ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---65 ) (31-03-2013)

శ్రీనివాస్ రివాల్వర్ ని అతడి నాలిక చివరికి ఆన్చి...'నేను ట్రిగ్గర్ నొక్కితే...నాలిక మాత్రమే కాదు...నీ గొంతులో నుంచి బుల్లెట్ దూసుకు వెళ్తుంది.నువ్వు నిజం చెప్పకపోయినా పర్లేదు...నిన్ను టార్చర్ చేసి నీ రెండు చేతులు నీ స్వాధీనం లో లేకుండా చేయడం,నీ రెండు కాళ్ళు చచ్చుబడేలా చేయడం నా ధ్యేయం...అన్నట్టు ఎప్పుడైనా పందికొక్కులు సంచీలో వుండగా మొహాన్ని సంచీలో కుక్కి పంది కొక్కులతొ నీ మొహాన్ని ఓ ఆట ఆడుకునేలా చేస్తే ఎలా వుంటుందో ఊహించావా ? ' అడిగాడు సత్తార్ వైపే చూస్తూ....
"నన్ను చంపితే నువ్వు బ్రతికి పోతావా? మరో కొద్ది గంటల్లో ఈ తిరుపతి...సర్వనా..." సత్తార్ నోట్లో నుంచి మాట పూర్తి కాకుండానే అతడి చెంప చెళ్ళుమంది.
"అప్పటి వరకూ నువ్వు బ్రతికి వుంటే కదా ...అయినా నీలాంటి వాడితో డిస్కషన్ అనవసరం...ఒక్క బుల్లెట్ చాలు...సెకండ్ బుల్లెట్ కూడా వేస్ట్.."అని కంట్రోల్ రూం కి కి ఫోన్ చేసాడు.
"ఇక్కడ ఒక డెడ్ బాడీ వుంది.సారీ వుంటుంది...మీ రికార్డ్స్ లో వున్న పాత నేరస్తుడే...పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షూట్ చేయబడుతాడు..."అని ఫోన్ కట్ చేసాడు.
"ఏయ్ ...మీరేం చేస్తున్నారు ?కా..కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి.కోర్ట్ లో హాజరుపర్చండి
భయం గా అన్నాడు.
శ్రీనివాస్ గురించి బాగా తెలుసు.
"సారీ...నిన్ను అరెస్ట్ చేయడం..కోర్ట్ లో హాజరుపర్చడం...రిమాండ్..బిల్...నీకు తిండి పెట్టడానికి గవర్నమెంట్ ఖర్చు...సింపుల్ గా ఒక బుల్లెట్ తో పోయే విషయానికి ఇంత ఖర్చు అవసరమా ?శ్రీనివాస్ తాపీగా అన్నాడు.
"నేను పెన్ డ్రైవ్ ఇస్తాను..నన్ను వదిలేస్తారా ?ఆశగా అడిగాడుసత్తార్.
"వదిలేస్తాను."శ్రీనివాస్ చెప్పాడు.
సత్తార్ కు తను సేఫ్ గా ఉండడమే ముఖ్యం....మాటకు కట్టుబడే మనిషి కాదు.ఖాసిం కు ఇచ్చిన మాట కన్నా,తన ప్రాణం ముఖ్యం.అందుకే పెన్ డ్రైవ్ ఇచ్చేసాడు.
శ్రీనివాస్ పెన్ డ్రైవ్ చెక్ చేసుకున్నాడు.తర్వాత సత్తార్ వైపు తిరిగి "నువ్వు అయిదు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోవాలి ...ఆ తర్వాత నా బాధ్యత లేదు."అన్నాడు.
సత్తార్ మూడు నిమిషాల్లో అక్కడి నుంచి బయటపడ్డాడు.
శ్రీనివాస్ పోలీస్ కంట్రోల్ రూం కి ఫోన్ చేసి..."సత్తార్ అనే కిల్లర్ పారిపోతున్నాడు....పట్టుకోవడానికి ప్రయత్నించండి."అంటూ తను వున్న లొకేషన్ చెప్పాడు.తర్వాత కార్తికేయ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
"థాంక్యూ శ్రీ..నేను మరో గంటలో తిరుపతి వస్తున్నాను.మీరు ఎలర్ట్ గా వుండండి."చెప్పాడు కార్తికేయ.
సత్తార్ పారిపోయాడు..అతడిని పోలీసులు పట్టుకోలేక పోయారు...ఖాసిం ట్రేస్ చేయలేక పోయాడు.ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చంపేసాడు....మోహన ఏర్పాటు చేసిన కిల్లర్ అతను.
******************************
కార్తికేయ తో పాటు మోహన వచ్చింది.ఆ ఇంటి వైపు చూసింది.అంజలి కార్తికేయను చూసి పరుగెత్తుకు వచ్చింది.ముగ్ధ రూపం లో వున్న మోహన ను చూసి గట్టిగా పట్టుకుంది.
తనకూ ఓ చెల్లెలు వుంటే ఇలానే ఉండేదా ?మోహన లో విచిత్రమైన ఆలోచన.
కార్తికేయ అంజలి గురించి క్లుప్తం గా చెప్పాడు."నేను వచ్చేవరకు మీరు ఇక్కడే వుండాలి...ఎక్కడికీ వెళ్ళకూడదు."చెప్పాడు.
అలాగే అన్నట్టు తలూపింది మోహన.
"నేను వెళ్తాను ...టైం లేదు "చెప్పాడు కార్తికేయ.
"నేనూ వెళ్తాను.నాకూ టైం లేదు "మనసులో అనుకుంది మోహన.
కార్తికేయ బయల్దేరాడు.వెళ్ళే ముందు ముగ్ధ రూపం లో వున్న మోహనను చూసాడు...అదే చివరి సారి...అని , మళ్ళీ మోహనను అలా చూడలేనని ఆ క్షణం కార్తికేయకు తెలియదు.
***********************
వియస్సార్ హాస్పిటల్స్ ....
డాక్టర్ వి,సాకేత్ ...చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్...
ప్రపంచం లోని అతికొద్ది మంది ప్రముఖ సర్జన్స్ లో ఒక్కడు ...తన తాతగారు క్యాన్సర్ తో మరణించడం తో తండ్రి కోరిక మేరకు ఈ హాస్పిటల్ ని స్థాపించాడు సాకేత్.
క్యాన్సర్ తో తన దగ్గరికి వచ్చే వారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యం తో వెళ్ళాలన్నది అతని ఆశయం. తండ్రి ప్రేరణ తో ఈ రోజు అతడు కొన్ని వేల కుటుంబాలలో దీపం వెలిగించిన వాడయ్యాడు.
మెడికల్ జర్నల్ తిరగేస్తున్నాడు. ప్రతి రోజు ఇంట్లో నుంచి వచ్చేప్పుడు దేవుడిని ఆటను ఒకటే కోరుకుంటాడు..
."క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు వచ్చే వ్యక్తీ కి నేనెప్పుడూ నెగటివ్ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దని " కొన్ని సార్లు దేవుడు అతని మొర ను వినడు.
వంద రకాల క్యాన్సర్లు...ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేసే క్యాన్సర్ కణం...క్యాన్సర్ కణాలు అపరిమితం గా పెరిగిపోయి,లింఫ్ నాళాల ద్వారా రక్తం ద్వారా మిగితా భాగాలకు కూడా వ్యాపించి ,అక్కడి అవయవాలను కూడా తీవ్రం గా ప్రభావితం చేసి,తల నుండి కాళ్ళ వేళ్ళ వరకు వ్యాపించి ,మనిషిని అర్దాంతరం గా తీసుకు వెళ్ళే వందకు పైగా వున్న క్యాన్సర్ లోని రకాలు...
సామాన్యులకు తెలియని విషయాలు.కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తే బావుండు.
తన మనసులోని ఆలోచన తెలిసినట్టు తండ్రి చెప్పేవరకు తెలియలేదు.
"సాకేత్ నీ ఆలోచన ,తపన ఆ దేవుడికి తెలిసిపోయింది.సామాన్యులకు అర్ధమయ్యే అచ్చ తెలుగులో ఓ పుస్తకం వచ్చింది.ఆ పుస్తకం పేరు "క్యాన్సర్ ని జయించండి." చెప్పాడు తండ్రి.
ఇలాంటి పుస్తకాలు సామాన్యులను చేరాలి ...అనుకున్నాడు సాకేత్.అప్పుడే అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
"గుడ్ మార్నింగ్ డాక్టర్ ...నేను మిత్ర ని ...ఆ రోజు..."అవతలి వైపు మాటలు పూర్తి కాకుండానే..
"ఐ రిమెంబర్..వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్పానుగా...మీ వాళ్ళు వచ్చారా ?సాకేత్ అడిగాడు.
"రాలేదు..నేనే వెళ్ళాల్సి వస్తుందేమో..."ఆమె గొంతులో చిన్న బాధా వీచిక.
సాకేత్ కొద్ది క్షణాలు మౌనం గా వున్నాడు.
"డాక్టర్ గారూ..నాకు బ్రతకాలని వుంది."ఆమె గొంతులో తడి...
"నేనూ అదే కోరుకుంటున్నాను...మీరేమీ వర్రీ కాకండి.వెంటనే రండి.సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను."ఆ రోజు తన దగ్గరికి వచ్చిన మిత్ర గుర్తుకు వచ్చింది.
"తప్పకుండా వస్తాను "తన ఎదురుగా తననే గమనిస్తోన్న అంజలి వైపు చూసి చెప్పింది.ఆమె..

No comments: