ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

1) పుస్తక పఠనం యోగకారకం. పుస్తక ఒక మంచి నేస్తం. ఒంటరికి ఆలంబనం పుస్తకం. ఋణం కోరక, బదులుచెప్పక బుద్ది నేర్పేది ఎన్నో కొత్త కొత్త విషయాలు విశదీకరించి నేర్పేది పుస్తకం. మనం చదివే ప్రతి పుస్తకం మన మానసిక ఎదుగుదలను ఒక మిల్లిమీటర్ వరకైనా పెంచుతుంది, ఇది మటుకు సత్యం.

2) పరులను తనవాళ్ళను సర్వులను శాంతింపచేసే నాలుకతో ఎల్లప్పుడూ మాట్లాడు, వారితో పాటు నీకు కూడా నెమ్మది పరుస్తుంది. పరుషాలు పలికితే పౌరుషాలు పెరిగి పతనానికి పరుగు తీస్తుంది.

No comments: