విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---58 ) (24-03-2013)
కార్తికేయ మొహం అరుణ వర్ణం దాల్చింది.ఏ క్షణమైనా పేలిపోయే అగ్నిపర్వతం లా వుంది. మోహన ఖాసిం నంబర్ కలిపింది.స్విచిడ్ ఆఫ్...అని వస్తోంది.మరో సారి...మరో సారి ట్రై చేసింది.ఈ సారి యాహ్యాఖాన్ కి చేసింది.మరో పక్క అక్కడ ఏం జరుగుతుందో ఐ ఫోన్ లో కనిపిస్తోంది.
"యాహ్యాఖాన్..".మోహన అంత గట్టిగా అరవడం మొదటి సారి...యాహ్యాఖాన్..మర్యాదగా ఆ గదిలో నుంచి వెనక్కు వెళ్ళు..."
యాహ్యాఖాన్ తాపీగా..."వెనక్కి వెళ్ళడానికి ఈ గదిలోకి రాలేదు మేమ్ ...మాఫ్ కీజియే....అయినా ఈ అమ్మాయి మన శత్రువు ప్రియురాలు..." అన్నాడు...
"ఖామూష్...యాహ్యాఖాన్ ఈ మోహన సహనాన్ని పరీక్షించకు... డీల్ డీల్ లానే వుండనీ...నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో..."
"ఈ యాహ్యాఖాన్ డబ్బుని,ఆడదాన్ని వదులుకోడు మేం సాబ్..."
"అక్కడ వున్నది ఈ మేమ్ రూపం "
"యస్ మేమ్ నాకు ఇంకా మజాగా వుంటుంది....ఇద్దర్ని...."
మోహన ఫోన్ కట్ చేసింది.కార్తికేయ వైపు తిరిగింది.
"మోహనా...వాడెక్కడ ఉన్నాడో చెప్పు...వాడి తల తెగనరికి....."ఆవేశం తో కంపించి పోతున్నాడు.
"సారీ...నేనే వెళ్తాను...నన్ను నమ్మి నన్ను వదిలేయండి....సరిగ్గా ఒక గంటలో తిరిగొస్తాను."
"నేనూ వస్తాను "కార్తికేయ అన్నాడు .
"మిస్టర్ కార్తికేయ టైం లేదు నన్ను వెళ్ళనివ్వండి "
కార్తికేయ ఏదో అనబోయాడు.కోపాన్ని,అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్తికేయ దగ్గరి వచ్చింది.
"సారీ కార్తికేయ గారు....బిలీవ్ మీ....చిన్నప్పటి ఆవు పులి కథ మీకు తెలుసు...మీ ముగ్దని కాపాడడానికే వెళ్తున్నాను...ఈ మోహన మోసగాళ్ళను మోసగించిందే కానీ మంచివాల్లను మోసగించలేదు...
అంటూ అతని చేతిని తీసుకుని...కళ్ళు మూసుకుంది...కార్తికేయ చేతిని తన పొట్ట మీదికి తీసుకు వచ్చింది...
"ఆకలి అంటే నాకు గౌరవం,భయం...నేను గడిపిన ఆకలి రోజుల మీదొట్టు....
ఆ చేతిని ,కార్తికేయ చేతిని తన గుండెల మీదికి చేర్చింది....శూన్యమైన నా మనసు మీద,నేను కోల్పోయిన ప్రేమ మీదొట్టు..
కార్తికేయ చేతిని తన తల మీదికి చేర్చి....నా మీదొట్టు....నన్ను ప్రేమించడానికి నేను తప్ప,నన్ను నేను తప్ప ఎవరి ప్రేమకూ నోచుకోని నా మీదొట్టు..."
కార్తికేయ చేతిని వదిలేసింది...
"దయ చేసి నన్ను ఫాలో కావొద్దు....సరిగ్గా గంటలో నేను ఇక్కడుంటాను...మీ ముగ్ధ మీద ఈగ వాలనివ్వను...ఈ ప్రయత్నం లో నేను తిరిగిరాకపోతే...చచ్చిపోయానని అనుకోండి.తెలివిగా ఇమ్మల్ని మోసం చేసి పారిపోయానని అనుకోవద్దు.
అంటూ తన గదిలోకి వెళ్లి అయిదే నిమిషాల్లో జీన్స్ తో బయటకు వచ్చింది.
"మోహనా ఈ రివాల్వర్ వుంచండి.అవసరమైతే వాడిని కాల్చేయండి.ఇది సర్వీస్ రివాల్వర్..ఈ బుల్లెట్స్
నా అకౌంట్ లోకి వెళ్తాయి."రివాల్వర్ ఇస్తూ చెప్పాడు.
"ఈ మోహన చేయే ఒక ఆయుధం..."
కార్తికేయ తన కారు కీస్ ఇచ్చాడు.మోహన బయటకు నడిచింది.
**************************
"సార్...మోహన బయల్దేరింది...ఫాలో అవమంటారా?మోహన బయటకు వెళ్ళడం చూసి అడిగాడు డిటెక్టివ్ శ్యాంసన్.
"వద్దు...ప్లీజ్ వెనక్కి వచ్చేయండి.తను నా ముగ్ధను మాత్రమే కాదు..మానవత్వాన్నీ కాపాడడం కోసం వెళ్ళింది"మనస్ఫూర్తిగా అన్నాడు కార్తికేయ.
ఒక సారి తన చేయి వంక చూసుకున్నాడు.ముగ్ధ వేసిన ఒట్టు.ఒక్కో ఒట్టు ఒక్కో కథ చెబుతుంది...కన్నీటి చెమ్మను స్పృశిస్తుంది.
********************
యాహ్యాఖాన్ నరరూప రాక్షసుడు..ఉమనైజర్...అందులోనూ మత్తులో వున్నాడు.ఆటను మోహన రూపం లో వున్నా ముగ్ధను...చూసి రెచ్చిపోతున్నాడు.
ముగ్ధ అద్దం లో తన రూపం మారడం చూసి షాకైంది. దానికి తోడూ యాహ్యాఖాన్ తనను సమీపించి వెకిలిగా ప్రవర్తించడం....
మోహన కారు స్పీడ్ కు స్పీడో మీటర్ వణికిపోతోంది.యాక్సిలేటర్ మీద ఆమె కాలు....యాహ్యాఖాన పీక మీద ఉన్నంత కసిగా వుంది.
విద్యారణ్య,డాక్టర్ రాధారాణి తలుపుల మీద బాదుతున్నారు.లోపల ముగ్ధ భయం తో వణికిపోతుంది.
యాహ్యాఖాన్ ముగ్ధను సమీపించాడు...
ముగ్ధ మనసులో కార్తికేయను తలుచుకుంది.భయం నీ మొదటి శత్రువు ...అన్న కార్తికేయ మాటలు స్మరించుకుంది...
మరణం నీ ఎదురుగా వున్నప్పుడు చచ్చేవరకూ చావును ఎదురించు...అన్న కార్తికేయ ధైర్య వచనాలు అమల్లో పెట్టింది.
టేబుల్ మీద వున్న పళ్ళు కోసే చాకు తీసుకుంది.
యాహ్యాఖాన్ పగలబడి నవ్వాడు...నవ్వుతూనే వున్నాడు....నవ్వుతూ ఒక్కసారి ఆగిపోయాడు.ఆ గది తలుపుల దగ్గర పెద్ద శబ్దం.
ఆ భవనం ముఖద్వారం కారు పట్టే వెడల్పులో వుంటుంది.మోహన కారును సరాసరి హాలులోపలికి ,అక్కడి నుండి ముగ్ధ గది దగ్గరికి స్పీడ్ గా తీసుకు వెళ్ళింది.కారు తలుపును డీ కొట్టింది.
ఆ వేగాని తలుపు విరిగింది.మోహన అనుచరులు పరుగెత్తుకు వచ్చారు.కారులో నుంచి మోహన దిగింది.ఇదంతా క్షణాల్లో జరిగింది.
యాహ్యాఖాన్ షాకయ్యాడు....మోహన యాహ్యాఖాన్ దగ్గరికి వెళ్లి అతని కుడిచేతిని మెలి తిప్పింది.మార్షల్ ఆర్ట్స్ లో తను నేర్చుకున్న విద్యనూ మొదటి సారి యాహ్యాఖాన్ మీద ప్రయోగించింది.అతని ఆర్తనాదాలు ఆ పాతభవనం గోడలలో ప్రతిధ్వనిస్తున్నాయి.మోహనను ఆపే ధైర్యం ఎవరూ చేయడం లేదు...అతని కుడి కాలు..ఎడమ కాలు...ఎడమ చేయి..అన్నీ క్షణాల్లో వేలాడిపోయాయి..భయం తోనే అతని ప్రాణం ఎగిరిపోయింది.
తన ఉగ్రవాదం తో కాక మదొన్మాద చేష్టలకు విపరీతమైన కామవాంచకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.అతని శరీరం భయంకరం గా తయారైంది.
ముగ్ధ ఇంకా షాక్ లో నుంచి తేరుకోలేదు...తన రూపం లో వున్న మోహన ను చూసి అలానే ఉండిపోయింది.
యాహ్యాఖాన్ శవాన్ని భుజాల మీద వేసుకుని ఫైర్ ప్లేస్ దగ్గరికి వెళ్లి అందులో వేసింది.మంట వేసింది.అనుచరుల వైపు తిరిగి "వీడి శవం కాలేవరకూ ఇక్కడే వుండండి "అని ముగ్ధ దగ్గరికి వెళ్ళింది.
రెండు చేతులు జోడించింది.
"నన్ను క్షమించండి..మీకేమీ కాదు .... "అంటూ అక్కడి నుంచి కదిలింది.
మరో సారి ఖాసిం కు ఫోన్ చేసింది.ఈ సారి ఖాసిం ఫోన్ రింగ్ అయింది.
"ఖాసిం..యాహ్యాఖాన్ ని చంపేసాను....వాడికి మనం ఇవ్వవలిసిన బ్యాలెన్స్ వాడి బార్యాబిద్దలకు పంపించండి.మన స్థావరాన్ని షిఫ్ట్ చేయండి.వీళ్ళు మన అతిథులు ..బందీలు కాదు.' మన లక్ష్యం అమాయకులు కాదు. 'చెప్పి ఫోన్ కట్ చేసింది.
విద్యారణ్య,రాధారాణి వైపు చూసి "కొద్దిగా ఓపిక పట్టండి.ముగ్ధను జాగ్రత్తగా చూసుకోండి "చెప్పి బయటకు వెళ్లబోతుంటే...డాక్టర్ రాధారాణి ఆపింది.
ఏమిటన్నట్టు చూసింది మోహన..
రాధారాణి మోహనను దగ్గరికి హత్తుకుంది."రాయిలో కూడా నీళ్ళు ఉంటాయని......కన్నీళ్లు ఉంటాయని తెలుసుకున్నాను .మీ మంచితనానికి సరెండర్ అయ్యాం "సిన్సియర్ గా అంది .
*********************
అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచాడు కార్తికేయ...ఎదురుగా మోహన...అలిసిపోయి....
"మీ ముగ్ధ సేఫ్....:అంది చిన్న నవ్వు నవ్వి.
"నాకు తెలుసు...నా ముగ్ధకు ఏమీ కానివ్వరు...థాంక్యూ మోహనా...ఆమె రెండు చేతులూ పెదవులకు ఆన్చుకున్నాడు .
"అలిసిపోయాను కార్తికేయ...ఈ రోజు ప్రేమను అనుభూతించాను...ఒక్క క్షణం మీ గుండెల మీద తల వాల్చవచ్చా? అడిగింది మోహన.
సంవత్సరాల ఒంటరితనం...వేన వేల రోజుల శూన్యం....
***************************
మంటల్లో తగలబడిపోతోన్న యాహ్యాఖాన్ శవం వంక అలానే చూస్తోందిపోయాడు ఖాసిం.
ఒక శత్రువుకు సంబంధించిన వ్యక్తి కోసం... ,తనకు పనికి వచ్చే మనిషిని నిర్దాక్షిణ్యం గా చంపిన మోహన...
మంటల్లో కాలిపోతున్న తమ్ముడి శవం వంక చూసాడు ఖాసిం.తనకు తప్ప మరెవరికి తెలియని నిజం. ఆ నిజం మంటల్లో కాలిపోతోంది...ఖాసిం ద్వేషం మంట

No comments:
Post a Comment