ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

కవిత: నీవంటే
............


Photo: కవిత: నీవంటే
............
కదిలే కలవే నీవు
మదికడలిలో అలవే నీవు

తరువు తొడిగే క్రొత్త చివురులు నీవు
తరుణి మోమున సిగ్గుదొంతరలు నీవు

కరుణ పొంగిన హృదికొలను నీవు
తామర విరిసిన మదితటాకం నీవు

రెక్కలు విప్పిన విహంగం నీవు
కనురెప్పలు దాచని స్వప్నం నీవు

ప్రేమ విరిసే వలపు ముంగిలి నీవు
హృది మెరిసే తలపు ఎంగిలి నీవు

జాబిలి మెచ్చే నెచ్చెలి నీవు
జావళి పాడే కమ్మని కోయిల నీవు 

వెన్నెల చిలికే కన్నుల రాణివి నీవు
మిన్నెల నిలిచే అందాల వాణివి నీవు

జలజలపారే జలపాతం హోరువి నీవు
మిలమిలలాడే అరుణకిరణ కాంతివి నీవు 

ప్రౌఢ ప్రాయాల పడుచు రాగానివి నీవు
మౌన వేదనల వలపు వేదానివి నీవు 

బ్రతుకు వీణపై పలికే సురాగాల సుస్వరానివి నీవు
అలపు వేళలో తోడ్పాటిచ్చే అమృత కలశానివి నీవు

నిండు పున్నమైన కాళరాత్రేగా జోడు కాక నీవు 
పూర్ణ జన్మమంతా వ్యర్ధమేగా తోడు లేక నీవు 

వలపు దేవతవై మనసులో వసింపవా చెలి నీవు 
సొబగు సుందరివై సోకులన్నీ అందించవా నాకే మరి నీవు

...................
విసురజ కదిలే కలవే నీవు
మదికడలిలో అలవే నీవు

తరువు తొడిగే క్రొత్త చివురులు నీవు
తరుణి మోమున సిగ్గుదొంతరలు నీవు

కరుణ పొంగిన హృదికొలను నీవు
తామర విరిసిన మదితటాకం నీవు

రెక్కలు విప్పిన విహంగం నీవు
కనురెప్పలు దాచని స్వప్నం నీవు

ప్రేమ విరిసే వలపు ముంగిలి నీవు
హృది మెరిసే తలపు ఎంగిలి నీవు

జాబిలి మెచ్చే నెచ్చెలి నీవు
జావళి పాడే కమ్మని కోయిల నీవు

వెన్నెల చిలికే కన్నుల రాణివి నీవు
మిన్నెల నిలిచే అందాల వాణివి నీవు

జలజలపారే జలపాతం హోరువి నీవు
మిలమిలలాడే అరుణకిరణ కాంతివి నీవు

ప్రౌఢ ప్రాయాల పడుచు రాగానివి నీవు
మౌన వేదనల వలపు వేదానివి నీవు

బ్రతుకు వీణపై పలికే సురాగాల సుస్వరానివి నీవు
అలపు వేళలో తోడ్పాటిచ్చే అమృత కలశానివి నీవు

నిండు పున్నమైన కాళరాత్రేగా జోడు కాక నీవు
పూర్ణ జన్మమంతా వ్యర్ధమేగా తోడు లేక నీవు

వలపు దేవతవై మనసులో వసింపవా చెలి నీవు
సొబగు సుందరివై సోకులన్నీ అందించవా నాకే మరి నీవు

...................
విసురజ

No comments: