ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

కవిత: చిలక పలకరింపు
,,,,,,,,,,,,,,
చెట్లపై నుంచి వీచే గాలి మెల్లగ సన్నగా పలకరించే
ఊగే మామిడి కొమ్మలు పచ్చని చేలో హాయినిచ్చే
పచ్చని చీర కట్టి చిలకమ్మ తోటలోకి మావిచిగురు తినవచ్చే
కొమ్మమీన కోత కొచ్చిన మామిళ్ళు అందంగ అగుపించే
పండిన దోర మామిళ్ళను ఎర్రముక్కమ్మ ముద్దార కొరక వచ్చే
మనసు దోచిన ప్రియురాలి నునువైన చెక్కిళ్ళులా మామిళ్ళు ఊరించే
చిలక కోరికిన పళ్ళు చెలియ అధరామృతంలా తీయని తీపినందించే
ఆరుబయలులో పచ్చని మామిడి తోపులో చిలక పిలుపులు వినవచ్చే

No comments: