ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

కవిత: అందమా అందుమా
......................
వెన్నెల సోనాకే రూపందగ
నీవై ఈ అవనిపైన వుదయించావే
మల్లిపులే తమ సోకే అద్దంగ
మాకై సుమపరిమళాలు మోసుకు వచ్చావే
మయూరల్లే వయ్యారంగా నడవంగ
సింగారాల సౌరాభాలు వెదజల్లావే
మూర్తిభవిస్తే మంచితనమే నీ రూపంగ
చందనాల విరిస్నిగ్ధగా విరబూసినావే
నిలువెత్తు రూపంతో అతిలోక సుందరంగ
మనసుకళ్ళున్న వారికి అగుపించావే
కుదురున్న మనసైన కోటతోటలో పుష్పించగ
వలచినవారి దర్పమై చేపట్టినవారి గర్వానివై మెరిసావే
నలుగురిలో కలిసి మెరిసి నవ్యంగ భవ్యంగ
దేశకాలమేదైన దేదీప్యమానంగ వెలిగావే
పసిడి నవ్వుల అమాయక రూపశిల్పం..చిత్రంగ
నేడు పదుగురికి ఊతిచ్చి ఆశల "ఆసార"వైనావే

No comments: