ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత/భజన: శివోహం
...................................................


Photo: ఈ రోజు అనగా 10.03.2013, మహాశివరాత్రి, సందర్భముగా "ముక్కంటి సాంబశివుడ్ని" క్రింద విధముగా నుతించితి. చూసి దీవించగలరు.
.........
కవిత/భజన: శివోహం  
...................................................
వేకువయ్యే వేళ వెన్నంటి ఉంటావు..శివా 
చీకట్లోనూ చూస్తే చెంతే ఉంటావు,..శివా 
రోజంతా నీడల్లే నిత్యం నాతో ఉంటావు..శివా 
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా 

కష్టాలు తాకువేళ ఓరిమినీయవయ..శివా  
కోర్కెలు తీరువేళ గర్వమీయకయ..శివా
ప్రశ్నలు ఎదురయ్యేవేళ జవాబీయవయ..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా..శివా

ఎదలో సదాచారం కొలువుండాలి..శివా
మదిలో మంచితలపులు మెరవాలి..శివా
హృదిలో జ్ఞానభోదలు నిలవాలి..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

పూజలు చేయుట చేతకాదు..శివా
ఉపవాసాలు వుండుట చేతవదు..శివా
మనసు నీ నామస్మరణ మానదు..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

ఆశలు అతిగా రేపకు..శివా
కాసులు వెలతిగా చేయకు..శివా
బాసలు ఉత్తవి కానీకు..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

నెమ్మది చిత్తము నీయరా..శివా
గోరచనం నాశనం చేయరా..శివా
శాంతం కొండంత ఇవ్వరా..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

లోకం అల్లకల్లోలం సేయకురా..శివా
జనం ప్రజాహితం మానకురా..శివా
నిజం నిర్భయత్వం వదలనీయకురా..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా
.................
విసురజ (10.03.2013) 
 వేకువయ్యే వేళ వెన్నంటి ఉంటావు..శివా
చీకట్లోనూ చూస్తే చెంతే ఉంటావు,..శివా
రోజంతా నీడల్లే నిత్యం నాతో ఉంటావు..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

కష్టాలు తాకువేళ ఓరిమినీయవయ..శివా
కోర్కెలు తీరువేళ గర్వమీయకయ..శివా
ప్రశ్నలు ఎదురయ్యేవేళ జవాబీయవయ..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా..శివా

ఎదలో సదాచారం కొలువుండాలి..శివా
మదిలో మంచితలపులు మెరవాలి..శివా
హృదిలో జ్ఞానభోదలు నిలవాలి..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

పూజలు చేయుట చేతకాదు..శివా
ఉపవాసాలు వుండుట చేతవదు..శివా
మనసు నీ నామస్మరణ మానదు..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

ఆశలు అతిగా రేపకు..శివా
కాసులు వెలతిగా చేయకు..శివా
బాసలు ఉత్తవి కానీకు..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

నెమ్మది చిత్తము నీయరా..శివా
గోరచనం నాశనం చేయరా..శివా
శాంతం కొండంత ఇవ్వరా..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా

లోకం అల్లకల్లోలం సేయకురా..శివా
జనం ప్రజాహితం మానకురా..శివా
నిజం నిర్భయత్వం వదలనీయకురా..శివా
భక్తసులభా భస్మాకరా హరా మము కావరా
.................

No comments: