ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత:పూస్తే
...............
ప్రకృతి పూస్తే...వసంతమొచ్చినట్టే
వెలుగు పూస్తే...ఉషోదయమైనట్టే
వదనం పూస్తే...సిగ్గోదయమైనట్టే
మరులు పూస్తే...విరహోదయమైనట్టే
కుక్కుటం కూస్తే...సూర్యోదయమైనట్టే
వలపు పూస్తే...హృదయోదయమైనట్టే
స్నేహమే పూస్తే...భాగ్యోదయమైనట్టే
రాతిరి పూస్తే...పౌర్ణోదయమైనట్టే
తనువు పూస్తే...వయసోదయమైనట్టే
కలువ పూస్తే...చంద్రోదయమైనట్టే
మనసు పూస్తే....ప్రేమోదయమైనట్టే
చేనులు పూస్తే..హర్షోదయమైనట్టే
మేఘమే పూస్తే..మబ్బోదయమైనట్టే
కవితే పూస్తే...కావ్యోదయమైనట్టే
వయసు పూస్తే...మేనిమేరుపోదయమైనట్టే
బ్రతుకు పూస్తే...ఆనందమంగళమైనట్టే
.....
విసురజ

No comments: