ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) జీవన యాత్రలో ఎంతోమంది తమకు లభించిన వాటి కన్నా అందని/పొందని వాటిపై వేదనతో అందిన/పొందిన వాటి విలువను గుర్తెరగక అందిన వాటిని, మరి విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాం. గమనించి మెలగగలరు.

2) అడుగులు వేసే సమయంలో పరుగులు తీయరాదు, బోర్లాపడి దెబ్బలే తగిలే అవకాశముంది. మరలాగే పరుగులు పెట్టాల్సిన సమయంలో నెమ్మది నడకలు నప్పవు, వెనకపడే అవకాశముంది. కనుక సమయానుసారం, సందర్భానుసారం బ్రతుకున వేగం/వడి చూపాల్సివుంటుంది. తెలిసి మెలిగితే గెలుపువీరుడువి నీవే.

No comments: