ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

కవిత: శ్రీవాసుని స్తుతి
........................
అలిమేలు పతి వందనం
పద్మావతి ప్రియా వందనం
శ్రీదేవి మనోవిహారి వందనం
లక్షిహృదయ స్థితా వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం

ధరణిమాన సంరక్షా వందనం
క్షీరసాగర నివాసా వందనం
కమలనాభ ప్రియే వందనం
శృంగార రసరాజా వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం

నారదనుత శ్రీశా వందనం
దశావతార ధీశా వందనం
లీలామానుష రూపా వందనం
గరుడవాహన శ్రీవరా వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం

శుద్ధచైతన్య స్వామీ వందనం
నీరజదళాక్షక సుందరా వందనం
కామితఫల వరదాయి వందనం
ఆర్తజనసంరక్షా భక్తీశ్వర వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం

దానవ దమనకా వందనం
దురిత పాపాహారా వందనం
భక్తజన సేవితా వందనం
సర్వవ్యాపి వ్రజిత వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం

సకల భూతాత్మనే వందనం
వటపత్ర శాయీశ వందనం
సత్యం శివం సుందరేశ వందనం
సత్యవాక్య పరిపాలక వందనం
గోవిందనామ శ్రీనాధా వందేహం
విసురజ(New Delhi)

No comments: