్లెమాల వాడింది
వగచి హృది మూతిముడిచింది
నింగిన జాబిలి రాక తారలలిగే
ఇలలో చెలి రాక మమతలిగే
వరించిన చెలి రాక మనసు దిగాలు పడే
అంతులేని విరహంతో డెందము భార పడే
మనసైన చినదాన వేగ రావేలనే
చెంతచేర జాగేలనే చెలి సిగ్గేలనే
తలపులలో నిత్యముండే పెన్నిధివే
వలపుగూటిలో చేర మరింక జాగేలనే
తనకై వేచి చూసిన రేయి ఉదయమయ్యే
సిగ్గు పడే చెలి మోములా అరుణమయ్యే

No comments: