ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 19 February 2013

కవిత: వలపు ఘోష
...........................
పిండారబోసిందా అన్నట్టున్న ఈ వెన్నెల వెలుగులు
తరిమి తడిమి నీ తలపులనే మరీ మరీ గుర్తుచేస్తోంటే
తడుస్తూ విరహంలో నిలువెల్ల తలచి నీ ప్రేమ సౌరభాలు
మది మరో లోకంలో మనసు తన్మయత్వంలో తేలుతుంటే
గుండెల్లో చిలిపి కోరికలేవో కోరే నీ ప్రేమ గురుతులు
దొర్లి దొర్లి నిద్రపట్టక కళ్ళేర్రబారితే కారణం పదుగురు అడుగుతుంటే
చెలి నాకే తెలియని నిన్ను వారికెలా తెలిపేది నీ పోకడలు
తొలిపొద్దు వెచ్చంగా గుచ్చుతు పసిడి రేకులు విచ్చుకుంటుంటే
అల్లంతదూరాన నువ్వుండి నీ శ్వాస నిట్టుర్పు ఊపిరులు
చలచల్లని హిమకౌగిలిలా నన్ను అల్లుకుని చుట్టుకుంటుంటే
దర్శనం దొరకనిదే నీ స్పర్శ సోకనిదే జీవించలేననే వలపు నిజాలు
నా మనసుని తొలిచి దహించే నన్ను సజీవంగానే నిర్జీవిని చేస్తుంటే
చెలి నేనెలా బ్రతకను నీవు నను దరి చేరక మనసు తెలపగ
అంతదాక నీ జ్ఞాపకాల ఊసులనే ఊపిరిగా చేసుకుని జీవించెదనే చెలి

No comments: