ప్రభాత కిరణాలు పుడమికి సుప్రభాత గీతాలాలపించే
అరవిచ్చిన పసిడి కిరణాలు అవనికి కొత్తాందాలిప్పించే
నింగిని నిలిచిన ఆదిత్యుని మెరుపు తిమిరాన్ని నిర్జించే
ఉదయభాస్కరుని ఎరుపు అతివ బుగ్గలకు పెదాలకంటే
మందారం సిగలో ముడిచి పడతి నుదుట అరుణతిలకమద్దే
తీరైన కనుముక్కుతీరుతో మీనాక్షి మోము మరింత శోభించే
వల్లెవాటు చాటున దాచినా దాగని రమణి అందాలు మదిలో తపనలు రేపే
భ్రమరాలే తేనెల నెలవైన సుగంధాల కుసుమ కన్యకవని భ్రమపడి తాకవచ్చే
కనకాభరణాలు తొడిగిన భామిని మేని రంగు పసిడి కిరణాలకే పోటీకొచ్చే
కాపుకొచ్చిన అందాల జవ్వని శరీరాకృతిపై పచ్చని ప్రకృతికి సైతం ఈర్ష్యోచ్చే

No comments:
Post a Comment