ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: నీ తలపే
...............
తూరుపు ఎర్రబారితే..నీ తలపే
రేయికి పగలే వీడ్కోలిస్తే.నీ తలపే
మండుటెండ చుర్రుమనిపిస్తే..నీ తలపే
మలయమారుతమే వయసునే గిల్లితే..నీ తలపే
చల్లగాలి బడలిన మేనును గిలిగింతలిడితే..నీ తలపే
తిమిర సుందరి ముస్తాబై ముద్దుగావస్తే..నీ తలపే
రాత్రమ్మ చీకటిదుప్ప్తటితో లోకాన్ని కప్పేస్తే..నీ తలపే
సుస్వర సంగీతం చెవికింపుగా వినివస్తే..నీ తలపే
జలకాలటలలో మున్నీట మునిగితేలి ఆటలాడితే..నీ తలపే
అల్లరి కెరటాలే పాదాలను ముద్దాడితే..నీ తలపే
జాజిమల్లెలు సుగంధాలను విరజిమ్మితే..నీ తలపే
జావళి పాడే వెన్నెలే వలపు పానుపు నందిస్తే..నీ తలపే
నిద్రరాని రాత్రులలో నిట్టూర్పుల కూనిరాగాలే తీస్తే..నీ తలపే
కోయిలల కచేరీలలో పసందైన కూతలే వినవస్తే..నీ తలపే
మది పిలుపు ఎద సుధలకై తపిస్తే..నీ తలపే
ఎద వలపు చితివరకు తోడుంటానని సెలవిస్త ..నీ తలపే
కోరికలే మనసును తరిమి తడిమితే..నీ తలపే
హృది సన్నిధిలో వలపు రాగం పాడితే..నీ తలపే
అనురాగపు ఆంక్షల గడియ కిర్రుకిర్రంటు వూడిపోతే..నీ తలపే

No comments: