ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత: కన్నె పిలుపు
.................................


Photo: కవిత: కన్నె పిలుపు
.................................
ధర్మదత్తమైన మానధనుల కన్యనురా
డాబులు దర్పాలు తెలియని దాననురా
మదనుడి చిలిపల్లరి ఓపజాలనురా
సరసుడా దరిచేర రారా తాళలేనురా
వడుపు వాటమైన సమయమిదేరా 
మారాం చేయక చెలియకై బేగరారా
సంపెంగెలు సన్నజాజులు వెక్కిరించేరా
కుదురైన నియమాన నిను సేవింతురా
చివాలున కదిలివచ్చి మురిపించరా
రాగామయికి అనురాగతీర్ధం ప్రసాదించరా
మదిలో తిష్టవేసి చక్కిలిగింతలేట్టేవురా
వలపు చిటారుకొమ్మను మనసార అందరా
కన్నెగులాబి సౌరభాలు పరిమిళించేరా
కొంటెతుమ్మెదవై సోయగపు తేనేను జుర్రరా
బ్రతుకుయామినిలో నిశిచీకటి పోగొట్టరా 
పున్నమి శోభలు నలుదెసల ప్రభవించరా 
......
విసురజ ధర్మదత్తమైన మానధనుల కన్యనురా
డాబులు దర్పాలు తెలియని దాననురా
మదనుడి చిలిపల్లరి ఓపజాలనురా
సరసుడా దరిచేర రారా తాళలేనురా
వడుపు వాటమైన సమయమిదేరా
మారాం చేయక చెలియకై బేగరారా
సంపెంగెలు సన్నజాజులు వెక్కిరించేరా
కుదురైన నియమాన నిను సేవింతురా
చివాలున కదిలివచ్చి మురిపించరా
రాగామయికి అనురాగతీర్ధం ప్రసాదించరా
మదిలో తిష్టవేసి చక్కిలిగింతలేట్టేవురా
వలపు చిటారుకొమ్మను మనసార అందరా
కన్నెగులాబి సౌరభాలు పరిమిళించేరా
కొంటెతుమ్మెదవై సోయగపు తేనేను జుర్రరా
బ్రతుకుయామినిలో నిశిచీకటి పోగొట్టరా
పున్నమి శోభలు నలుదెసల ప్రభవించరా
......
విసురజ

No comments: