ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---57 ) (23-03-2013)

బెనిఫిట్ ఆఫ్ డౌట్...సంశయ లాభం....
చట్టం లో ఇది కొన్ని సందర్భాల్లో అతి శక్తివంతమైన ఆయుధం అవుతుంది. కళ్ళ ముందు కనిపించే తన ముగ్ధ రూపాన్ని చంపగలడా ? మోహన రూపం లో
వున్న ముగ్ధ ను పట్టుకోగలడా ?
మోహన కార్తికేయ వైపు చూసి కొనసాగించింది " ప్రతి మనిషికీ ఓ లక్ష్యం వుంటుంది...లక్ష్యం లేని మనిషి... శవం తో సమానం....
ఇరవై నాలు గంటల్లో బాడీ( శవం ) లో మార్పులు..నలభై ఎనిమిది గంటల్లో వాసన...ఆ తర్వాత శరీరం లో పురుగులు...ఏ అవయవానికి ఆ అవయవం ఊడిపోతుంది...లక్ష్యం లేని మనిషి కూడా అలానే ...ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు...నేను నా వాదాన్ని సమర్ధించుకుంటాను...మీరు మీ వాదాన్ని వినిపిస్తారు. కోర్ట్ కు సాక్ష్యాలు కావాలి...మనసు కోర్ట్ కు తన మనస్సాక్షి చాలు.

నా లక్ష్యం ఈ ప్రపంచాన్ని నా పాదాక్రాంతం చేసుకోవాలి...అవినీతి,స్వార్ధం,అరాచకాలు లేని సామ్రాజ్యానికి నేనే రూలర్ ని కావాలి...ఈ ప్రయత్నం లో ఎన్నో ఎదురుదెబ్బలు...అన్నింటినీ తట్టుకున్నాను....కానీ మిమ్మల్ని ఎదురించలేకపోయాను....నాకు తెలుసు ఏదో ఒక రోజు మృత్యువు నన్ను తరుముతుంది.అప్పుడు నాకు ఓ రక్షణ కావాలి...ఆ మృత్యువు కూడా మీ రూపం లోనే వస్తుంది అని తెలుసు. అలాంటి పరిస్థితి లో నన్ను నేను కాపాడుకోవాలంటే....మిమ్మల్ని నియంత్రించాలి.
నేను ముగ్ధను బంధించి మీ నుంచి తప్పించుకోవడం అసాధ్యం...అదే నేను ముగ్ధ రూపం లో వుంటే...ఒకటి మిమ్మల్ని తప్పు దారి పట్టించి..నా లక్ష్యం నేరవేర్చుకోవాలి...లేదా మీ నుంచి ఎస్కేప్ కావాలి...ముగ్ధ రూపం లో వున్న నన్ను చంపలేరు...అలా చంపినా మరుక్షణం నా రూపం లో వున్నా ముగ్ధను ఇంటర్ పోల్ వెంటాడుతుంది...ముగ్ధ మోహన కాదని మీరు నిరూపించేలోగా మీ ముగ్ధ మీకు దూరం అవుతుంది.
ముగ్ధను కిడ్నాప్ చేయించి నా స్థావరానికి రప్పించాను. డాక్టర్ రాధారాణి ని కిడ్నాప్ చేసాను...నేను ముగ్ధ గా మారాను...ముగ్ధను మోహన గా మార్పించాను. నేను సేఫ్ గా ఉన్నంత వరకు ముగ్ధ,డాక్టర్ రాధారాణి,విద్యారణ్య సేఫ్ గా వుంటారు." మోహన ఆగి కార్తికేయ వంక చూసింది.
కార్తికేయ తన మనసులోని ఫీలింగ్స్ బయటకు ప్రదర్శించలేదు.
*********************************
మోహన కార్తికేయ వైపు చూసింది..అతనిలోని గాంభీర్యాన్ని చూస్తె ముచ్చటేసింది.శత్రువు తన ఎదురుగా వుంది.తను ప్రాణం గా ప్రేమించిన ప్రియురాలు బందీగా వుంది.అయినా చెరిగిపోని గుండె నిబ్బరం.
"చెప్పండి కార్తికేయ ఇప్పుడు నన్నేం చేస్తారు ? చంపేస్తారా ? నా నుంచి నిజం రాబట్టడాని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ?
కార్తికేయ మోహనకు దగ్గరగా వచ్చాడు...ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు.అతని కళ్ళలో సన్నటి కన్నీటి మెరుపు...
"మోహనా...నాకు ముగ్ధను చూడాలని వుంది.ఒక్కసారి చూపించవూ ..."
ఒక్క క్షణం షాకింగ్ గా అలానే ఉండిపోయింది మోహన.ఎంతో గుండె నిబ్బరం వున్న వ్యక్తీ...
దేవుడే వచ్చి భక్తురాలిని వరం అడిగితే ?
"ప్లీజ్ మోహన...పోనీ తను క్షేమంగా వుందని నా మీద ఒట్టేసి చెప్పు.."..మోహన చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకుని అడిగాడు
ఆ చేతిని అతని తల మీది నుంచి తీయాలని అనిపించలేదు.
బండగా మారిన ఆమె గుండె హిమమై కరుగుతోంది...దుఖమై వర్షిస్తోంది.
వెంటనే బ్యాగ్ లోని నుంచి ఐ ఫోన్ తీసింది.
ఆ క్షణం కార్తికేయ కోరిక తీర్చడం కోసం చచ్చిపోవాలని అనిపించింది మోహనకు...
నిజాయితీ తో కూడిన ప్రేమకు ఇంత గొప్ప శక్తి ఉంటుందా ? కార్తికేయ ను సోఫాలో కూచోబెట్టింది...తను అతని పక్కనే కూచుంది.
ఐ ఫోన్ స్క్రీన్ మీద దృశ్యం మొదలైంది.
**********************************
పాత ఢిల్లీ...పాడుబడిన విశాలమైన భవనం...ఒక గదిలో విద్యారణ్య సోఫాలో కూచొని మిమిక్రీ కి సంబంధించిన పుస్తకం చదువుతున్నాడు. అతని ఎదురుగా డాక్టర్ రాధారాణి...టీపాయ్ మీద పళ్ళు..కూల్ డ్రింక్స్...డైనింగ్ టేబుల్ మీద రక రకాల డిషెస్...
డాక్టర్ రాధారాణి విద్యారణ్య వైపు చూసి "మనకీ పనిష్మెంట్ ఇంకా ఎన్నాళ్ళు ?
"బహుశా మనల్ని కిడ్నాప్ చేసిన మోహనకు కూడా తెలియదేమో...కానీ ఒక్క విషయం లో మనం మోహన ను అభినందించాలి..తాళ్ళతో కట్టేయకుండా,నోట్లో గుడ్డలు కుక్కి హింసించకుండా..."నవ్వి అన్నాడు విద్యారణ్య.
"నిజమే...ఇక్కడ మనకు ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది.ముగ్ధ పరిస్థితి తలుచుకుంటుంటే...భయం గా వుంది.ఇక ముగ్ధను కాపాడవలిసింది కార్తికేయ మాత్రమే..." రాధారాణి అంది.
**************************
మెల్లి మెల్లిగా కళ్ళు తెరుస్తోంది ముగ్ధ...చాలా రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. ముగ్ధ లేవగానే ఆమెను అంటి పెట్టుకువున్న నర్స్ లేచి మంచం దగ్గరి వచ్చింది.ముగ్ధను ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా చూసుకోవలిసిన బాధ్యత ఆ నర్స్ ది.
"నేను...నేను ఎక్కడున్నాను ? ముగ్ధ గొంతు నీరసం గా వుంది...మెల్లిగా లేచి వాష్ బేస్ దగ్గరికి వచ్చింది...అడ్డం లో తన మొహం చూసుకుని గట్టిగా అరిచింది.ఆ అరుపుకు హాల్లో ఉన్న విద్యారణ్య,డాక్టర్ రాధారాణి ఒక్క ఉదుటున లేచారు...ముగ్ధ గదిలోకి రాబుతుంటే..ముగ్ధ గది తలుపులు
ఆటో మేటిగ్గా క్లోజ్ అయ్యాయి...అయ్యేలా చేసాడు యాహ్యాఖాన్...
అతను తాగివున్నాడు..ఎర్రని ఆ కళ్ళలో పైశాచికమైన కోరిక కనబడుతుం ది ...తన మొహం లో వచ్చిన మార్పుకు సంబంధించిన షాక్ లో నుంచి ఇంకా ముగ్ధ కోలుకోనేలేదు...మరో షాక్ యాహ్యాఖాన్ రూపం లో ...ఆ దృశ్యం చూసిన మోహన షాకయింది. కార్తికేయ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మోహన హ్యాండ్ బాగ్ లో ఉన్న మరో ఫోన్ తీసింది.మోహన మొహం కోపం ఎర్రబడిం

No comments: